65 good friday songs available. Lyrics in Roman and Telugu script.
ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన – విలువైన నీ మాటలు / ప్రాణాత్మలను సేదదీర్చు జీవ ఊటలు (2) / మోక్షమునకు చేర్చు బాటలు / పరిశుద్ధతలో పరిపూర్ణుడా – ఉన్నత గుణ సంపన్నుడా (2) / శ్రేష్టుడా… ||ధ్యానించుచుంటిమి|| / తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు / వీరిని దయతో క్షమించుము (2) / అని ప్రార్ధన చేసావా బాధించే వారికి (2) / శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||పరిశుద్ధతలో|| / నేడే నాతోను పరదైసులో నీవుందువు / నిశ్చయముగ ప్రవేశింతువు (2) / అని మాట ఇచ్చావా దొంగ వైపు చూచి (2) / అధికారముతో పాపిని రక్షించి (2) ||పరిశుద్ధతలో|| / ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు / కష్టము రానీయకు ఎప్పుడు (2) / అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను (2) / తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను (2) ||పరిశుద్ధతలో|| / దేవా నా దేవా నను విడనాడితివెందుకు / చెవినీయవె నా ప్రార్థనకు (2) / అని కేక వేసావా శిక్షననుభవిస్తూ (2) / పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2) ||పరిశుద్ధతలో|| / సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని / వాక్యము నెరవేర్చుచుంటిని (2) / అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు (2) / జీవ జలమును అనుగ్రహించుటకు (2) ||పరిశుద్ధతలో|| / సమాప్తిమయ్యింది లోక విమోచన కార్యం / నెరవేరెను ఘన సంకల్పం (2) / అని ప్రకటన చేసావా కల్వరి గిరి నుంచి (2) / పని ముగించి నీ తండ్రిని ఘనపరచి (2) ||పరిశుద్ధతలో|| / నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని / నీ యొద్దకు వచ్చుచుంటిని (2) / అని విన్నవించావా విధేయత తోటి (2) / తల వంచి తృప్తిగ విజయము చాటి (2) ||పరిశుద్ధతలో||
చూచితి నీ మోముపై – చిందిన రక్తము / తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె / రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా / సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా / పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే / ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని / యేసు.. ||చూచితి|| / నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను / ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను (2) / మట్టి దేహమును – మహిమగ మార్చుటకు (2) / మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే (2) / యేసు.. ||చూచితి|| / సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను / చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను (2) / మా రోగములను – భరియించుటకు (2) / మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే (2) / యేసు.. ||చూచితి||
ముళ్ళ కిరీటము రక్త ధారలు / పొందిన గాయములు జాలి చూపులు / చల్లని చేతులు పరిశుద్ధ పాదములు / దిగిన మేకులు వేదన కేకలు / ఎంత గొప్పది యేసు నీ హృదయము / మా కోసమే ఇన్ని బాధలా / ఇంత ప్రేమ ఏలనో / సన్నుతింతుము సత్యవంతుడా / నిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతో / యేసు నీ త్యాగము మరువలేనిది / మా జీవితాలకు విలువ నిచ్చినది / ముళ్ళ కిరీటము రక్త ధారలు / పొందిన గాయములు జాలి చూపులు / లోక పాపము సిలువ భారము / జనుల పక్షము ఘోర మరణము / తండ్రి కార్యము పునరుద్దానము / ఉచిత దానము నిత్య జీవము / యేసు నీ కృప మాకు చాలును / నీ నీతియే మాకు సంపద / నిన్ను కీర్తించుట దీవెన / మా విమోచకా మా రక్షణాధారమా / అందుకోవయా మా స్తుతి అర్పణములు / వందనం ప్రభు వందనం నీకు / నీ ప్రాణదానముకై సదా వందనం / లోక పాపము సిలువ భారము / జనుల పక్షము ఘోర మరణము / తండ్రి కార్యము పునరుద్దానము / ఉచిత దానము నిత్య జీవము
