255 salvation songs available. Lyrics in Roman and Telugu script.
అమూల్య రక్తం – ప్రశస్త రక్తం / విలువైన రక్తం – శక్తి గల రక్తం (2) / యేసు రక్తమే జయము / క్రీస్తు రక్తమే విజయము (2) / పాప క్షమాపణ యేసు రక్తములోనే / శాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య|| / తండ్రి చిత్తము నెరవేర్చ / గెత్సేమనేలో ప్రార్ధింప (2) / చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే / ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు|| / శాపానికి ప్రతిఫలము ముళ్ళు / ముండ్ల కిరీటముతో చెల్లు (2) / ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు / ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2) ||యేసు|| / నీ చేతుల పనిని ఆశీర్వదింప / ప్రభు చేతులలో మేకులు గొట్ట (2) / కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే / బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2) ||యేసు||
యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా / ఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా (2) / దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా (2) / నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే (2) ||యాకోబు|| / అయ్యా నే సమరయ స్త్రీని – మీరేమో యూదులాయె / మీకు మాకు ఏనాడైనా – సాంగత్యము లేకపాయె (2) / నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా (2) / చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా (2) ||యాకోబు|| / అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానే / నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే (2) / అయ్యా నే ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నానే (2) / లొపేమి ఎరగనట్టు లోగుట్టు దాచినానే (2) ||యాకోబు|| / నీకు భర్త లేడన్నాడే పెనిమిట్లు ఐదుగురుండే / ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే (2) / వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా (2) / ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా (2) ||యాకోబు|| / నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు / ఏ తట్టు చూస్తున్నావో లోగుట్టు దాస్తున్నావో (2) / గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా (2) / తప్పకుండ యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా (2) ||యాకోబు||
యేసయ్య మాట బంగారు మూట / ఎన్నటికి మారని మాటేనన్న / ఎన్నటెన్నటికి మారని మాటేనన్న / నిత్యజీవానికి సత్యమైనది / పరలోక రాజ్యానికి మార్గమైనది / పదరా పదరా పోదాం పదరా / (మన) యేసయ్య చెంతకు పోదాం పదరా – (2) / చెట్టు పైకి చక్కగా చూసాడయ్యా / పొట్టి జక్కయ్యను పిలిచాడయ్యా / తిన్నగా ఇంటికి వేళ్ళాడయ్యా / అబ్రహాము బిడ్డగా మార్చాడయ్యా ||పదరా|| / సమరయ స్త్రీని చూసాడయ్యా / కుండను బద్దలు కొట్టాడయ్యా / జీవపు ఊటలు ఇచ్చాడయ్యా / జీవితాన్నే మార్చివేసాడయ్యా ||పదరా||
సువార్తను ప్రకటింపవా / సునాదము వినిపింపవా / సిలువను ధరియించవా / దాని విలువను వివరింపవా / లెమ్ము సోదరా / లేచి రమ్ము సోదరీ (2) ||సువార్తను|| / సుఖము సౌఖ్యము కోరి నీవు / సువార్త భారం మరచినావు (2) / సోమరివై నీవుండి / స్వామికి ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము|| / నీలోని ఆత్మను ఆరనీకు / ఎదలో పాపము దాచుకోకు (2) / నిను నమ్మిన యేసయ్యకు / నమ్మక ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము||
నీతో గడిపే ప్రతి క్షణము / ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) / కృప తలంచగా మేళ్లు యోచించగా (2) / నా గళమాగదు స్తుతించక – నిను కీర్తించక / యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4) ||నీతో|| / మారా వంటి నా జీవితాన్ని / మధురముగా మార్చి ఘనపరచినావు (2) / నా ప్రేమ చేత కాదు / నీవే నను ప్రేమించి (2) / రక్తాన్ని చిందించి / నన్ను రక్షించావు (2) ||యేసయ్యా|| / గమ్యమే లేని ఓ బాటసారిని / నీతో ఉన్నాను భయము లేదన్నావు (2) / నా శక్తి చేత కాదు / నీ ఆత్మ ద్వారానే (2) / వాగ్ధానము నెరవేర్చి / వారసుని చేసావు (2) ||యేసయ్యా||
వేవేల దూతలతో కొనియాడబడుచున్న / నిత్యుడగు తండ్రి సమాధాన కర్త / బలవంతుడైన దేవా ||వేవేల|| / మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగం / నే మరువలేను నా దేవా (2) / ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను (2) / ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను (2) ||వేవేల|| / మా స్థితిని మా గతిని నీవు మార్చగలవు / మా బాధలు మా వేదన నీవు తీర్చగలవు (2) / ఎంత వేదనైనా – ఎంత శోధనైనా (2) / మా కొరకు సిలువలో బలి అయినావు (2) ||వేవేల||
