318 hope songs available. Lyrics in Roman and Telugu script.
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైతే నాకు లాభము / నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| / నీ కృప నాకు చాలును ఇలలో / నీవు లేని బ్రతుకే శూన్యము నాలో (2) / నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే|| / నీవే నా గొప్ప కాపరివి / విడువను నను ఎడబాయనంటివి (2) / నా ప్రభువా యేసయ్యా (4) ||నా మట్టుకైతే||
కావలెనా యేసయ్య బహుమానము / (మరి) చేయాలి విలువైన ఉపవాసము (2) / సిద్ధమౌ శ్రీ యేసుని ప్రియా సంఘమా / చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా (2) ||కావలెనా|| / నీనెవె పట్టణము యెహోవా దృష్టికి / ఘోరమాయెను – పాపముతో నిండిపోయెను / సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి / నీనెవెకు పంపెను – కనికరము చూపించెను / ఘనులేమి అల్పులేమి – నీనెవె పట్టణపు రాజేమి / పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా / ఆగింది యెహోవా శాపము / కురిసింది కరుణ వర్షము (2) ||కావలెనా|| / దేవుని ప్రజలను నశియింప చేయుటకు / దుష్టుడు తలచెను – కలవరము పుట్టించెను / మొర్దెకై వేదనతో రాజునొద్దకు పంపుట / దైవ చిత్తమని – ఎస్తేరును సిద్ధపరచెను / ఘనులేమి అల్పులేమి – షూషను కోటలో రాణి ఏమి / పిల్లలేమి పెద్దలేమి – ఉపవాసము చేయగా / అణిగింది హామాను గర్వము / జరిగింది దేవుని చిత్తము (2) ||కావలెనా||
కృపలను తలంచుచు (2) / ఆయుష్కాలమంతా ప్రభుని / కృతజ్ఞతతో స్తుతింతున్ (2) ||కృపలను|| / మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను (2) / ముట్టునని సెలవిచ్చిన దేవుడు / కాచెను గతకాలం – (నన్ను) (2) ||కృపలను|| / కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2) / నింగిని చీల్చి వర్షము పంపి / నింపెను నా హృదయం – (యేసు) (2) ||కృపలను|| / రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2) / నాకు విరోధమై వర్ధిల్లదు యని / చెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2) ||కృపలను|| / సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2) / సతతము తన కృప వెల్లడిచేయ / శుద్దులతో నిలిపెను – (ఇలలో) (2) ||కృపలను|| / హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే (2) / సీయోను నివాసం నాకెంతో ఆనందం / ఆనందమానందమే – (ఆమెన్) (2) ||కృపలను||
అందమైన మధురమైన నామం ఎవరిది / మహిమాన్వితుడు మహిజన రక్షకుడు / ఆయనేసు యేసు యేసు (2) ||అందమైన|| / సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజా / లోకమును రక్షించు ఇమ్మానుయేలా (2) / మా పాలి దైవమా ఓ శ్రీ యేసా / స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన|| / కొండ నీవే కోట నీవే నీవే యేసయ్యా / ఆకలి తీర్చి ఆదుకునే తండ్రివి నీవే (2) / నీ ఒడిలో చేర్చుమా ఓ శ్రీ యేసా / స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన|| / చీకటి నుండి వెలుగు లోనికి నడిపించావు / మానవులను ప్రేమించి చూపించావు (2) / మా కోసం మరణించి చూపించావు / స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన||
నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో / అది నిర్దేశించును జీవిత గమ్యమును / ఈనాడే యేసుని చెంతకు చేరు (2) ||నీ నిర్ణయం|| / లోకం దాని ఆశలు గతించిపోవును / మన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2) / మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు / క్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2) ||నీ నిర్ణయం|| / పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే / శాపంతో నీవుండిన తప్పదు మరణము (2) / భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే / ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2) ||నీ నిర్ణయం||
