115 christmas songs available. Lyrics in Roman and Telugu script.
ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం / ఇది లోక కళ్యాణం / మేరి పుణ్యదినం – (2) / రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో / పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో / భయము లేదు మనకిలలో / జయము జయము జయమహో ||ఇది|| / గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో / పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో / జయనాదమే ఈ భువిలో / ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||
జాగోరే జాగోరే జాగు జాము రాతిరి / యేసు జాము రాతిరి కాడ పుట్టినాడే భాయ్ (2) / కన్నియ మరియ కన్నులు విరియ / పూత రేకు వంటి బాలుడోయ్ పుట్టె పాకలోన ||జాగోరే|| / దూతలు పాడే కమ్మని పాట కబురే తెచ్చింది / తారలు మెరిసే తీరును చూడ వెలుగే వచ్చింది (2) / వెళ్లి గొల్లలు తేరి చూసిరి – ఘల్లు ఘల్లున చిందులు వేసిరి (2) / ఈ ప్రజల నేలె యేసయ్య వచ్చెనని పరుగులు తీసిరమ్మా ||జాగోరే|| / వెలుగులు చిందే తారను చూసి తరలిరి జ్ఞానులమ్మా / బోళము తెచ్చి కానుకలిచ్చి సాగిలపడిరమ్మా (2) / పోలి కేక పెట్టెనమ్మా – పొలిమేర దాటెనమ్మా (2) / ఆ పసిడి కిరణాల బాలుని చూసి ప్రకృతి మురిసెనమ్మా ||జాగోరే||
నజరేతు పట్నాన నగుమల్లె దరని లొ / యొసేపు మరియమ్మ నగుమల్లె దరని లొ / హల్లెలుయ (x4) / మేము వెల్లి చూచినాము స్వామి యెసు నాదుని / ప్రెమ మ్రొక్కి వచినాము మామనమ్బు లల్లరగ / బెతలెము పురములొన బీద కన్య మరియకు / పేదగ సురూపు దాల్చి వెలసె పశుల పాకలొ / పేద వడ్ల వారి కన్య మరియమ్మ / ప్రెమ గల యేసు తల్లి మరియమ్మ / ప్రెమ గల్ల యెసు తల్లి / పెరెల్లిన దేవ దేవుడె యెసయ్య / ప్రెమ గల అవతారం / స్వర్గ ద్వరాలు తెరిచిరి యెసయ్య / స్వర్గ రాజు పుట్ట గనె యెసయ్య / స్వర్గ రాజు పుట్ట గనె / సరుగున దూతల్ వచిరి యెసయ్య / చక్కని పాటల్ పాడిరి / నువు బొయె దారి లొ యెరుశలెము / గుడి కాడ అచం మల్లె పూల తొట యెసయ్య / దొడ్డు దొడ్డు బైబిలు దొసిట్లొ పెట్టుకొని / దొరొల్లె బయిలెల్లి నాడె యెసయ్య / రాజులకు రాజు పుట్టన్నయ్య / రా రె చూడ మనం ఎల్లుదం అన్నయ్య / తారన్ జూచి తూర్పు గ్యనుల్ అన్నయ్య / తరలి నారె బెత్లహెమ్ అన్నయ్య / పద ర పొదాము రన్న / శ్రి యెసుని చూడ / పద ర పొదము రన్న / శ్రి యెసన్న నట లొక రక్షకుడట / శ్రి యెసన్న నట లొక రక్షకుడట / లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట / లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట / పద ర హెయ్ పద ర హెయ్ / పద ర పొదము రన్న / శ్రి యెసుని చూడ / పద ర పొదాము రన్న
చిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగా / కనరాని దేవుడు కనిపించెనా / తన ప్రేమ నా పైన కురిపించెనా… కురిపించెనా / జో.. లాలిజో.. జో… లాలిజో… / పరలోక భోగాలు వర దూత గానాలు / తనకున్న భాగ్యాలు విడనాడెనా (2) / పాపాలు భరియించెనా – శాపాలు భరియించెనా / ఆనందమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే ||జో లాలిజో|| / దావీదు తనయుండై మహిమా స్వరూపుండై / మానుజావతారుండై పవళించెనా (2) / గాఢాంధకారంబున ఒక తార ఉదయించెనా / ప్రభు బాలుడై ప్రభు యేసుడు మరియమ్మ ఒడిలోన నిదురించెనా ||జో లాలిజో|| / శాంతి స్వరూపుండు కరుణా సముద్రుండు / కడు శక్తిమంతుడు కమనీయుడు (2) / ఆశ్చర్యకరుడాయనే ఆలోచన కర్తాయనే / అభిషిక్తుడు ఆరాధ్యుడు ప్రేమామయుడు ప్రియుడేసుడు ||జో లాలిజో||
ఏడానుంటివిరా – ఓరన్న / వేగి ఉరికి రారా – ఓరన్న (2) / యాదికొచ్చెరా యాదన్న / యేసు సిత్ర కథ వినరన్న (2) / ఏలియాలో ఏలియాలో ఏలియాలో / యేసే నా రక్షకుడు ఏలియాలో / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా / యేసే నా రక్షకుడు హల్లెలూయా (2) / యూదా దేశమందు – ఓరన్న / బెత్లెహేమునందు – ఓరన్న / పశువుల శాలయందు – ఓరన్న / ప్రభు యేసు జన్మించె – ఓరన్న / చుక్కల రెక్కలు ఎగుర వేయుచు / చల్లని దూతలు పాట పాడిరి (2) / చల్ల చల్లని చలిలోన – ఓరన్న / గొల్ల గొల్లలు మ్రొక్కిరి – ఓరన్న (2) ||ఏలియాలో|| / పెద్ద పెద్దని వాడై – యేసన్న / ఇంత ఇంతింత ఎదిగె – యేసన్న / వింత వింతలు చేసె – యేసన్న / ఐదు రొట్టెలు రెండు చేపలు / ఐదు వేల మందికి పంచెను (2) / తుఫాను నణిచెను – యేసన్న / సంద్రాన నడిచెను – యేసన్న (2) ||ఏలియాలో|| / ఏ పాపమెరుగని – ఓరన్న / యేసయ్య తండ్రిని – ఓరన్న / సిలువ వేయమని – ఓరన్న / కేకలు వేసిరి – ఓరన్న / సిలువ మోసెను శ్రమల నోర్చెను / మూడవ నాడు తిరిగి లేచెను (2) / పరలోకమెళ్లాడు – యేసన్న / త్వరలోనే వస్తాడు – యేసన్న (2) ||ఏలియాలో||
