నిరీక్షణ | Hope Telugu Songs

318 hope songs available. Lyrics in Roman and Telugu script.

జీవితమంటే మాటలు కాదు|Jeevithamante Maatalu Kaadu

జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా / (ఇవి) మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా – (2) ||జీవితమంటే|| / నమ్ముకున్నాడు యోసేపు – అమ్ముకున్నారు అన్నలు / నమ్ముకున్నాడు ఏశావు – మోసగించాడు యాకోబు (2) / ఈ అన్నల నమ్మే కంటే… / ఈ అన్నల నమ్మే కంటే / అన్న యేసుని నమ్ముకో / రాజ్యం నీదే మేలుకో / పరలోకం నీదే ఏలుకో ||జీవితమంటే|| / నమ్ముకున్నాడు యేసయ్యా – అమ్ముకున్నాడు శిష్యుడు / పాపుల కొరకై వచ్చాడమ్మా – ప్రాణాలే తీసారమ్మా (2) / ఈ మనుషులలోనే… / ఈ మనుషులలోనే – మమతలు లేవు / మంచితనానికి రోజులు కావు / సమయం మనకు లేదమ్మా / ఇక త్వరపడి యేసుని చేరమ్మా ||జీవితమంటే|| / నమ్మకమైన వాడు – ఉన్నాడు మన దేవుడు / నమ్మదగినవాడు – వస్తాడు త్వరలోనే (2) / యేసుని రాకకు ముందే… / యేసుని రాకకు ముందే / మారు మనస్సును పొందుమా / ప్రభుని చెంతకు చేరుమా / రక్షణ భాగ్యం పొందుమా ||జీవితమంటే||

మనలో ప్రతి ఒక్కరి|Manalo Prathi Okkari

మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు / మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు (2) / హృదయాంత రంగములో బాధలు తెలుసు / మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు (2) / జగత్తు పునాది వేయబడక ముందే / మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా (2) ||మనలో|| / మనసులోని మాట నీవు పలుకకముందే / ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు / తల్లి గర్భమునందు నిను రూపించకముందే / ఎరిగియున్నాడు – యేసు ఎరిగియున్నాడు (2) / సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించినా / ఆకాశ వీధులలో నీవు విహరించినా (2) / ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా / ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా ||మనలో|| / నీవు నడిచే దారిలో నీతో సహవాసిగా / యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు / నీవు మాట్లాడు వేళలో మంచి స్నేహితునిగా / యేసు ఉన్నాడు – ప్రభు యేసు ఉన్నాడు (2) / నీ యవ్వన కాలమున ప్రభు యేసుని స్మరియించి / నీ ఒంటరి సమయములో కన్నీటితో ప్రార్ధించు (2) / ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు నేస్తమా / ప్రభు యేసుని నీ హృదయములోనికి ఆహ్వానించుమా ||మనలో||

ఓ ప్రార్ధనా సుప్రార్ధనా|O Praardhanaa Supraardhanaa

ఓ ప్రార్ధనా సుప్రార్ధనా / నీ ప్రాభావంబున్ మరతునా / నా ప్రభువున్ ముఖా ముఖిన్ / నే బ్రణుతింతు నీ ప్రభన్ / నా ప్రాణమా సు ప్రార్ధనా / నీ ప్రేరణంబుచే గదా / నీ ప్రేమధార గ్రోలుదు / నో ప్రార్ధనా సుప్రార్ధనా / పిశాచి నన్ను యుక్తితో / వశంబు చేయ జూచుచో / నీ శాంతమైన దీప్తియే / నా శంక లెల్ల మానుపున్ / నీ శక్తి నేను మరతునా / నా శైలమున ప్రార్ధనా / నా శోక మెల్ల దీర్చెడు / విశేషమైన ప్రార్ధనా / నీ దివ్యమైన రెక్కలే / నా దుఃఖ భార మెల్లను / నా దేవుడేసు చెంతకు / మోదంబు గొంచు బోవును / సదా శుభంబు లొందను / విధంబు జూప నీవెగా / నా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనా / సుధా సుధార ప్రార్ధనా / అరణ్యమైన భూమిలో / నా రమ్యమౌ పిస్గా నగం / బు రంగుగాను నెక్కి నా / చిర గృహంబు జూతును / శరీరమున్ విదల్చి నే / బరంబు బోవు వేళలో / కరంబు నిన్ను మెచ్చెదన్ / పరేశు ధ్యాన ప్రార్ధనా

పరదేశులమో ప్రియులారా|Paradeshulamo Priyulaaraa

పరదేశులమో ప్రియులారా మన / పురమిది గాదెపుడు (నిజముగ) (2) ||పరదేశుల|| / చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి / చిత్రమైన సంత (లోకము) (2) ||పరదేశుల|| / సంత గొల్లు క్షమ సడలిన చందం / బంతయు సద్దణగన్ (నిజముగ) (2) ||పరదేశుల|| / స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని / బరలోకమే స్థిరము (నిజముగ) (2) ||పరదేశుల|| / మేడలు మిద్దెలు మేలగు సరకులు / పాడై కనబడవే (నిజముగ) (2) ||పరదేశుల|| / ధర ధాన్యంబులు దరగక మానవు / పని పాటలు పోయె (నిజముగ) (2) ||పరదేశుల|| / ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన / మన్నై పోవునుగా (దేహము) (2) ||పరదేశుల|| / వచ్చితి మిచటికి వట్టి హస్తముల / దెచ్చిన దేదియు లే (దు గదా) (2) ||పరదేశుల|| / ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు / అట్లు వెళ్ళవలయున్ (మింటికి) (2) ||పరదేశుల|| / యేసు నందు విశ్వాసం బుంచిన / వాసిగ నిను జేర్చున్ (బరమున) (2) ||పరదేశుల|| / యేసే మార్గము యేసే సత్యము / యేసే జీవముగా (నిజముగ) (2) ||పరదేశుల||

మరణము నన్నేమి చేయలేదు|Maranamu nannemi cheyaledu

మరణము నన్నేమి చేయలేదు / పరిస్థితి నన్నేమి చేయగలదు (2) / నీ కృప సమృద్ధిగా / నాపై నిలిపి తోడైయున్నావు (2) ||మరణము|| / నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే / నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే (2) / నను సీయోనులో చేర్చుకొనుటే / నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| / నీ రూపమును పొంది జీవించుటే ఆశ / సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి (2) / విశ్వసింపబోవు వారికి మాదిరిగా నేనుండుటే / నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| / నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము / పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము (2) / నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే / నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము|| / నీ కొరకు ఖైదీనై ఉండుటే ధన్యత / సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి (2) / దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే / నా యెడల నీకున్న ఉద్దేశ్యమా (2) ||మరణము||

ఈ జీవితం విలువైనది|Ee Jeevitham Viluvainadi

ఈ జీవితం విలువైనది / నరులారా రండని సెలవైనది (2) / సిద్ధపడినావా చివరి యాత్రకు / యుగయుగాలు దేవునితో ఉండుటకు / నీవుండుటకు ||ఈ జీవితం|| / సంపాదన కోసమే పుట్టలేదు నీవు / పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) / పోతున్నవారిని నువు చుచుటలేదా (2) / బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం|| / మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు / కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) / చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2) / కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం|| / పాపులకు చోటు లేదు పరలోకమునందు / అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2) / యేసు రక్తమే నీ పాపానికి మందు (2) / కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం||

Hope Telugu Songs — Page 7 | UEC Telugu Church