799 praise songs available. Lyrics in Roman and Telugu script.
నమ్మకమైన నా ప్రభు / నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును || నమ్మకమైన || / కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడిన / స్థిరపరచి కాపాడిన / స్థిరపరచిన నా ప్రభున్ / పొగడి నే స్తుతింతును (2) || నమ్మకమైన || / ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభు / విడచియుంటినో ప్రభు / మన్ననతోడ నీ దరిన్ / చేర్చి నన్ క్షమించితివి (2) || నమ్మకమైన || / కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివి / పైకి లేవనెత్తితివి / భంగ పర్చు సైతానున్ / గెల్చి విజయమిచ్చితివి (2) || నమ్మకమైన || / నా కాశ్రయశైలమై – కోటగా నీవుంటివి / కోటగా నీవుంటివి / ప్రాకారంపు ఇంటివై / నన్ను దాచియుంటివి (2) || నమ్మకమైన || / సత్య సాక్షివై యుండి – నమ్మదగినవాడవై / నమ్మదగినవాడవై / నిత్యుడౌ మా దేవుడా / ఆమేనంచు పాడెద (2) || నమ్మకమైన ||
వర్ణించలేను వివరించలేను / యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) / యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) / పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు / పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2) / ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| / అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు / ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2) / ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| / తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను / ఆదరించినావు ఓదార్చినావు (2) / ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||
నీ జల్దరు వృక్షపు నీడలలో / నేనానంద భరితుడనైతిని (2) / బలు రక్కసి వృక్షపు గాయములు (2) / ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2) ||నీ జల్దరు|| / నా హృదయపు వాకిలి తీయుమని / పలు దినములు మంచులో నిలచితివి (2) / నీ శిరము వానకు తడిచినను (2) / నను రక్షించుటకు వేచితివి (2) ||నీ జల్దరు|| / నీ పరిమళ పుష్ప సుగంధములు / నా రోత హృదయమును నింపినవి (2) / ద్రాక్షా రస ధారల కన్న మరి (2) / నీ ప్రేమే ఎంతో అతి మధురం (2) ||నీ జల్దరు|| / ఓ ప్రియుడా నా అతి సుందరుడా / దవళ వర్ణుడా నాకతి ప్రియుడా (2) / వ్యసనా క్రాంతుడుగా మార్చబడి (2) / నీ సొగసును నాకు నొసగితివి (2) ||నీ జల్దరు||
దేవుని స్తుతించ రండి / గత సంవత్సరమున కాపాడెన్ / కీడు మనలను చేరకను – కోటి / కీడుల నుండి కాపాడినట్టి – మహా ||దేవుని|| / కోట్లకొలది మరణించిరి / మన మిచ్చట చేరియున్నాము / కష్టముల బాపి మనల నింక / జగమున జీవితులుగా నుంచినట్టి – మహా ||దేవుని|| / ఎన్ని కీడుల మనము చేసిన / నన్ని మెల్లను చేసెనుగా / నిరతము కాచి చక్కగాను / ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి ||దేవుని|| / ఏకముగా పాడి హర్షముతో / లెక్కలేని మేలులకై / ఆత్మ దేహములను బలిగా / నిపుడేసు కర్పించెద మేకముగా – చేరి ||దేవుని|| / వత్సారంభముననిను / మే మొక్కటిగా నారాధింప / దైవ కుమారా కృపనిమ్ము / మా జీవిత కాలమంతయు పాడి – మహా ||దేవుని|| / భూమి యందలి మాయల నుండి / సైతానుని వలలో నుండి / ఆత్మతో నిను సేవింప / నిపు డేలుమనుచు బ్రతిమాలెదము – కూడి ||దేవుని||| / ప్రతి సంవత్సరమును మము జూడుము / దుర్గములో మము చేర్చుమయ్యా / దాటునప్పుడు నీ సన్నిధిని – చూపి / ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా – మహా ||దేవుని|| / స్తోత్రింతుము ప్రభువా నీ పదముల / సకలాశీర్వాదముల నిమ్ము / ప్రేమతో ప్రభుతో నుండ / నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ – ప్రభు ||దేవుని||
దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్ / దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్ (2) / నిన్ను కీర్తించెదన్ – నిన్ను స్తుతియించెదన్ / నీ నామమునే ఘనపరచెదన్ (2) / హల్లెలూయ హల్లెలూయ యేసయ్యా / హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2) / పనికిరాని నన్ను నీవు / ఉపయోగ పాత్రగ మలచితివే (2) / నీదు కృపతో నను రక్షించిన / దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ|| / నీదు ప్రేమతో నను ప్రేమించి / నూతన జీవితం ఇచ్చితివి (2) / నీవు నాకై చేసావు త్యాగం / దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ|| / నిన్ను నమ్మిన నీ ప్రజలకు / అండగా నీవు నిలచితివి (2) / మాట తప్పని నిజమైన ప్రభువా / దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ||
నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు / నీలా క్షమియించేదెవరు – యేసయ్యా / నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు (2) / లోక బంగారము – ధన ధాన్యాదులు / ఒక పోగేసినా – నీతో సరితూగునా / జీవ నదులన్నియు – సర్వ సంద్రములు / ఒకటై ఎగసినా – నిన్ను తాకగలవా / లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన / నీవేగా చాలిన దేవుడవు ||నీతో|| / పలు వేదాలలో – మత గ్రంథాలలో / పాపమే సోకని – పరిశుద్దుడేడి / పాప పరిహారార్థం – సిలువ మరణమొంది / తిరిగి లేచినట్టి – దైవ నరుడెవ్వరు / నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా / నీవేగా మంచి దేవుడవు ||నీతో|| / నేను వెదకకున్నా – నాకు దొరికితివి / నేను ప్రేమించకున్నా – నన్ను ప్రేమించితివి / పలు గాయాలు చేసి – తరచు రేపితిని / నన్నెంతో సహించి – క్షమియించితివి / నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి / నీవేగా విమోచకుడవు ||నీతో||