రారాజు జన్మించే ఇలలోన / యేసు రారాజు జన్మించే ఇలలోన (2) / ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా / రండీ మనమంతా చాటి చెప్పుదాం (2) / ఓ సోదరా… ఓ సోదరీ… (2) / విష్ యు హాప్పీ క్రిస్మస్ / అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2) ||రారాజు|| / అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా / గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2) / రాజులకు రారాజు పుడతాడంటూ / లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2) / రాజాధి రాజుని చూడాలంటూ / (తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2) ||ఓ సోదరా|| / అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా / (అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా (2) / రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ / గొల్లలతో దేవదూత మాట్లాడేనూ (2) / ఈ లోక రక్షకుని చూడాలంటూ / (ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2) ||ఓ సోదరా||
దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2) / మనకు దిక్కు ఈ బాల యేసుడే / ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో / ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2) / కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2) / స్థలము లేక తిరిగి వేసారెను / నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2) / కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2) / నేడు నోవాహు ఓడ జోరేబు కొండ / గుర్తుగా ఉన్నాయి చూడండి ||దిక్కులెన్ని|| / దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2) / తన మార్గమందు నడుప బుట్టెను / ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2) / జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2) / నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి / హృదయాలు అర్పించినారయ్యో ||దిక్కులెన్ని||
బాల యేసుని జన్మ దినం / వేడుకైన శుభ దినము / సేవింప రారే జనులారా / ముద్దుల బాలకు ముద్దులిడ ||బాల|| / మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని / చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2) / చేకొని లాలింప రారే / జో జోల పాటలు పాడి ||బాల|| / పాపికి పరమ మార్గము జూప / ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు (2) / పశుశాలయందు పవళించే / తమ ప్రేమను జూపింప మనకు ||బాల|| / మన జోల పాటలు ఆలించు బాలుడు / దేవాది దేవుని తనయుడు గనుక (2) / వరముల నొసగి మనకు / దేవుని ప్రియులుగా జేయు ||బాల||
ఆకాశం అమృత జల్లులు కురిపించింది / ఈ లోకం ఆనందమయమై మురిసింది (2) / అంతు లేని ఈ అనంత జగతిలో / శాంతి కొరవడి మసలుచుండగా (2) / రక్షణకై నిరీక్షణతో (2) / వీక్షించే ఈ అవనిలో (2) / శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ ||ఆకాశం|| / పొంతన లేని వింత జగతిలో / పాపాంధకారం ప్రబలి యుండగా (2) / సమ్మతిని మమతలను (2) / పెంచుటకై ఈ పృథివిపై (2) / ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ ||ఆకాశం||
కొండలలో కోనలలో / బేతలేము గ్రామములో / కనిపించె ప్రభు దూత / వినిపించేను శుభ వార్త / చెలరేగెనే ఆనందము / రక్షకుని రాకతో (2) ||కొండలలో|| / కొరికేసే చలి గాలిలో / వణికించే నడి రేయిలో (2) / కాపరుల భయము తీర / పామరుల ముదము మీర (2) / దూతా గానము / శ్రావ్యా రాగము (2) / పరమ గీతము ||కొండలలో|| / దావీదు పురమందున / పశువుల శాలయందున (2) / మన కొరకే రక్షకుండు / ఉదయించే పాలకుండు (2) / రండి వేగమే / రండి శీఘ్రమే (2) / తరలి వేగమే ||కొండలలో||
యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో / మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2) / ఇది పండుగ – క్రిస్మస్ పండుగ / జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2) ||యేసు క్రీస్తు|| / పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2) / కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2) ||ఇది పండుగ|| / సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2) / నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2) ||ఇది పండుగ|| / శరీర ధారిగా – కృపగల దేవునిగా (2) / పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2) ||ఇది పండుగ||
జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్ / వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్ / రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్ / మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2) / ఈ రాత్రిలో కడు దీనుడై / యేసు పుట్టెను బెత్లెహేములో (2) / తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై / నీ కోసం నా కోసం పవళించే పాకలో (2) ||జగతికి|| / ఇమ్మానుయేలుగా అరుదించెను / దైవ మానవుడు యేసు దేవుడు (2) / నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు / ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2) ||జగతికి||