నన్ను గన్నయ్య రావె నా యేసు / నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| / ముందు నీ పాదారవిందము / లందు నిశ్చల భక్తి ప్రేమను (2) / పొందికగా జేయరావే నా / డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను|| / హద్దులేనట్టి దురాశల / నవివేకినై కూడి యాడితి (2) / మొద్దులతో నింక కూటమి / వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| / కాలము పెక్కు గతించెను / గర్వాదు లెడదెగవాయెను (2) / ఈ లోకమాయ సుఖేచ్ఛలు / చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| / దారుణ సంసార వారధి / దరి జూపి ప్రోవ నీ కన్నను (2) / కారణ గురువు లింకెవ్వరు / లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను|| / నా వంటి దుష్కర్మ జీవిని / కేవలమగు నీదు పేర్మిని (2) / దీవించి రక్షింపనిప్పుడే / రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||
నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము / నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము (2) / యేసయ్యా… కనిపించరే / నీలాగా ప్రేమించే వారెవరు (2) ||నీ దీర్ఘ|| / కడుపేద స్థితిలోనే కరువే నా బంధువాయెను / వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే కృంగదీసెను (2) / (ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో / ఐశ్వర్యవంతుడ నన్నాదుకున్నావు (2) / యేసయ్యా… కనిపించరే / నీలాగా దీవించే వారెవరు (2) ||నీ దీర్ఘ|| / ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని / ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని (2) / తృణీకరింపబడిన నా బ్రతుకును / కరుణా సంపన్నుడా నన్నెన్నుకున్నావు (2) / యేసయ్యా… కనిపించరే / నీలాగా కృప చూపే వారెవరు (2) ||నీ దీర్ఘ|| / నా ప్రాణము నాలో కృంగివున్న సమయములో / జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను (2) / మధురమైన నీ సహవాసముతో / నా జీవ నాథుడా నీ మమతను పంచావు (2) / యేసయ్యా… కనిపించరే / నీలాంటి జీవము గల దేవుడెవ్వరు (2) ||నీ దీర్ఘ||
చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను / పాడు లోకంబునకై – గోడు జెందె గదా ||చూడరే|| / నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా / నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే|| / దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై / నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై ||చూడరే|| / పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు / పరమ రక్షకుని – పాదములలో మేకులు ||చూడరే|| / పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే / పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు ||చూడరే||
బ్యూలా దేశము నాది / సుస్థిరమైన పునాది (2) / కాలము స్థలము లేనిది (2) / సుందర పురము – నందనవనము (2) ||బ్యూలా|| / స్పటిక నది తీరము నాది / అన్నిటిలో ఘనం అనాది (2) / అపశ్రుతి లేని రాగములు (2) / అలరెడు పురము యేసుని వరము (2) ||బ్యూలా|| / జీవ వృక్ష ఫల సాయము నాది / దేవుని మహిమ స్పర్శ వేది (2) / మరణం బాధే లేనిది (2) / అమరుల పురము మంగళకరము (2) ||బ్యూలా||
క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి / క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే|| / ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత / భక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన ||క్రీస్తే|| / దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసి / దాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన ||క్రీస్తే|| / శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి / శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన ||క్రీస్తే|| / సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్ / నీతి పథంబు బెంప – రుధిరంబు గార్చె గాన ||క్రీస్తే|| / మృత్యువు ముళ్ళు తృపన్ – నిత్య జీవంబు బెంపన్ / మర్త్యాళి భయము దీర్పన్ – మరణంబు గెలిచె గాన ||క్రీస్తే|| / పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన / ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన ||క్రీస్తే|| / ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు / యెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన ||క్రీస్తే||
యేసుని నామములో – మన బాధలు పోవును / దుష్టాత్మలు పారిపోవును / శోధనలో జయమొచ్చును / మృతులకు నిండు జీవమొచ్చును / హృదయములో నెమ్మదొచ్చును / యేసు రక్తముకే – యేసు నామముకే / యుగయుగములకూ మహిమే / అభిషిక్తులగు తన దాసులకు / ప్రతి సమయమునా జయమే ||యేసుని|| / ఘోరమైన వ్యాధులెన్నైనా / మార్పులేని వ్యసనపరులైనా / ఆర్ధికముగా లోటులెన్నున్నా / ఆశలు నిరాశలే ఐనా / ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు / పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు ||యేసు రక్తముకే || / రాజువైనా యాజకుడవైనా / నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా / ఆశ్రయముగా గృహములెన్నున్నా / నిలువ నీడే నీకు లేకున్నా / శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా / నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు ||యేసు రక్తముకే ||