స్తుతి | Praise Telugu Songs

799 praise songs available. Lyrics in Roman and Telugu script.

దూత పాట పాడుడి|Dootha Paata Paadudi

దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి / ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేము నందున / భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను / ఆకసంబు నందున – మ్రోగు పాట చాటుడి / దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి / ఊర్ధ్వ లోకమందున – గొల్వగాను శుద్దులు / అంత్య కాలమందున – కన్య గర్భమందున / బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో / ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా / దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి / రావే నీతి సూర్యుడా – రావే దేవా పుత్రుడా / నీదు రాక వల్లను – లోక సౌఖ్య మాయెను / భూ నివాసులందరూ – మృత్యు భీతి గెల్తురు / నిన్ను నమ్ము వారికి – ఆత్మ శుద్ది కల్గును / దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి

యేసుతో ఠీవిగాను పోదమా|Yesutho teevigaanu podamaa

యేసుతో ఠీవిగాను పోదమా / అడ్డుగా వచ్చు వైరి గెల్వను / యుద్ధనాదంబుతో బోదము ||యేసుతో|| / రారాజు సైన్యమందు చేరను / ఆ రాజు దివ్య సేవ చేయను (2) / యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2) / యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| / విశ్వాస కవచమును ధరించుచు / ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2) / అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2) / యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| / శోధనలు మనల చుట్టి వచ్చినా / సాతాను అంబులెన్ని తగిలినా (2) / భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2) / యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| / ఓ యువతి యువకులారా చేరుడి / శ్రీ యేసురాజు వార్త చాటుడి (2) / లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2) / సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||

యెహోవా నీ నామము ఎంతో బలమైనది|Yehovaa nee naamamu entho balamainadi

యెహోవా నీ నామము ఎంతో బలమైనది / ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది / యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది / ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా || / మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2) / యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా || / నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2) / అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా || / సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2) / ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా || / చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2) / సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా || / పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2) / పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||

యెహోవా నా బలమా|Yehovaa naa balamaa

యెహోవా నా బలమా / యదార్థమైనది నీ మార్గం / పరిపూర్ణమైనది నీ మార్గం (2) ||యెహోవా|| / నా శత్రువులు నను చుట్టిననూ / నరకపు పాశములరికట్టిననూ (2) / వరదవలె భక్తిహీనులు పొర్లిన (2) / విడువక నను ఎడబాయని దేవా (2) ||యెహోవా|| / మరణపుటురులలో మరువక మొరలిడ / ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2) / తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2) / ఆదరెను ధరణి భయకంపముచే (2) ||యెహోవా|| / నా దీపమును వెలిగించువాడు / నా చీకటిని వెలుగుగా చేయును (2) / జలరాసులనుండి బలమైన చేతితో (2) / వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా|| / పౌరుషముగల ప్రభు కొపింపగా / పర్వతముల పునాదులు వణకెను (2) / తన నోటనుండి వచ్చిన అగ్ని (2) / దహించివేసెను వైరులనెల్లన్ (2) ||యెహోవా|| / మేఘములపై ఆయన వచ్చును / మేఘములను తన మాటుగ జేయును (2) / ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2) / అపజయమిచ్చును అపవాదికిని (2) ||యెహోవా|| / దయగలవారిపై దయ చూపించును / కఠినులయెడల వికటము జూపును (2) / గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2) / సర్వమునెరిగిన సర్వాధికారి (2) ||యెహోవా|| / నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును / ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2) / రక్షణ కేడెము నాకందించి (2) / అక్షయముగ తన పక్షము జేర్చిన (2) ||యెహోవా|| / యెహోవా జీవముగల దేవా / బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2) / అన్యజనులలో ధన్యత చూపుచు (2) / హల్లెలూయ స్తుతిగానము చేసెద (2) ||యెహోవా||

