255 salvation songs available. Lyrics in Roman and Telugu script.
నీ జీవితం క్షణ భంగురం / నీ యవ్వనం తృణాప్రాయం / ఎప్పుడు రాలునో ఎవరు ఎరుగరు / ఎప్పుడు పోవునో నీకు తెలియదు / ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా / పరిహాసమేల ఓ సోదరా / ప్రభు యేసు ప్రియమార నిన్ను పిలుచుచుండగా / పరిహాసమేల ఓ సోదరీ / పరిహాసమేల ఓ సోదరా… పరిహాసమేల ఓ సోదరీ… / ఈ రెండు మార్గములు నీ ఎదుటనున్నవి / విశాల మార్గమొకటి – ఇరుకు మార్గమొకటి (2) / ఏది నీ మార్గమో – ఈ క్షణమే తేల్చుకో (2) / ఈ క్షణమే తేల్చుకో ||నీ జీవితం|| / నీకున్నవన్నియు క్షణిక సుఖములే / ప్రభు యేసుని చేరు – పరలోకమే నీదవును (2) / ఈ దినమే సుదినము – ప్రభుని హృదిని చేర్చుకో (2) / ప్రభుని హృదిని చేర్చుకో ||నీ జీవితం||
నీ జీవితం నీటీ బుడగా వంటిది / ఎప్పుడూ ఆగునో మనకూ తెలియదూ (2) / నేడే తెలుసుకో నిజమైన దేవుని / నిత్య జీవముకై వెంబడించు యేసుని ||నీ జీవితం|| / ఎన్నాళ్ళూ ఈ వ్యర్ధపు ప్రయాసము / మనకై మరణించిన ప్రభుని చూడు (2) / ఈ క్షణమే వెదుకూ నీ హృదయముతో (2) / మనదగునూ.. ఆయన క్షమా రక్షణ (2) ||నీ జీవితం|| / ఎన్నాళ్ళు ఈ వ్యర్ధపు ప్రయాణము / త్వరగా రానైయున్నాడు ప్రభువూ (2) / ఆయనతో పరమునకేగుటకూ (2) / నిరీక్షణ గలవారమైయుందుము (2) ||నీ జీవితం||
దేహం పాతది – మనసు మలినమైనది / జీవం పాపిది – మార్గం తెలియనిది (2) / సర్వోన్నతుడా నిత్య నూతనుడా / నిత్య జీవనం కలిగించుమయ్యా / మరియా కన్న తనయా ||దేహం|| / దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానే / ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే / తల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానే / మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే ||సర్వోన్నతుడా|| / తెలిసీ తెలియక చేసిన తప్పులు ఉన్నవి మన్నించు / తండ్రివి నీవే నా చేయిని నువ్వు పట్టి నడిపించు / వీడగ లేని సంసారమనే బంధం విడిపించు / నీపై మనసు నిలిచే విధమును నువ్వే నేర్పించు ||సర్వోన్నతుడా||
కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ / వినబడుతుంది నా యేసుని స్వరమే / తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం / ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం || కొండ కోన || / నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు / హృదయమందు చేర్చుకో నేస్తమా (2) / ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య / నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2) / నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన || / ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు / నిన్ను రక్షించాలని (2) / కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య / తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2) / నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన ||
యేసు స్వామీ నీకు నేను / నా సమస్త మిత్తును / నీ సన్నిధి-లో వసించి / ఆశతో సేవింతును / నా సమస్తము – నా సమస్తము / నా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము / యేసు స్వామీ నీకు నేను / ద్రోసి లొగ్గి మ్రొక్కెదన్ / తీసివేతు లోక యాశల్ / యేసు చేర్చుమిప్పుడే ||నా సమస్తము|| / నేను నీ వాడను యేసు / నీవును నా వాడవు / నీవు నేను నేకమాయే / నీ శుద్ధాత్మ సాక్ష్యము ||నా సమస్తము|| / యేసు నీదే నా సర్వాస్తి / హా సుజ్వాలన్ పొందితి / హా సురక్షణానందమా / హల్లెలూయా స్తోత్రము ||నా సమస్తము||
చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా / చిన్న గొరియపిల్లను నేను యేసయ్యా (2) / పాపమంటే తెలియదు కాని యేసయ్యా / పాప లోకంలో నున్నానట యేసయ్యా (2) ||చిట్టి|| / జీవమంటే తెలియదు కాని యేసయ్యా / నిత్య జీవం నీవేనట యేసయ్యా (2) ||చిట్టి||
