65 good friday songs available. Lyrics in Roman and Telugu script.
మారా గయా సులీ పర్ / మేరా యీషు మసీహ్ (2) / మేరా యీషు మసీహ్ (2) / మారా గయా సులీ పర్ / మేరా యీషు మసీహ్ (2) / మేరా యీషు మసీహ్ ||మారా|| / యీషు సులీ చడా హై / మేరే గుణా కే ఖాతిర్ (2) / ఉస్నే దీ జాన్ అప్ నీ / మేరే గుణా కే ఖాతిర్ (2) / లాఖో మే ఏక్ హై వో / మేరా యీషు మసీహ్ (2) ||మారా|| / మేరే గుణావో కా భోజ్ / యీషు తూ నే లియా హై (2) / మేరే లియే సభీ దర్ద్ / యీషు తూ నే సహా హై (2) / ఏక్ నామ్ అనోఖా హై వో / మేరా యీషు మసీహ్ (2) ||మారా|| / యీషు తేరే లాహూ సే / ముజ్కో మిలీ హై ముక్తి (2) / పాపోన్ సే దూర్ కే రెహ్కర్ / ముజ్కో మిలీ హై శాంతి (2) / ముక్తి కా దాతా హై వో / మేరా యీషు మసీహ్ (2) ||మారా||
అదిగదిగో అల్లదిగో / కల్వరి మెట్టకు దారదిగో / ఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో|| / గెత్సేమను ఒక తోటదిగో / ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2) / అచటనే యుండి ప్రార్ధించుడని (2) / పలికిన క్రీస్తు మాటదిగో (2) ||అదిగదిగో|| / శిష్యులలో ఇస్కరియోతు / యూదాయను ఒక ఘాతకుడు (2) / ప్రభువును యూదులకప్పగింప (2) / పెట్టిన దొంగ ముద్దదిగో (2) ||అదిగదిగో|| / లేఖనము నెరవేరుటకై / ఈ లోకపు పాపము పోవుటకై (2) / పావనుడేసుని రక్తమును గల (2) / ముప్పది రూకల మూటదిగో (2) ||అదిగదిగో|| / చలి కాచుకొను గుంపదిగో / ఆ పేతురు బొంకిన స్థలమదిగో (2) / మూడవసారి బొంకిన వెంటనే (2) / కొక్కొరొకోయను కూతదిగో (2) ||అదిగదిగో|| / యూదుల రాజువు నీవేనా / మోదముతో నీవన్నట్లే (2) / నీలో దోషము కనుగొనలేక (2) / చేతులు కడిగిన పిలాతుడాడుగో (2) ||అదిగదిగో|| / గొల్గొతా స్థల అద్దరిని / ఆ ఇద్దరు దొంగల మధ్యమున (2) / సాక్షాత్తు యెహోవా తనయుని (2) / సిలువను వేసిరి చూడదిగో (2) ||అదిగదిగో|| / గొల్లున ఏడ్చిన తల్లదిగో / ఆ తల్లికి చెప్పిన మాటదిగో (2) / యూదుల రాజా దిగి రమ్మనుచు (2) / హేళన చేసిన మూకదిగో (2) ||అదిగదిగో|| / దాహము గొనుచున్నాననుచు / ప్రాణము విడిచెను పావనుడు (2) / పరిశుద్ధుడు మన రక్షకుడేసు (2) / మన మది యేమో గమనించు (2) ||అదిగదిగో||
కల్వరి ప్రేమను తలంచునప్పుడు / కలుగుచున్నది దుఃఖం / ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు / పగులుచున్నది హృదయం (2) / గెత్సేమనే అను తోటలో / విలపించుచు ప్రార్ధించు ధ్వని (2) / నలువైపులా వినబడుచున్నది / పగులుచున్నవి మా హృదయములు / కలుగుచున్నది దుఃఖం / సిలువపై నలుగ గొట్టిననూ / అనేక నిందలు మోపిననూ (2) / ప్రేమతో వారిని మన్నించుటకై / ప్రార్ధించిన ప్రియ యేసు రాజా / మమ్మును నడిపించుము ||కల్వరి|| / మమ్మును నీవలె మార్చుటకై / నీ జీవమును ఇచ్చితివి (2) / నేలమట్టుకు తగ్గించుకొని / సమర్పించితివి కరములను / మమ్మును నడిపిపంచుము ||కల్వరి||
నా కొరకు బలియైన ప్రేమ / బహు శ్రమలు భరియించె ప్రేమ (2) / కడు ఘోర కఠిన శిక్ష సహియించె ప్రేమ (2) / తుది శ్వాసనైన నాకై అర్పించె ప్రేమ (2) / క్రీస్తేసు ప్రేమ ||నా కొరకు|| / నా హృదయ యోచనే జరిగించె పాపము / నా క్రియల దోషమే నడిపించె పతనముకై (2) / ఏ మంచి యుందని ప్రేమించినావయ్యా / నా ఘోర పాపముకై మరణించినావయ్యా / ఉన్నత ప్రేమ చూపి రక్షించినావయ్యా (2) / నా మంచి యేసయ్యా (2) ||నా కొరకు|| / నీ సిలువ త్యాగము నా రక్షణాధారం / నీ రక్త ప్రోక్షణయే నా నిత్య ఐశ్వర్యం (2) / అర్హతే లేని నాకై మరణించినావయ్యా / నీ మరణ త్యాగమే బ్రతికించె యేసయ్యా / ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలనయ్యా / ప్రాణాత్మ దేహముతో స్తుతియింతు యేసయ్యా / ఘనపరతు యేసయ్యా (2) ||నా కొరకు||
