799 praise songs available. Lyrics in Roman and Telugu script.
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా / ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2) / నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ|| / నాకు ఉన్న సామర్ధ్యం / నాకు ఉన్న సౌకర్యం / నాకు ఉన్న సౌభాగ్యం / నాకు ఉన్న సంతానం (2) / ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2) / కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ|| / నాకు ఉన్న ఈ బలం / నాకు ఉన్న ఈ పొలం / త్రాగుచున్న ఈ జలం / నిలువ నీడ ఈ గృహం (2) / నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం (2) / కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య / చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2) / దయగల వాడమ్మో / ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| / రాయి రప్పకు మొక్కవద్దు / చెట్టు పుట్టను కొలవవద్దు (2) / దయగల వాడమ్మో / ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర|| / లోకమునకు వచ్చినాడు / పాపుల రక్షించుటకు (2) / పరిశుద్దుడొచ్చినాడు / ఆ పరమున చేర్చుతాడు (2) ||చిత్ర|| / కోళ్ళు గొర్లు కోరడట / కొబ్బరికాయలు కోరడట (2) / దయగల వాడమ్మో / ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||
నిత్యము స్తుతించినా / నీ ఋణము తీర్చలేను / సమస్తము నీకిచ్చినా / నీ త్యాగము మరువలేను (2) / రాజా రాజా రాజాధి రాజువు నీవు / దేవా దేవా దేవాది దేవుడవు (2) ||నిత్యము|| / అద్వితీయ దేవుడా / ఆది అంతములై యున్నవాడా (2) / అంగలార్పును నాట్యముగా / మార్చివేసిన మా ప్రభు (2) ||రాజా|| / జీవమైన దేవడా / జీవమిచ్చిన నాథుడా (2) / జీవజలముల బుగ్గ యొద్దకు / నన్ను నడిపిన కాపరి (2) ||రాజా|| / మార్పులేని దేవుడా / మాకు సరిపోయినవాడా (2) / మాటతోనే సృష్టినంతా / కలుగజేసిన పూజ్యుడా (2) ||రాజా||
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో / వందనంబొనర్తుమో ప్రభో ప్రభో / వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా / వందనంబు లందుకో ప్రభో ||వందనం|| / ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు / గన్న తండ్రి మించి ఎపుడు గాచియు / ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా / యన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం|| / ప్రాత వత్సరంపు బాప మంతయు / బ్రీతిని మన్నించి మమ్ము గావుము / నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా / దాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం|| / దేవ మాదు కాలుసేతు లెల్లను / సేవకాలి తనువు దినములన్నియు / నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ / సేవకై యంగీకరించుమా ||వందనం|| / కోతకొరకు దాసజనము నంపుము / ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము / పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము / ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం|| / మా సభలను పెద్దజేసి పెంచుము / నీ సువార్త జెప్ప శక్తి నీయుము / మోసపుచ్చు నందకార మంత ద్రోయుము / యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం||
స్తోత్రము స్తుతి స్తోత్రము / వేలాది వందనాలు / కలుగును గాక నీకే మహిమ / ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము / యేసయ్య యేసయ్య యేసయ్య (4) / శూన్యము నుండి సమస్తము కలుగజేసెను / నిరాకారమైన నా జీవితమునకు రూపము నిచ్చెను / యేసే నా సర్వము / యేసే నా సమస్తము ||యేసయ్య|| / పరము నుండి భూమికి దిగివచ్చిన యేసు / సిలువ మరణమునొంది మార్గము తెరిచెను / యేసే నా రక్షణ / యేసే నా నిరీక్షణ ||యేసయ్య||
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము / యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| / దివారాత్రములు కంటిపాపవలె కాచి (2) / దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం|| / గాడాంధకారములో కన్నీటి లోయలలో (2) / కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2) ||స్తోత్రం|| / సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2) / సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం|| / సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2) / సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం|| / సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2) / యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ||స్తోత్రం|| / పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2) / సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం||
రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2) / రారే చూడ మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు|| / యుదాయనే దేశమందన్నయ్య (2) / యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2) ||రాజులకు|| / తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2) / తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2) ||రాజులకు|| / బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య (2) / బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2) ||రాజులకు|| / ఆడుదాము పాడుదామన్నయ్య (2) / వేడుకతో మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు||
ఓరన్న… ఓరన్న / యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న / యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా / యేసే ఆ దైవం చూడన్నా ||ఓరన్న|| / చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా / పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2) / అద్వితీయుడు ఆదిదేవుడు / ఆదరించును ఆదుకొనును (2) ||ఓరన్న|| / పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా / నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా (2) / పరిశుద్దుడు పావనుడు / ప్రేమించెను ప్రాణమిచ్చెను (2) ||ఓరన్న|| / సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా / మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న (2) / మహిమ ప్రభూ మృత్యుంజయుడు / క్షమియించును జయమిచ్చును (2) ||ఓరన్న||
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు / క్రొత్త యేడు మొదలు బెట్టెను / క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ / తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ ||క్రొత్త|| / పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర / డెందమందు స్మరణ జేయుడి / ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు / అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా ||క్రొత్త|| / బలము లేని వారమయ్యీను బలమొందవచ్చు / కలిమి మీర గర్త వాక్కున / అలయకుండా అడుగుచుండ నలగకుండా మోదమొంది / బలమొసంగు సర్వ విధుల నెలమి మీర నొచ్చుచుండ ||క్రొత్త|| / పాప పంకమంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు / ప్రాపు జేరి మీరు వేడగా / సేపు మీర తనదు కరుణ పాపమంతా కడిగివేసి / పాప రోగ చిహ్నలన్ని బాపి వేసి శుద్ది చేయు ||క్రొత్త||
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు / హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2) / రాజుల రాజా ప్రభువుల ప్రభువా / రానైయున్నవాడా (2) / మహిమా మహిమా ఆ యేసుకే / మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ|| / సూర్యునిలో చంద్రునిలో / తారలలో ఆకాశములో (2) ||మహిమా|| / కొండలలో లోయలలో / జీవులలో ఆ జలములలో (2) ||మహిమా|| / ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా / యుగయుగముల నిత్యుడా (2) ||మహిమా||
ఓ సద్భక్తులారా – లోక రక్షకుండు / బెత్లేహేమందు నేడు జన్మించెన్ / రాజాధి రాజు – ప్రభువైన యేసు / నమస్కరింప రండి నమస్కరింప రండి / నమస్కరింప రండి ఉత్సాహముతో / సర్వేశ్వరుండు – నర రూపమెత్తి / కన్యకు బుట్టి నేడు వేంచేసెన్ / మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ / నీకు నమస్కరించి నీకు నమస్కరించి / నీకు నమస్కరించి పూజింతుము / ఓ దూతలారా – ఉత్సాహించి పాడి / రక్షకుండైన యేసున్ స్తుతించుడి / పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు / నమస్కరింప రండి నమస్కరింప రండి / నమస్కరింప రండి ఉత్సాహముతో / యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మ / ఈ వేల స్తోత్రము నర్పింతుము / అనాది వాక్య – మాయే నర రూప / నమస్కరింప రండి నమస్కరింప రండి / నమస్కరింప రండి ఉత్సాహముతో
జన్మించెను ఒక తార / తూర్పు దిక్కున కాంతిమయముగా / దివి నుండి భువికి వెడలిన / రారాజును సూచిస్తూ (2) / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జన్మించెను|| / ఇదిగో జనులందరికి / సంతోషకరమైన సువార్తమానము (2) / దేవాది దేవుండు / ఒక శిశువై పుట్టెను (2) ||హ్యాప్పీ|| / సర్వోన్నత స్థలములలో / దేవునికి మహిమ ఆయనకిష్టులకు (2) / భూమియందు / సమాధానము (2) ||హ్యాప్పీ|| / మనలను పాపాలనుండి / రక్షించు దేవుడు ఆయనే యేసు (2) / నీ కొరకే అరుదించే / తన ప్రాణం నిచ్చుటకై (2) ||హ్యాప్పీ||