నిరీక్షణ | Hope Telugu Songs

318 hope songs available. Lyrics in Roman and Telugu script.

తెలియదా? నీకు తెలియదా?|Theliyadaa neeku theliyadaa

తెలియదా? నీకు తెలియదా? / యేసు తోడుగా ఉన్నాడని (4) / నీవే సాక్షి యేసే దేవుడని / యేసే నీకు సాక్షి ఆయన బిడ్డవని (2) / యేసే నీకు సాక్షి ఆయన బిడ్డవని (2) / తెలియదా? నీకు తెలియదా? / యేసుకున్నదంతా నువ్వేనని (4) / నీ మౌనం పరలోకపు మౌనమని / నీవు మాట్లాడితే పాతాళం వణుకునని (2) / నీవు మాట్లాడితే పాతాళం వణుకునని (2) / తెలియదా? నీకు తెలియదా? / నీవు జత పని వాడవని / తెలియదా? నీకు తెలియదా? / దేవుని జత పని వాడవని (2) / నీ బలహీనతలో యేసే నీ బలం / నీ అవమానములో యేసే నీ ఘనం (2) / నీ అవమానములో యేసే నీ ఘనం (2) / తెలియదా? నీకు తెలియదా? / రాయబారివి అని / తెలియదా? నీకు తెలియదా? / దేవుని రాయబారివి అని (2) / అడుగుము జనములను స్వాస్థ్యముగా ఇచ్చును / భూమిని దిగంతముల వరకు సొత్తుగా మార్చును (2) / నీ శత్రువులందరిని పాదపీఠముగ చేయును (2) / తెలియదా? నీకు తెలియదా? / వారసుడు నువ్వేనని / తెలియదా? నీకు తెలియదా? / దేవుని వారసుడు నువ్వేనని (2) / తెలియదా? ఆ ఆ ఆ (2) / నీకు తెలియదా? ఆ ఆ ఆ (2) / నీకు తెలియదా? / తెలియదా? (4)

కన్నులనెత్తి పైరుల చూడు|Kannulaneththi Pairula Choodu

కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2) / ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2) / కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2) / ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా|| / మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2) / వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా|| / విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2) / జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా|| / మందిరము పడియుండ మందుడవై నీవుండి (2) / సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా|| / మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2) / నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా||

ఈ తరం యువతరం|Ee tharam yuvatharam

ఈ తరం యువతరం / ప్రభు యేసుకే అంకితం / నా బలం యవ్వనం / ప్రభు యేసుకే సొంతము / రా సోదరీ రారా సోదరా / ప్రభు యేసు వార్త చాటుదాం / రా సోదరీ రారా సోదరా / ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం|| / సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా / ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా / దేవుని సేవ వ్యాపారమాయే / ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే / నీవు కాకపోతే ఇంకెవ్వరు / నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| / నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా / యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా / యేసయ్య రాకడ సామీపమాయే / ఆ వార్త చాటను వేగిర రావే / నీవు కాకపోతే ఇంకెవ్వరు / నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||

జాగ్రత్త భక్తులారా|Jaagraththa Bhakthulaaraa

జాగ్రత్త, భక్తులారా పిలుపిదే ప్రభు యేసు వేగవచ్చును / వందనం, హోసన్న, రాజాధి రాజు వచ్చును / వినుమార్భాటము బూరధ్వనియు ప్రధానదూత శబ్దము / చాలా రాత్రి గడిచిపోయే చూడు పగలు వచ్చెనుగా / విడువుము అంధకార క్రియలు తేజో ఆయుధముల ధరించుము ||జాగ్రత్త|| / గుర్తులన్ని నెరవేరినవి నోవహు కాలము తలచుము / లోతు భార్యను మరచిపోకు మేలుకొనెడి సమయము వచ్చె ||జాగ్రత్త|| / మన దినములు లెక్కింపబడెను మేల్కొనువారికి భయమేమి / ఘనముగ వారెత్తబడుదురు యెవరు ప్రభువుతో నడచెదరో ||జాగ్రత్త|| / దైవజనులు కలుతురు గగనమున – ప్రభునందు మృతులు జీవింతురు / మేఘమునందు ఎల్లరు చేరి అచ్చటనే ప్రభుని గాంతురు ||జాగ్రత్త|| / క్రియలను బట్టి ప్రతిఫలమిచ్చును విజయులే దాని పొందెదరు / ప్రీతిగ పల్కును ప్రభువే మనతో నావన్నియు మీవేయనుచు ||జాగ్రత్త||

