రక్షణ | Salvation Telugu Songs

255 salvation songs available. Lyrics in Roman and Telugu script.

మానవుడవై సకల|Maanavudavai Sakala Narula

మానవుడవై సకల నరుల / మానక నా దోషముల / బాపుటకు బలియైతివే యేసు – (2) / బహు ప్రేమ తోడ ||మానవుడవై|| / నీదు బలిని నిత్యముగను / నిజముగా ధ్యానించి ప్రేమను / నీదు దివ్య ప్రేమ నొందుటకు – (2) / నియమంబు నిచ్చి ||మానవుడవై|| / నీ శరీరము రొట్టె వలెనె / నిజముగా విరువంగబడెనే / నిన్ను దిను భాగ్యంబు నిచ్చితివే – (2) / నా యన్న యేసు ||మానవుడవై|| / మంచి యూట మించి దండి / పంచ గాయములలో నుండి / నిత్య జీవపు టూటలు జేసితి – (2) / నీ ప్రేమ నుండి ||మానవుడవై|| / నిన్ను జ్ఞాపక ముంచుకొనుటకు / నీదు ప్రేమ బలిలో మనుటకు / నిత్య మాచరించుడంటివి నీ – (2) / నిజ భక్తి తోడ ||మానవుడవై|| / ఎంతో ప్రేమతో బలిగానయితివి / యెంతో ప్రేమాచారమైతివి / చింతలును నా పాపములు బాప – (2) / శ్రీ యేసు దేవా ||మానవుడవై|| / నిత్య బలియగు నిన్నే నమ్మి / నిన్ను ననుభవించి నెమ్మి / నిన్ను నిముడించుకొని నాలో నీ – (2) / నిజ రూప మొంద ||మానవుడవై|| / నేను నీ బలిలోన గలిసి / నేను నీతో గలిసి మెలిసి / నేను నీవలె నుండి జేసితివే – (2) / నా దివ్య యేసు ||మానవుడవై|| / నీదు శ్రమలను బలిని నిపుడు / నాదు కనులు చూడ నెపుడు / నాదు పాప భారములు దిగునే – (2) / నా దివ్య యేసు ||మానవుడవై|| / నీవు బలియై తిరిగి లేచి / నిత్య తేజోరూపు దాల్చి / నిత్యమును నా బంతి నున్నావే – (2) / నిజ దేవా యేసు ||మానవుడవై|| / నీవే నీ చేతులలో నిత్తువు / ఈ నీ బలి విందునకు వత్తువు / నిన్ను నిట జూచితిని నా యేసు – (2) / ఎన్నడును మరువను ||మానవుడవై||

రక్షింపబడిన నీవు|Rakshimpabadina Neevu

రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు / గురి నిలిపి పయనిస్తున్నావా / రక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకు / అన్నట్టు జీవిస్తున్నావా (2) / యేసే లేని నీ బ్రతుకులో / వెలుగే లేదని తెలుసుకో / యేసే లేని జీవితానికి / విలువే లేదని తెలుసుకో (2) ||రక్షింపబడిన|| / మంటితోనే నిను చేసినా / కంటి పాపగా కాపాడెనే / మాటి మాటికి పడిపోయినా / శాశ్వత ప్రేమతో ప్రేమించెనే (2) / ఆ ప్రేమను కాదని – అవసరమే లేదని / ఈ లోకం నాదని – ప్రభు మార్గం విడచితివా / యేసే లేనిదే – పరలోకానికి / ప్రవేశం లేదనే – పరమార్ధం మరచితివా ||యేసే|| / యేసులోనే నీ రక్షణ / యేసులోనే నిరీక్షణ / యేసులోనే క్షమాపణ / చేసుకో మరి ప్రక్షాళన (2) / ఎంతో ప్రేమను – నీపై చూపించెను / తన ప్రాణము సహితము – నీకై అర్పించెనుగా / ఇప్పటికైననూ – మార్చుకో మనస్సునూ / ప్రభువును చేరగా – వేగిరమే పరుగిడిరా ||యేసే||

