నిరీక్షణ | Hope Telugu Songs

318 hope songs available. Lyrics in Roman and Telugu script.

నూతన సంవత్సరం|Noothana samvathsaram

నూతన సంవత్సరం దయచేసిన దేవా / నీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా (2) / ఆశ్చర్యకరుడవు ఆది సంభూతుడవు (2) / అద్భుతకరుడవు అల్ఫా ఓమెగవు (2) ||నూతన || / పాపాంధకారమునకు బానిసనై యున్నప్పుడు / శాపముతో నేను హీనుడనై యున్నప్పుడు / చేతులు చాచి నన్ను లేవనెత్తిన దేవా / ప్రేమతో పిలిచి నన్ను ఆదరించిన ప్రభువా / నీ ప్రేమ పిలుపుకు నే ఘనుడనైతిని / నీ స్పర్శ తాకిడికి ఆత్మ పూర్ణుడైతిని ||నూతన|| / కడవరి దినాలలో కంట నీరు పెడుతుండగా / కష్టాలతో నేను సతమతమౌతుండగా / నీ వాక్య వెలుగులో నడిపించిన నా ప్రభువా / ఏ దిక్కు లేని నాకు దారి చూపిన తండ్రి / నీ జాలి హృదయమునకు దాసుడ నేనైతిని / నీ వాక్య జ్ఞానమునకు పరిచారకుడనైతిని ||నూతన||

కొంతసేపు కనబడి|Konthasepu Kanabadi

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే / ఆవిరి వంటిదిరా ఈ జీవితం / లోకాన కాదేది శాశ్వతం (2) / యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు / మరణమైన జీవమైన నిన్ను విడువడు (2) ||కొంతసేపు|| / ఎదురౌతారెందరో నీ పయనంలో / నిలిచేది ఎందరు నీ అక్కరలో (2) / వచ్చేదెవరు నీతో మరణము వరకు (2) / ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు ||యేసే|| / చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి / ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2) / ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2) / సంపాదన ఎవరిదగును యోచించితివా ||యేసే|| / నీ శాపం తాను మోసి పాపం తీసి / రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2) / విశ్రాంతినీయగ నిన్ను పిలువగా (2) / నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా ||యేసే||

మన్నేగదయ్యా మన్నేగదయ్యా|Mannegadayyaa Mannegadayyaa

మన్నేగదయ్యా మన్నేగదయ్యా (2) / మహిలోని ఆత్మ జ్యోతియు తప్ప / మహిలోనిదంతా మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| / మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినా / మించిన బంగారము మించిన నీ దేహము (2) / ఉంచుము ఎన్నాళ్ళకుండునో / మరణించగానే మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| / ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచినా / నిన్ను చూచి లోకులంతా ధన్యుడవని పిలిచినా (2) / మెల్లని పుష్పంబు పోలినా / పుష్పంబుతోనే ఊడిపడినది (2) ||మన్నేగదయ్యా|| / మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము / ఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము (2) / కుక్క శవంతో సమమేగా / నిక్కముగనదియు మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా|| / మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల / మరణమును జయించుచున్న కాలమింత మన్నిల (2) / మరణ విజయుడేసు క్రీస్తుడే / మది నమ్ము నిత్య జీవమిచ్చ్చును (2) ||మన్నేగదయ్యా||

దిక్కులెన్ని తిరిగినా|Dikkulenni Thiriginaa

దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2) / మనకు దిక్కు ఈ బాల యేసుడే / ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో / ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2) / కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2) / స్థలము లేక తిరిగి వేసారెను / నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2) / కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2) / నేడు నోవాహు ఓడ జోరేబు కొండ / గుర్తుగా ఉన్నాయి చూడండి ||దిక్కులెన్ని|| / దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2) / తన మార్గమందు నడుప బుట్టెను / ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2) / జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2) / నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి / హృదయాలు అర్పించినారయ్యో ||దిక్కులెన్ని||

Hope Telugu Songs — Page 13 | UEC Telugu Church