315 faith songs available. Lyrics in Roman and Telugu script.
ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం / ఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2) / దేవుడే నీ జీవిత గమ్యం / దేవ రాజ్యం నీకే సొంతం / గురి తప్పక దరి చేరుమురా / తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| / కష్టాలకు కృంగిపోకురా / నష్టాలకు కుమిలిపోకురా / అశాంతిని చేరనీకురా / తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో|| / గెలుపోటమి సహజమురా / దివ్య శక్తితో కదులుమురా / ఘన దైవం తోడుండునురా / తెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో||
అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2) / కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2) ||అందాలు|| / చిననాటి పుట్టింటి నడకా / సాగాలి అత్తింటి దాకా (2) / ఎంత ఘనమైన బంధం / వెయ్యేండ్ల వివాహ బంధం (2) ||అందాలు|| / సంసార సాగర పయనం / తెర చాటు అనుభూతి వినయం (2) / సాగిపోవాలి పయనం / చేరుకోవాలి గమ్యం (2) ||అందాలు|| / యేసయ్య పాదాల చెంత / వదలాలి ఎదలోని చింత (2) / క్రీస్తు పుట్టాలి నీలో / చేర్చుకోవాలి హృదిలో (2) ||అందాలు||
కంట నీరేల? కలతలు ఏల? / యేసుతో నీవు సాగు వేళ / శోధన వేళ రోదన ఏల? / నీ విశ్వసము గెలిచే వేళ (2) / నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు / నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు ||కంట|| / వలదు చింతన దేనికైనా / విన్నవించుము నీ నివేదన (2) / పొందితినను నీదు నమ్మకము / దరికి చేర్చును తగిన విజయము (2) / తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు / పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2) ||కంట|| / రేపు గూర్చిన భయము వలదు / ప్రతి దినము తగు బాధ కలదు (2) / నీదు భారము మోయు ఆ దేవుడు / నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2) / నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం / స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2) ||కంట||
కలవంటిది నీ జీవితము / కడు స్వల్ప కాలము / యువకా అది ఎంతో స్వల్పము (2) / విలువైనది నీ జీవితం / వ్యర్ధము చేయకుము / యువకా వ్యర్ధము చేయకుము / బహు విలువైనది నీ జీవితం / వ్యర్ధము చేయకుము / యువతీ వ్యర్ధము చేయకుము ||కలవంటిది|| / నిన్ను ఆకర్షించే ఈ లోకము / కాటు వేసే విష సర్పము / యువకా అది కాలు జారే స్థలము (2) / ఉన్నావు పాపపు పడగ నీడలో / నీ అంతము ఘోర నరకము / యువకా అదియే నిత్య మరణము (2) ||కలవంటిది|| / నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం / నూతన సృష్టిగా మార్చును / పాపం క్షమియించి రక్షించును (2) / ఆ మోక్షమందు నీవుందువు / యుగయుగములు జీవింతువు / నీవు నిత్యము ఆనందింతువు (2) ||కలవంటిది||
నేను తగ్గాలి యేసు – నీవే హెచ్చాలి (2) / నేను పూర్తిగా మరుగై – నీవే కనబడాలి (2) / ఇదియే నా ప్రార్థన – నీ చిత్తము (2) ||నేను|| / నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి (2) / నా స్వార్ధ్య జీవితమంతా లయమైపోవాలి (2) / యేసూ నీ స్వభావము నాలో అధికమౌతు ఉండాలి (2) / పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి (2) ||ఇదియే|| / ఆదాము పాపము నాలో వసియించియుండగా (2) / యేసూ నీ రక్తమే దాని నశియింప చేయును (2) / ఆటంకమేమియు లేక జీవధారలుండాలి (2) / యేసూ నీ జీవము నాలో నింపబడుతు పోవాలి (2) ||ఇదియే||
