క్రిస్మస్ | Christmas Telugu Songs

115 christmas songs available. Lyrics in Roman and Telugu script.

వచ్చింది క్రిస్మస్ వచ్చింది|Vachchindi Christmas Vachchindi

వచ్చింది క్రిస్మస్ వచ్చింది / తెచ్చింది పండుగ తెచ్చింది / వచ్చింది క్రిస్మస్ వచ్చింది / తెచ్చింది రక్షణ తెచ్చింది / ఊరూ వాడా పల్లె పల్లెల్లోన / ఆనందమే ఎంతో సంతోషమే (2) / మన చీకటి బ్రతుకులలోన / ప్రభు యేసు జన్మించెను (2) / రారండోయ్ వేడుక చేద్దాం / కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది|| / దావీదు పట్టణములో / బేత్లెహేము గ్రామములో / కన్య మరియ గర్భమునందు / బాలునిగా జన్మించెను (2) / అంధకారమే తొలగిపోయెను / చీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి|| / ఆకాశంలో ఒక దూత / పలికింది శుభవార్త / మన కొరకు రక్షకుడేసు / దీనునిగా పుట్టాడని (2) / పాప శాపమే తొలగించుటకు / గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2) ||మన చీకటి||

ఆ నింగిలో వెలిగింది|Aa Ningilo Veligindi

ఆ నింగిలో వెలిగింది ఒక తార / మా గుండెలో ఆనందాల సితార / నిజ ప్రేమను చూసాము కళ్ళారా / ఈ లోకంలో నీ జన్మము ద్వారా / ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల / హృదయంలోని యేసు పుట్టిన వేళ / ఆనంద హేళ ఇయ్యాల సందడి చేయాల / మా హృదయాల్లోన యేసు పుట్టిన వేళ / యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ / యేషు మేరా ధ్యాన్ హాయ్ తూ / యేషు మేరా గాన్ హాయ్ తూ / యేషు మేరా ప్రాణ్ హాయ్ తూ / లోకంలో యాడ చూసిన శోకాలేనట / పరిశుద్ధ రాక కోసం ఎదురు చూపులట / అంతట ఒక తార వెలసెను తూర్పు దిక్కుట / అది చూసిన జ్ఞానులు వెళ్లిరి దాని వెంబట / విశ్వాన్ని సృష్టించిన దేవుడంట / పశువుల పాకలోన పుట్టాడంట / పాటలు పాడి ఆరాధించి / నిజ దేవుడు యేసుని అందరు చూడగ రారండోయ్ ||యేషు|| / చీకటిలో చిక్కుకున్న బీదవారట / చలి గాలిలో సాగుతున్న గొల్లవారట / అంతట ఒక దూత నిలిచెను వారి ముంగిట / వెలుగులతో నింపే గొప్ప వార్త చెప్పెనట / దావీదు పట్టణమందు దేవుడంట / మనకొరకై భువిలో తానే పుట్టాడంట / వేగమే వెళ్లి నాథుని చూసి / పరిశుద్ధుని పాదము చెంత మోకరిల్లండోయ్ ||యేషు||

జన్మించె జన్మించె యేసయ్యా|Janminche Janminche Yesayyaa

జన్మించె.. జన్మించె.. / యేసయ్యా పశువుల పాకలోనా.. ