రక్షణ | Salvation Telugu Songs

255 salvation songs available. Lyrics in Roman and Telugu script.

జీవితమంటే మాటలు కాదు|Jeevithamante Maatalu Kaadu

జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా / (ఇవి) మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా – (2) ||జీవితమంటే|| / నమ్ముకున్నాడు యోసేపు – అమ్ముకున్నారు అన్నలు / నమ్ముకున్నాడు ఏశావు – మోసగించాడు యాకోబు (2) / ఈ అన్నల నమ్మే కంటే… / ఈ అన్నల నమ్మే కంటే / అన్న యేసుని నమ్ముకో / రాజ్యం నీదే మేలుకో / పరలోకం నీదే ఏలుకో ||జీవితమంటే|| / నమ్ముకున్నాడు యేసయ్యా – అమ్ముకున్నాడు శిష్యుడు / పాపుల కొరకై వచ్చాడమ్మా – ప్రాణాలే తీసారమ్మా (2) / ఈ మనుషులలోనే… / ఈ మనుషులలోనే – మమతలు లేవు / మంచితనానికి రోజులు కావు / సమయం మనకు లేదమ్మా / ఇక త్వరపడి యేసుని చేరమ్మా ||జీవితమంటే|| / నమ్మకమైన వాడు – ఉన్నాడు మన దేవుడు / నమ్మదగినవాడు – వస్తాడు త్వరలోనే (2) / యేసుని రాకకు ముందే… / యేసుని రాకకు ముందే / మారు మనస్సును పొందుమా / ప్రభుని చెంతకు చేరుమా / రక్షణ భాగ్యం పొందుమా ||జీవితమంటే||

నన్నెంతగా ప్రేమించితివో|Nannenthagaa Preminchithivo

నన్నెంతగా ప్రేమించితివో / నిన్నంతగా దూషించితినో / నన్నెంతగా నీవెరిగితివో / నిన్నంతగా నే మరచితినో / గలనా – నే చెప్పగలనా / దాయనా – నే దాయగలనా (2) / అయ్యా… నా యేసయ్యా / నాదం – తాళం – రాగం / ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2) / ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో / ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2) / ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో / ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా|| / ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో / ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2) / ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో / ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||

ఎందుకో ఈ ప్రేమ|Enduko Ee Prema

ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను / ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను (2) / ఏ యోగ్యత లేని ఓటి కుండను / నీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి (2) / ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో|| / నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే / అయినా నీవు క్షమియించినావే / ఊహించని మేలులతో దీవించినావే / నా సంకటములను కదా తీర్చినవే (2) / ఏ యోగ్యత లేని దీనుడను / ఏమివ్వగలను నీ ప్రేమకు / (నా) సర్వం నీకే అర్పింతును – (2) ||ఎందుకో|| / మా కొరకు బలి పశువై మరణించినావు / మా పాప శిక్ష తొలగించినావు / పలు విధముల శోధనలో తోడైనావు / ఏ కీడు రాకుండ మేము కాచినావు (2) / రుచి చూపినావు నీ ప్రేమను / ఆ ప్రేమలో నేను జీవింతును / నీవే నాకు ఆధారము – (2) ||ఎందుకో||

ఈ జీవితం విలువైనది|Ee Jeevitham Viluvainadi

ఈ జీవితం విలువైనది / నరులారా రండని సెలవైనది (2) / సిద్ధపడినావా చివరి యాత్రకు / యుగయుగాలు దేవునితో ఉండుటకు / నీవుండుటకు ||ఈ జీవితం|| / సంపాదన కోసమే పుట్టలేదు నీవు / పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) / పోతున్నవారిని నువు చుచుటలేదా (2) / బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం|| / మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు / కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) / చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2) / కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం|| / పాపులకు చోటు లేదు పరలోకమునందు / అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2) / యేసు రక్తమే నీ పాపానికి మందు (2) / కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం||

దేవుని ప్రేమ ఇదిగో|Devuni Prema Idigo

దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరే / కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును ||దేవుని|| / సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను / సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను ||దేవుని|| / మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను / మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే ||దేవుని|| / యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల / దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు ||దేవుని|| / పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి / పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని|| / సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను / సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను ||దేవుని|| / చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను / సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి ||దేవుని|| / గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే / మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను ||దేవుని|| / చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను / పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్ ||దేవుని|| / ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి / వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు ||దేవుని|| / ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను / మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను ||దేవుని|| / రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్ / రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను ||దేవుని|| / రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును / పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా ||దేవుని|| / మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు / నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్ ||దేవుని|| / పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు / పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను ||దేవుని|| / నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును / నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను ||దేవుని||

Salvation Telugu Songs — Page 5 | UEC Telugu Church