క్రిస్మస్ | Christmas Telugu Songs

115 christmas songs available. Lyrics in Roman and Telugu script.

చిన్ని చిన్ని చేతులతో|Chinni Chinni Chethulatho

చిన్ని చిన్ని చేతులతో / బుల్లి బుల్లి బుగ్గలతో / బెత్లెహేము పురము నుండి / కన్య మరియకి పుట్టెనండి / యేసు క్రీస్తు నామమండి / రక్షకుడని అర్ధమండి / పరలోకమున దూతలందరు / సర్వ సైన్యములతో కూడను / పాటలతో పరవశిస్తూ / మహిమ కరుడంటూ పొగుడుతూ / భువికేగె నేకముగా బూరధ్వనితో / రక్షకుని సువార్త చాటింపగా / ఆకసమున తారలన్ని / నేముందు నేముందని త్వర త్వరపడగా / తూర్పు నందొక చిన్ని తార / పరు పరుగున గెంతుకొచ్చి / భువికి సూచన ఇవ్వనండి / బెత్లెముకి మార్గము చూపనండి / దూత వార్త గొన్న గొల్లలు / గెంతులేస్తూ చూడ వచ్చిరి / పసుల తొట్టిలో ప్రభుని చూచి / పట్టలేని సంతసముతో / స్తుతుల గానము చేసెరండి / సకల జనులకు చాటెరండి / తారన్ చూచి జ్ఞానులు కొందరు / రారాజును చూడ బయలు దేరి / బంగారమును బోళమును / సాంబ్రాణి కూడా పట్టుకొచ్చె / పూజించ వచ్చిరి ప్రభు యేసుని / రాజులకు రాజని ఎరిగి వారు / ఎంత సందడి ఎంత సందడి / దీవిలోన భువిలోన ఎంత సందడి / యేసు రాజు జన్మ దినము / ఎంత భాగ్యము ఎంతో శుభము / దేవ దేవుని అమర ప్రేమండి / దివ్య వాక్కు ఫలితమండి

ఉదయించె దివ్య రక్షకుడు|Udayinche Divya Rakshakudu

ఉదయించె దివ్య రక్షకుడు / ఘోరాంధకార లోకమున / మహిమ క్రీస్తు ఉదయించెను / రక్షణ వెలుగు నీయను – (2) ||ఉదయించె|| / ఘోరాంధకారమున దీపంబు లేక / పలు మారు పడుచుండగా (2) / దుఃఖ నిరాశ యాత్రికులంతా / దారి తప్పియుండగా (2) / మార్గదర్శియై నడిపించువారు (2) / ప్రభు పాద సన్నిధికి / దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు / ఉదయించె ఈ ధరలో – (3) ||ఉదయించె|| / చింత విచారముతో నిండియున్న / లోక రోదన విని (2) / పాపంబునుండి నశించిపోగా / ఆత్మ విమోచకుడు (2) / మానవాళికై మరణంబునొంది (2) / నిత్య జీవము నివ్వన్ / దివ్యరక్షకుడు ప్రకాశతార / ఉదయించె రక్షింపను – (3) ||ఉదయించె|| / పరలోక తండ్రి కరుణించి మనల / పంపేను క్రీస్తు ప్రభున్ (2) / లోకాంధులకు దృష్టినివ్వ / అరుదెంచె క్రీస్తు ప్రభువు (2) / చీకటి నుండి దైవ వెలుగునకు (2) / తెచ్చె క్రీస్తు ప్రభువు / సాతాను శృంగలములను తెంప / ఉదయించె రక్షకుడు – (3) ||ఉదయించె||

అందరు మెచ్చిన అందాల తార|Andaru Mechchina Andaala Thaara

అందరు మెచ్చిన అందాల తార / అవనికి తెచ్చెను వెలుగుల మేడ (2) / క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్ / హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ / క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు|| / సృష్టికర్తయే మరియ తనయుడై / పశుల పాకలో పరుండినాడు (2) / నీతి జీవితం నీవు కోరగా / నీకై రక్షణ తెచ్చినాడు (2) / నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్|| / ఇంటిని విడిచి తిరిగిన నాకై / ఎదురు చూపులే చూచినాడు (2) / తప్పును తెలిసి తిరిగి రాగా / క్షమియించి కృప చూపినాడు (2) / ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్|| / పాత దినములు క్రొత్తవి చేసి / నీలో జీవము నింపుతాడు (2) / కటిక చీకటే వేకువ కాగా / అంబరమందు సంబరమాయే (2) / హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||

దేవుడు దేహమును|Devudu Dehamunu

దేవుడు దేహమును పొందిన దినము / మనిషిగా మారి ఇల చేరిన క్షణము (2) / తార వెలిగెను – దూత పాడెను / పరలోకనికి మార్గము వెలిసెను (2) / స్తుతుల గానములు పాడి పరవశించెదము / యేసు నామమునే చాటి మహిమ పరిచెదము (2) ||దేవుడు|| / దూత పలికెను భయము వలదని / తెలిపే వార్తను యేసే క్రీస్తని (2) / చీకటి తొలగెను రారాజుకు భయపడి / లోకము వెలిగెను మరణము చెరవిడి (2) / క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదము / నిత్య జీవమునే చాటి ఘనత పొందెదము (2) ||దేవుడు|| / సృష్టి కారుడు అల్పుడాయెను / అది శాపము తీయ వచ్చెను (2) / పాపము ఎరుగని మనిషిగా బ్రతికెను / మానవ జాతికి మార్గమై నిలిచెను (2) / నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములు / పరము చేరుటకు మనకు కలుగు దీవెనలు (2) ||దేవుడు||

ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త|Aascharyakarudaa Aalochanakartha

ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త / బలవంతుడైన దేవుడా / నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి / మనకై జన్మించెను (2) / వి విష్ యు హ్యాపీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ (2) / హోసన్నా హల్లలూయా / క్రిస్మస్ బాలునికే (2) ||ఆశ్చర్యకరుడా|| / ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై / స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్ / అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై / ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్ / ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు / దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2) / దొంగలను మార్చి దయచూపినావు (2) / ధవళ వస్త్రములు ధరింప చేసి / ధన్యుని చేసావు ||వి విష్|| / నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు / నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు (2) / నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు (2) / నీతో నిరతం జీవించుటకు / నిత్య జీవమియ్య అరుదెంచినావు ||వి విష్||

విన్నారా విన్నారా|Vinnaaraa Vinnaaraa

విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త / మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను / వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను / తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2) / ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం / యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2) ||విన్నారా|| / దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని / గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2) / పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా / లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా ||ఊరు వాడా|| / ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని / జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2) / బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా / రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా ||ఊరు వాడా||