255 salvation songs available. Lyrics in Roman and Telugu script.
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా / పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా / ఏది గమ్యము ఏది మార్గము / యోచించుమా ఓ క్రైస్తవా (2) ||గొర్రెపిల్ల|| / ఆరాధనకు హాజరైనా / కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా (2) / ఎన్ని సభలకు నీవు వెళ్ళినా / మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల|| / సంఘములో నీవు పెద్దవైనా / పాటలెన్నో నీవు పాడినా (2) / వాక్యమును నీవు బోధించినా / మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల|| / ఉపవాసములు ఎన్ని ఉన్నా / ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా (2) / ప్రవచనములు నీవు ఎన్ని పలికినా / మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల||
కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు / పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2) / నీ కోసమే అది నా కోసమే (2) / ప్రతివానికి రూపు నిచ్చె / అతనికి రూపు లేదు (2) / పదివేలలో అతిప్రియుడు / పరిహాసములనొందినాడు (2) ||నీ కోసమే|| / వధ చేయబడు గొర్రెవలె / బదులేమీ పలుకలేదు (2) / దూషించు వారిని చూచి / దీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే|| / సాతాను మరణమున్ గెల్చి / పాతాళ మందు గూల్చి (2) / సజీవుడై లేచినాడు / స్వర్గాన నిను చేర్చినాడు (2) ||నీ కోసమే||
నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు / నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు / ఎవరైనా – మీలో ఎవరైనా (2) / వెళతారా – నా ప్రేమను చెబుతారా (2) / రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు / మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2) ||ఎవరైనా|| / నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు / వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు (2) ||ఎవరైనా|| / వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి / వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి (2) ||ఎవరైనా||
అందరికి కావాలి యేసయ్య రక్తము (2) / పాపము లేని పరిశుద్ధుని రక్తము / ఇది పాపుల కొరకై వొలికిన / పరమ వైద్యుని రక్తము (2) / కుల మత బేధం లేని రక్తము / అందరికి వర్తించే రక్తము (2) / కక్ష్య క్రోధం లేని రక్తము / కన్న ప్రేమ చూపించే రక్తము (2) ||అందరికి|| / కోళ్ళ రక్తముతో పాపం పోదు / ఎడ్ల రక్తముతో పాపం పోదు (2) / ఈ పాపము కడిగే యేసు రక్తము / సాకలి వాని సబ్బు వంటిది (2) ||అందరికి|| / చీకటి శక్తుల అణిచె రక్తము / రోత బతుకును కడిగే రక్తము (2) / రక్తములోనే ప్రాణమున్నది / పాపము కడిగే గుణమున్నది (2) / రక్తములోనే పవ్వరున్నది / స్వస్తపరిచే గుణమున్నది (2) ||అందరికి||
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) / ఈ వార్త వినరండే / యేసయ్యను నమ్ముకొండే (2) / మానవ జాతి పాపము కొరకై (2) / కన్నీరు విడుస్తుండు / ప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా|| / లోకమంతటా యేసు రక్తము (2) / ఎరువుగ జల్లిండే / మరణపు ముల్లును విరిచిండే (2) / అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) / ఓ పల్లె చెల్లెల్లారా / ఓ పట్నం అక్కల్లారా (2) / బట్టలు మార్చితే బ్రతుకు మారదు / గుండు కొడితే నీ గుణం మారదు / బతుకు మారడం బట్టల్ల లేదు / గుణం మారడం గుండుల లేదు / నీ మనసు మారాలన్నా / నీ బుద్ది మారాలన్నా / నీ మనసు మారాలక్కా / నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా|| / పాపం లేని యేసు దేవుణ్ణి / నమ్ముకుందామమ్మా / దేవుడు మంచి దేవుడమ్మా (2) / అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) / ఈ సత్యమినరండే / ఇది కల్ల కాదు చెల్లె / ఇది కల్ల కాదు తమ్మి / ఇది కల్ల కాదు తాత / ఇది కల్ల కాదు అవ్వ / ఇది కల్ల కాదు అన్న / ఇది కల్ల కాదు అక్క
భాసిల్లెను సిలువలో పాపక్షమా / యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను|| / కలువరిలో నా పాపము పొంచి / సిలువకు నిన్ను యాహుతి చేసి / కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను|| / దోషము చేసినది నేనెకదా / మోసముతో బ్రతికిన నేనెకదా / మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను|| / పాపము చేసి గడించితి మరణం / శాపమెగా నేనార్జించినది / కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను|| / నీ మరణపు వేదన వృధా గాదు / నా మది నీ వేదనలో మునిగెను / క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను|| / ఎందులకో నాపై ఈ ప్రేమ / అందదయ్యా స్వామీ నా మదికి / అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను|| / నమ్మిన వారిని కాదన వనియు / నెమ్మది నొసగెడి నా ప్రభుడవని / నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను||
