233 grace songs available. Lyrics in Roman and Telugu script.
నువ్వు లేని నన్ను ఊహించలేను / నీ ఉన్నత ప్రేమను వివరించలేను (2) / అడగాలని నేను అనుకోకముందే / నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు (2) / నా అవసరతలు ఎరిగి అక్కరలు తీర్చావు / యేసయ్యా… నీవే నా ఆరాధ్య దైవమా / యేసయ్యా… నీవే నా ఆధార దీపమా (2) ||నువ్వు లేని|| / పదివేలలో అతి సుందరుడా / కురూపినైన నాకు నీ స్వారూప్యమునిచ్చావు / ఎందుకు పనికిరాని వాడనై యుండగా / నీ కుమారునిగా నను స్వీకరించావు (2) ||అడగాలని|| / ఏ పాపమును ఎరుగని పరిశుద్ధుడా / ఘోరపాపినైన నాకు పరిశుద్ధత నొసగావు / ఈ లోకము వీడి నిన్ను చేరేంత వరకు / పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచావు (2) ||అడగాలని||
త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావే / నేను – దేహి యనుచు నీ పాదములే / దిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం|| / గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనై / రవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితి / త్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశి / యివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం|| / నీ యందు భయభక్తులు లేని – నిర్లజ్జా చిత్తము బూని / చేయరాని దుష్కర్మములు – చేసినాడను / దయ్యాల రాజు చేతిలో – జేయి వేసి వాని పనుల / జేయ సాగి నే నిబ్భంగి – జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో ||త్రాహిమాం|| / నిబ్బర మొక్కించుకైన – నిజము రవ్వంతైన లేక / దబ్బర లాడుతకు ము – త్తా నైతిని / అబ్బురమైన ఘోర పా – పాంధకార కూపమందు / దబ్బున బడిపోతి నయ్యో – దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహిమాం|| / నిన్ను జేరి సాటిలేని – నిత్యానంద మంద బోవు / చున్నప్పుడు నిందలు నా – కెన్ని చేరినా / విన్నదనము లేకుండ నీ – వే నా మదికి ధైర్యమిచ్చి / యన్నిట రక్షించితివి నా – యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహిమాం||
ఎంతెంత భారమాయె ఆ సిలువ / లోక పాపములన్ని నువ్వు గెలువ (2) / కదిలినావు ఆ కల్వరికి / మరణముని దరి చేర్చుకొని (2) / యేసయ్యా… నా యేసయ్యా… / అలసిపోతివ నా యేసయ్యా… (2) / కొరడాలు నీ ఒళ్ళు చీల్చేను / పిడి గుద్దులతో కళ్ళు తిరిగెను (2) / వడి ముళ్ళు తలలోన నాటేను / నీ కళ్ళు రుధిరాన్ని కురిసెను (2) ||యేసయ్యా|| / బరువైన సిలువను మోయలేక / తడబడె నీ అడుగు అదిరిపడి (2) / వడివడిగా నిన్ను నడువుమని / పడి పడి తన్నిరి ఆ పాపులు (2) ||యేసయ్యా|| / చల్లని నీ దేహమల్లాడెను / ఏ చోటు లేకుండ గాయాలతో (2) / కాళ్ళు చేతులకు దిగి మేకులు / వ్రేళాడే సిలువకు నీ ప్రాణము (2) ||యేసయ్యా|| / వెలలేనిది తండ్రి నీ త్యాగము / నీ కష్టమంతయు నా పాపము (2) / మదిలోన కొలువుండు నా రక్షకా / వదిలేది లేదు నిన్ను నా పాలిక (2) ||యేసయ్యా||
కృపా క్షేమము నీ శాశ్వత జీవము / నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2) / మహోన్నతమైన నీ ఉపకారములు / తలంచుచు అనుక్షణము పరవశించనా / నీ కృపలోనే పరవశించనా / నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే / లెక్కకు మించిన దీవెనలైనాయి (2) / అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే / కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2) / నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను / నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2) / ఆరాధన నీకే ||కృపా క్షేమము|| / నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే / పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2) / కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే / గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2) / ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే / నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2) / ఆరాధన నీకే ||కృపా క్షేమము|| / నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా / నా హృది నీ కొరకు పదిలపరచితిని (2) / బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా / అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2) / ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే / ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2) / ఆరాధన నీకే ||కృపా క్షేమము||
ఎంతటి వాడను నేను యేసయ్యా / కొంతైనా యోగ్యుడను కానయ్యా (2) / ఇంతగ నను హెచ్చించుటకు / ఈ స్థితిలో నన్నుంచుటకు (2) ||ఎంతటి|| / ఐశ్వర్యము గొప్పతనమును / కలిగించు దేవుడవీవే / హెచ్చించువాడవును / బలమిచ్చువాడవు నీవే (2) / అల్పుడను మంటి పురుగును / నన్ను ప్రేమించినావు / ప్రాణమును నీ సర్వమును / నా కొరకై అర్పించినావు ||ఎంతటి|| / నిను వెంబడించువారిని / నిజముగ సేవించువారిని / నీవుండే స్థలములలో / నిలిచే నీ సేవకుని (2) / ఎంతో ఘనపరచెదవు / ఆశీర్వదించెదవు / శత్రువుల కంటె ఎత్తుగా / అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి|| / వినయముగల మనుష్యులను / వర్దిల్లజేసెదవు / గర్విష్టుల గర్వమునణచి / గద్దె నుండి దించెదవు (2) / మాదు ఆశ్రయ దుర్గమా / మేమంతా నీ వారమే / మా శైలము మా కేడెమా / మాకున్నదంతా నీ దానమే ||ఎంతటి||
