318 hope songs available. Lyrics in Roman and Telugu script.
నీవున్నావని ఒకే ఆశ / నడిపిస్తావని ఒకే ఆశ / ఎవరున్నారు నాకిలలో (2) / నీవు తప్ప ఎవరున్నారు నాకు ఇలలో / ఎవరున్నారు నాకు యేసయ్యా / ఎవరున్నారయ్యా / నీవున్నావని ఒకే ఆశతో / నడిపిస్తావని ఒకే ఆశలో (2) / ఆదరిస్తావని ఆదుకుంటావని (2) / అద్దరికి చేరుస్తావని నీ జీవిస్తున్నా / ఆశలే అడి ఆశలై / బ్రతుకెంతో భారమై (2) / కలలన్ని కన్నీటి వ్యధలై / గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని|| / ఆప్తులే దూరమై / బంధు మిత్రులకు భారమై (2) / నా అన్న వారే నాకు కరువై / గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని|| / యాత్రలో తుఫానులే / నా నావనే ముంచేసినా (2) / అద్దరి చేరే ఆశలే అనగారినా / గుండెను పిండే దుఃఖమున్నా ||నీవున్నావని||
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి / ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి / పాపులనందరిని – తన దాపున చేర్చుటకై / ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా / మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా ||ఇక|| / రాజుల రాజైన యేసు రానై యుండెనుగా / గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి / తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి ||ఇక|| / బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటే / సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే / తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి ||ఇక|| / వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు / తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ / మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును ||ఇక|| / సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను / గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి / మరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ ||ఇక|| / జాలము చేయకను – మీరు హేళన చేయకను / కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ / తరుణముండగానే – మీరు త్వరపడి రారండి ||ఇక||
యేసు రాజు రాజుల రాజై / త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె / హోసన్నా జయమే – హోసన్నా జయమే / హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు|| / యోర్దాను ఎదురైనా / ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2) / భయము లేదు జయము మనదే (2) / విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా|| / శరీర రోగమైనా / అది ఆత్మీయ వ్యాధియైనా (2) / యేసు గాయముల్ స్వస్థపరచున్ (2) / రక్తమే రక్షణ నిచ్చున్ (2) ||హోసన్నా|| / హల్లెలూయ స్తుతి మహిమ / ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2) / యేసు రాజు మనకు ప్రభువై (2) / త్వరగా వచ్చుచుండె (2) ||హోసన్నా||
రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో / యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2) / రావయ్య యేసయ్య – వేగరావయ్యా / రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2) ||రాకడ|| / యేసయ్య రాకడ సమయంలో / ఎదురేగె రక్షణ నీకుందా? (2) / లోకాశలపై విజయం నీకుందా? (2) ||రావయ్య|| / ఇంపైన ధూపవేదికగా / ఏకాంత ప్రార్థన నీకుందా? (2) / యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ||రావయ్య|| / దినమంతా దేవుని సన్నధిలో / వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2) / యేసునాథునితో సహవాసం నీకుందా? (2) ||రావయ్య|| / శ్రమలోన సహనం నీకుందా? / స్తుతియించే నాలుక నీకుందా? (2) / ఆత్మలకొరకైన భారం నీకుందా? (2) ||రావయ్య|| / నీ పాత రోత జీవితము / నీ పాప హృదయం మారిందా? (2) / నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2) ||రావయ్య|| / అన్నీటికన్నా మిన్నగను / కన్నీటి ప్రార్థన నీకుందా? (2) / ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2) ||రావయ్య||
చింతెందుకు మీకు దిగులెందుకు / మన ప్రియులు లేరని బాధెందుకు (2) / కష్టాలు లేని కన్నీళ్లు లేని / పరదైసులోన తానుండగా (2) ||చింతెందుకు|| / శాశ్వతము కాదు ఈ లోకము / మన గమ్యస్థానము పరలోకము (2) / ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకు / తప్పక ఈ భువిని వీడాలిగా (2) ||చింతెందుకు|| / ఒకరోజు మన ప్రియుని చూస్తామనే / నిరీక్షణ ప్రభువు మనకొసగెగా (2) / ఆ రోజు వరకు పరదైసులోన / అబ్రహాము చెంతన తానుండగా (2) ||చింతెందుకు||
పోరాటం ఆత్మీయ పోరాటం (2) / చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు / సాగిపోవుచున్నాను / సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2) / నా యేసుతో కలిసి పోరాడుచున్నాను / అపజయమే ఎరుగని జయశీలుడాయన (2) / నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2) / ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం|| / నా యేసు వెళ్ళిన మార్గము లేనని / అవమానములైనా ఆవేదనలైనా (2) / నా యేసు కృపనుండి దూరపరచలేవని (2) / ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం|| / ఆదియు అంతము లేనివాడు నా యేసు / ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2) / ఆ సింహాసనం నా గమ్యస్థానం (2) / ఆగిపోను నేను సాగిపోవుచున్నాను ||పోరాటం||
