255 salvation songs available. Lyrics in Roman and Telugu script.
నీవు తడితే తలుపు తీయనా ప్రభు / నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2) ||నీవు|| / పాపముతో నిండియున్న నా బ్రతుకును / పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా / పాపములో జీవించుచున్న నాపై / ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2) / నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి / నన్ను నడిపించగ వచ్చావయ్యా (2) ||నీవు|| / తెరిచాను నా తలుపులు రావా ప్రభు / ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను / నాలోన నీవుండి పోవాలి / నీతోనే నడవాలి ఇక మీదట (2) / రక్షణనే కేడెము చేత పట్టి / ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద (2) ||నీవు|| / విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి / వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా / స్వస్థతనే వరముల దయచేయుమా / కడ వరకు పరుగెడుదును నీ బాటలో (2) / ఎల్లవేళలా నాతో ఉండి నన్ను / చేయి పట్టి నడిపించు నా యేసయ్యా (2) ||నీవు||
ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2) / నీ కోసమే నా కోసమే / కలువరి పయనం – ఈ కలువరి పయనం (2) ||ఎవరి|| / ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా / ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2) / మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో / నడువలేని నడకలతో తడబడుతూ పోయావా / సోలి వాలి పోయావా…. ||ఎవరి|| / జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము / జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2) / మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా / నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి / తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు / వీరిని క్షమించు, వీరిని క్షమించు / అని వేడుకొన్నావా… పరమ తండ్రిని ||ఎవరి||
మనిషి బ్రతుకు రంగుల వలయం / ఆ బ్రతుకే క్షణ భంగురం (2) / మారాలి ప్రతి హృదయం / వెదకాలి క్రీస్తు రాజ్యము (2) ||మనిషి|| / గడ్డి పువ్వురా మనిషి జీవితం / గాలి వీచగా రాలిపోవును (2) / గాలిలో నిలువని దీపమురా ఇది / గాలిలో ఎగిరే గాలిపటం రా (2) / తెలుసుకో ఓ మానవా / ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి|| / ఆత్మ వెళ్లగా శవమని నిన్ను / ఇంట నుంచరు పంచ చేర్చెదరు (2) / ఇరుగు పొరుగువారు కూడ కొందరు / వల్లకాటి వరకే వచ్చెదరు (2) / తెలుసుకో ఓ మానవా / ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి|| / ధనమున్నదని గర్వించకురా / ధనమే నీకు తోడు రాదురా (2) / లోకమే నీకు అశాశ్వతంబురా / పరలోకమే నీకు శాశ్వతంబురా (2) / తెలుసుకో ఓ మానవా / ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి||
ఎవరు నన్ను చేయి విడచినన్ / యేసు చేయి విడువడు (2) / చేయి విడువడు (3) / నిన్ను చేయి విడువడు ||ఎవరు || / తల్లి ఆయనే తండ్రి ఆయనే (2) / లాలించును పాలించును (2) ||ఎవరు|| / వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2) / వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు|| / రక్తము తోడ కడిగి వేసాడే (2) / రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు|| / ఆత్మ చేత అభిషేకించి (2) / వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు||
ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా (2) / నీ బ్రతుకంతా మారుటే మేలు / కోరుము జీవమునే ||ఓ క్రైస్తవ|| / పాププు చీకటి బ్రతుకేలా / శాపము భారము నీకేలా (2) / పావన యేసుని పాదము చేరిన / జీవము నీదగురా ||ఓ క్రైస్తవ|| / మారిన జీవిత తీరులలో / మానక నీప్రభు సేవకురా (2) / మహిమ కిరీటము మనకొసగును / ఘనమే నీదగురా ||ఓ క్రైస్తవ|| / భయపడి వెనుకకు పరుగిడక / బలమగు వైరిని గెలిచెదవా (2) / బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన / గెలుపే నీదగురా ||ఓ క్రైస్తవ||
ఎవరో తెలుసా యేసయ్యా / చెబుతా నేడు వినవయ్యా / పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి / రక్షణ పొందయ్యా (2) / దేవాది దేవుడు యేసయ్యా / మానవ జన్మతో వచ్చాడయ్యా (2) / మరణించాడు మరి లేచాడు / నీ నా పాప విమోచనకై (2) ||ఎవరో|| / ధనవంతుడై యుండి యేసయ్యా / దరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2) / రూపు రేఖలు కోల్పోయాడు / నీ నా పాపవిమోచనకై (2) ||ఎవరో|| / పాపుల రక్షకుడేసయ్యా / కార్చెను రక్తము పాపులకై (2) / తన దరి చేరిన పాపులనెల్ల / కడుగును తనదు రక్తముతో (2) ||ఎవరో|| / యేసే దేవుడు ఎరుగవయ్యా / రాజుల రాజుగా వస్తాడయ్యా (2) / నమ్మినవారిని చేర్చును పరమున / నమ్మని వారికి నరకమేగా (2) ||ఎవరో|| / యేసుని తరుపున ప్రతినిధినై / దేవుని ప్రేమకు ప్రతిరూపమై (2) / అతి వినయముగా బతిమాలుచున్నాను / నేడే నమ్ముము ప్రభు యేసుని (2) ||ఎవరో||