కృపామయుడా – నీలోనా (2) / నివసింప జేసినందున / ఇదిగో నా స్తుతుల సింహాసనం / నీలో నివసింప జేసినందునా / ఇదిగో నా స్తుతుల సింహాసనం / కృపామయుడా… / ఏ అపాయము నా గుడారము / సమీపించనీయక (2) / నా మార్గములన్నిటిలో / నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా|| / చీకటి నుండి వెలుగులోనికి / నన్ను పిలచిన తేజోమయా (2) / రాజవంశములో / యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా|| / నీలో నిలిచి ఆత్మ ఫలము / ఫలియించుట కొరకు (2) / నా పైన నిండుగా / ఆత్మ వర్షము కుమ్మరించు (2) ||కృపామయుడా|| / ఏ యోగ్యత లేని నాకు / జీవ కిరీటమిచ్చుటకు (2) / నీ కృప నను వీడక / శాశ్వత కృపగా మారెను (2) ||కృపామయుడా||
నాదు జీవితము మారిపొయినది / నిన్నాశ్రయించిన వేళ / నన్నాదుకుంటివి ప్రభువా ||నాదు|| / చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2) / పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా / నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| / కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2) / నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా / నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| / లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2) / ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా / నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు|| / జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా (2) / చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా / నే పాపినయ్యా ప్రభువా.. ||నాదు|| / ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై (2) / ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి / నన్నెంతగా ప్రేమించితివి.. ||నాదు||
కృతజ్ఞతన్ తలవంచి / నాదు జీవము అర్పింతును / లేదే ఇక-నే ఈవి ఇల / అర్పింతును నన్నే నీకు (2) / దూరమైతి నీ ప్రేమ మరచి / నే రేపితి నీ గాయముల్ (2) / దూరముగా నిక వెళ్ళజాల / కూర్చుండెద నీ చెంతనే (2) ||కృతజ్ఞతన్|| / ఆకర్షించే లోకాశాలన్ని / లోక మహిమ నడ్డగించు (2) / కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై / నిక్కముగా త్యజింతును (2) ||కృతజ్ఞతన్|| / తరముల నీ ప్రేమ నాకై / వర్ణింపను అశక్యము (2) / నిరంతరము సేవించినను / తీర్చలేను నీ ఋణము (2) ||కృతజ్ఞతన్||
వర్ణించలేను వివరించలేను / యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) / యేసయ్యా నీవు నాకు చేసిన మేలు (2) / పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు / పాడైపోయిన నన్ను బాగు చేసినావు (2) / ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| / అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు / ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు (2) / ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా|| / తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను / ఆదరించినావు ఓదార్చినావు (2) / ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను ||యేసయ్యా||
తప్పిపోయిన కుమారుడనయ్యా / తరలి తిరిగి వస్తున్న తనయుడనయ్యా / కాదనకయ్యా నా కన్న తండ్రి / తనయుడిగా కాదు నీ దాసుడిగా ఉంటా (2) / అంతులేని ఆశలతో ఆస్తినంత పంచుకొని / పరిహాసకులనే స్నేహితులుగ ఎంచుకొని (2) / ఆస్తి అంత కోల్పోయి అనాథగా వస్తున్నా / ఆదరించువారు లేక అలమటిస్తు వస్తున్నా (2) ||కాదనకయ్యా|| / పూట పూట కూటి కొరకు ఆకలితో అలమటిస్తు / పొట్ట నింపుకొనుట కొరకు పంది పొట్టుకాశపడుచు (2) / ఆ పొట్టు కూడ నోచుకోని దీన స్థితిలో వస్తున్నా / తండ్రి నీవు గుర్తొచ్చి తరలి తిరిగి వస్తున్నా (2) ||కాదనకయ్యా||
చాలునయ్య నీ కృప నా జీవితానికి (2) / సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా ||చాలునయ్య|| / మేఘాలలోన మెరుపుంచినావు (2) / త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2) / సాగలేని జీవిత సమరములో (2) / వేగమే దూతనంపి బాగుగ నిలిపావు ||చాలునయ్య|| / పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2) / ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2) / వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2) / లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా ||చాలునయ్య||
ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2) / ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2) / ఒక్కరినైనా ఒక ఆత్మనైనా / రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా|| / ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా / మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2) / ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా / నిన్నే ఎదిరించానా (2) / ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2) / నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా|| / ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా / శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2) / ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా / నా కడుపు నింపుకున్నానా (2) ||ఇప్పటికైనా || / ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా / భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2) / ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా / సోమరినైపోయానా (2) ||ఇప్పటికైనా ||