వాక్యమే శరీర ధారియై వసించెను / జీవమై శరీరులను వెలిగింపను / ఆ… ఆ…. ఆ… ఆ…. (2) / కృపయు సత్యములు – హల్లెలూయ / నీతి నిమ్మళము – హల్లెలూయ (2) / కలసి మెలసి – భువిలో దివిలో (2) / ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే|| / ఆశ్చర్యకరుడు – హల్లెలూయ / ఆలోచనకర్త – హల్లెలూయ (2) / నిత్యుడైన – తండ్రి దేవుడు (2) / నీతి సూర్యుడు – భువినుదయించెను ||వాక్యమే|| / పరమ దేవుండే – హల్లెలూయ / నరులలో నరుడై – హల్లెలూయ (2) / కరము చాచి – కనికరించి (2) / మరు జన్మములో మనుజుల మలచే ||వాక్యమే||
వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే / నీవే నా మంచి యేసయ్యా / ప్రవహించే సెలయేరై రావా నీవు / జీవ నదిలా మము తాకు యేసయ్యా / నీవే నా ప్రాణము – నీవే నా సర్వము / నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి / నీలోనే తరియించాలి ప్రభు (2) / నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం / నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో|| / ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం / కడవరకు కాపాడే నీవే నా దైవం / పోషించే నా తండ్రి నీవే ఆధారం / కరుణగల నీ మనసే నాకు చాలును / నీ మాటలే మాకు ఉజ్జీవం / నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు|| / ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం / ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై / నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే / నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి / మా కోసమే నీవు మరణించి / పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||
పరమ జీవము నాకు నివ్వ / తిరిగి లేచెను నాతో నుండ / నిరంతరము నన్ను నడిపించును / మరల వచ్చి యేసు కొని పోవును / యేసు చాలును – యేసు చాలును / యే సమయమైన యే స్థితికైన / నా జీవితములో యేసు చాలును / సాతాను శోధనలధికమైన / సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను / లోకము శరీరము లాగినను / లోబడక నేను వెళ్ళెదను ||యేసు|| / పచ్చిక బయలులో పరుండజేయున్ / శాంతి జలము చెంత నడిపించును / అనిశము ప్రాణము తృప్తిపరచున్ / మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు|| / నరులెల్లరు నన్ను విడిచినను / శరీరము కుళ్ళి కృశించినను / హరించినన్ నా ఐశ్వర్యము / విరోధివలె నన్ను విడచినను ||యేసు||
సమర్ధవంతుడవైన నా యేసయ్యా / సమస్తము నీకు సాధ్యమేనయ్యా (2) / నా స్తుతి యాగము నీకే / నా ప్రాణార్పణ నీకే / నా సర్వస్వము నీకే / నా జీవన గానము నీకే ||సమర్ధ|| / పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా / ఉంచువాడవు నీవే యేసయ్యా / ఆత్మ జలములను నవ్యముగా / ఇచ్చువాడవు నీవే యేసయ్యా (2) / నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా (2) / దూతల చేతులలో / నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా (2) నీ ||సమర్ధ|| / శత్రువు చరలోనుండి నను భద్రముగా / నిల్పువాడవు నీవే యేసయ్యా / రక్షణ వస్త్రమును నిత్యము నాపై / కప్పువాడవు నీవే యేసయ్యా (2) / జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా (2) / రక్తపు బిందువుతో / నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా (2) నీ ||సమర్ధ||
దవలవర్ణుడా రత్నవర్ణుడా / పదివేలలో అతిప్రియుడా / అతి కాంక్షనీయుడా (2) / ఎందుకయ్యా మాపై ప్రేమ / ఎందుకయ్యా మాపై కరుణ (2) / ఘోర పాపినైన నన్ను / లోకమంతా వెలివేసినా / అనాథగా ఉన్న నన్ను / ఆప్తులంతా దూషించగా (2) / నీ ప్రేమ నన్నాదుకొని / నీ కరుణ నన్నోదార్చెను (2) / గాయములతో ఉన్న నన్ను / స్నేహితులే గాయపరచగా / రక్తములో ఉన్న నన్ను / బంధువులే వెలివేసినా (2) / నీ రక్తములో నను కడిగి / నీ స్వారూపము నాకిచ్చితివా (2) / అర్హత లేని నన్ను నీవు / అర్హునిగా చేసితివి / నీ మహిమలో నిలబెట్టుటకు / నిర్దోషిగా చేసితివి (2) / నీ సేవలో నను వాడుకొని / నీ నిత్య రాజ్యము చేర్చితివి (2) ||దవలవర్ణుడా||
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం (2) యేసు / యేసయ్యా నీ ప్రేమ మధురం / యేసయ్యా మధురాతి మధురం (2) ||నీ ప్రేమ|| / మరచిపోనిది నీ ప్రేమా / నన్ను మార్చుకున్నది నీ ప్రేమా / కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా / జీవ కాలముండును నీ ప్రేమా (2) ||నీ ప్రేమ|| / సిలువకెక్కెను నీ ప్రేమా / నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా / నాకై మరణించెను నీ ప్రేమా / నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2) ||నీ ప్రేమ|| / తల్లికుండునా నీ ప్రేమా / సొంత చెల్లికుండునా నీ ప్రేమా / అన్నకుండునా నీ ప్రేమా / కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2) ||నీ ప్రేమ|| / త్యాగమున్నది నీ ప్రేమలో / దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో / బలమున్నది నీ ప్రేమలో / గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2) ||నీ ప్రేమ||