ఎందరో… ఎందరు ఎందరో… / యేసుని ఎరుగనివారు చెబుతారా వారికి మీరు / రాయబారులై బారులు తీరి తరలండి / క్రీస్తుకు రాయబారులై సిలువ ధ్వజం చేబూనండి / వందలు వేలు ఏళ్ళు గడుస్తున్నాయి / సువార్త అందని స్థలాలు ఎన్నో ఉన్నాయి (2) ||ఎందరో|| / పల్లె పల్లెలో పట్టణాలలో క్రీస్తు మార్గమే చూపుదాం / పల్లె పల్లెలో పట్టణాలలో యేసు వార్తనే చాటుదాం / వాగులు వంకలు దాటుదాం / యేసు సిలువ ప్రేమనే చాటుదాం (2) ||వందలు||
ఆకశాన తార ఒకటి వెలసింది / ఉదయించెను రక్షకుడని తెలిపింది (2) / ఇదే క్రిస్మస్ – హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ ||ఆకాశాన|| / యూద దేశపు బెత్లెహేములో / కన్య మరియ గర్బమున జన్మించె / తూర్పు దేశపు గొప్ప జ్ఞానులు / యూదుల రాజు ఎక్కడని వెతికారు / తూరుపు దిక్కున చుక్కను కనుగొని / ఆనందభరితులై యేసుని చేరిరి / కానుకలిచ్చిరి పూజించిరి ||ఇదే|| / రాత్రివేళలో మంద కాసెడి / కాపరులకు ప్రభువు దూత ప్రకటించే / లోక ప్రజలకు మిగుల సంతసం / కలిగించెడి వర్తమానమందించే / క్రీస్తే శిశువుగా యేసుని పేరట / ముక్తిని గూర్చెడి రక్షకుడాయెగా / సంతోషగానముతో స్తుతియింతుము ||ఇదే||
ఇదిగో దేవుని గొర్రెపిల్లా / ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2) / అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు / గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు / రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి / నీదు ప్రజలను కొనినావు / అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు / గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు / మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు / నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో|| / పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2) / సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను (2) ||అర్హుడవు|| / దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా (2) / యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను (2) ||అర్హుడవు|| / దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి (2) / క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను (2) ||అర్హుడవు||
కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా / రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2) / దేవుని ముందు నిలిచే రోజుంది / తక్కెడ తూకం వేసే రోజుంది (2) / జీవ గ్రంథం తెరిచే రోజుంది / నీ జీవిత లెక్క చెప్పే రోజుంది / ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా / ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2) ||కాలం|| / ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా / మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా (2) / గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో / ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2) ||ఆగవేమయ్యా|| / చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు / పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2) / నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు / ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు (2) ||ఆగవేమయ్యా|| / సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు / సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు (2) / అగ్ని ఆరదు పురుగు చావదు / నిత్యం ఏడుపు దుఃఖాలు (2) ||ఆగవేమయ్యా||
రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము / నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు / హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి / మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య|| / నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి / మా గండంబులన్నియు ఖండించుటకు ||రావయ్య|| / మేర లేని పాపము మాకు భారమైన మోపు / నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు ||రావయ్య|| / పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను / మా పాపంబులన్నియు పారద్రోలుటకు ||రావయ్య|| / అందమైన నీదు పరమానంద పురమందు / మేమందరము జేరి యానందించుటకు ||రావయ్య||
విడువను నిను ఎడబాయనని నా / కభయ మొసంగిన దేవా / నా కభయ మొసంగిన దేవా / నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2) / నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా ||విడువను|| / పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా (2) / నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా ||విడువను|| / మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా (2) / గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి ||విడువను|| / సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా (2) / నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను ||విడువను||