నిత్య జీవపు రాజ్యములో / సత్య దేవుని సన్నిధిలో (2) / నిత్యం యేసుని స్నేహముతో / నిత్యమానందమానందమే (2) / వ్యాధి భాధలు లేవచ్చట / ఆకల్దప్పులు లేవచ్చట (2) / మన దీపము క్రీస్తేలే / ఇక జీవితం వెలుగేలే (2) ||నిత్య|| / కడు తెల్లని వస్త్రముతో / పరి తేజో వాసులతో (2) / రాజ్యమునేలుదుములే / యాజకులము మనమేలే (2) ||నిత్య|| / ప్రతి భాష్పబిందువును / ప్రభు యేసే తుడుచునులే (2) / ఇక దుఖము లేదులే / మన బ్రతుకే నూతనమే (2) ||నిత్య|| / పరిశుద్ధ జనములతో / పరిశుద్ధ దూతలతో (2) / హల్లెలూయా గానాలతో / వెంబడింతుము యేసునితో (2) ||నిత్య||
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే / సౌందర్య సీయోనులో / నీ మనోహరమైన ముఖము దర్శింతును / నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే / సీయోనులో స్థిరమైన పునాది నీవు / నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2) / సూర్యుడు లేని చంద్రుడు లేని / చీకటి రాత్రులు లేనే లేని (2) / ఆ దివ్య నగరిలో కాంతులను / విరజిమ్మెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| / కడలి లేని కడగండ్లు లేని / కల్లోల స్థితి గతులు దరికే రాని (2) / సువర్ణ వీధులలో / నడిపించెదవా నా యేసయ్యా (2) ||సీయోనులో|| / సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2) / సౌందర్య సీయోనులో / నీ మనోహరమైన ముఖము దర్శింతును (2) / నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3) / ఆనందమే పరమానందమే (10)
ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప / ఏమున్నదయ్యా భువిలో నీవు లేక (2) / నా యేసయ్యా హల్లెలూయా / నా యేసయ్యా హల్లెలూయా (2) / నా ఆశ్రయం నీవే – నా ఆశయం నీవే (2) / నా సర్వము యేసు నీవేగా (2) ||ఎవరున్నారయ్యా|| / ఈ భువికి దీపం నీవే – నా హృదిలో వెలుగు నీవే (2) / అన్నింటిని వెలిగించే దీపం నీవే (2) ||ఎవరున్నారయ్యా||
ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు / ప్రేమించలేని నాడు – తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు (2) / ప్రేమ నేర్పించాలని నిన్ను – ఈ లోకానికి పంపించెను ఆ దేవుడు / ప్రేమ చూపించాలని నీకు – తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడు / ప్రేమే జీవన వేదం – ప్రేమే సృష్టికి మూలం / ప్రేమే జగతికి దీపం – ప్రేమలోనే నిత్య జీవితం / ప్రేమే అంతిమ తీరం – ప్రేమే వాక్యపు సారం / ప్రేమే సత్య స్వరూపం – ప్రేమ ఒకటే నిలుచు శాశ్వతం ||ప్రేమ లేనివాడు|| / మంచి వాని కొరకు సహితము – ఒకడు మరణించుట అరుదు / పాపులకై ప్రాణమిచ్చిన – ప్రేమకు కట్టలేము ఖరీదు / ద్రోహియైన యూదానే ఆయన – కడవరకు విడువలేదు / అప్పగించువాడని తెలిసి – బయటకు నెట్టివేయలేదు / దొంగ అని తెలిసే ఉద్యోగం ఇచ్చాడురా / ధనము సంచి యూదా దగ్గరనే ఉంచాడురా / వెండి కొరకు తనను అమ్ముకోకూడదనేరా / చివరి వరకు వాడిని మార్చాలని చూసాడురా / ఇంత గొప్ప క్రీస్తు ప్రేమ కలిగియున్నవాడే / నిజ క్రైస్తవుడౌతాడురా / ప్రేమే దేవుని రూపం – ప్రేమే క్రీస్తు స్వరూపం / ప్రేమే కడిగెను పాపం – ప్రేమ జీవ నదీ ప్రవాహం ||ప్రేమ లేనివాడు|| / కాలు ఎదిగిపోతుందని – ఓర్వలేక కన్ను బాధపడదు / కంటిలోని నలుసు పడితే – సంబరంతో కాలు నాట్యమాడదు / చేయి లేచి చెవిని నరుకదు – పేగు గుండెను ఉరి తీయదు / వేలు తెగితే నోరు నవ్వదు – అసూయ అవయవాలకుండదు / సంఘమంటే యేసు క్రీస్తు శరీరమే సోదరా / మీరంతా అవయవాలు అతికి ఉండాలిరా / ఏ భాగం పాటుపడిన శిరస్సుకే మహిమరా / ఈ భావం బాధపడితే అభ్యంతర పరచకురా / ఇంత గొప్ప దైవ ప్రేమ కనుపరచిననాడే / క్రీస్తు నీలో ఉంటాడురా / ప్రేమే ఆత్మకు ఫలము – ప్రేమే తరగని ధనము / ప్రేమే పరముకు మార్గము – ప్రేమ వరము నిత్యజీవము ||ప్రేమ లేనివాడు|| / ఎంత గొప్పవాడైనా ప్రేమ లేకపోతే – లేదు ఏ ప్రయోజనం / ఎంత సేవ చేస్తున్నా ప్రేమ చూపకుంటే – గణ గణలాడే తాళం / వర్గాలుగా విడిపోయి విభజన చేస్తామంటే – ఒప్పుకోదు వాక్యం / పౌలెవరు పేతురెవరు పరిచారకులే కదా – క్రీస్తు యేసు ముఖ్యం / మారాలని మార్చాలని కోరేది ప్రేమరా / నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించరా / ప్రేమించే వారినే ప్రేమిస్తే ఏం గొప్పరా / శత్రువులను సైతం ప్రేమించమన్నాడురా / ప్రేమ పొడవు లోతు ఎత్తు గ్రహియించినవాడే / పరలోకం వెళతాడురా / స్వార్ధ్యం లేనిది ప్రేమ – అన్నీ ఓర్చును ప్రేమ / డంభం లేనిది ప్రేమ – అపకారములే మరచును ప్రేమ / ఉప్పొంగని గుణమే ప్రేమ – కోపం నిలుపదు ప్రేమ / అన్నీ తాలును ప్రేమ – మత్సరమే పడనిది ప్రేమ / దయనే చూపును ప్రేమ – దరికే చేర్చును ప్రేమ / సహనం చూపును ప్రేమ – నిరీక్షణతో నిలుచును ప్రేమ / క్షమనే కోరును ప్రేమ – ద్వేషం చూపదు ప్రేమ / ప్రాణం నిచ్చిన ప్రేమ – దోషములే కప్పును ప్రేమ
