స్తుతి | Praise Telugu Songs

799 praise songs available. Lyrics in Roman and Telugu script.

యెహోవాను స్తుతియించు|Yehovaanu Sthuthiyinchu

యెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు / మహా దేవుని సేవించు – యేసుని పూజించు (2) / ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త / బలవంతుడైన నిత్యుడగు తండ్రి (2) / సమాధానకర్త అయిన రారాజును / ఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోను / కరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసి / కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు ||యెహోవాను|| / ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించు / భూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించు / తన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించు / పిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించు / నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో ||ఆత్మతోను|| / స్వరమండలముతో ఆయనను స్తుతియించు / సితార స్వరములతో ఆయనను స్తుతియించు / గంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతో / తంబుర నాట్యముతో తంతి వాద్యముతో / జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు ||ఆత్మతోను||

భీకరుండౌ మా యెహోవా|Bheekarundau Maa Yehovaa

భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే / ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ|| / మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను / ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము || భీకరుండౌ || / ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను / ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము || భీకరుండౌ || / పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని / బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని || భీకరుండౌ || / మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను / జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను || భీకరుండౌ || / మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను / దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను || భీకరుండౌ ||

అత్యున్నత సింహాసనముపై|Athyunnatha simhaasanamupai

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా / అత్యంత ప్రేమా స్వరూపివి నీవే / ఆరాధింతును నిన్నే (2) / ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3) / ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్ / ఆశ్చర్యకరుడా స్తోత్రం / ఆలోచనకర్త స్తోత్రం / బలమైన దేవా నిత్యుడవగు తండ్రి / సమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా|| / కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం / కృపతో రక్షించితివే స్తోత్రం / నీ రక్తమిచ్చి విమోచించినావు / నా రక్షణకర్త స్తోత్రం (2) ||ఆహాహా|| / స్తుతులపై ఆసీనుడా స్తోత్రం / సంపూర్ణుడా నీకు స్తోత్రం / మా ప్రార్థనలు ఆలకించువాడా / మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) ||ఆహాహా|| / మృత్యుంజయుడా స్తోత్రం / మహాఘనుడా స్తోత్రం / మమ్మును కొనిపోవ త్వరలో రానున్న / మేఘ వాహనుడా స్తోత్రం (2) ||ఆహాహా|| / ఆమెన్ అనువాడా స్తోత్రం / అల్ఫా ఒమేగా స్తోత్రం / అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా / అత్యున్నతుడా స్తోత్రం (2) ||ఆహాహా||

నడిపించు నా నావా|Nadipinchu naa naavaa

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా / నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| / నా జీవిత తీరమున నా అపజయ భారమున / నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు / నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప / నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| / రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము / రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము / రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో / రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు|| / ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి / అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి / ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే / ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు|| / ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని / ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని / ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది / ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు|| / లోతైన జలములలో లోతున వినబడు స్వరమా / లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి / లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు / లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు|| / ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని / ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ / పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో / ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||

ఆనందముగా యెహోవా నీ|Aanandamugaa yehovaa nee

ఆనందముగా యెహోవా నీ కృపలన్ని / అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2) / చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాత / వివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయో / సవ్యంబుగా ఈ భువియందున ||ఆనందముగా|| / సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికి / ఇహమందునా ఏ మేలు కొదువ యుండదు / అహా\! ఏమందు నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా|| / ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్ / ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన / కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ||ఆనందముగా|| / పర్వతంబులు – పారిపోయినను- ఉర్విలోమార్పు కలిగిననూ / తరుణములు విరోధముగపై లేచినా – / స్మరియించెద నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||

Praise Telugu Songs — Page 63 | UEC Telugu Church