మహాత్ముడైన నా ప్రభు / విచిత్ర సిల్వ జూడ నా / యాస్తిన్ నష్టంబుగా నెంచి / గర్వం బణంగ ద్రొక్కుదున్ / నీ సిల్వ గాక యో దేవా / దేనిన్ బ్రేమింప నీయకు / నాన్నాహరించు సర్వమున్ / నీ సిల్వకై త్యజింతును / శిరంబు పాద హస్తముల్ / సూచించు దుఃఖ ప్రేమలు / మరెన్నడైన గూడెనా / విషాద ప్రేమ లీ గతిన్? / ముండ్లన్ దుర్మార్గులల్లిన / కిరీట మేసు కుండినన్ / ఈ భూ కిరీటములన్ని / దానం దూగంగ జాలు నే? / లోకంబు నే నేర్పించిన / నయోగ్యమైన యీవి యౌ / వింతైన యేసు ప్రేమకై / నా యావజ్జీవ మిత్తును / రక్షింప బడ్డ లోకమా / రక్షింప జావు బొందిన / రక్షకు-డేసు నిన్ సదా / రావంబు తోడ గొల్వుమా
మోయలేని భారమంత సిలువలో మోసావు / నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2) / అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు / మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు / నాదు గతిని మార్చావు – (2) / కడలి పై నడిచిన పాదాలు / సిలువ బరువుకు తడబడి పోయే / స్వస్థతలు చూపిన హస్తములు / సిలువలో శీలలతో వ్రేళాడే (2) / ఇంత ఘోరము మోపిన నేరము / నేను చేసిన పాప భారము (2) || మోయలేని || / జయము నీకని పలికిన జనము / మహిమ ఏదని నిను నిలదీసిరి / పాపములు క్షమియించిన నిన్ను / పాపివని పలుమారులు తెలిపిరి (2) / తాకినంతనే మహిమ నొసగిన / నీదు వస్త్రము చీట్ల పరము (2) || మోయలేని || / దైవ సుతుడవు అయినా గాని / దొంగలతో దోషిగా నిను చేర్చిరి / మధుర వాక్యము నేర్పిన నోటికి / చేదు చిరకతో దాహము తీర్చిరి (2) / ఇంత జరిగిన ఎంత కరుణ / వదలవేమయ నీ క్షమాపణ (2) || మోయలేని ||
యేసయ్య పాదాలు బంగారు పాదాలు (2) / ఎండల్లో కందాయయ్యా / అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయయ్యా (2) ||యేసయ్య|| / మండేటి ఎండల్లో కాడి మోసాడయ్యా (2) / నడలేక తూలాడయ్యా / అయ్యయ్యయ్యో నేల కూలాడయ్యా (2) ||యేసయ్య|| / కొయ్యపై కాళ్ళు పెట్టి / సీలను కొట్టిరయ్యా (2) / పాదాలు అదిరాయయ్యా / అయ్యయ్యయ్యో పాదాలు చితికాయయ్యా (2) ||యేసయ్య|| / ఈ ప్రేమమూర్తి / పాదాలు నమ్ముకుంటే (2) / పాపాలు పోతాయయ్యా / అయ్యయ్యా నీ శాపాలు తీరుతాయయ్యా / పాపాలు పోతాయయ్యా / అయ్యయ్యా నీ రోగాలు పోతాయయ్యా ||యేసయ్య|| / రాతి గుండెలను మాంసపు గుండెలుగా / మార్చేందుకు వచ్చాడయ్యా / ప్రాణము పెట్టాడయ్యా
అప్పగింపబడిన రాత్రి / చెప్ప సాగే శిష్యులతో (2) / చెప్పరాని దుఃఖముతో / తప్పదు నాకీ మరణమనెను (2) ||అప్పగింప|| / రొట్టె విరచి ప్రార్ధించి / నిట్టూర్పు విడచి ఇది నా దేహం (2) / పట్టుదలతో నేనొచ్చుఁ వరకు / ఇట్టులనే భుజించుడనెను (2) ||అప్పగింప|| / ద్రాక్షా రస గిన్నెను చాపి / వీక్షించుడిదియే నా రక్తం (2) / రక్షణార్థం దీని త్రాగి / మోక్ష రాజ్యం చేరుడనెను (2) ||అప్పగింప|| / రాతివేత దూరాన / చేతులెత్తి ప్రభు మోకరించి (2) / నా తండ్రి నీ చిత్తమైతే / ఈ పాత్రన్ తీసి వేయుమనెను (2) ||అప్పగింప|| / ఇదిగో వచ్చె తుది ఘడియ / హృదయ బాధ హెచ్చెను (2) / పదిలపరచు-నట్లు తండ్రిన్ / మదిలో వదలక ప్రార్ధించుడనెను (2) ||అప్పగింప||
