799 praise songs available. Lyrics in Roman and Telugu script.
నీవేయని నమ్మిక / యేసు నాకు.. నీవేయని నమ్మిక / నీవే మార్గంబు – నీవే సత్యంబు / నీవే జీవంబు – నీవే సర్వంబు ||నీవే|| / పెడదారిని బోవగ / నా మీదికి.. ఇడుమలెన్నియో రాగ / అడవిలో బడి నేను – ఆడలుచు నుండగ / తడవకుండ దొరుకు – ధన్యమౌ మార్గంబు ||నీవే|| / కారు మేఘము పట్టగ / నా మనస్సులో.. కటిక చీకటి పుట్టగ / ఘోరాపదలు చేరి – దారియని భ్రమపడగ / తేరి చూడగల్గు – తేజోమయ మార్గంబు ||నీవే|| / లేనిపోని మార్గంబు / లెన్నోయుండ.. జ్ఞానోపదేశంబు / మానుగ జేయుచు – వానిని ఖండించి / నేనే మార్గంబన్న – నిజమైన మార్గంబు ||నీవే|| / నరలోకమునుండి / పరలోకంబు.. వరకు నిచ్చెనగా నుండి / నరులకు ముందుగా – నడుచుచు ముక్తికి / సరిగా కొనిపోవు సు-స్థిరమైన మార్గంబు ||నీవే||
చక్కనైన దారి నీవే / చేరువైన తోడు నీవే (2) / యేసయ్యా నీవే చాలయ్యా / నా బ్రతుకునందు ఎన్నడూ వీడిపోకయ్యా (2) / చిన్న చిన్న బాధలకే భయపడిపోయానయ్యా / జయమే లేదనుకొని ఏడ్చినానయ్యా (2) / యేసయ్యా ఆశ్రయం నీవైనావయ్యా / యేసయ్యా భుజంపై చెయ్యేసావయ్యా / నీ ప్రేమనెవరు ఆపలేరయ్యా / ఎంత ఉపకార బుద్ధి నీదయ్యా (2) ||చక్కనైన|| / అడిగినదానికన్నా అధికం చేసావయ్యా / నీ స్థానం ఎవ్వరికి చెందనీనయ్యా (2) / యేసయ్యా గుప్పిలి విప్పుచున్నావు / యేసయ్యా అందని వాడవు కావు / సమీపమైన బంధువువి నీవు / నీ ఆత్మతో దీవించుచున్నావు (2) ||చక్కనైన||
యేసూ నన్ను ప్రేమించినావు / పాపినైన – నన్ను ప్రేమించినావు (2) / నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి / దా-నముగా జీవము సిలువపై (2) / ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ / కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| / తల్లి గర్భమున నే – ధరియింపబడి నపుడే / దురుతుండనై యుంటిని (2) / నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పు / డేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| / మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్ / మించ ప్రేమించి-నావు (2) / ఆహా – యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచ / నెంచి ప్రేమించినావు (2) ||యేసూ|| / నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని / మున్నై తెలిసియుంటివి (2) / తెలిసి – నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో / యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ|| / నా వంటి నరుడొకడు – నన్ను ప్రేమించిన / నా వలన ఫలము కోరు (2) / ఆహా – నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో / కేవలంబేమీ లేక (2) ||యేసూ||
స్తోత్రబలి అర్పించెదము / మంచి యేసు మేలు చేసెన్ (2) / చేసెను మేలులెన్నో / పాడి పాడి పొగడెదన్ (2) / తండ్రీ స్తోత్రం – దేవా స్తోత్రం (2) / ప్రాణమిచ్చి నను ప్రేమించి / పాపం తొలగించి కడిగితివే (2) / నీ కొరకు బ్రతుక వేరుపరచి / సేవ చేయ కృప ఇచ్చితివే (2) ||తండ్రీ|| / గొప్ప స్వరముతో మొరపెట్టి / సిలువ రక్తమును కార్చితివే (2) / రక్త కోటలో కాచుకొని / శత్రు రాకుండ కాచితివే (2) ||తండ్రీ|| / చూచే కన్నులు ఇచ్చితివి / పాడే పెదవులు ఇచ్చితివి (2) / కష్టించే చేతులు ఇచ్చితివి / పరుగెత్తే కాళ్ళను ఇచ్చితివి (2) ||తండ్రీ|| / మంచి ఇల్లును ఇచ్చావయ్యా / వసతులన్నియు ఇచ్చావయ్యా (2) / కష్టించి పనిచేయ కృప చూపి / అప్పు లేకుండ చేసితివే (2) ||తండ్రీ||
దేవా… యెహోవా… / నాకు చాలిన వాడా (4) / నడి సంద్రమున తుఫాను ఎగసినప్పుడు / నీవుంటివి యేసయ్యా / ఒక్క మాటతో తుఫాను ఆగెను / నీ మాట చాలును యేసయ్యా (2) / నా జీవితంలో తుఫానులు ఆపివేయుమా / నీ మాట చేత నన్ను నీవు లేవనెత్తుమా (2) ||దేవా|| / అడవిలోన మన్నా కురిపించి / నీ బిడ్డగ పోషించితివి / బండ నుండి నీటిని తెచ్చి / దాహమును తీర్చావయ్యా (2) / నీ సమృద్ధిలో నుండి దయచేయుమా / నీ మహిమార్థమై నన్ను లేవనెత్తుమా (2) ||దేవా||
నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు / నీదు రూపమే నాలో ఉంచి నన్ను చేసావు / మంటివాడను నన్ను నీవు మహిమపరిచావు / మరణపాత్రుడనైన నన్ను పరము చేర్చావు / ఎంత ప్రేమ యేసయ్యా – నీకెంత నాపై కరుణయో / మరువగలనా నీ కృప – బ్రతుకంతయు (2) / తోడువైనావు నా నీడవైనావు / నీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకు / మంచి కాపరి నీవేనయ్యా నా యేసయ్యా / ఎంచలేనయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా / జీవితమంతా మరువలేనయ్యా ||నీదు ప్రేమ|| / ప్రాణమైనావు నీవే ధ్యానమైనావు / అన్నీ నీవై చేరదీసి ఆశ్రయమైనావు / నీతిసూర్యుడా పరిపూర్ణుడా నిత్య దేవుడా / కీర్తనీయుడా కృపాపూర్ణుడా సత్యజీవుడా / నేను నిన్ను విడువలేనయ్యా ||నీదు ప్రేమ||
