318 hope songs available. Lyrics in Roman and Telugu script.
భయము చెందకు భక్తుడా / ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2) / భయము చెందకు నీవు / దిగులు చెందకు నీవు (2) / జీవమిచ్చిన యెహొవున్నాడు / ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము|| / బబులోను దేశమందున / ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2) / పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2) / నాల్గవ వాడు ఉండలేదా / ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము|| / చెరసాలలో వేసినా / తన దేహమంతా.. గాయాలతో నిండినా (2) / పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2) / భూకంపం కలుగ లేదా / ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ||భయము|| / ఆస్తి అంతా పోయినా / తన దేహమంతా.. కురుపులతో నిండినా (2) / అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2) / అని యోబు పలుక లేదా / ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా ||భయము||
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను / నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2) / నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2) / నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా|| / లేక లేక వృద్ధాప్యమందు / ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2) / ఇచ్చిన నీవే బలి కోరగా (2) / తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా|| / సర్వము పోయి శరీరము కుళ్ళిన / నా అనువారే వెలివేసినా (2) / ఆప్తులంతా శత్రువులైనా (2) / అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా|| / నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైనా అది నాకెంతో మేలే (2) / ఇదిగో నేను ఉన్నానయ్యా (2) / దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||
సర్వాంగ కవచము నీవే / ప్రాణాత్మ దేహము నీవే / నా అంతరంగము నీవే దేవా (2) / నీ పోలికగ చేసి – నీ జీవమును పోసి / నా పాపమును తీసీ / నా భారమును మోసావయ్యా… యేసయ్యా / నా సర్వము నీవే నా యేసయ్యా ఓ.. ఓ.. / నా ప్రాణము నీవే నా యేసయ్యా (2) / వాక్యమను ఖడ్గము నీవై – రక్షణను శిరస్త్రాణమై / సత్యమను దట్టివి నీవై నా యేసయ్యా / నీతియను మైమరువునై విశ్వాసమను డాలునై / సమాధాన సువార్త నీవై నా యేసయ్యా ||నా సర్వము|| / దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై / బూడిదెనకు ప్రతిగా పూదండవై / దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలము నీవై / భారభరితమైన ఆత్మకు స్తుతివస్త్రమై ||నా సర్వము||
నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా / నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా (2) / నీవు చేసినవి చూపినవి వింటే / హృదయం తరియించి పోతుంది దేవా / నీవు చూపినవి చేసినవి చూస్తే / హృదయం ఉప్పొంగి పోతుంది దేవా / దేవా… యేసు దేవా – నాధా… యేసు నాధా / నా మార్గమంతటిలో నను కాపాడినావు (2) / నా చేయి పట్టుకొని నను నడిపించినావు (2) / ఏమేమి మారినా నీ మాట మారదు (2) / అదియే నాకు బలమైన దుర్గము (2) ||దేవా|| / మా కష్ట కాలంలో మమ్ము కరుణించినావు (2) / ఏ రాయి తగలకుండా మము ఎత్తి పట్టినావు (2) / ఏమేమి మారినా నీ మాట మారదు (2) / అదియే నాకు బలమైన దుర్గము (2) ||దేవా||
నేనునూ నా ఇంటి వారును / యెహోవాను సేవించెదము / ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2) / సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని ||నేనునూ|| / శ్రమలో శోధనలో మరణ బంధకంలో / శాంతి సమాధానం దయచేసి దేవుడు (2) / ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2) / ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2) ||నేనునూ|| / ఏ పాపము నన్ను ఏలనీయని వాడు / ఏ అపాయమును రాకుండా కాపాడును (2) / కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2) / నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2) ||నేనునూ|| / దీర్ఘాయువు చేత దీవించు దేవుడు / దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును (2) / మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు (2) / మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును (2) ||నేనునూ||
శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా / సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే – (2) ||శోధనా|| / నడవలేక నా పడవ నది సముద్రమందున / నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా (2) / చూచెనే యేసు చెంతకు చేరెనే (2) / ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే (2) ||శోధనా|| / పాపమని దొంగ యూభి పడిపోవుచుండగా / పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా (2) / చూచెనే యేసు చేయి చాచెనే (2) / లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే (2) ||శోధనా||
దినదినము విజయము మనదే / జయశీలుడైన యేసునిలో / భయమే లేదు మాకు దిగులే లేదు / సైన్యములకు అధిపతి యుండగా / సాతానును ఓడించెను / స్వేచ్చా జీవము మాకిచ్చెను / పాప శాపములు తొలగించెను / పరిపూర్ణ జీవము మాకిచ్చెను (2) / హోసన్నా జయం మనదే (3) / హోసన్నా జయం జయం మనదే ||దినదినము||
మల్లెలమ్మా మల్లెలు – తెల్ల తెల్లని మల్లెలు (2) / ఏ మల్లెలోన వస్తాడో – రానున్న యేసయ్యా (2) / నీవచ్చే రాకడలో జరిగే గుర్తులు తెలిసాయి (2) / జరుగుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| / అక్కడక్కడ కరువులు భూకంపాలే లేచాయి (2) / నీ రాకడ సమీపమయ్యింది – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| / రాజ్యము మీదికి రాజ్యములు జనముల మీదికి జనములు (2) / లేచుచున్నవి ఈనాడే – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| / పదవుల కొరకే ఈనాడు పార్టీలెన్నో పెరిగాయి (2) / పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| / పురుగులు పట్టి ఈనాడే పైరులు ఎన్నో పోయాయి (2) / రోజులు మారే రోజాన్నో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా|| / నీతి న్యాయం నివసించే పాపుల పరుగే గెలిచాయి (2) / పరిశుద్ధుల పాలిట నీవయ్యో – రానున్న యేసయ్యా (2) ||మల్లెలమ్మా||
ఆకాశం అమృత జల్లులు కురిపించింది / ఈ లోకం ఆనందమయమై మురిసింది (2) / అంతు లేని ఈ అనంత జగతిలో / శాంతి కొరవడి మసలుచుండగా (2) / రక్షణకై నిరీక్షణతో (2) / వీక్షించే ఈ అవనిలో (2) / శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ ||ఆకాశం|| / పొంతన లేని వింత జగతిలో / పాపాంధకారం ప్రబలి యుండగా (2) / సమ్మతిని మమతలను (2) / పెంచుటకై ఈ పృథివిపై (2) / ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ ||ఆకాశం||
లోకాన ఎదురు చూపులు / శోకాన ఎద గాయములు / యేసులోన ఎదురు చూపులు / ఫలియించును ప్రభు వాగ్ధానములు (2) / ఎదురు చూడాలి యేసుకై / నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| / నిండు నూరేళ్లు అబ్రహాము / ఎదురు చూసాడు విశ్వాసముతో (2) / కన్నాడు పండంటి కుమారుని / పొందాడు వాగ్ధాన పుత్రుని (2) / ఎదురు చూడాలి యేసుకై / నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన|| / ఎనభై నాలుగేళ్ల ప్రవక్తిని / ఎదురు చూసెను ఉపవాసముతో (2) / చూసింది పరిశుద్ధ తనయుని / సాక్ష్యమిచ్చింది విశ్వాస విధేయులకు (2) / ఎదురు చూడాలి యేసుకై / నిరీక్షణా ప్రేమతో (2) ||లోకాన||
వెండి బంగారాల కన్న మిన్న అయినది / యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2) / లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2) / లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి|| / లోకమునకు వెలుగైన ప్రేమ / లోకమును వెలిగించిన ప్రేమ (2) / లోకులకై కరిగిపోయిన ప్రేమ / లోకాన్ని జయించిన ప్రేమ (2) / యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) / హల్లెలూయా మహదానందమే (2) ||వెండి|| / ఏ స్థితికైనా చాలిన ప్రేమ / నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2) / నీకు బదులు మరణించిన ప్రేమ / చిర జీవము నీకొసగిన ప్రేమ (2) / యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) / హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||
మేఘాల పైన మన యేసు / త్వరలోనే మనకై వచ్చుచున్నాడు (2) / సిద్ధపడుమా ఉల్లసించుమా / నీ ప్రియుని రాకకై (2) ||మేఘాల|| / ఏ ఘడియో ఏ వేళయో – తెలియదు మనకు / బుద్ధి కలిగిన కన్యకలు వలె – సిద్ధపడియుండు (2) / బూర శబ్దం మ్రోగగా / ప్రభుని రాకడ వచ్చును / రెప్ప పాటున పరిశుద్ధులు / కొనిపోబడుదురు ప్రభువుతో ||మేఘాల|| / పాపం వలన వచ్ఛు జీతం – మరణమే కాదా / దేవుని కృపయే క్రీస్తు యేసులో – నిత్య జీవమే (2) / వినుట వలన విశ్వాసం / కలుగును సోదరా / దేవుని ఆజ్ఞకు లోబడితే / పొందెదవు పరలోకం ||మేఘాల|| / స్తుతియు మహిమ ఘనత ప్రభావం / యేసుకే చెల్లు గాక / తర తరములకు యుగయుగములు / యేసే మారని దైవం (2) / నిత్యము ఆనందమే ప్రభువా నీతో నుండుట / నూతన యెరూషలేము చేరుకోనుటే నిరీక్షణ ||మేఘాల||