రక్షణ | Salvation Telugu Songs

255 salvation songs available. Lyrics in Roman and Telugu script.

పువ్వులాంటిది జీవితం|Puvvu laantidi jeevitham

పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది / గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2) / ఏ దినమందైనా ఏ క్షణమైనా (2) / రాలిపోతుంది నేస్తమా / ఆ.. వాడిపోతుంది నేస్తమా (2) / పాల రాతపైన నడిచినా గాని / పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2) / అందలము పైన కూర్చున్నా గాని / అందనంత స్థితిలో నీవున్నా గాని / కన్ను మూయడం ఖాయం / నిన్ను మోయడం ఖాయం (2) / కళ్ళు తెరచుకో నేస్తమా / ఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2) ||పువ్వు|| / జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని / డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2) / జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా / డబ్బు నిన్ను రక్షించదు తెలుసా / మరణము రాకముందే / అది నిన్ను చేరకముందే (2) / పాపాలు విడువు నేస్తమా / ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు|| / ఇలలో నీవు నేను స్థిరము కాదుగా / ధరలో మనకేది స్థిరము కాదుగా (2) / ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా / ఏది నీతో రాదనీ తెలుసా / వాడిపోయి రాలకముందే / ఎత్తి పారవేయక ముందే (2) / పాపాలు విడువు నేస్తమా / ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు||

మంచి స్నేహితుడా|Manchi snehithudaa

మంచి స్నేహితుడా మంచి కాపరివి (2) / అగాధ జలములలో నేను నడచినను / అరణ్య యానములో నేను తిరిగినను / నన్ను ఆదరించినావు ఓదార్చినావు / చేర దీసినావు కాపాడినావు (2) / నీకే ఆరాధన – నీకే ఆరాధన (2) / ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే ఆరాధన (2) / తప్పిపోయిన నన్ను వెదకి రక్షించినావు / ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచుచున్నావు (2) / ఘనమైన పరిచర్యను నాకు దయచేసినావు / ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు ||ఆరాధన|| / చెరలో ఉన్న నన్ను విడుదల చేసినావు / బంధింపబడియున్న నన్ను విముక్తి ప్రకటించినావు (2) / నాలో ఉన్న నిన్ను లోకానికి చూపినావు / నీలో ఉన్న నన్ను నీ సాక్షిగా నిలిపినావు ||ఆరాధన|| / ఒంటరియైన నన్ను వేయిమందిగా చేసితివి / ఎన్నిక లేని నన్ను బలమైన జనముగా మార్చితివి (2) / నన్ను హెచ్చించినావు నా కొమ్ము పైకెత్తినావు (2) ||ఆరాధన||

అంబరానికి అంటేలా|Ambaraaniki antelaa

లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2) / అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2) / సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2) ||లాల|| / దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు / దీనులను రక్షించే దేవ తనయుడు (2) / దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె / విజయ వీరుడై ఉద్భవించెనే (2) / పశుల పాకలో పరుండియుండెనే ||లాల|| / ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే / లోకానికి రక్షకుడు వెలిసెనని (2) / తార వెంబడి వెళ్లి వారు / కానుకలర్పించి ఆరాధించారు (2) / ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి ||లాల|| / ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త / సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే (2) / పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు / దూత గణములే జోల పాడగా (2) / సృష్టికి బహు సంబరమాయెగా ||లాల||

దేవుడు నీకు తెలుసు|Devudu neeku thelusu

దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా / నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2) / అవసరాలకు దేవుని నమ్మక / ఆత్మకు తండ్రని నమ్మాలి (2) / నీ ఆత్మకు తండ్రని నమ్మాలి ||దేవుడు|| / నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక / నలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2) / ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక / పాపిని రక్షించు పరలోకానికి నడిపించు / నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు / నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు ||దేవుడు|| / నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి / సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి (2) / ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి (2) / దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి (2) / దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు / దేహానికిష్టమైనది అడగకూడదు ముందు ||దేవుడు||

నన్ను దిద్దుము చిన్న ప్రాయము|Nannu Diddumu Chinna Prayamu

నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా / నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా ||నన్ను|| / దూరమునకు బోయి నీ దరి – జేర నైతిని నాయనా / నేను కారు మూర్ఖపు పిల్లనై కా – రడవి దిరిగితి నాయనా ||నన్ను|| / మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా / నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను|| / చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనా / నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా ||నన్ను|| / జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా / నీవు జ్ఞానము గల తండ్రి మంచు – జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను|| / కొద్ది నరుడను దిద్ది నను నీ – యొద్ద జేర్చుము నాయనా / నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము – మొద్దు నైతిని నాయనా ||నన్ను|| / ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనా / నీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా ||నన్ను|| / శత్రువగు సాతాను నన్ను – మిత్రు జేయను నాయనా / యెన్నో సూత్రములు గల్పించెను నా – నేత్రముల కో నాయనా ||నన్ను|| / వాసిగా నే బాప లోకపు – వాసుడ నో నాయనా / నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||

దొరకును సమస్తము|Dorakunu samasthamu

దొరకును సమస్తము యేసు పాదాల చెంత / వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2) / యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా / యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా ||దొరకును|| / మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి / కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2) / పాదాలను ముద్దు పెట్టుకొని / పూసెను విలువైన అత్తరు (2) / చేసెను శ్రేష్టారాధన / దొరికెను పాప క్షమాపణ (2) ||దొరకును|| / యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి / బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2) / చిన్నదాన లెమ్మని చెప్పి / బ్రతికించెను యేసు దేవుడు (2) / కలిగెను మహదానందం / దొరికెను రక్షణ భాగ్యము (2) ||దొరకును|| / పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి / పాదాలపై పడెను పరవశుడై యుండెను (2) / పరలోక దర్శనం / చూచెను తానే స్వయముగా (2) / దొరికెను ప్రభు ముఖ దర్శనం / దొరికెను ఇల మహా భాగ్యం (2) ||దొరకును||

మరువగలనా మరలా|Maruvagalanaa Maralaa

మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా / ఈలాంటి ప్రేమను కలిగినను / క్షమించు నింతటి నేరమును / జీవిత కాలమంతా – యేసు ధ్యానము చేసెదను / ఆశయు అక్కరయు పాపమై / చిక్కితి శత్రువు చేతులలో / మరణపు టంచున చేరితిని / ఇంతలోనే యేసు కరుణింప వచ్చి / క్షమియించి విడిపించెను / ఈలాంటి ప్రేమను కలిగినను / క్షమించు నింతటి నేరమును / నిందను పొందినను – ప్రభు చెంతకు చేరెదను / ఏ పాపికి కడు భాగ్యమే / యేసుని చేరగ ధన్యమే / యేసుని ప్రేమ అనంతమే / నీ పాపమంతా తొలగించి / యేసు ప్రేమించి దీవించును / నీ భారమంతయు భరియించును / కన్నీరు తుడిచి ఓదార్చును / శాశ్వత ప్రేమ చూపి – తన కౌగిట దాచుకొనున్ / మరువగలనా మరలా – ఇలలో గనని కరుణా / ఆ సిల్వ ప్రేమను చూపెదను / నా క్రీస్తు వార్తను చాటెదను / జీవిత కాలమంత – యేసు ధ్యానము చేసెదను