ఓ నాదు యేసు రాజా / నిన్ను నే నుతించెదను (2) / నీ నామమును సదా / నే సన్నుతించుచుండును (2) ||ఓ నాదు|| / అనుదినము నిను స్తుతియించెదను (2) / ఘనంబు చేయుచుండును నేను (2) ||ఓ నాదు|| / వర్ణించెద నే నీ క్రియలను (2) / స్మరియించెద నీ మంచితనంబున్ (2) ||ఓ నాదు|| / రక్షణ గీతము నే పాడెదను (2) / నిశ్చయ జయధ్వని నే చేసెదను (2) ||ఓ నాదు|| / విజయ గీతము వినిపించెదను (2) / భజియించెద జీవితమంతయును (2) ||ఓ నాదు|| / నిరీక్షణ పూర్ణత కలిగి (2) / పరికించెద నా ప్రభు రాకడను (2) ||ఓ నాదు||
ఉదయమాయె హృదయమా / ప్రభు యేసుని ప్రార్ధించవే (2) / పదిలముగా నిను వదలకుండా / పడక నుండి లేపెనే (2) ||ఉదయమాయె|| / రాత్రి గడచిపోయెనే / రవి తూర్పున తెలవారెనే (2) / రాజా రక్షకుడేసు దేవుని / మహిమతో వివరించవే (2) ||ఉదయమాయె|| / తొలుత పక్షులు లేచెనే / తమ గూటి నుండి స్తుతించెనే (2) / తండ్రి నీవే దిక్కు మాకని / ఆకాశమునకు ఎగిరెనే (2) ||ఉదయమాయె|| / పరిశుద్ధుడా పావనుండా / పరంధాముడా చిరంజీవుడా (2) / పగటియంతయు కాచి మము / పరిపాలించుము దేవుడా (2) ||ఉదయమాయె|| / తండ్రి దాతవు నీవని / ధరయందు దిక్కు ఎవరని (2) / రాక వరకు కరుణ చూపి / కనికరించి బ్రోవుమా (2) ||ఉదయమాయె||
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2) / నిత్యము నా కీర్తి నా నోట నుండును (2) / మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా / చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు|| / కలిమి చేజారి నను వంచినా / స్థితిని తలకిందులే చేసినా (2) / రెండింతలుగా దయచేసెదవని (2) / నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| / పరుల ఎగతాళి శృతి మించినా / కలవరము గుండెనే పిండినా (2) / నా మొఱ విని కృప చూపెదవని (2) / నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| / శ్రమలు చెలరేగి బెదిరించినా / ఎముకలకు చేటునే తెచ్చినా (2) / ఆపదలలో విడిపించెదవని (2) / నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
నీతో నా జీవితం సంతోషమే / నీతో నా అనుబంధం మాధుర్యమే (2) / నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై / నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై / ఆరాధ్యుడా యేసయ్యా… / నీతో నా అనుబంధం మాధుర్యమే / భీకర ధ్వనిగలా మార్గమునందు / నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2) / కలనైన మరువను నీవు నడిపిన మార్గం / క్షణమైన విడువను నీతో సహవాసం (2) ||ఆరాధ్యుడా|| / సంతోషమందైనా శ్రమలయందైనను / నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2) / నిత్యమైన మహిమలో నను నిలుపుటకు / శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా|| / ఆకాశమందుండి ఆశీర్వదించితివి / అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2) / నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు / నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా||
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు / సుడిగాలిలోనైనా జడి వానలోనైనా / ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము / నీవు వెలిగించిన దీపము – (2) / ఆరని దీపమై దేదీప్యమానమై / నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2) / చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము|| / మారని నీ కృప నను వీడనన్నది / మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2) / మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము|| / ఆగని హోరులో ఆరిన నేలపై / నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2) / పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||
నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా / నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా / నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు / ఎల్లకాలం తోడు నీవే / నమ్మదగిన యేసయ్యా – కృతజ్ఞతా స్తుతులు నీకే – (2) / కృతజ్ఞతా స్తుతులు నీకే / పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది / పరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది ||నీ ప్రేమ|| / పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది / పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును ||నీ ప్రేమ||