నిబ్బరం కలిగి|Nibbaram Kaligi

నిబ్బరం కలిగి ధైర్యముగుండు / దిగులు పడకు జడియకు ఎప్పుడు (2) / నిన్ను విడువడు నిన్ను మరువడు / ప్రభువే నీ తోడు / హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా / ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము / నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు / హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా ||నిబ్బరం|| / పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2) / ప్రభు కృప మమ్మును విడువడుగా (2) / ఎక్కలేని ఎత్తైన కొండను / ఎక్కించును మా ప్రభు కృప మమ్మును / ప్రభువే మా బలము ||హల్లెలూయా|| / మునుపటి కంటెను – అధికపు మేలును (2) / మా ప్రభు మాకు కలిగించును (2) / రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును / శత్రువు ఎదుటనే భోజనమిచ్చును / ప్రభువే మా ధ్వజము ||హల్లెలూయా|| / మా అంగలార్పును – నాట్యముగా మార్చెను / బూడిద బదులు సంతోషమిచ్చెను (2) / దుఃఖ దినములు సమాప్తమాయెను / ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను / ప్రభునకే స్తోత్రం ||హల్లెలూయా|| / స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును (2) / మా ప్రభు మమ్మును మరువడుగా (2) / చూడుము నా అరచేతిలనే / చెక్కితి నిను అన్నాడు ప్రభువు / ప్రభువే చూచుకొనును ||హల్లెలూయా|| / రాబోవు కాలమున – సమాధాన సంగతులే (2) / మా ప్రభు మాకై ఉద్దేశించెను (2) / ఇదిగో నేనొక నూతన క్రియను / చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను / ఇప్పుడే అది మొలుచున్ ||హల్లెలూయా|| / మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను (2) / మా ప్రభు మాకు అందించును (2) / ప్రాకారముగల పట్టణములోనికి / ప్రభువే మమ్మును నడిపింపచేయును / ప్రభువే మా పురము ||హల్లెలూయా||

కన్నులుండి చూడలేవ|Kannulundi Choodaleva

కన్నులుండి చూడలేవ యేసు మహిమను / చెవులుండి వినలేవ యేసు మాటను (2) / నాలుకుండి పాడలేవ యేసు పాటను / కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి|| / చెడును చూడకుండ నీ కనులను / చెడును వినకుండ నీ చెవులను (2) / చెడును పలుకకుండ నీ నాలుకన్ / చెడులో నడువకుండ నీ కాళ్ళను / దూరముగా నుంచు ఓ సోదరా / దూరముగా నుంచు ఓ సోదరీ (2) ||కన్నులుండి|| / దుష్టుల ఆలోచన చొప్పునా / నడువక సాగుమా నీ యాత్రలో (2) / పాపుల మార్గమందు నీవు నిలువక / అపహాసకులు కూర్చుండు చోటను / కూర్చుండకుమా ఓ సోదరా / కూర్చుండకుమా ఓ సోదరీ (2) ||కన్నులుండి|| / యెహోవా దొరుకు కాలమందునా / ఆయనను మీరు వెదక రండి (2) / ఆయన మీ సమీపమందు నుండగా / ఆయననూ మీరు వేడుకొనండి / ఆయన తట్టు తిరుగు ఓ సోదరా / ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ (2) ||కన్నులుండి||

Hope Telugu Songs — Page 22 | UEC Telugu Church