పైలం కొడుకా పాపం చేయకురా / యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా / పైలం కొడుకా పైలం కొడుకా / పైలం కొడుకా పైలం కొడుకా / పైలం కొడుకా పాపం చేయకురా / యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా / నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా / ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తది / పాపం చెయ్యమని ఒత్తిడి చేస్తది / పాపమన్నది పాములాంటిది / పగ పడ్తది ప్రాణం తీస్తది ||పైలం|| / మనిషి జీవితం విలువయ్యింది / మరువకు కొడుకా మరణమున్నదని / బ్రతికింది ఇది బ్రతుకు కాదురా / సచ్చినంక అసలాట ఉంటది ||పైలం|| / కత్తి కన్న పదునెక్కువ కొడుకా / మనిషి కోపము మంచిది కాదు / కాలు జారితే తీసుకోవచ్చురా / నోరు జారితే తీసుకోలేము ||పైలం|| / క్రైస్తవ జీవితం విలువయ్యింది / నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా / నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా / నిందలన్ని మొయ్యాలిరా కొడుకా ||పైలం|| / విచ్చలవిడిగా తిరుగుతున్నావు / ఎవరు చూడరని ఎగురుతున్నావు / చూసే దేవుడేసయ్య ఉన్నడు / తోలు తీస్తడు జాగ్రత్త కొడుకా ||పైలం|| / గుట్కలు తినకురా గుటుక్కున చస్తావు / పొగాకు తినకురా పోతవు నరకం / సినిమా చూడకు చింతలు తప్పవు / ఫోజులు కొట్టకు పోతవు నరకం ||పైలం|| / కుమ్మరి పురుగు గుణం చూడరా / బురదల ఉంటది బురదే అంటదు / తామెర పువ్వు బురుదల ఉంటది / వరదొస్తే తల వంచుకుంటది ||పైలం|| / ఎన్నో ఆశలు పెట్టుకున్నరా / సేవ చేస్తే నిను చూడాలని / నా కలలను కల్ల చెయ్యకు కొడుకా / కాళ్ళు మొక్కుతా మయ్యగానిరా ||పైలం|| / పొందుకున్నవు రక్షణ నీవు / పోగొట్టుకోకు పోతవు నరకం / నరకమంటే ఆషామాషీ కాదురో / అగ్ని ఆరదు పురుగు చావదు ||పైలం|| / ప్రపంచమంతటా పాపమున్నది / మందులేని మాయ రోగమున్నది / నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడకా / నీవు మంచిగా బ్రతికేసయ్యను మహిమపరచు నా కొడకా / నీవు సి ఎం అయితే సంతోషముండదు పి ఎం అయితే సంతోషముండదు / యాక్టర్ అయితే సంతోషముండదు డాక్టర్ అయితే సంతోషముండదు / నీవు సేవ చేస్తే నేను చూడాలి కొడుకా / నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడుకా ||పైలం||
పరలోకమే నా అంతఃపురం / చేరాలనే నా తాపత్రయం (2) / యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2) ||పరలోకమే|| / స్వల్ప కాలమే ఈ లోక జీవితం / నా భవ్య జీవితం మహోజ్వలం (2) / మజిలీలు దాటే మనోబలం / నీ మహిమ చూసే మధుర క్షణం (2) / వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా (2) ||పరలోకమే|| / పాపము నెదిరించే శక్తిని నాకివ్వు / పరులను ప్రేమించే మనసే నాకివ్వు (2) / ఉద్రేక పరచే దురాత్మను / ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2) / మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం – నాకు నేర్పవా (2) ||పరలోకమే||
క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా / క్షణికమైన సుఖమురా ఇది (2) / ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా / సృష్టికర్తను స్మరణ చేయుమా / దైవ ప్రేమను మదిని నిలుపుమా / ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా ||క్షణికమైన|| / ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు (2) / ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా (2) / ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2) ||ఓ స్నేహితుడా|| / గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు (2) / ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును (2) / ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము (2) ||ఓ స్నేహితుడా||
క్రైస్తవుడా సైనికుడా / బలవంతుడా పరిశుద్ధుడా / కదలిరావోయ్ నీవు కదలిరా (4) / జాలరీ మనుషులు పట్టు జాలరి / ఆత్మలు పట్టు కాపరి / అమృతమందించే ఆచారి / యేసుకై జీవించే పూజారి ||క్రైస్తవుడా|| / సిలువే నీ స్థావరము / శ్రమలే నీ సైన్యము (2) / సహనమే నీ ధైర్యము / వాక్యమే నీ విజయము (2) ||క్రైస్తవుడా|| / సత్యమే నీ గమ్యము / సమర్పణే నీ శీలము (2) / యేసే నీ కార్యక్రమం / ప్రేమే నీ పరాక్రమం (2) ||క్రైస్తవుడా|| / దేశంలో విదేశంలో / గ్రామంలో కుగ్రామంలో (2) / అడవులలో కొండలలో / పని ఎంతో ఫలమెంతో (2) ||క్రైస్తవుడా|| / సిద్ధాంతపు గట్టు దుమికి రా / వాగులనే మెట్టును దిగిరా (2) / దీనుడా ధన్యుడా / విజేయుడా అజేయుడా (2) ||క్రైస్తవుడా|| / వాగ్ధాన భూమి స్వతంత్రించుకో / అద్వానపు అడవి దాటి ముందుకుపో (2) / నీ ఇల్లు పెనూయేలు / నీ పేరే ఇశ్రాయేలు (2) ||క్రైస్తవుడా||
మేడి చెట్టు పైకి ఎవ్వరెక్కారు / మేడి చెట్టు పైకి ఎందుకెక్కారు (2) / మేడి చెట్టు పైకి జక్కయ్యెక్కాడు / యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడు (2) / మేడి చెట్టు కింద ఎవ్వరాగారు / చెట్టు దిగిన జక్కయ్య ఏమి చేసాడు (2) / మేడి చెట్టు క్రింద రక్షకుడాగాడు / యేసును జక్కయ్యింట చేర్చుకున్నాడు (2) / ఓ.. ఓ.. ఓ తమ్ముడా / ఓ.. ఓ.. ఓ చెల్లెలా (2) / యేసుని నీవు చేర్చుకుంటావా / నీ హృదయములో స్థానమిస్తావా (2) / ఓ.. ఓ.. ఓ తమ్ముడా / ఓ.. ఓ.. ఓ చెల్లెలా (2)
కానెన్నడు నేను అనాథను / అయ్య కానెన్నడు నేను అనాథను (2) / (నా) కన్నీరు తుడచువాడా / నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు|| / అమ్మ నాన్న దూరమైనా / బంధువులే వెలివేసినా (2) / నా అమ్మ నాన్న నీవే యేసయ్యా / నా తోడు నీడ నీవే యేసయ్య (2) ||కానెన్నడు|| / వెక్కి వెక్కి ఏడుపొచ్చినా / వెక్కిరింతల పాలైనా (2) / నా కన్నీరు తుడచువాడా / నేనున్నానని అనువాడా (2) ||కానెన్నడు|| / వ్యాధి బాధలవరించినా / రోగములతో కృంగదీసినా (2) / నా వైద్యుడవు నీవే యేసయ్యా / నన్ను స్వస్థపరచువాడవు నీవే (2) ||కానెన్నడు||
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది / బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది / ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది (2) / వాన కురిసి వరద వస్తే / గాలి తోడై విసిరి కొడితే (2) / మాట వినని వాని ఇల్లు కూలిపోయెను / లోబడని వాని ఇల్లు కూలిపోయెను / వాని సొగసైన ఇల్లు కూలిపోయెను (2) / బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (2) / వాన కురిసి వరద వస్తే / గాలి తోడై విసిరి కొడితే (2) / మాట వినిన వాని ఇల్లు నీటుగుండెను / లోబడిన వాని ఇల్లు నీటుగుండెను / వాని సొగసైన ఇల్లు నిలిచియుండెను (2) / జోరు వాన హోరు గాలి వరద పోటు / ఆ ఇంట ముంగిట తెల్లబోయెగా (2) / బండ మీద ఇల్లు కట్టి / సాటి ఏదని చాటి చెప్పి (2) / బండ అయిన యేసు మీద / నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవయ్యా / బండ అయిన యేసు మీద / నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవమ్మా / చావు వద్ద తీర్పు వద్ద / కూలిపోని కాలిపోని (2) / నిత్య జీవం పొందరావయ్యా / సజీవుడైన యేసు దేవుని స్వీకరించయ్యా / నిత్య జీవం పొందరావమ్మా / సజీవుడైన యేసు దేవుని స్వీకరించమ్మా / ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది / బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (5)