ప్రార్థన | Prayer Telugu Songs

167 prayer songs available. Lyrics in Roman and Telugu script.

ఊహించలేని కార్యములు|Oohinchaleni Kaaryamulu

ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు / కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2) / దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు / ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు / ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే / కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము ||ఊహించలేని|| / ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం / ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2) / కలవాలి హృదయాలు ఒకటై / పండాలి నూరేళ్లు ఇకపై (2) / వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ ||ఊహించలేని|| / దేవుని సముఖములో బ్రతకాలి మీరు / మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2) / లోబడి ఉండాలి వధువు / ప్రేమను పంచాలి వరుడు (2) / దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి ||ఊహించలేని||

నీ మందిరమై నేనుండగా|Nee Mandiramai Nenundagaa

నీ మందిరమై నేనుండగా / నా యందుండి నడిపించవా (2) / నీవు తోడుండగా నాకు దిగులుండునా (2) / వెంబడిస్తాను నిను యేసువా (2) / నీవు కోరేటి దేవాలయం / నాదు దేహంబెగా నిశ్చయం (2) / నీదు ప్రత్యక్షత నాకు కలిగించవా (2) / నిత్యము నిన్ను స్తుతింతును (2) / నీ మందిరమై నేనుండగా... / నాడు నిర్మించే దేవాలయం / రాజు సొలొమోను బహుసుందరం (2) / అట్టి దేవాలయం నేను నిర్మించగా (2) / నీ కట్టడలో నను నిల్పుమా (2) / నీ మందిరమై నేనుండగా... / హన్న ప్రార్ధనను విన్నావుగా / నేనున్నానని అన్నావుగా (2) / నేడు సమూయెలుతో బహుగా మాట్లాడినా (2) / దేవా నాతోటి మాట్లాడవా (2) / నీ మందిరమై నేనుండగా... / ఆత్మసత్యముతో ఆరాధింప / ఆత్మదేవుండు నేర్పించుమా (2) / మహిమ రూపంబును నేను దర్సింపను (2) / నా నేత్రంబు వెలిగించుమా (2) / నీ మందిరమై నేనుండగా... / ఆ పరలోక ప్రతిబింబమై / ఈ ధరలోన దీపంబునై (2) / ధరణి వెలిగించను కరుణ ప్రసరింపను (2) / కరము తోడుంచి నడిపించుము (2) / నీ మందిరమై నేనుండగా...

ప్రేమించెద యేసు రాజా|Premincheda Yesu Raajaa

ప్రేమించెద యేసు రాజా / నిన్నే ప్రేమించెద (2) / ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ / ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు / నే మట్టిలో చేరే వరకు / నా ప్రాణమున్నంతవరకు / నే మహిమలో చేరే వరకు / ఆరాధించెద యేసు రాజా / నిన్నే ఆరాధించెద (2) / ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ / ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు / నే మట్టిలో చేరే వరకు / నా ప్రాణమున్నంతవరకు / నే మహిమలో చేరే వరకు / ప్రార్ధించెద యేసు రాజా / నిన్నే ప్రార్ధించెద (2) / ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ / ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు / నే మట్టిలో చేరే వరకు / నా ప్రాణమున్నంతవరకు / నే మహిమలో చేరే వరకు / సేవించెద యేసు రాజా / నిన్నే సేవించెద (2) / సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ / సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు / నే మట్టిలో చేరే వరకు / నా ప్రాణమున్నంతవరకు / నే మహిమలో చేరే వరకు / జీవించెద యేసు రాజా / నీకై జీవించెద (2) / జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ / జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు / నే మట్టిలో చేరే వరకు / నా ప్రాణమున్నంతవరకు / నే మహిమలో చేరే వరకు