సర్వమానవ పాపపరిహారార్థమై / సిలువలో వ్రేలాడిన శ్రీ యేసునాధా – (2) / దోషివా…. ప్రభూ…. నువు దోషివా / నీ విధేయతకు నా అవిధేయతకు / మధ్యలో నలిగి, వ్రేలాడిన నిర్దోషివా (2) / దోషివా…. ప్రభూ…. నువు దోషివా / ఘోరంబుగా నే చేసిన నేరాలకు / నువు పొందిన మరణ శిక్ష / నే నడచిన వక్ర మార్గాలకు / నువు పొందిన సిలువ యాతన (2) / కలువరి గిరిలో ఆ ఘోర యాత్ర (2) / నే పొందిన రక్షణా పాత్ర (2) / నే వేసిన తప్పటడుగులకు / నీవు కార్చిన రక్త పు మడుగులూ / నే చేసిన కపటంబులకు / నీవు పొందిన కొరడా దెబ్బలు (2) / సంపూర్ణ సిద్ది నొసగితివే నాకు (2) / ప్రేమించితివే నన్ను (2) / తులువలలో ఓ తులువగా నున్న / నా పై నీ దయగల చూపు / పరలోకములో నీతో నుండ / భాగ్యంబును నాకు నిచ్చినదే (2) / తుది వరకు నీ దివ్య ప్రేమను పంచ (2) / నీ తుది శ్వాస వీడనంటివే (2)
ప్రియ యేసు మన కొరకు / ప్రేమతో పొందిన శ్రమలు / కాంచగ కల్వరి దృశ్యం / కారెను కళ్ళలో రుధిరం (2) / కల్వరి కొండపైన / దొంగాల మధ్యలోన / సిల్వలోన వ్రేలాడెను / నాకై యేసు మరణించెను (2) / ముండ్లతో అల్లిన మకుటం / జల్లాటమున పెట్టగా / స్రవించె పరిశుద్ధ రక్తం / ద్రవించె నా హృదయం (2) / పాపాంధకారములో / పయనించు మనుజులను / పావనులుగా చేయుటకు / పావనుడేసు మరణించెను (2) / పాపినైన నా కొరకు / ప్రేమించి ప్రాణమిచ్చెను / సిల్వలో వ్రేళాడెను / నీకై ప్రాణమునిచ్చెను (2)
కల్వరి గిరిపై సిలువ భారం / భరించితివా ఓ నా ప్రభువా / నా పాపముకై నీ రక్తమును / సిలువ పైన అర్పించితివా (2) / దుష్టుండనై బల్లెము బూని / గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2) / కేక వేసి నీదు ప్రాణం / సిలువ పైన అర్పించితివా (2) ||కల్వరి|| / మూడు దినములు సమాధిలో / ముదము తోడ నిద్రించితివా (2) / నా రక్షణకి సజీవముతో / సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2) ||కల్వరి|| / ఆరోహణమై వాగ్ధానాత్మన్ / సంఘము పైకి పంపించితివా (2) / నీ రాకడకై నిరీక్షణతో / నిందలనెల్ల భరించెదను (2) ||కల్వరి||
సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా / మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2) / ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి / నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2) ||సిలువలో|| / తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం / నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2) / నను విడిపించుటకు – విలువను విడిచితివి / పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2) ||ఘోర పాపిని|| / దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం / కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం (2) / నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి / మరణము దాటుటకు – బలిగా మారితివి (2) ||ఘోర పాపిని|| / అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను / పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము (2) / నిను చాటించుటకు – వెలుగై సాగెదను / ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను (2) ||ఘోర పాపిని||
ముక్తి దిలాయే యీషు నామ్ / శాంతి దిలాయే యీషు నామ్ (2) / ధరణి మే తూనే జన్మ లియా యీషు (2) / సూలి పర్ హువాఁ విశ్రామ్ (2) ||ముక్తి|| / క్రూస్ పర్ అప్నా కోన్ బహాయ (2) / సారా చుకాయ దామ్ (2) ||ముక్తి|| / యీషు దయాక బెహతా సాగర్ (2) / యీషు హై దాత మహాన్ (2) ||ముక్తి|| / హమ్ సబ్ కే పాపోంకో మిటానే (2) / యీషు హువాఁ బలిదాన్ (2) ||ముక్తి|| / హమ్ పర్ భీ యీషు క్రిపా కర్ నా (2) / హమ్ హై పాపి నాదాన్ (2) ||ముక్తి||