శుభశుక్రవారం | Good Friday Telugu Songs

65 good friday songs available. Lyrics in Roman and Telugu script.

ప్రేమగల యేసయ్యా|Premagala Yesayyaa

ప్రేమగల యేసయ్యా / జీవ వృక్షమా యేసయ్యా (2) / సిలువలో బలి అయిన యేసయ్యా / తులువలో వెలి అయిన యేసయ్యా (2) / పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా / పరిశుద్ధుడా నా ప్రాణేశ్వరా / పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా / పరిశుద్ధుడా నా ప్రాణ ప్రియుడా ||ప్రేమగల|| / యేసయ్య నీ శిరముపై మూళ్ళ కిరీటం మొత్తగా / రక్తమంత నీ కణతలపై ధారలుగా కారుచుండగా / కొరడాల దెబ్బలు చెళ్లుమనెను / శరీరపు కండలే వేలాడేను (2) / నలిగిపోతివా నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడా|| / యేసయ్యను కొట్టిరి జాలిలేని ఆ మనుష్యులు / ముఖానపై ఉమ్మి వేసిరి కరుణ లేని కక్షకులు / గడ్డము పట్టాయనను లాగుచుండగా / నాగటి వలె సిలువలో దున్నబడగా (2) / ఒరిగిపోతివా నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడా|| / యేసయ్య ఆ కల్వరిలో దాహముకై తపియించగా / మధురమైన ఆ నోటికి చేదు చిరకను ఇచ్చిరే / తనువంత రుధిరముతో తడిసిపోయెనే / తండ్రీ అని కేక వేసి మరణించెనే (2) / మూడవ దినాన తిరిగి లేచెను (2) ||పరిశుద్ధుడా||

సిలువే నా శరణాయెను రా|Siluve Naa Sharanaayenu Raa

సిలువే నా శరణాయెను రా / నీ… సిలువే నా శరణాయెను రా / సిలువ యందే ముక్తి బలము చూచితి రా / నీ… సిలువే నా శరణాయెను రా / సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు / విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా / నీ… సిలువే నా శరణాయెను రా / సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు / నలిగి కరిగి నీరగుచున్నది రా / నీ… సిలువే నా శరణాయెను రా / సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప / కలుషమెల్లను బాపగ చాలును రా / నీ… సిలువే నా శరణాయెను రా / పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక / సిలువ యెదుటను నిలచినాడను రా / నీ… సిలువే నా శరణాయెను రా / శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా / దురిత దూరుడ నీ దరి జేరితి రా / నీ… సిలువే నా శరణాయెను రా

మోసితివా నా కొరకై|Mosithivaa Naa Korakai

మోసితివా నా కొరకై సిలువ వేదనను / గొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలో / సిలువలో రక్తము పాపికి రక్షణ విలువగు మోక్షమును / పాప క్షమాపణ పాపికి ముక్తి పరమ ప్రభుని గనుము ||మోసితివా|| / అమ్మా ఇదిగో నీ సుతుడు వ్రేళాడుచు పిలిచెన్ / ఏలీ ఏలీ లామా సబక్తానీ చే విడిచి / దాహము తీర్చను చేదు చిరకను అందించిరిగా / ముండ్ల మకుట నీ శిరముపై గృచ్చిరి యూదుల రాజని / హేళన చేసిరి గుద్దిరి ఉమిసిరి కొరడా దెబ్బలతో / దేవ నా దేవా ఏల నా చేయి విడనాడితివిలలో ||మోసితివా|| / తర తరాల ఈ లోకం – యుగయుగాల నీ నామం / తరగని వేదన నీకు సిలువ విజయమునకే / కల్వరి ధారా నాథా పాపికి ప్రాణ ప్రదాత / విలువగు రక్త ప్రదాత ఆశ్రిత రక్షణ రాజా / చిందిన రక్తము విలువగు ప్రాణము లోక విమోచనకే / అందదు ఊహకు అంతము ఎప్పుడో సిద్ధపరచు ప్రభువా ||మోసితివా||