స్థిరపరచువాడవు బలపరచువాడవు / పడిపోయిన చోటే నిలబట్టువాడవు / ఘనపరచువాడవు హెచ్చించువాడవు / మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు (2) / ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు / నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు (2) / యేసయ్య యేసయ్య నీకే నీకే సాధ్యము (2) / సర్వకృపానిధి మా పరమ కుమ్మరి / నీ చేతిలోనే మా జీవమున్నది (2) / మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి / మా ఊహకు మించిన కార్యములెన్నో / జరిగించుచున్నవి (2) ||ఏమైనా|| / నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా / నీ కంచే దాటగ శత్రువుకు సాధ్యమా (2) / మా దేవా నీవే మాతొడుంటే అంతే చాలును / అపవాది తలచిన కీడులన్నీ / మేలైపోవును (2) ||ఏమైనా||
ఉతక మీద తలుపు తిరుగు రీతిగా / తన పడక మీద సోమరి తిరుగాడును / గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా / సోమరి చుట్టూ లేమి తిరుగును / సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో.. (2) / జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో / ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో (2) ||ఉతక|| / చిన్న జీవులు చీమలు చూడు / వాటికి ఏలిక లేనే లేదు (2) / అయినను అవి క్రమము గానే నడచును / వేసవిలో ఆహారము కూర్చును (2) ||సోమరీ|| / చిన్న కుందేళ్ళను చూడు / ఏ మాత్రము బలము లేని జీవులు (2) / పేరు సందులలో జీవించును / బంధకములు లేనివై తిరుగును (2) ||సోమరీ|| / చిన్న జీవులు మిడతలు చూడు / వాటికి న్యాయాధిపతి లేడుగా (2) / పంక్తులుగా తీరి సాగి పోవును / జ్ఞానము గల వానిగ పేరొందును (2) ||సోమరీ|| / తెల్లవారుచుండగనే పక్షులు / కిలకిలమని దేవుని స్తుతియించును (2) / బ్రతుకు తెరువు కోసమై తిరుగును / ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును (2) ||సోమరీ|| / ఓ మానవుడా నీ మనసును మార్చుకో / ఎందుకో నీ పయనము తెలుసుకో (2) / ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు / అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది (2) ||సోమరీ||
భయము లేదు మనకు / ఇకపై ఎదురు వచ్చు గెలుపు / అదిగో యేసు పిలుపు / వినుమా పరము చేరు వరకు (2) / ఫలితమేదైన ప్రభును వీడకు / కష్టమెంతైన కలత చెందకు / అలుపు లేకుండ పరుగు సాగని / శోధనలు నిన్ను చూసి బెదరని ||భయము|| / సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని / మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని (2) / కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని / తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని (2) ||ఫలిత|| / మండించే అగ్గితోనే మెరయును బంగారము / శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము (2) / నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ / తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా (2) ||ఫలిత|| / కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము / తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము (2) / నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి / తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి (2) ||ఫలిత|| / ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు / అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు (2) / తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు / నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు (2) ||ఫలిత||