799 praise songs available. Lyrics in Roman and Telugu script.
మాట్లాడే యేసయ్యా / నాతో మాట్లాడుచున్నాడు (2) / (నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2) / చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4) ||మాట్లాడే|| / వెన్నలాంటి కన్నులలో / కురిసే తన ప్రేమను పంచాలని (3) / వేకువనే తట్టుచున్నాడు / కునుకని నిద్రపోని నా యేసయ్యా (2) / తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు / లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2) ||మాట్లాడే|| / అరుణోదయమున నేను లేచి / కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3) / ఉత్సాహగానముతో యేసయ్యను / సంగీత స్వరములతో ఘనపరచెదను (2) / ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు / ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు (2) ||మాట్లాడే|| / లోకము నుండి నన్ను ప్రత్యేకించి / మైమరిపించాడు మహనీయుడు (3) / ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు / జీవముగల సంఘములో నిలిపియున్నాడు (2) / తన మాటతో నన్ను బలపరచాడు / కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు (2) ||మాట్లాడే||
ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే / అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే (2) / తల్లి కన్నా తండ్రి కన్నా / కాచిన దేవా నీకే స్తోత్రం (2) ||ఆపత్కాలమున|| / నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు / నేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి (2) / ఆకాశమునకు ఎక్కిననూ అక్కడ నీవే ఉన్నావు / భూదిగంతములు చుట్టిననూ అక్కడ నీవే ఉన్నావు / ఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావు / నీ కన్న దైవమెవరు మా పూజ్యనీయుడా ||ఆపత్కాలమున|| / నేను నడచే మార్గమంతటిలో నీ దూతల చేత / రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి (2) / మరణముగుండా వెళ్లిననూ విష సర్పములను తొక్కిననూ / చేయి విడువక ఎప్పుడునూ విడనాడక నను ఎన్నడునూ / నడిపించుచున్న దేవా నీకెంత ప్రేమ నాపై – (2) ||ఆపత్కాలమున||
సృష్టికర్తవైన యెహోవా / నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ / మంటికి రూపమిచ్చినావు / మహిమలో స్థానమిచ్చినావు / నాలో నిన్ను చూసావు / నీలో నన్ను దాచావు / నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా / మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన|| / ఏ కాంతి లేని నిశీధిలో / ఏ తోడు లేని విషాదపు వీధులలో / ఎన్నో అపాయపు అంచులలో / నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2) / యేసయ్యా నను అనాథగా విడువక / నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన|| / నిస్సారమైన నా జీవితములో / నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా / నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి / నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2) / యేసయ్యా నను కృపతో బలపరచి / ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన||
మన దేశం భారత దేశం / మన రాజ్యం దేవుని రాజ్యం (2) / స్తుతి ఆరాధన నా ఊపిరి / ప్రేమానురాగము నా జీవితం (2) / మన దేశం కానాను దేశం / మన రాజ్యం దేవుని రాజ్యం (2) / స్తుతి ఆరాధన నా ఊపిరి / ప్రేమానురాగము నా జీవితం (6)
నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా / నీ మాట ఎంతో శ్రేష్టం యేసయ్యా / యేసయ్యా యేసయ్యా / యేసయ్యా యేసయ్యా (2) ||నీ ప్రేమ|| / రాతి గుండెలే మారును / నీ మాట సెలవిస్తే (2) / రమణీయము నీ మాటలే / వెదజల్లును సుమగంధమే (2) ||యేసయ్యా|| / వ్యాధి బాధలే పోవును / నీ మాట సెలవిస్తే (2) / బలమైనది నీ మాటయే / తొలగించును కారు చీకటులే (2) ||యేసయ్యా||
ఒకసారి నీ స్వరము వినగానే / ఓ దేవా నా మనసు నిండింది / ఒకసారి నీ ముఖము చూడగానే / యేసయ్య నా మనసు పొంగింది (2) / నా ప్రతి శ్వాసలో నువ్వే / ప్రతి ధ్యాసలో నువ్వే / ప్రతి మాటలో నువ్వే / నా ప్రతి బాటలో నువ్వే (2) ||ఒకసారి|| / నీ సిలువ నుండి కురిసింది ప్రేమ / ఏ ప్రేమ అయినా సరితూగునా (2) / నీ దివ్య రూపం మెరిసింది ఇలలో / తొలగించె నాలోని ఆవేదన ||నా ప్రతి|| / ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా / బ్రతికించు మమ్ములను నీ కోసమే (2) / తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం / నడిపించు మమ్ములను నీ బాటలో ||నా ప్రతి||