సిలువ ధ్యానం|Siluva Dhyaanam

నీ సిలువే నా శరణము (2) / విలువైన రుధిరాన్ని కార్చి / వెలపోసి నన్ను కొన్నావు (2) / ప్రేమా త్యాగం నీవే యేసయ్యా / మహిమా నీకే ఆరోపింతును / గాయాలు పొందినావు – వెలివేయబడినావు / నా శిక్ష నీవు పొంది – రక్షణను కనుపరచావు (2) / నీ ప్రేమ ఇంత అంతని – నే తెలుపలేను / నీ కృపను చాటెదన్ – నా జీవితాంతము / నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు / భారమైన సిలువ – మోయలేక మోసావు / కొరడాలు చెళ్ళని చీల్చెనే – నీ సుందర దేహమునే (2) / తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే (2) / వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా (2) / సిలువలో ఆ సిలువలో – ఆ ఘోర కల్వరిలో / తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2) / విలువే లేని నా బ్రతుకును – విలువ పెట్టి కొన్నావయ్యా (2) / నాదు పాపమంతయూ (2) / నీదు భుజముపై మోసావయ్యా (2) / గొల్గొతా కొండ పైన (2) / గాయాలు పొందితివే (3) / చెమటయు రక్తముగా – ఆత్మల వేదనయూ (2) / పొందెను యేసు నీ కొరకే / తండ్రీ నీ చిత్తం – సిద్ధించు గాక అని పలికెను (2) / కల్వారిలో జీవామిచ్చెన్ (2) / నీ పాపములను తొలగించుటకై / నీదు సిలువన్ మోసెను యేసు (2) / రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము / కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము / చలించిపోయెనే ఆ సిలువ ధాటికి (2) / కసాయి చేతిలో అల్లాడిపోయెనే (2) / రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము / కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము / కృపా సత్య దేవా – సిలువలో మాకై బలియై / రక్తము చిందించినావు – రక్షణిచ్చినావు (2) / ఆరాధింతుము నిన్ను యేసు – ఆత్మ సత్యముతో / పాడి కొనియాడి కీర్తింతుము / పూజించి ఘనపరతుము / హాల్లేలూయా హాల్లేలూయా (3) / నిన్నే ఆరాధింతుమ్ (3)

ఈలాటిదా యేసు ప్రేమ|Eelaatidaa Yesu Prema

ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను / తూలనాడక తనదు జాలి చూపినదా ||ఈలాటిదా|| / ఎనలేని పాప కూపమున – నేను / తనికి మిణుకుచును నే దరి గానకుండన్ / కనికరము పెంచి నాయందు – వేగ / గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె ||ఈలాటిదా|| / పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను / మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు / నను నీచుడని త్రోయలేక – తనదు / నెనరు నా కగుపరచి నీతి జూపించె ||ఈలాటిదా|| / నెమ్మి రవ్వంతైనా లేక – చింత / క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి / సమ్మతిని నను బ్రోవ దలచి – కరము / జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె ||ఈలాటిదా|| / పనికిమాలిన వాడనైన – నేను / కనపరచు నా దోష కపటవర్తనము / మనసు నుంచక తాపపడక యింత / ఘనమైన రక్షణ-మును నాకు చూపె ||ఈలాటిదా|| / నా కోర్కెలెల్ల సమయములన్ – క్రింది / లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ / చేకూర్చి ధృడము చిత్తమునన్ – శుభము / నా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటిదా|| / శోధనలు నను చుట్టినప్పుడు – నీతి / బోధ నా మనసులో పుట్టించి పెంచి / బాధలెల్లను బాపి మాపి – యిట్టి / యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు ||ఈలాటిదా||

ఆహా మహాత్మ|Aahaa Mahaathma

ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా / ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా|| / వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్ / కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై ||ఆహా|| / నీవు నాతో పరదైసున – నేడే యుందువు / పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి ||ఆహా|| / అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి / క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి ||ఆహా|| / నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు / శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా ||ఆహా|| / దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా / యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా ||ఆహా|| / శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా / సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా ||ఆహా|| / అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును / గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా ||ఆహా||