నీవే నా దేవుడవు ఆరాధింతును / నీవే నా రాజువు కీర్తించెదను (2) / మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే / మరణమునుండి జీవముకు నను దాటించావు / పరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి / చీకటినుండి వెలుగునకు నను నడిపించావు / హోసన్నా మహిమా నీకే / హోసన్నా ప్రభావము రాజునకే (2) / నీవే నీవే నీవే నీవే (2) / పాపిని నను కరుణించిన కరుణామయుడవు నీవే / విలువైన నీ కృపచే నను రక్షించావు / కలువరిలో మరణించి నీ ప్రేమను చూపితివి / పాపమును క్షమియించి నను విడిపించావు / హోసన్నా మహిమా నీకే / హోసన్నా ప్రభావము రాజునకే (2) / నీవే నీవే నీవే నీవే (2)
నా నీతి నీవే నా ఖ్యాతి నీవే / నా దైవమా యేసయ్యా / నా క్రియలు కాదు నీ కృపయే దేవా / నా ప్రాణమా యేసయ్యా / నదులంత తైలం విస్తార బలులు / నీకిచ్చినా చాలవయ్యా / నీ జీవితాన్నే నాకిచ్చినావు / నీకే నా జీవమయ్యా / హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (4) ||నా నీతి|| / నా దీన స్థితిని గమనించి నీవు / దాసునిగ వచ్చావుగా / నా దోష శిక్ష భరియించి నీవు / నను నీలో దాచావుగా / ఏమంత ప్రేమ నా మీద నీకు / నీ ప్రాణమిచ్చావుగా / నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను / యజమానుడవు నీవేగా ||హల్లెలూయ|| / నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు / నీవు చేరదీసావుగా / నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి / కన్నీరు తుడిచావుగా / నేనున్న నీకు భయమేలనంటూ / ఓదార్పునిచ్చావుగా / చాలయ్య దేవ నీ కృపయే నాకు / బ్రతుకంతయు పండుగా ||హల్లెలూయ|| / ఆ ఊభిలోనా నే చిక్కినప్పుడు / నీవు నన్ను చూసావుగా / నీ చేయి చాపి నను పైకి లేపి / నీ వాక్కునిచ్చావుగా / నా సంకటములు నా ఋణపు గిరులు / అన్నిటిని తీర్చావుగా / నీలోన నాకు నవ జీవమిచ్చి / నీ సాక్షిగా నిలిపావుగా ||హల్లెలూయ||
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా / ఓ మానవా.. ఇకనైనా మారవా / మన పాపములను క్షమియించుటకే / సిలువ మరణము పొందెనని (2) / గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2) / ఈ దినమే అనుకూలం… / లేదిక వేరే ఏ సమయం (2) / నిజమేదో తెలియకనే / చనిపోతే నీ గతి ఏమి? (2) ||ఓ మానవా|| / సిలువను గూర్చిన శుభ వార్త / వెర్రితనముగా ఉన్నదా? / దేవుని శక్తని తెలుసుకొని / ప్రభు మార్గమును చేరెదవా (2) ||ఈ దినమే|| / ప్రయాసముతో భారము మోసే / నిన్నే దేవుడు పిలిచెనుగా / ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద / వేగిరమే పరుగిడి రావా (2) ||ఈ దినమే|| / నీ ధనము నీ ఘనము / నీ సర్వస్వము చితి వరకే / అర్పించుము నీ హృదయమును / (నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2) ||ఈ దినమే||
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే / అల్పమైన దానికా ఆరాటం / త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి / స్వల్పమైనదానికా పోరాటం / కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం / దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే|| / బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా / అంతరించిపోయెను భువినేలిన రాజులు (2) / నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా / చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే|| / మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో / ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2) / ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున / చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే||
ఆహా యేమానందం ఆహా యేమానందము / చెప్ప శక్యమా (2) / ఆహా మా రాజగు యేసు మా వృజినముల / మన్నించి వేసెను (2) ||ఆహా|| / ముదముతో నాడుచు కూడుచు పాడుచు / ఆర్భాటించెదము (2) / వెదకుచు వచ్చిన యేసును హృదయాన / కోరి స్తుతింతుము (2) ||ఆహా|| / అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను / గ్రహించినందున (2) / రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము / నిశ్చయముగా నిత్తుము (2) ||ఆహా|| / తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము / మేడపై జయ జెండాల్ (2) / ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన / రాజున్ స్తుతింతుము (2) ||ఆహా||
గాడాంధకారపు లోయలో / నే సంచరించిన వేళలో / అపాయమేమియు రానీయక / ఉన్నావు తోడుగ నా త్రోవలో (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా ఆశ్రయ దుర్గము నీవే / నా బలమైన శైలము నీవే / నా రక్షణ శృంగము నీవే / నా శిక్షను భరియించితివే ||గాడాంధకారపు|| / పచ్చిక గల చోట్లలో నిలిపావు / శాంతి జలములందు నన్ను నడిపావు (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా ఎత్తైన కోట నీవే / నే నడిచే ప్రతి చోట నీవే / నా రక్షణకర్తా నీవే / నా జీవన దాతా నీవే ||గాఢాంధకారపు|| / నూనెతో నా తలను అంటావు / నా గిన్నెను పొర్లి పారజేసావు (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా మొరను ఆలించావే / నీ వరములు నాకొసగావే / నా పరమ తండ్రివి నీవే / నీ కరమున నను దాచావే ||గాఢాంధకారపు|| / చీకటి బ్రతుకును వెలిగించావు / మరణపు భయమును తొలగించావు (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా త్రోవకు వెలుగు నీవే / నా నావకు చుక్కాని నీవే / నను కావగ ఏతెంచితివే / కొనిపోవగ రానున్నావే ||గాఢాంధకారపు||