సంతోషం యేసు వందనం / నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై / సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు / మా దుఃఖ దినములు సమాప్తపరచావు (2) / సంతోషం యేసు వందనం / నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై / స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం / మా దేవా నీకే అర్పితం ||సంతోష|| / నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో / దీవెన కలదు నీ ప్రతి మాటలో (2) / విడువను ఎడబాయనని / వాగ్ధానమిచ్చి బలపరచావు (2) ||సంతోషం|| / రక్షణ ఆనందం మాకిచ్చావు / మా క్రయ ధనమంతా చెల్లించావు (2) / ఏ తెగులు నీ గుడారమును / సమీపించదని సెలవిచ్చావు (2) ||సంతోషం||
కరుణామయుడా పరలోక రాజా / నిత్యనివాసి నిర్మల హృదయుడా (2) / నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు / నీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములు / నీకే స్తోత్రములు ||కరుణామయుడా|| / గడిచిన దినములన్ని కాపాడినావు / కృపాక్షేమములే నా వెంట ఉంచావు (2) / విడువక నా యెడల కృప చూపినావు (2) / విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ (2) ||నీకే స్తోత్రములు|| / శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా / వేదనలెన్నో కలిగిన వేళలో (2) / సహించే శక్తి నాకిచ్చినావు (2) / నీ సేవలో నన్ను నడిపించినావు (2) ||నీకే స్తోత్రములు|| / నూతన యుగములోన నను నిలిపినావు / నూతనాత్మతో నను నింపు దేవా (2) / నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి (2) / ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త (2) ||నీకే స్తోత్రములు||
యేసయ్యా నా ప్రాణనాథా నిను / ఆడి పాడి కీర్తించెదను / నీవే నా జీవదాత అని / లోకమంతా చాటించెదను ||యేసయ్యా|| / సర్వశక్తిమంతుడా సర్వాధికారి / సర్వలోకమును సృష్టించిన సుందరుడా (2) / స్తుతి మహిమా ఘనతా నీకే అని / సంతసించి స్తోత్రించెదను ||యేసయ్యా|| / పాపమే ఎరుగని నీతిమంతుడా / పాపిని రక్షించిన నీతిసూర్యుడా (2) / పరిశుద్ధ పరలోక తండ్రి అని / పరవశించి నే పాడెదను ||యేసయ్యా|| / ఆది అంతమైన అల్ఫా ఒమేగా / మేఘముపై రానున్న మహిమోన్నతుడా (2) / ఉన్నవాడవు అనువాడవు నీవని / ఉల్లసించి ఆరాధింతును ||యేసయ్యా||
యెహోవాయే నా కాపరిగా / నాకేమి కొదువగును (2) / పచ్చికగల చోట్లలో / నన్నాయనే పరుండజేయును (2) / శాంతికరమైన జలములలో (2) / నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే|| / గాఢాంధకార లోయలలో / నడిచినా నేను భయపడను (2) / నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2) / నా తోడైయుండి నడిపించును (2) ||యెహోవాయే|| / నా శత్రువుల ఎదుట నీవు / నా భోజనము సిద్ధపరచి (2) / నా తల నూనెతో నంటియుంటివి (2) / నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే|| / నా బ్రతుకు దినములన్నియును / కృపాక్షేమాలు వెంట వచ్చును (2) / నీ మందిరములో నే చిరకాలము (2) / నివాసము చేయ నాశింతును (2) ||యెహోవాయే||
దేవా యెహోవా సీయోనులో నుండి / స్తుతియించెదా కొనియాడెదా కీర్తించెద (2) / కను మూసినా కను తెరిచినా – కనిపించె నీ రూపం / కల కానిది నిజమైనది – సిలువలో నీ త్యాగం / రక్తాన్ని చిందించి రక్షించినావా / ఈ పాపిని యేసయ్యా / నా దేవా.. నా ప్రభువా… / నీకేమర్పింతును – (2) ||దేవా|| / నను మోసిన నను కాచిన – నా తండ్రి నీవయ్యా / నా శిక్షను నీ శిక్షగా – భరియించినావయ్యా / ప్రాణంగా ప్రేమించి నా పాపముల కొరకై / బలియైతివా యేసయ్యా / నా దేవా.. నా ప్రభువా… / నీ సిలువే చాలయా – (2) ||దేవా||
హల్లెలూయ పాటలతో / ఆనంద గీతాలతో (2) / కృపామయుండా నీ మేలులన్ని / స్మరించి స్తుతింతును (2) / నేనారణ్యా యానములో / నిను పలుమార్లు విసిగించినా (2) / కోపించుచునే వాత్సల్యము చూపి / అనుదినము నను మరువక / మన్నాను నాకిడితివి (2) ||హల్లెలూయ|| / మలినంబైన వలువలతో / నే నీ ఎదుట నిలుచుండగా (2) / కృపతో నా నేరములను క్షమియించి / పరిశుద్ధ వస్త్రములతో / నన్నలంకరించితివి (2) ||హల్లెలూయ|| / నే కృంగిన వేళలలో / నీ అభిషేక తైలముచే (2) / పక్షిరాజు యవ్వనము వలె నా బలము / నూతనము జేసితివి / నను పైకెగుర జేసితివి (2) ||హల్లెలూయ||