255 salvation songs available. Lyrics in Roman and Telugu script.
విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త / మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను / వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను / తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2) / ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం / యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2) ||విన్నారా|| / దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని / గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2) / పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా / లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా ||ఊరు వాడా|| / ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని / జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2) / బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా / రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా ||ఊరు వాడా||
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము / చల్లని దేవుని నీడలో / గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం / సంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు|| / లోకమే నటనాలయం / జీవితమే రంగుల వలయం (2) / పరలోకమే మనకు శాశ్వతం / పరలోక దేవుని నిత్య జీవం / ప్రేమామయుడే ఆ పరమాత్ముడే / పదిలపరచెనే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు|| / మారు మనస్సు మనిషికి మార్గం / పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2) / నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా / నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా / పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే / కరుణించునే కలకాలం ||ఇన్నేళ్లు||
క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన / క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ (2) / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) / క్రీస్తులోనే విశ్వాసం / క్రీస్తులోనే ఉల్లాసం / క్రీస్తులోనే అభిషేకం / క్రీస్తులోనే సమస్తం (2) / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) ||క్రిస్మస్|| / యేసులోనే రక్షణ / యేసులోనే స్వస్థత / యేసులోనే విడుదల / నమ్మితే నిత్య జీవం (2) / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) ||క్రిస్మస్||
వినుమా యేసుని జననము / కనుమా కన్య గర్భమందున (2) / పరమ దేవుని లేఖనము (2) / నెరవేరే గైకొనుమా (2) / ఆనందం విరసిల్లె జనమంతా / సంతోషం కలిగెను మనకంతా / సౌభాగ్యం ప్రణవిల్లె ప్రభుచెంత / చిరజీవం దిగివచ్చె భువికంతా ||వినుమా|| / గొల్లలొచ్చె దూతద్వారా సాగిలపడి మ్రొక్కిరంట / చుక్కచూచి జ్ఞానులువచ్చిరి యేసును చూచి కానుకలిచ్చిరి / మనకోసం పుట్టెనంట పశువుల పాకలోన / ఎంత మస్తు దేవుడన్న రక్షణనే తెచ్చెనన్నా ||వినుమా|| / పాపులనంతా రక్షింపగా / పరమును విడిచె యేసు (2) / దీనులకంతా శుభవార్తేగా (2) / నడువంగ ప్రభువైపునకు (2) ||ఆనందం|| / అదిగో సర్వలోక రక్షకుడు / దివినుండి దిగివచ్చినాఁడురా (2) / చూడుము యేసుని దివ్యమోమును (2) / రుచియించు ప్రభుని ప్రేమను (2) ||ఆనందం||
ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి / వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని – (2) ||ఎట్టి|| / గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు (2) / హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే (2) ||ఎట్టి|| / పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా (2) / పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె (2) ||ఎట్టి|| / పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం (2) / కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం (2) ||ఎట్టి||
దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా? / ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2) / ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్న / వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో మన్నా (2) / మరచినవా నీ అపజయములు / గుర్తు లేదా! ఆ శోధనలు / నీవు చూపిన ఆ వినయములు / ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు / తండ్రి నీవే దిక్కంటూ, మోకరిల్లిన ఆ క్షణము / అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2) ॥ఎంత॥ / అందుకొంటివి బాప్తిస్మమును / పొందు కొంటివి ఆ రక్షణను / వదలబోకు ఆత్మీయతను / చేరనివ్వకు నిర్లక్ష్యమును / తీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగు / నిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా? (2) ॥ఎంత॥
హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2) / దాపు జేరితిని శరణు కోరితిని / దిక్కు నీవే నాకు ఇలలో / లేరు ఎవ్వరు నాయను వారు ||హీనమైన|| / మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత / మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2) / కరుణించి నన్ను కష్టాలు బాపు (2) / కరుణామయా క్రీస్తేసువా ||హీనమైన|| / తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ / భార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ (2) / పాపి కొరకు ప్రాణమర్పించిన (2) / త్యాగ శీలివి నీకే స్తోత్రము ||హీనమైన|| / నిన్న నేడు రేపు యేసు – మారనే మారవు / లోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు (2) / వెరువను జడియను (2) / నీ కంటి పాపను నను కాచే దైవమా ||హీనమైన||
సిలువను గెలిచిన సజీవుని త్యాగము / విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2) / ముందే తెలియును – తన బలియాగము / తెలిసే చేసెను స్వ బలిదానము / తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము / తననే వంచెను తనువే అర్పించెను / దేవా నీ త్యాగము మము రక్షించెను / పాపము నుండి విడిపించెను / దేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెను / ఇల సజీవులుగా మేము నిలిపెను ||సిలువను||
యేసే సత్యం యేసే నిత్యం / యేసే సర్వము జగతికి / యేసే జీవం యేసే గమ్యం / యేసే గమనము (2) / పాత పాడెదం ప్రభువునకు / స్తోత్రార్పణ చేసెదం (2) ||యేసే|| / పలు రకాల మనుష్యులు – పలు విధాలు పలికిన / మాయలెన్నో చేసినా – లీలలెన్నో చూపినా (2) / యేసులోనే నిత్య జీవం / యేసులోనే రక్షణ (2) ||యేసే|| / బలము లేని వారికి – బలము నిచ్చుఁ దేవుడు / కృంగియున్న వారిని – లేవనెత్తు దేవుడు (2) / యేసులోనే నిత్య రాజ్యం / యేసులోనే విడుదల (2) ||యేసే||
ఆరిపోయే దీపంలా / ఆగిపోదా ఈ జీవితం (2) / మారలేని లోకమందు / మారలేవా జీవితాన (2) / మార్చుకో నీ జీవితం / చేర్చుకో ఆ దేవుని (2) / ఆ దేవుని (2) ||ఆరిపోయే|| / లోతు లేని లోకమందు / చూడలేవా చోటు కోసం (2) / చూడుమా ఆ దేవుని / వేడుమా ఆ దేవుని (2) / ఆ దేవుని (2) ||ఆరిపోయే||
మార్గం సత్యం జీవం నీవే యేసు / సర్వం సకలం నీవే క్రీస్తు (2) / మా ఆధారం నీవేనయ్యా / మా అనుబంధం నీతోనేనయ్యా (2) / వధియింపబడిన ఓ గొర్రెపిల్ల / ప్రభువైన మా యేసువా / మా స్తుతి స్తోత్రముల్ నీకే / మహిమా ప్రభావముల్ నీకే (2) ||మార్గం|| / పరమును విడిచావు మాకై / నరునిగా పుట్టావు ధరపై (2) / ఆహా నీదెంత ప్రేమ / ఎవరికైనా వర్ణింప తరమా (2) ||వధియింప|| / కలువరిలో రక్తమును కార్చి / విలువగు ప్రాణమును ఇచ్చి (2) / తెచ్చావు భువికి రక్షణ / ఇచ్చావు పాప క్షమాపణ (2) ||వధియింప||
సందేహమేల సంశయమదేల / ప్రభు యేసు గాయములను పరికించి చూడు / గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల|| / ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే / నీ పాప శిక్షను తానే – భరియించెనే (2) / ప్రవహించె రక్త ధార నీ కోసమే / కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల|| / ఎందాక యేసుని నీవు – ఎరగనందువు / ఎందాక హృదయము బయట – నిలవమందువు (2) / యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా / యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల|| / ఈ లోక భోగములను – వీడజాలవా / సాతాను బంధకమందు – సంతసింతువా (2) / యేసయ్య సహనముతోనే చెలగాటమా / ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహమేల|| / లోకాన ఎవ్వరు నీకై – మరణించరు / నీ శిక్షలను భరియింప – సహియించరు (2) / నీ తల్లియైన గాని నిన్ను మరచునే / ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2) ||సందేహమేల||