యెహోవ నా మొర లాలించెను|Yehova naa mora laalinchenu

యెహోవ నా మొర లాలించెను / దన మహా దయను నను గనించెను / అహర్నిశల దీనహీనుడగు నా / దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ|| / పిశాచి గడిమి బడగొట్టెను / దన వశాన నను నిలువ బెట్టెను / ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల / నిశాంతమున జే ర్చి సేద దీర్చెను ||యెహోవ|| / మదావలము బోలు నా మదిన్ / దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్ / యధేచ్చలన్నిటి గుదించి పాపపు / మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను ||యెహోవ|| / అనీతి వస్త్ర మెడలించెను / యే సునాథు రక్తమున ముంచెను / వినూత్న యత్నమే ద నూని యెన్నడు / గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను ||యెహోవ|| / విలాపములకు జెవి నిచ్చెను / శ్రమ కలాపములకు సెలవిచ్చెను / శిలానగము పై కిలాగి నను సుఖ / కళావళుల్ మన సులోన నిలిపెను ||యెహోవ|| / అగణ్య పాపియని త్రోయక / న న్ను గూర్చి తన సుతుని దా చక / తెగించి మృతి కొ ప్పగించి పాపపు / నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను ||యెహోవ||

స్తుతియు మహిమ ఘనత నీకే|Sthuthiyu Mahima Ghantha Neeke

స్తుతియు మహిమ ఘనత నీకే / యుగయుగముల వరకు / ఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు|| / మా దేవుడవై మాకిచ్చితివి / ఎంతో గొప్ప శుభ దినము (2) / మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2) / కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు|| / నీవొక్కడవే గొప్ప దేవుడవు / ఘనకార్యములు చేయుదువు (2) / నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2) / నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ||స్తుతియు|| / నీవే మాకు పరమ ప్రభుడవై / నీ చిత్తము నెరవేర్చితివి (2) / జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2) / నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2) ||స్తుతియు|| / భరియించితివి శ్రమలు నిందలు / ఓర్చితివన్ని మా కొరకు (2) / మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2) / పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2) ||స్తుతియు||

సర్వకృపానిధియగు ప్రభువా|Sarvakrupaanidhiyagu Prabhuvaa

సర్వకృపానిధియగు ప్రభువా / సకల చరాచర సంతోషమా (2) / స్తోత్రము చేసి స్తుతించెదను / సంతసముగ నిను పొగడెదను (2) / హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను / నేను… ఆనందముతో సాగెదను / ప్రేమించి నన్ను వెదకితివి / ప్రీతితో నను రక్షించితివి (2) / పరిశుద్ధముగా జీవించుటకై / పాపిని నను కరుణించితివి (2) ||హల్లెలూయా|| / అల్పకాల శ్రమలనుభవింప / అనుదినము కృపనిచ్చితివి (2) / నాథుని అడుగుజాడలలో / నడుచుటకు నను పిలిచితివి (2) ||హల్లెలూయా|| / మరణ శరీరము మర్పునొంది / మహిమ శరీరము పొందుటకై (2) / మహిమాత్మతో నను నింపితివి / మరణ భయములను తీర్చితివి (2) ||హల్లెలూయా|| / భువినుండి శ్రేష్ట ఫలముగను / దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2) / భూజనములలోనుండి నన్ను / ప్రేమించి క్రయ ధనమిచ్చితివి (2) ||హల్లెలూయా|| / ఎవరూ పాడని గీతములు / యేసుతో నేను పాడుటకై (2) / హేతువు లేకయే ప్రేమించెన్‌ / యేసుకు నేనేమివ్వగలన్‌ (2) ||హల్లెలూయా||

సాక్ష్యమిచ్చెద|Saakshyamichcheda

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు / సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే (2) / సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య|| / దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి (2) / మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో ||సాక్ష్య|| / పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు (2) / పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య|| / బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల (2) / నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు ||సాక్ష్య|| / పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు (2) / బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు ||సాక్ష్య|| / చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన (2) / ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్య|| / పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల (2) / ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు ||సాక్ష్య|| / ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక (2) / తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర ||సాక్ష్య||

Praise Telugu Songs — Page 65 | UEC Telugu Church