నాతో మాట్లాడుమయ్యా|Naatho Maatladumayya

నాతో మాట్లాడుమయ్యా – నన్ను దర్శించుమయ్యా / నీ మందిరాన – నీ సన్నిధాన – నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా / నాతో మాట్లాడుమయ్యా.. / యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా….. / కన్నీళ్ళైనా కష్టాలెదురైనా – కడవరకూ నను చేర్చుమయ్యా / కరువు తోడైనా – కలిమి వేరైనా – కరుణించి కాపాడుమయ్యా / నా వేదనలో నీ జాలితో – నా శోధనలో నీ చేతితో / నిత్యము నను నడిపించుమయ్యా.. / యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా….. / నావారే నన్ను నిందించు వేళ – నను విడిచి పోబోకుమయ్యా / ఆదరణ నాకు – కరువైన వేళ – దరి చేరి ఒదార్చుమయ్యా / నా నిందలలో నా తోడువై – అపనిందలలో నా చేరువై / నిత్యము నను నడిపించుమయ్యా.. / యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా….. / నా కాలు జారి తొట్రిల్లు వేళ – చేజార్చి నిలబెట్టుమయ్యా / సాతాను నన్ను – బంధించు వేళ – నను చేరి విడిపించుమయ్యా / నీ చేతితో నను పట్టుకో – నీ సేవలో నను వాడుకో / నిత్యము నను నడిపించుమయ్యా.. / యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా…..

ఆకాశమా ఆలకించుమా|Aakaashamaa Aalakinchumaa

ఆకాశమా ఆలకించుమా / భూమీ చెవియొగ్గుమా (2) / అని దేవుడు మాటలడుచున్నాడు / తన వేదన నీతో చెబుతున్నాడు (2) ||ఆకాశమా|| / నేను పెంచిన నా పిల్లలే / నా మీదనే తిరగబడిరనీ (2) / అరచేతిలో చెక్కుకున్నవారే / నా అరచేతిపై మేకులు కొడుతూ (2) / నను దూరంగా ఉంచారని / నా పిల్లలు బహు చెడిపోతున్నారని (2) ||దేవుడు|| / విస్తారమైన బలులు నాకేల / క్రొవ్విన దూడా నాకు వెక్కసమాయే (2) / కోడెల రక్తం గొర్రె పిల్లల రక్తం / మేకల రక్తం నాకిష్టము లేదు (2) / కీడు చేయ మానాలని / బహు మేలు చేయ నేర్వాలని (2) ||దేవుడు|| / పాపిష్టి జనమా, దుష్టసంతానమా / చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ / అక్కరలో మీ చేతులు నా వైపుకు చాచినపుడు / మిమ్మును నే చూడకనే కనులు కప్పుకొందును / ఆపదలో మీ గొంతులు నా సన్నిధి అరచినపుడు / మీ మాటలు వినకుండా చెవులు మూసుకొందును / నన్ను విసర్జించువారు లయమగుదురని / నీరులేని తోటలా నశియింతురని (2) ||దేవుడు|| / ఆకాశమా భువికి చెప్పుమా / భూమీ లోకాన చాటుమా (2)

నా ప్రాణమా ఏలనే|Naa Praanamaa Aelane

నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా / సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా / ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు (2) / నెమరేసుకుంటూ ప్రాణమా / స్తుతిపాడుమా – స్తుతిపాడుమా ||నా ప్రాణమా|| / నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు / నీ కొరకు సిలువలోన తాను మరణించాడు (2) / నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా / నీవు కూడా తన కార్యం పాటించుమా (2) / అలనాటి యేసు ప్రేమ మరువకు సుమా / మరువకు సుమా – మరువకు సుమా ||నా ప్రాణమా|| / నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడు / నీ వ్యాధి బాధలందు నిన్ను ఓదార్చాడు (2) / నా ప్రాణమా నాలో కరిగిపోకే / నీ గతం ఏమిటో మరచిపోకే (2) / దినమెల్ల దేవుని దయ కోరుమా / దయ కోరుమా – దయ కోరుమా ||నా ప్రాణమా|| / నీ చదువులోన నీకు విజయాన్ని ఇచ్చాడు / నీ వయసులో నీకు తోడుగా ఉన్నాడు (2) / నా ప్రాణమా నాలో కృంగిపోకే / నీ గతం ఏమిటో మరచిపోకే (2) / దినమెల్ల దేవుని కృప కోరుమా / కృప కోరుమా – కృప కోరుమా ||నా ప్రాణమా||

Prayer Telugu Songs — Page 7 | UEC Telugu Church