799 praise songs available. Lyrics in Roman and Telugu script.
అందరు నన్ను విడచినా / నీవు నన్ను విడువనంటివే (2) / నా తల్లియు నీవే / నా తండ్రియు నీవే / నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) / లోకము నన్ను విడచినా / నీవు నన్ను విడువనంటివే (2) / నా బంధువు నీవే / నా మిత్రుడ నీవే / నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) / వ్యాధులు నన్ను చుట్టినా / బాధలు నన్ను ముట్టినా (2) / నా కొండయు నీవే / నా కోటయు నీవే / నా కొండ కోట నీవే యేసయ్యా (2) / నేను నిన్ను నమ్ముకొంటిని / నీవు నన్ను విడువనంటివే (2) / నా తోడుయు నీవే / నా నీడయు నీవే / నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
నే యేసుని వెలుగులో నడిచెదను / రాత్రింబగలాయనతో నడిచెదను / వెల్గున్ నడిచెదను – వెంబడిచెదను / యేసుడే నా రక్షకుడు / నడిచెద నే ప్రభు యేసునితో / నడిచెద నే ప్రభు హస్తముతో / కాంతిలో నుండగ జయగాంతును / యేసునే నే వెంబడింతును / నే యేసుని వెలుగులో నడిచెదను / గాడంబగు చీకటిలో భయపడను / ఆత్మతో పాడుచు సాగిపోవుదును / యేసుడే నా ప్రియుండు ||నడిచెద|| / నే యేసుని వెలుగులో నడిచెదను / వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును / సర్వమిచ్చెదను చెంతనుండెదను / యేసుడే ప్రేమామయుడు ||నడిచెద|| / నే యేసుని వెలుగులో నడిచెదను / దిన సహాయము నే పొందెదను / సుఖ దుఃఖమైన మరణంబైన / యేసుడే నా యండనుండును ||నడిచెద|| / నే యేసుని వెలుగులో నడిచెదను / నా దృష్టిని ప్రభుపై నుంచెదను / సిల్వ ధ్వజమునే బట్టి వెళ్లెదను / యేసుడే నా చెంత నుండును ||నడిచెద||
ఈ తరం యువతరం / ప్రభు యేసుకే అంకితం / నా బలం యవ్వనం / ప్రభు యేసుకే సొంతము / రా సోదరీ రారా సోదరా / ప్రభు యేసు వార్త చాటుదాం / రా సోదరీ రారా సోదరా / ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం|| / సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా / ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా / దేవుని సేవ వ్యాపారమాయే / ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే / నీవు కాకపోతే ఇంకెవ్వరు / నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| / నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా / యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా / యేసయ్య రాకడ సామీపమాయే / ఆ వార్త చాటను వేగిర రావే / నీవు కాకపోతే ఇంకెవ్వరు / నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||
చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని / చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో ||చెప్పలేను|| / ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు (2) / ఐదు వేల పీపుల్ కి పంచిపెట్టాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| / కానానులో పెళ్లి విందులో (2) / వాటర్ ని వైన్ గా మార్చివేసాడు (2) బాబోయ్ ||చెప్పలేను|| / సమాధిలో శవాన్ని చూచి (2) / కమాన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు (2) బాబోయ్ ||చెప్పలేను||
చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా / మెల్లమెల్లగా నడుపు యేసయ్యా (2) / యేసయ్యా యేసయ్యా యేసయ్యా / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) / శాంతి జలములందు పచ్చ గడ్డిలో / కాంతి బాటలో నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా|| / ఒక్కటే ఆశ కలదు యేసయ్యా / చక్కనైన నీ ఇల్లు చేరేద (2) ||యేసయ్యా|| / శత్రువైన సాతాను ఎదుటను / విందు చేసినావు నాకు యేసయ్యా (2) ||యేసయ్యా|| / అంధకార లోయలో అండగా / ఉండుగాక నీ సిలువ యేసయ్యా (2) ||యేసయ్యా||
నీ చేతి కార్యములు సత్యమైనవి / నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి (2) / నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవి / నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి (2) / బల సౌందర్యములు / పరిశుద్ధ స్థలములో ఉన్నవి / ఘనతా ప్రభావములు / ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి (2) / మాపై నీ ముఖ కాంతిని / ప్రకాశింపజేయుము యేసయ్యా / నీ ఆలోచనలు గంభీరములు / నీ శాసనములు హృదయానందకరములు (2) / నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవి / నీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి (2) ||బల సౌందర్యములు|| / ఎవర్లాస్టింగ్ ఫాదర్ / యువర్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫరెవర్ / ఎవర్లాస్టింగ్ ఫాదర్ – మై జీసస్ / నిత్యుడైన తండ్రి / నీ కృప నిరతము నిలచును / నిత్యుడైన తండ్రి – నా యేసయ్య / నీ రూపము ఎంతో మనోహరము / నీ అనురాగము మధురాతి మధురము (2) / నీ నామము నిత్యము పూజింపతగినది / నీ విశ్వాస్యత నిరతము నిలచునది (2) ||బల సౌందర్యములు||
యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు / యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2) / ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును / చింతలన్ని బాపి శాంతినిచ్చును (2) ||యేసు మంచి|| / శాశ్వతమైన ప్రేమతో / నిన్ను నన్ను ప్రేమించాడు (2) / సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు / తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2) ||యేసు మంచి|| / శాంతి సమాధానం మనకిచ్చాడు / సమతా మమత నేర్పించాడు (2) / మార్గము సత్యము జీవమైనాడు / మానవాళికే ప్రాణమైనాడు (2) ||యేసు మంచి||
స్తుతులకు పాత్రుడు యేసయ్యా / స్తుతి కీర్తనలు నీకేనయ్యా (2) / మహిమకు పాత్రుడు ఆయనయ్యా / కీర్తియు ఘనతయు రాజునకే / నే పాడెద ప్రభు సన్నిధిలో / నే ఆడెద ప్రభు సముఖములో / చిన్ని బిడ్డను పోలి నే (2) / స్తుతి చెల్లించెద యేసయ్యా / మహిమకు పాత్రుడు మెస్సయ్యా (2) / నిరతము పాడెద హల్లెలూయా / ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా ||నే పాడెద||
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ / మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2) / ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో / ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు / ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2) ||యేసయ్యా|| / అందరు ఉన్నారని అందరు నావారని (2) / తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని (2) / చివరికి ఒంటరి నేనైతిని / నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా / నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా ||యేసయ్యా|| / అంధకారములో అంధుడ నేనైతిని (2) / నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా (2) / నాకొసగుమా నజరేయుడా / నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా / నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా ||యేసయ్యా||
చాలునయ్య నీ కృప నా జీవితానికి (2) / సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా ||చాలునయ్య|| / మేఘాలలోన మెరుపుంచినావు (2) / త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2) / సాగలేని జీవిత సమరములో (2) / వేగమే దూతనంపి బాగుగ నిలిపావు ||చాలునయ్య|| / పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2) / ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2) / వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2) / లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా ||చాలునయ్య||
ఒకని తల్లి ఆదరించునట్లు / నను ఆదరించిన నా దేవుడు (2) / హీనుడనైనా బలహీనుడనైనా / కురూపినైనా కఠినుడనైనా (2) ||ఒకని|| / ఒకసారి నేను నీ మందనుండి / నే తప్పిపోయిన వేళ (2) / నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2) / నీ చంకపెట్టితివా యేసయ్యా (2) ||ఒకని|| / నీ సన్నిధినుండి నే దూరమవగా / చిక్కాను దొంగ చేతిలోన (2) / నను దోచిపోగా నను దాటిపోగా (2) / బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2) ||ఒకని||
ఒంటరివి కావు ఏనాడు నీవు / నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2) / ఆలకించవా ఆలోచించావా / ఆనందించవా (2) ||ఒంటరివి|| / వెలివేసారని చింతపడకుమా / ఎవరూ లేరని కృంగిపోకుమా / ఒంటరితనమున మదనపడకుమా / మంచి దేవుడు తోడుండగా (2) / ఆత్మహత్యలు వలదు / ఆత్మ ఆహుతి వలదు (2) ||ఆలకించవా|| / బలము లేదని భంగపడకుమా / బలహీనుడనని బాధపడకుమా / ఓటమి చూచి వ్యసనపడకుమా / బలమైన దేవుడు తోడుండగా (2) / నిరాశ నిస్పృహ వద్దు / సాగిపోవుటే ముద్దు (2) ||ఆలకించవా||