స్తుతి | Praise Telugu Songs

799 praise songs available. Lyrics in Roman and Telugu script.

ఏమని నే పాడెదన్|Emani Ne Paadedan

ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును / ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును (2) / నిన్ను ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును / రక్తం కార్చిన రక్షకుడా – కనికర సంపన్నుడా (2) / కనికర సంపన్నుడా – అయ్యా కనికర సంపన్నుడా (2) / అభిషేకించి ఆదరించినా – ఆదరణ నాయకుడా (2) / ఆదరణ నాయకుడా – అయ్యా ఆదరణ నాయకుడా (2) / నీ పాదాల దరి చేరి – తనివి తీరా ముద్దాడెదన్ (2) / తనివి తీరా ముద్దాడెదన్ – అయ్యా తనివి తీరా ముద్దాడెదన్ (2) / నిన్ను విడచి వేరెవ్వరు – ఉత్తముడా నీవేనయ్యా (2) / ఉత్తముడా నీవేనయ్యా – అయ్యా ఉత్తముడా నీవేనయ్యా (2) / రాకడలో కొనిపోదువు – నీతో నేనుందును (2) / నీతో నేనుందును – అయ్యా నీతో నేనుందును (2)

చాలా గొప్పోడు|Chaalaa Goppodu

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు / నేను నమ్మిన నా యేసుడు / చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు / నాకు దొరికిన నా యేసుడు (2) / మాటలలో చెప్పలేనంత / చేతలలో చూపలేనంత (2) / చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు / చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2) ||చాలా|| / నా పాప శిక్షను తాను మోసెను / నా కొరకు కలువారిలో త్యాగమాయెను (2) / తన ప్రేమ వర్ణనాతీతం / తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో|| / యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు / జగమంతా వెదకినా కానరారులే (2) / తన ప్రేమ వర్ణనాతీతం / తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో|| / ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు / వింతైన ప్రేమ అంతు చిక్కదు (2) / కలువరిలో చూపిన ప్రేమ / శాపమునే బాపిన ప్రేమ (2) ||మాటలలో||

అద్వితీయ సత్య దేవా|Advitheeya Sathya Devaa

వందనమయ్యా వందనమయ్యా యేసు నాథా / వందనం వందనం వందనం / అద్వితీయ సత్య దేవా వందనం – వందనం / పరమ తండ్రి పావనుండా వందనం – వందనం / దివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనం / పావనాత్మా శాంతి దాతా వందనం – వందనం (2) / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) / వ్యోమ సింహాసనుండ వందనం – వందనం / ఉర్వి పాద పీఠస్థుడ వందనం – వందనం (2) / ఆద్యంత రహిత నీకే వందనం – వందనం / అక్షయ కరుణీక్షుండా వందనం – వందనం (2) ||హల్లెలూయా|| / ప్రాణదాత యేసునాథా వందనం – వందనం / ముక్తిదాత జీవదాతా వందనం – వందనం (2) / సిల్వధారి ప్రేమమూర్తి వందనం – వందనం / ముగ్ధ స్తోత్రార్హుండా వందనం – వందనం (2) ||హల్లెలూయా||

నీవే నా సర్వము|Neeve Naa Sarvamu

నీవే నా సర్వము నీవే నాకున్నావు / నీవే నా సర్వము అన్నిటిలో / నీ జీవం నా కొరకు ఇచ్చినందున / నీవే నా సర్వము అన్నిటిలో (2) / తేనె కంటే మధురము (2) / యేసయ్యే నాకు మాధుర్యము / రుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమును / యేసయ్యే నాకు మాధుర్యము ||తేనె|| / నీవే నా రక్షణ నీవే నిరీక్షణ / నీవే కదా నా ఆధారము / నీ పాదములకు మ్రొక్కెదను / నీ నామం పాడి స్తుతించెదను (2) ||తేనె|| / నీవే పరిహార నీవే పరమౌషధం / నీవే నా శక్తివి నా యేసయ్యా / కల్వరి సిలువపై బాలి అయితివే / నే బాగుపడితిని గాయములచే (2) ||తేనె|| / నీవే నా కీర్తివి నీవే నా అతిశయం / నీవే నా మేలులు నా యేసయ్యా / నీ పాద సేవయే చేయుటయే / నా హృదయములున్న వాంఛయేగా (2) ||తేనె||