యేసు గొరియ పిల్లను నేను / వధకు తేబడిన గొరియ పిల్లను (2) / దినదినము చనిపోవుచున్నాను / యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ|| / నా తలపై ముళ్ళు గుచ్చబడినవి / నా తలంపులు ఏడుస్తున్నవి (2) / నా మోమున ఉమ్మి వేయబడినది / నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ|| / నా చేతుల సంకెళ్ళు పడినవి / నా రాతలు చెరిగిపోతున్నవి (2) / నా కాళ్ళకు మేకులు దిగబడినవి / నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ||
మార్పుచెందవా నీవు మర్పుచెందవా / నీ బ్రతుకు మార్చుకోవా (2) / అనుకూల సమయం ఇదియేనని ఎరిగి / మారు మనసునూ పొందవా (2) / ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని / ఏమున్నది ఈ లోకంలో / ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి / తీర్పున్నది పై లోకంలో (2) / తీర్పు దినమునందున ఆయన ముందు నీవు / నిలిచే ధైర్యం నీకుందా (2) / నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా|| / దిగంబరిగానే వచ్చావు నీవు / దిగంబరిగా పోతావు / మన్నైన నీవు మన్నై పోతావు / ఏదో ఒక దినమందున (2) / నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు / నీవెంట రావెన్నడు (2) / నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా|| / ఆత్మని కాక దేహాన్ని చంపే / మనుషులకే భయపడకయ్యా / ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే / దేవునికే భయపడవయ్యా (2) / దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు / నీకంటూ ఏముందిలే (2) / నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||
యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు / యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2) / ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును / చింతలన్ని బాపి శాంతినిచ్చును (2) ||యేసు మంచి|| / శాశ్వతమైన ప్రేమతో / నిన్ను నన్ను ప్రేమించాడు (2) / సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు / తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2) ||యేసు మంచి|| / శాంతి సమాధానం మనకిచ్చాడు / సమతా మమత నేర్పించాడు (2) / మార్గము సత్యము జీవమైనాడు / మానవాళికే ప్రాణమైనాడు (2) ||యేసు మంచి||
తప్పిపోయిన కుమారుడనయ్యా / తరలి తిరిగి వస్తున్న తనయుడనయ్యా / కాదనకయ్యా నా కన్న తండ్రి / తనయుడిగా కాదు నీ దాసుడిగా ఉంటా (2) / అంతులేని ఆశలతో ఆస్తినంత పంచుకొని / పరిహాసకులనే స్నేహితులుగ ఎంచుకొని (2) / ఆస్తి అంత కోల్పోయి అనాథగా వస్తున్నా / ఆదరించువారు లేక అలమటిస్తు వస్తున్నా (2) ||కాదనకయ్యా|| / పూట పూట కూటి కొరకు ఆకలితో అలమటిస్తు / పొట్ట నింపుకొనుట కొరకు పంది పొట్టుకాశపడుచు (2) / ఆ పొట్టు కూడ నోచుకోని దీన స్థితిలో వస్తున్నా / తండ్రి నీవు గుర్తొచ్చి తరలి తిరిగి వస్తున్నా (2) ||కాదనకయ్యా||
నేడు ఇక్కడ రేపు ఎక్కడో / తెలియని పయనం ఓ మానవా (2) / ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు / ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు (2) ||నేడు|| / నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే / నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే (2) / నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో (2) / నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||నేడు|| / అది నాది ఇది నాదని అదిరి పడతావు / చివరికి ఏది రాదు నీ వెంట (2) / దిగంబరిగానే నీవు పుడతావు / దిగంబరిగానే నీవు వెళతావు (2) ||నేడు||
దేవునికి భయపడవా మానవా / నీ దేవునికి భయపడవా మానవా (2) / పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా (2) / యేసయ్యను నీవు శరణు వేడుమా (2) ||దేవునికి|| / ఐగుప్తు మంత్రసానుల గమనించితివా / రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి (2) / దేవునికి విధేయత చూపిరి / వంశాభివృద్ధిని పొందిరి (2) ||దేవునికి|| / నినెవె ప్రజలను గమనించితివా / దేవుని మాటకు లోబడినారు (2) / పాపమును విడిచి ఉపవాసముండి / ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి (2) ||దేవునికి||