యేసయ్యా యేసయ్యా… నీదెంత జాలి మానసయ్యా / యేసయ్యా యేసయ్యా… నీదెంత దొడ్డ గుణమయ్యా / నిన్ను సిలువకు వేసి మేకులేసినోల్ల చేతులే / కందిపోయెనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నావోడివి ||యేసయ్యా|| / ఒంటి నిండ రగతం – గొంతు నిండ దాహం / అయ్యో.. ఆరిపోవు దీపం / అయినా రాదు నీకు కోపం / గుండెలోన కరుణ – కళ్ళలోన పొంగి / జారే కన్నీళ్లు మాత్రం / పాపం చేసినోల్ల కోసం ||యేసయ్యా|| / నమ్మినోల్ల పాపం – మోసినావు పాపం / నిను మోసి కట్టుకుంది పుణ్యం / ఆహా సిలువదెంత భాగ్యం / ఓడిపోయి మరణం – సాక్ష్యమిచ్చుఁ తరుణం / మళ్ళీ లేచి వచ్చుఁ నిన్నే / చూసిన వారి జన్మ ధన్యం ||యేసయ్యా||
నాకై చీల్చబడ్డ యో / నా యనంత నగమా / నిన్ను దాగి యందున్న / చేను మీర బారెడు / రక్త జలధారలా / శక్తి గ్రోలగా నిమ్ము / నేను నాదు శక్తిచే / నిన్ను గొల్వజాలను / కాల మెల్ల నేడ్చినన్ / వేళా క్రతుల్ చేసినన్ / నేను చేయు పాపము / నేనే బాప జాలను / వట్టి చేయి చాచుచున్ / ముట్టి సిల్వ జేరెదన్ / దిక్కు లేని పాపిని / ప్రక్క జేర్చి ప్రోవుము / నా కళంక మెల్లను / యేసునాథ, పాపుము / ఈ ధరిత్రియందున / నీరు దాటునప్పుడు / నాదరించి నీ కడన్ / నాకై చీల్చబడ్డయో / నా యనంత శైలమా / నన్ను జేర దీయుమా
చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను / పాడు లోకంబునకై – గోడు జెందె గదా ||చూడరే|| / నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా / నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే|| / దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై / నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై ||చూడరే|| / పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు / పరమ రక్షకుని – పాదములలో మేకులు ||చూడరే|| / పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే / పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు ||చూడరే||
ఇదేనా న్యాయమిదియేనా / కరుణామయుడు యేసు ప్రభుని – సిలువ వేయ ||ఇదేనా|| / కుంటి వారికి కాళ్ళ నొసగే / గ్రుడ్డి వారికి కళ్ళ నొసగే / రోగుల నెల్ల బాగు పరిచే – ప్రేమ మీర ||ఇదేనా|| / చెడుగు యూదులు చెరను బట్టి / కొరడా దెబ్బలు కసిగా గొట్టి / వీధులలోనికి ఈడ్చిరయ్యో – రక్తము కారన్ ||ఇదేనా|| / మోయలేని సిలువ మోపి / గాయములను ఎన్నో చేసి / నడవలేని రాళ్ళ దారిన్ – నడిపిరయ్యో ||ఇదేనా|| / ప్రాణముండగానే సిలువ కొయ్యకు / మేకులెన్నో కొట్టిరయ్యో / ప్రక్కలోనే బల్లెముతో – పొడిచిరయ్యో ||ఇదేనా|| / ఎన్ని బాధలు పెట్టిన గాని / మారు పల్కడు యేసు ప్రభువు / ఎంత ప్రేమ ఎంత కరుణ – ఎంత జాలి ||ఇదేనా|| / ఎన్ని మారులు పాపము చేసి / యేసుని గాయముల్ రేపెదవేల / నరక బాధ ఘోరమయ్యొ – గాంచవేల ||ఇదేనా||
