విశ్వాసము | Faith Telugu Songs

315 faith songs available. Lyrics in Roman and Telugu script.

ఆకాశమా ఆలకించుమా|Aakaashamaa Aalakinchumaa

ఆకాశమా ఆలకించుమా / భూమీ చెవియొగ్గుమా (2) / అని దేవుడు మాటలడుచున్నాడు / తన వేదన నీతో చెబుతున్నాడు (2) ||ఆకాశమా|| / నేను పెంచిన నా పిల్లలే / నా మీదనే తిరగబడిరనీ (2) / అరచేతిలో చెక్కుకున్నవారే / నా అరచేతిపై మేకులు కొడుతూ (2) / నను దూరంగా ఉంచారని / నా పిల్లలు బహు చెడిపోతున్నారని (2) ||దేవుడు|| / విస్తారమైన బలులు నాకేల / క్రొవ్విన దూడా నాకు వెక్కసమాయే (2) / కోడెల రక్తం గొర్రె పిల్లల రక్తం / మేకల రక్తం నాకిష్టము లేదు (2) / కీడు చేయ మానాలని / బహు మేలు చేయ నేర్వాలని (2) ||దేవుడు|| / పాపిష్టి జనమా, దుష్టసంతానమా / చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ / అక్కరలో మీ చేతులు నా వైపుకు చాచినపుడు / మిమ్మును నే చూడకనే కనులు కప్పుకొందును / ఆపదలో మీ గొంతులు నా సన్నిధి అరచినపుడు / మీ మాటలు వినకుండా చెవులు మూసుకొందును / నన్ను విసర్జించువారు లయమగుదురని / నీరులేని తోటలా నశియింతురని (2) ||దేవుడు|| / ఆకాశమా భువికి చెప్పుమా / భూమీ లోకాన చాటుమా (2)

జీవితాంతము నే నీతో|Jeevithaanthamu Ne Neetho

జీవితాంతము నే నీతో నడవాలని / ఎన్నడూ నీ చేయి నేను విడువరాదని / నీ సన్నిధిలో నిత్యము నే ఉండాలని / నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని / నా మనసంతా నీవే నిండాలని / తీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కోరిక / పడితినయ్యా పడితిని నీ ప్రేమలోనే పడితిని / యేసయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా (2) / దారి తప్పి ఉన్న నన్ను వెదకి రక్షించినావయ్యా (2) / నే కన్న పగటి కలలన్ని కల్లలాయెను / నీవు లేని నాస్వానికి వ్యర్థమాయెను (2) / నరుని నమ్ముటే నాకు మోసమాయెను / భయముతోటి నా కన్ను నిద్ర మరచెను (2) / మనసులోన మానిపోని గాయమాయెను (2) / నీ ప్రేమ ఇచ్చె నాకు ఓ కొత్త జీవితం (2) ||పడితినయ్యా|| / లోక పొగడ్తలకు నే పొంగిపోతిని / దాని కనుసైగలోన నేను నడచుకొంటిని (2) / చెడ్డదైన బ్రతుకు సరి జేయ జూసితి / ప్రయాసము వ్యర్ధమై నే నిరసిల్లితి (2) / ముగిసిపోయెననుకుంటి నా ప్రయాణము (2) / నీ ప్రేమ ఇచ్చె నాకు ఓ కొత్త జీవితం (2) ||పడితినయ్యా||

యేసయ్య మాట విలువైన మాట|Yesayya Maata Viluvaina Maata

యేసయ్య మాట విలువైన మాట / వినిపించుకోవా సోదరా / వినిపించుకోవా సోదరీ (2) / నీ గుండెలోన ముద్రించుకోవా / ఏ నాటికైనా గమనించలేవా / గమనించుము పాటించుము ప్రచురించుము / నిన్నూవలె నీ పొరుగువారిని / ప్రేమించమని ప్రేమించమని ||యేసయ్య|| / ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట / నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట / కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు (2) / సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని (2) / దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట ||యేసయ్య|| / నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని / అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని / కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని (2) / అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము (2) / నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని ||యేసయ్య||

బ్రతికియున్నానంటే నీ కృప|Brathikiyunnaanante Nee Krupa

యేసయ్యా నా యేసయ్యా… / యేసయ్యా నా యేసయ్యా… / బ్రతికియున్నానంటే నీ కృప / జీవిస్తున్నానంటే నీ కృప (2) / ఏ యోగ్యత నాలో లేదు – ఎంత భాగ్యము నిచ్చావు / పరిశుద్ధత నాలో లేదు – నీ ప్రేమను చూపావు (2) / యేసయ్యా నా యేసయ్యా / యేసయ్యా నా యేసయ్యా (2) / నా జీవిత నావా సాగుచుండగా / తుఫానులు వరదలు విసిరి కొట్టగా / కదలలేక నా కథ ముగించబోగా / నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు (2) / సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా / నీ పాదాల చెంతనే వాలిపోయేదా (2) ||యేసయ్యా|| / నా జీవితమంతా ప్రయాసలు పడగా / శోధనల సంద్రములో మునిగిపోగా / నా ఆశల తీరం అడుగంటిపోగా / ఆప్యాయత చూపి ఆదరించినావు (2) / నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది / నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా (2) ||బ్రతికి||

ఎటు చూచినా|Etu Choochinaa

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు / ఎటు చూచినా కరువూ భూకంపాలు / ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు / ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు / ఓ సోదరా ఓ సోదరీ (2) / రాకడ గురుతులని తెలుసుకోవా / తినుటకు త్రాగుటకు ఇది సమయమా ||ఎటు|| / మందసము నీ ప్రజలు – గుడారములో నివసిస్తుండగ / యోవాబుని సేవకులు దండులో నుండగను (2) / తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2) / ఇది సమయమా.. ఇది సమయమా.. అని / ఆనాడు ఊరియా దావీదునడిగాడు / ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| / నా పితరుల యొక్క – సమాధులుండు పట్టణము / పాడైపోయెను పాడైపోయెను (2) / యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా (2) / సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని / ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు / ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| / ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు / సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2) / ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2) / తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని / నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు / ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు ||ఎటు||

నీతో నుండని బ్రతుకు|Neetho Nundani Brathuku

నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము / ఊహించలేను నా యేసయ్యా / నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు / ఊహించలేను నా యేసయ్యా (2) / నీదు స్వరము వినకనే నేను / నిను విడచి తిరిగితి నేను / నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2) ||నిను|| / నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి / అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2) / అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ / నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా ||నీతో|| / నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ / నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ (2) / నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు / నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా ||నిను||

Faith Telugu Songs — Page 10 | UEC Telugu Church