799 praise songs available. Lyrics in Roman and Telugu script.
నీ పాదం మ్రొక్కెదన్ నిత్యము స్తుతించి / నిన్ను పాడి కీర్తించెదను / యేసయ్యా… నీ ప్రేమ పొంగుచున్నది (2) / పరిశుద్ధమైన పరవశమే / పరమ యేసుని కృపా వరమే (2) / వెదకి నన్ను కనుగొంటివి (2) / పాడుటకు పాటనిచ్చితివి (2) ||నీ పాదం|| / నూతన నూనె ప్రభావముతో / నూతన కవిత్వపు కృపతోను (2) / నింపి నిత్యము నడిపితివి (2) / నూతన షాలేము చేర్చేడవు (2) ||నీ పాదం|| / ఇరుకు నందు పిలచితివి / నాకు సహాయము చేసితివి (2) / చెడి ఎక్కడ తిరుగకుండా (2) / చేరవచ్చి నన్ను ఆడుకొంటివి (2) ||నీ పాదం|| / నిత్యముగ నీ సన్నిధి / నాకు ఇచ్చును విశ్రాంతిని (2) / దుడ్డు కర్ర నీ దండమును (2) / నిజముగ నన్ను ఆదరించును (2) ||నీ పాదం|| / ఫలించు చెట్టు నీవు నిలచు / తీగగా నేను వ్యాపించుటకై (2) / కొమ్మ నరికి కలుపు తీసి (2) / కాపాడి శుద్దీకరించితివి (2) ||నీ పాదం|| / పరిశుద్ధమైన కీర్తితోను / ప్రకాశమైన శిఖరముపై (2) / శీఘ్రముగ చేర్చెదవు (2) / సీయోనులో నిన్ను కీర్తించెదన్ (2) ||నీ పాదం||
చీకటి లోయలో నేను పడియుండగా / నీవే దిగి వచ్చి నను కనుగొంటివి / మరణపు గడియలో నేను చేరియుండగా / నీ రక్తమిచ్చి నను బ్రతికించితివి / నీవే.. దేవా నేవే.. నీవే నీవే / నా ప్రాణ దాతవు నీవే ప్రభు / చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు / ఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు / అరణ్యములలో నేను పయనించినను / ఏ అపాయమునకిక భయపడను / నీవే నా మార్గమని నిను వెంబడించెదను / నా చేయి పట్టి నను నడిపించుము / నీకే.. దేవా నీకే.. నీకే నీకే / నా సమస్తము నీకే అర్పింతును / చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు / నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు / ఆకలి దప్పులు లేని.. శ్రమలు అలసటలు లేని / శోధన ఆవేదన లేని.. భయము దుఃఖము లేని / మరణం కన్నీరు లేని.. చీకటి ప్రవేశం లేని / నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు / సకల సమృద్ధి ఉండు.. దూతల స్తుతిగానాలుండు / భక్తుల సమూహముండు.. మహిమ ప్రవాహముండు / నిత్యం ఆరాధన ఉండు.. నిరతం ఆనందముండు / నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు
హృదయాలనేలే రారాజు యేసువా / అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2) / నీ కొరకే నేను జీవింతును / నా జీవితమంతా అర్పింతును ||హృదయాల|| / నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి / నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2) / నా దరికి చేరి నన్ను ప్రేమించినావా / నన్నెంతో ఆదరించి కృప చూపినావా / నా హృదయనాథుడా నా యేసువా / నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల|| / నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా / నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2) / పరలోక మార్గాన నడిపించు నా ప్రభు / అరణ్య యాత్రలోన నిన్నానుకొందును / అతిలోక సుందరుడా శ్రీ యేసువా / రాజాధిరాజా ఘన యేసువా ||హృదయాల||
కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం / ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం / శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం / రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా|| / చెదరిన మనసులకూ శాంతి / కృంగిన హృదికీ ఓదార్పు / మృత్యు దేహముకూ జీవం / బలహీనులకు ఆరోగ్యం (2) / పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు / గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు / మోసపూరిత ఈ లోకంలో / ఏ వైద్యునికి సాధ్యము (2) ||కవులకైనా|| / క్షణికమైన అనురాగాలు / ఆవిరివంటి ఆప్యాయతలు / అవసరాల అభిమానాలు / నిలచిపోయే అనుబంధాలు (2) / నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ / ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం / స్వార్ధపూరిత ఈ లోకంలో / ఏ మిత్రునికి సాధ్యము (2) ||కవులకైనా||
యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం / యేసు నామం ఉన్నత నామం (2) / పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు / ఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2) / ఆశలన్ని అడి ఆశలుగా / మార్చునంత విపరీతముగా / చేయునదే నీ పాపము (2) / యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడు / ఆయన కృప నిత్యముండును (2) / ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు / లోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2) / శ్రమయు బాధ హింస అయిననూ / కరువు వస్త్ర హీనతైననూ / ఖడ్గ మరణమెదురే అయిననూ (2) / యేసు పునరుత్థానుడు… యేసు పునరుత్థానుడు / మరణపు బలము ఓడిపోయెను (2)
నిన్ను తలచి నను నేను మరచి / నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2) / యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) ||నిను తలచి|| / జీవము లేని దైవారాధనలో / నిర్జీవ క్రియలతో మృతుడనైతిని (2) / జీవాధిపతివై నా జీవితానికి / నిత్య జీవము నొసగిన యేసయ్యా (2) ||నిను తలచి|| / దారే తెలియని కారు చీకటిలో / బ్రతుకే భారమై నలిగిపోతిని (2) / నీతి సూర్యుడా ఎదలో ఉదయించి / బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా (2) ||నిను తలచి|| / సద్గుణ శీలుడా సుగుణాలు చూచి / హృదిలో నేను మురిసిపోతిని (2) / సుగుణాలు చూచుటకే నీవు / సిలువలో నాకై నలిగిన యేసయ్యా (2) ||నిను తలచి||