శిరము మీద ముళ్ల సాక్షిగా / కార్చిన కన్నీళ్ల సాక్షిగా / పొందిన గాయాల సాక్షిగా / చిందిన రుధిరంబు సాక్షిగా (2) / యేసు నిన్ను పిలచుచున్నాడు / నీ కొరకే నిలచియున్నాడు (3) / సర్వ పాప పరిహారం కోసం / రక్త ప్రోక్షణం అవశ్యమని (2) / మనుషులలో ఎవ్వరు బలికి పనికిరారని / పరమాత్ముడే బలియై తిరిగి లేవాలని / ఆర్య ఋషులు పలికిన ఆ వేదం సత్యం / యేసులోనే నెరవేరెనుగా / సర్వ పాప పరిహారో / రక్త ప్రోక్షణం అవశ్యం / తద్ రక్తం పరమాత్మేనా / పుణ్య దాన బలియాగం / ఆర్య ఋషులు పలికిన ఆ వేద సత్యం / క్రీస్తులోనే నెరవేరెనుగా / యేసే బలియైన పరమాత్మ ||శిరము|| / మహా దేవుడే ఇలకేతెంచి / యజ్ఞ పశువుగా వధ పొందాలని (2) / కాళ్లలోన చేతులలో మూడు మేకులుండాలని / శిరముపైన ఏడు ముళ్ల గాయాలు పొందాలని / బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం / క్రీస్తులోనే నెరవేరెనుగా / చత్వారః శ్రీద్న త్రయో అస్య పాదాద్రి / శీర్ష్యే సప్త హస్తాసో అస్య త్రిదావద్ధో / వృషభో రోర వీతి మహో దేవో / మద్యామ్ ఆవివేశత్తిథి / బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి / యేసులోనే నెరవేరెనుగా / యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా ||శిరము||
నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు / వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల (2) ||నా ప్రియుడు|| / మెల్లని చల్లని స్వరమే వినబడెను (2) / తండ్రీ వీరేమి చేయుచున్నారో (2) / ఎరుగరు గనుక క్షమించుమనెన్ / ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే ||నా ప్రియుడు|| / అతని ప్రేమ మధురం మధురం / ఎన్నటికీ నే మరువలేను (2) / ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం / శాపమంతా బాపి నను దీవించెనుగా ||నా ప్రియుడు|| / వీపంతా దున్నబడె నాగలితో / కారె రక్త వరదల్ కనుమా (2) / యేసు రక్తంలో రక్షణ – యేసు రక్తంలో స్వస్థత / నాకై మరణించి తిరిగి లేచె సజీవునిగా ||నా ప్రియుడు|| / తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి / నాకై విన్నతి చేయుచున్నాడు (2) / రానైయున్నాడు వేగ – మేఘముపై విభుడే / నన్ను పరమ గృహమునకు తోడ్కొని వెళ్ళును ||నా ప్రియుడు||
నీదెంతో కరుణా కరుణామయా / నీదెంతో జాలి నజరేయా (2) / మా పాపమంతా గాయాలుగా / దాల్చావు నీ మీన పూమాలగా (2) / మా కర్మమంతా ఆ సిలువగా / మోసేవు తండ్రి నీ మోపున ||నీదెంతో|| / ప్రభువా మా పాప ప్రక్షాళనముకై / వెలపోసినావు నీ రుధిరమే (2) / దేవా మా ఆత్మ పరిశుద్ధికై / బలి పెట్టినావు నీ ప్రాణమే ||నీదెంతో||
కల్వరిలోన చేసిన యాగం / మరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2) / కడిగి వేసెను నాదు పాపం / నిలిపె నాలో నీ స్వరూపం (2) ||కల్వరిలోన|| / ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు / తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు / పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు / నాలోని రోగాలకై పొందితివా గాయాలు (2) / దైవ సుతుడవే అయిన గాని / కనికరము వీడవు ఏల క్షణమైనా గాని (2) ||కల్వరిలోన|| / ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారం / రద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారం / నువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెను / చిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను (2) / నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి / నన్ను రక్షించుటకు వేదన పడితివి (2) ||కల్వరిలోన|| / సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహము / అందించేను నా కొరకై ఆ జీవ జలము / కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు / నింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం (2) / అధికారమే లేని మరణము నిలిచెను / నిన్ను తాకేందుకు అనుమతి కోరెను (2) ||కల్వరిలోన||