కృప | Grace Telugu Songs

233 grace songs available. Lyrics in Roman and Telugu script.

నీ ప్రేమా నీ కరుణా|Nee Premaa Nee Karunaa

నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన / మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన / చాలయ్య చాలీ దీవెనలు చాలు / మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2) / గురిలేని నన్ను గుర్తించినావే / ఎనలేని ప్రేమను చూపించినావే / వెలలేని నాకు విలువిచ్చినావే / విలువైన పాత్రగా నను మార్చినావే ||నీ ప్రేమా|| / చేజారిన నాకై చేచాచినావే / చెదరిన నా బ్రతుకును చేరదీసినావే / చెరనుండి నన్ను విడిపించినావే / చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే ||నీ ప్రేమా|| / నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే / కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే / నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే / నీ కుమారునిగా నను మార్చినావే ||నీ ప్రేమా||

నిన్న నేడు నిరంతరం|Ninna nedu nirantharam

నిన్న నేడు నిరంతరం మారనే మారవు / నా జ్ఞాపకాలలో చెరగని వాడవు (2) / నీవే నీవే నమ్మదగినా దేవుడవు / నీవు నా పక్షమై నిలిచేయున్నావు (2) / యేసయ్యా నీ ప్రత్యక్షతలో / బయలుపడెనే శాశ్వతా కృప నాకై (2) / విడువదే నన్నెల్లప్పుడూ కృప / విజయపథమున నడిపించెనే కృప (2) / విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు ||నిన్న|| / యేసయ్యా నీ కృపాతిశయము / ఆదరించెనే శాశ్వత జీవముకై (2) / మరువదే నన్నెల్లప్పుడూ కృప / మాణిక్య మణులను మరిపించేనే కృప (2) / మైమరచితినే నీ కృప తలంచినప్పుడు ||నిన్న|| / యేసయ్యా నీ మహిమైశ్వర్యము / చూపెనే నీ దీర్ఘశాంతము నాపై (2) / ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప / శాంతి సమరము చేసెనే కృప (2) / మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే ||నిన్న||

సిల్వలో నాకై కార్చెను|Silvalo naakai kaarchenu

సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2) / శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2) / యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) / అమూల్యమైన రక్తము – యేసు రక్తము (2) / సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము (2) / సంధి చేసి చేర్చును – యేసు రక్తము (2) / యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) / ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము (2) / సమాధాన పరచును – యేసు రక్తము (2) / సమస్యలన్ని తీర్చును – యేసు రక్తము (2) / యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) / సంపూర్ణ శాంతినిచ్చును – యేసు రక్తము (2) / నీతిమంతులుగ చేయును – యేసు రక్తము (2) / దుర్నీతి నంత బాపును – యేసు రక్తము (2) / యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) / నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము (2) / రోగములను బాపును – యేసు రక్తము (2) / దురాత్మల పారద్రోలును – యేసు రక్తము (2) / యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2) / శక్తి బలము నిచ్చును – యేసు రక్తము (2)