కొండలతో చెప్పుము|Kondalatho Cheppumu

కొండలతో చెప్పుము కదిలిపోవాలని / బండలతో మాట్లాడుము కరిగిపోవాలని (2) / నమ్ముట నీ వలనైతే / సమస్తం సాధ్యమే – (3) / మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు / మనసులో సందేహించక మాట్లాడు / మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకు / యేసుని నామములోనే మాట్లాడు ||కొండలతో|| / యేసయ్య ఉన్న దోనె పైన తుఫాను కొట్టెనే / యేసయ్య దోనె అమరమున నిద్రించుచుండెనే / గాలి పైకి లేచి – అలలు ఎంతో ఎగసి / దోనెలోనికొచ్చెను జలములు జోరున / శిష్యులేమో జడిసి – వానలోన తడిసి – బహుగా అలసిపోయే / ప్రభువా ప్రభువా – లేవవా త్వరగా / మేము నశించిపోతున్నామని / ప్రభువును లేపిరి – తమలో ఉంచిన – దైవ శక్తి మరచి / రక్షకుడు పైకి లేచాడు – శిష్యులకు చేసి చూపాడు / పరిస్థితుత్లతో మాటలాడాడు / ఆ గాలినేమో గద్దించి – తుఫాన్ని ఆపేసి – నిమ్మల పరిచాడు / శిష్యులను తేరి చూచాడు – విశ్వాసం ఎక్కడన్నాడు / అధికారం వాడమన్నాడు / ఇక మనమంత ప్రభు లాగ – చేసేసి గెలిచేసి / ప్రభునే స్తుతిద్దాము – జై / జై జై జై జై జై జై జై జై / ఈశు మసీహ్ కి జై / ఈశు కే జై జై జై / ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు|| / పరలోక రాజ్య తాళాలు మన చేతికిచ్చెనే / పాతాళ లోక ద్వారాలు నిలువనేరవనెనే / కన్నులెత్తి చూడు – తెల్లబారె పైరు / కోతకొచ్చి నిలిచెను మనకై నేడు / వాక్యముతో కది-లించిన చాలు – కోత పండగేలే / కాపరి లేని గొర్రెలు వారని – కనికరపడెను ప్రభువు నాడు / క్రీస్తుని కనులతో – చూద్దామా – తప్పిపోయిన ప్రజను / ప్రభు లాగా వారిని ప్రేమిద్దాం – సాతాను క్రియలు బందిద్దాం / విశ్వాస వాక్కు పలికేద్దాం / ఇక ఆ తండ్రి చిత్తాన్ని – యేసయ్యతో కలిసి – సంపూర్తి చేద్దాం / పరలోక రాజ్య ప్రతినిధులం – తాళాలు ఇంకా తెరిచేద్దాం / ఆత్మలను లోనికి నడిపిద్దాం / ఇక సంఘంగా ఏకంగా – పాడేద్దాం అందంగా / ఈశు మసీహ్ కి జై – జై / జై జై జై జై జై జై జై జై / ఈశు మసీహ్ కి జై / ఈశు కే జై జై జై / ప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు||

ఆత్మీయ గానాలతో|Aathmeeya Gaanaalatho

ఆత్మీయ గానాలతో / నిన్నే ఆరాధన చేయనా / స్తుతి స్తోత్ర గీతాలతో / నీ నామము పూజించనా (2) / మహిమ ఘనత ప్రభావములు / నీకే చెల్లించుచున్నానయ్యా (2) / ఆరాధించనా నీ పాద సన్నిధి (2) / స్తుతి పాత్రుడా – స్తోత్రార్హుడా / ఆరాధనా నీకే ఆరాధనా (2) ||ఆత్మీయ|| / సమీపించరాని తేజస్సులో / వసియించుచున్న పరిశుద్ధుడా (2) / కెరూబులు సెరాపులు (2) / దీవా రాత్రులు నీ సన్నిధిలో (2) / స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా (2) ||స్తుతి పాత్రుడా|| / అందరిలోను అతి శ్రేష్టుడా / వేల్పులలోన మహనీయుడా (2) / పూజార్హుడా స్తోత్రార్హుడా (2) / అతి సుందరుడా మనోహరుడా (2) / చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో (2) ||స్తుతి పాత్రుడా|| / అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా / అపరంజిని పోలిన పాదాలు గలవాడా (2) / (దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన (2) / స్వరమును కలిగిన ఘననీయుడా (2) / శిరము వంచనా సర్వోన్నతుడా (2) ||స్తుతి పాత్రుడా||

Praise Telugu Songs — Page 16 | UEC Telugu Church