ప్రార్థన | Prayer Telugu Songs

167 prayer songs available. Lyrics in Roman and Telugu script.

ఎటు చూచినా|Etu Choochinaa

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు / ఎటు చూచినా కరువూ భూకంపాలు / ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు / ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు / ఓ సోదరా ఓ సోదరీ (2) / రాకడ గురుతులని తెలుసుకోవా / తినుటకు త్రాగుటకు ఇది సమయమా ||ఎటు|| / మందసము నీ ప్రజలు – గుడారములో నివసిస్తుండగ / యోవాబుని సేవకులు దండులో నుండగను (2) / తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2) / ఇది సమయమా.. ఇది సమయమా.. అని / ఆనాడు ఊరియా దావీదునడిగాడు / ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| / నా పితరుల యొక్క – సమాధులుండు పట్టణము / పాడైపోయెను పాడైపోయెను (2) / యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా (2) / సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని / ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు / ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| / ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు / సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2) / ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2) / తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని / నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు / ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు ||ఎటు||

నీతో నుండని బ్రతుకు|Neetho Nundani Brathuku

నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము / ఊహించలేను నా యేసయ్యా / నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు / ఊహించలేను నా యేసయ్యా (2) / నీదు స్వరము వినకనే నేను / నిను విడచి తిరిగితి నేను / నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2) ||నిను|| / నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి / అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2) / అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ / నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా ||నీతో|| / నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ / నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ (2) / నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు / నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా ||నిను||

దినదినంబు యేసుకు|Dinadinambu Yesuku

దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా / అణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2) / ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2) / పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2) ||దినదినంబు|| / మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా (2) / మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2) ||దినదినంబు|| / ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము (2) / ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2) ||దినదినంబు|| / దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు చదువుతా (2) / ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా (2) ||దినదినంబు|| / పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా (2) / సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా (2) ||దినదినంబు||

యేసు దేవా నను కొనిపోవా|Yesu Devaa Nanu Konipovaa

యేసు దేవా నను కొనిపోవా / నీ రాజ్యముకై వేచియున్నా (2) / శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యింది / శాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యింది / నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను / అంత వరకు నీదు శక్తినిమ్మయా / నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను / అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము ||యేసు|| / ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది / ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2) / నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా / నీ రాక వరకు నను నిలబెట్టుము దేవా (2) ||యేసు|| / నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను / నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను (2) / నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము / నీ ఆత్మ శక్తితో నను బలపరచుము / నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు / కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను ||యేసు||

Prayer Telugu Songs — Page 8 | UEC Telugu Church