ఉదయించె దివ్య రక్షకుడు|Udayinche Divya Rakshakudu

ఉదయించె దివ్య రక్షకుడు / ఘోరాంధకార లోకమున / మహిమ క్రీస్తు ఉదయించెను / రక్షణ వెలుగు నీయను – (2) ||ఉదయించె|| / ఘోరాంధకారమున దీపంబు లేక / పలు మారు పడుచుండగా (2) / దుఃఖ నిరాశ యాత్రికులంతా / దారి తప్పియుండగా (2) / మార్గదర్శియై నడిపించువారు (2) / ప్రభు పాద సన్నిధికి / దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు / ఉదయించె ఈ ధరలో – (3) ||ఉదయించె|| / చింత విచారముతో నిండియున్న / లోక రోదన విని (2) / పాపంబునుండి నశించిపోగా / ఆత్మ విమోచకుడు (2) / మానవాళికై మరణంబునొంది (2) / నిత్య జీవము నివ్వన్ / దివ్యరక్షకుడు ప్రకాశతార / ఉదయించె రక్షింపను – (3) ||ఉదయించె|| / పరలోక తండ్రి కరుణించి మనల / పంపేను క్రీస్తు ప్రభున్ (2) / లోకాంధులకు దృష్టినివ్వ / అరుదెంచె క్రీస్తు ప్రభువు (2) / చీకటి నుండి దైవ వెలుగునకు (2) / తెచ్చె క్రీస్తు ప్రభువు / సాతాను శృంగలములను తెంప / ఉదయించె రక్షకుడు – (3) ||ఉదయించె||

అందరు మెచ్చిన అందాల తార|Andaru Mechchina Andaala Thaara

అందరు మెచ్చిన అందాల తార / అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2) / క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్ / హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ / క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు|| / సృష్టికర్తయే మరియ తనయుడై / పశుల పాకలో పరుండినాడు (2) / నీతి జీవితం నీవు కోరగా / నీకై రక్షణ తెచ్చినాడు (2) / నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్|| / ఇంటిని విడిచి తిరిగిన నాకై / ఎదురు చూపులే చూచినాడు (2) / తప్పును తెలిసి తిరిగి రాగా / క్షమియించి కృప చూపినాడు (2) / ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్|| / పాత దినములు క్రొత్తవి చేసి / నీలో జీవము నింపుతాడు (2) / కటిక చీకటే వేకువ కాగా / అంబరమందు సంబరమాయే (2) / హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||

దేవుడు దేహమును|Devudu Dehamunu

దేవుడు దేహమును పొందిన దినము / మనిషిగా మారి ఇల చేరిన క్షణము (2) / తార వెలిగెను – దూత పాడెను / పరలోకనికి మార్గము వెలిసెను (2) / స్తుతుల గానములు పాడి పరవశించెదము / యేసు నామమునే చాటి మహిమ పరిచెదము (2) ||దేవుడు|| / దూత పలికెను భయము వలదని / తెలిపే వార్తను యేసే క్రీస్తని (2) / చీకటి తొలగెను రారాజుకు భయపడి / లోకము వెలిగెను మరణము చెరవిడి (2) / క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదము / నిత్య జీవమునే చాటి ఘనత పొందెదము (2) ||దేవుడు|| / సృష్టి కారుడు అల్పుడాయెను / అది శాపము తీయ వచ్చెను (2) / పాపము ఎరుగని మనిషిగా బ్రతికెను / మానవ జాతికి మార్గమై నిలిచెను (2) / నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములు / పరము చేరుటకు మనకు కలుగు దీవెనలు (2) ||దేవుడు||

చిందింది రక్తం|Chindindi Raktham

చిందింది రక్తం ఆ సిలువ పైన / కారింది రుధిరం కలువరిలోన (2) / కరుణ చూప లేదే కసాయి మనుష్యులు / కనికరించలేదే మానవ లోకం (2) ||చిందింది|| / ఏదేనులో పుట్టిన ఆ పాపము / శాపముగా మారి మరణ పాత్రుని చేసె (2) / ఆ మరణమును తొలగించుటకు / మరణ పాత్రను చేబూనావా (2) / నా మరణమును తప్పించినావా ||కరుణ|| / చేసింది లోకం ఘోరమైన పాపం / మోపింది నేరం నీ భుజము పైనా (2) / యెరుషలేములో పారిన నీ రక్తము / ఈ లోక విమోచన క్రయధనము (2) / ఈ లోక విమోచన క్రయధనము ||కరుణ|| / నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగం / మరణపు ముల్లును విరిచిన దేవుడా (2) / జీవకిరీటము నిచ్చుటకై / ముళ్ళ కిరీటము ధరించితివా (2) / నాకు నిత్య జీవమిచ్చితివా ||కరుణ||

Salvation Telugu Songs — Page 2 | UEC Telugu Church