రోజంతా ద్వేషం మనుషుల కోపం / తీరని బాధ ఇది తీరము చేరనిది / అవమానం ఆవేశం / కన్నీళ్ళే ఈ దేహం / విరిగిన హృదయం నలిగిన దేహం / శవమై పోవులే ఈ జీవితము / ఊపిరి ఆహుతై మిగిలెనే / నీ కృప నాకు చాలును దేవా / నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా (2) / గర్బము లేని ఈ శరీరము / నిందై పోయిన ఈ జీవితము / నీ ప్రజలే నన్ను ద్వేషించగా / అయిన వాల్లే శోధించిగా / రావా దేవా నీ ప్రేమతో / నింపుము ప్రభువా నీ కృపతో (2) / నీ కృప నాకు చాలును దేవా / నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా (2) / రావా దేవా నీ ప్రేమతో / నింపుము ప్రభువా నీ కృపతో (2) / నిలబెట్టుము దేవా నీ ప్రజలతో / నిందైన నన్ను నీ సాక్షముతో / చేయి పట్టి నడుపుము నీ మార్గములో / పడుతున్న నన్ను నీ వాక్యముతో / ఎవరు మాట్లాడినా నీ స్వరమే అది / ఎవరు ప్రేమించినా నీ ప్రేమా అది / రావా దేవా నీ ప్రేమతో / నింపుము ప్రభువా నీ కృపతో (2) / నీ కృప నాకు చాలును దేవా / నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా (2) / రావా దేవా నీ ప్రేమతో / నింపుము ప్రభువా నీ కృపతో (2)
ఆవేదన నేనొందను / అవమానముతో నే కృంగను / ఆనందమే నా జీవితం (2) / నా యేసుని బాహూవులో / హల్లెలూయా హల్లెలూయా (2) / హల్లెలూయా ఆనందమే ||ఆవేదన|| / నాకేమి కావలెనో నేనేమి కోరెదనో (2) / నా ఊహలకు ఊపిరి పోసి / కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన / నీ కార్యములు ఆశ్చర్యమే (2) ||హల్లెలూయా|| / కష్టాల కెరటాల సుడిగుండమందున (2) / కలవరమొంది కృంగిన నన్ను / కరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవా / కృపలన్నియు కురిపించితివి (2) ||హల్లెలూయా||
నా యెడల నీకున్న తలంపులన్ని (2) / ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య (2) / అవి రమ్యమైనవి అమూల్యమైనవి(2) / నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య / నాకై నీవు తలంచుచున్నావా (2) ||నా యెడల|| / రాజువైన నీవు దాసుడవయ్యావా / దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే (2) / అభిషేకించావు అధికారం ఇచ్చావు (2) / పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు / నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల|| / ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా / దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే (2) / ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు (2) / సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు (2) / నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల|| / బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా / బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే (2) / నా స్తానము నిలిచావు నా శిక్ష భరించావు (2) / నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు / నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||
నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు / నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు (2) / నీ ప్రేమా నా లోనా (2) / ప్రతిక్షణం అనుభవించనీ (2) ||నీ చల్లనైన|| / మట్టి వంటిది నా జీవితం / గాలి పొట్టు వంటిది నా ఆయుషు (2) / పదిలముగా నను పట్టుకొని (2) / మార్చుకుంటివా నీ పోలికలో (2) / మరణ భయమిక లేదంటివి (2) ||నీ చల్లనైన|| / మారా వంటిది నా జీవితం / ఎంతో మదురమైనది నీ వాక్యం (2) / హృదయములో నీ ప్రేమా (2) / కుమ్మరించుమా జుంటి తేనెలా (2) / (ఆహా) మధురం మధురం నా జీవితం (2) ||నీ చల్లనైన|| / అల్పమైనది నా జీవితం / ఎంతో ఘనమైది నీ పిలుపు (2) / నీ సేవలో నే సాగుటకు (2) / నను నింపుమా నీ ఆత్మ శక్తి తో (2) / నే ఆగక సాగెద నీ సేవలో (2) ||నీ చల్లనైన||
మా ఇంటి పేరు పశువుల పాక / పక్కింటి పేరు ఒలీవల తోట (2) / ఎదురింటి పేరు కల్వరి కొండ / మా వాడ పేరు సీయోను కోట ||మా ఇంటి పేరు|| / మా తండ్రి యేసు పశువుల పాకలో / తనను తాను చూడు తగ్గించుకొనెను (2) / కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2) / మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు ||మా ఇంటి పేరు|| / మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో / సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2) / తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2) / మార్గము సత్వము జీవము చూడు ||మా ఇంటి పేరు||
రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా / స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2) ||రక్షకుడా|| / సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2) / శ్రమ అయిననూ బాధ అయిననూ (2) / ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా / క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా / రక్షకుడా… ||రక్షకుడా|| / ఎంచలేని యేసు నాకై హింస పొందెనే (2) / హింస అయిననూ హీనత అయిననూ (2) / ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా / క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా / రక్షకుడా… ||రక్షకుడా|| / ఎన్నడైన మారని మా యేసుడుండగా (2) / ఉన్నవైననూ రానున్నవైననూ (2) / ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా / హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ / రక్షకుడా… ||రక్షకుడా||