నాదు జీవితము మారిపొయినది / నిన్నాశ్రయించిన వేళ / నన్నాదుకుంటివి ప్రభువా ||నాదు|| / చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2) / పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా / నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| / కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2) / నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా / నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| / లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2) / ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా / నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| / జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా (2) / చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా / నే పాపినయ్యా ప్రభువా.. ||నాదు|| / ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై (2) / ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి / నన్నెంతగా ప్రేమించితివి.. ||నాదు||
పరవాసిని నే జగమున ప్రభువా (2) / నడచుచున్నాను నీ దారిన్ / నా గురి నీవే నా ప్రభువా (2) / నీ దరినే జేరెదను / నేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని|| / లోకమంతా నాదని యెంచి / బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2) / అంతయు మోసమేగా (2) / వ్యర్ధము సర్వమును / ఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని|| / ధన సంపదలు గౌరవములు / దహించిపోవు నీలోకమున (2) / పాపము నిండె జగములో (2) / శాపము చేకూర్చుకొనే / లోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని|| / తెలుపుము నా అంతము నాకు / తెలుపుము నా ఆయువు యెంతో (2) / తెలుపుము ఎంత అల్పుడనో (2) / విరిగి నలిగియున్నాను / నేను.. విరిగి నలిగియున్నాను ||పరవాసిని|| / ఆ దినము ప్రభు గుర్తెరిగితిని / నీ రక్తముచే మార్చబడితిని (2) / క్షమాపణ పొందితివనగా (2) / మహానందము కలిగే / నాలో.. మహానందము కలిగే ||పరవాసిని|| / యాత్రికుడనై ఈ లోకములో / సిలువ మోయుచు సాగెదనిలలో (2) / అమూల్యమైన ధనముగా (2) / పొందితిని నేను / యేసునే.. పొందితిని నేను ||పరవాసిని|| / నా నేత్రములు మూయబడగా / నాదు యాత్ర ముగియునిలలో (2) / చేరుదున్ పరలోక దేశము (2) / నాదు గానము ఇదియే / నిత్యము.. నాదు గానము ఇదియే ||పరవాసిని||
అదిగో నా నావ బయలు దేరుచున్నది / అందులో యేసు ఉన్నాడు / నా నావలో క్రీస్తు ఉన్నాడు (2) / వరదలెన్ని వచ్చినా వణకను / అలలెన్ని వచ్చినా అదరను (2) / ఆగిపోయే అడ్డులొచ్చినా / సాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో|| / నడిరాత్రి జాములో నడచినా / నది సముద్ర మధ్యలో నిలచినా (2) / నడిపించును నా యేసు / నన్నూ అద్దరికి చేర్చును (2) ||అదిగో|| / లోతైన దారిలో పోవుచున్నది / సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి (2) / సూర్యుడైన ఆగిపోవును / చుక్కాని మాత్రం సాగిపోవును (2) ||అదిగో||
యేసుని ప్రేమ యేసు వార్త / వాసిగ చాటను వెళ్ళెదము / ఆశతో యేసు సజీవ సాక్షులై / దిశలన్నిటను వ్యాపించెదము / వినుము ప్రభుని స్వరము (2) / ప్రభు యేసు సన్నిధి తోడు రాగా / కడుదూర తీరాలు చేరెదము ||యేసుని|| / మరణ ఛాయ లోయలలో / నాశన కూపపు లోతులలో (2) / చితికెను బ్రతుకులెన్నో (2) / ప్రేమ తోడను చేరి వారిని / ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని|| / కాపరి లేని గొర్రెలుగా / వేసారెనుగ సమూహములే (2) / ప్రజలను చూచెదమా (2) / ప్రేమ తోడను చేరి వారిని / ప్రభు యేసు కొరకై గెలిచెదము ||యేసుని||
నీ జీవితం నీటీ బుడగా వంటిది / ఎప్పుడూ ఆగునో మనకూ తెలియదూ (2) / నేడే తెలుసుకో నిజమైన దేవుని / నిత్య జీవముకై వెంబడించు యేసుని ||నీ జీవితం|| / ఎన్నాళ్ళూ ఈ వ్యర్ధపు ప్రయాసము / మనకై మరణించిన ప్రభుని చూడు (2) / ఈ క్షణమే వెదుకూ నీ హృదయముతో (2) / మనదగునూ.. ఆయన క్షమా రక్షణ (2) ||నీ జీవితం|| / ఎన్నాళ్ళు ఈ వ్యర్ధపు ప్రయాణము / త్వరగా రానైయున్నాడు ప్రభువూ (2) / ఆయనతో పరమునకేగుటకూ (2) / నిరీక్షణ గలవారమైయుందుము (2) ||నీ జీవితం||
ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు / నీదు పొలములో కూలివానిగా / కావాలి నేను నీదు తోటకు కావలివానిగా / అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే / అంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికే / స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవను / మెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2) / మరువకు నా ప్రాణమా / నీ ప్రయాస వ్యర్ధము కాదు (2) ||ప్రియ యేసు|| / ఏక భావము సేవ భారము / యేసు మనసుతో సాగిపోదును (2) / విసుగక విడువక / కష్టించి పని చేసెదన్ (2) ||ప్రియ యేసు||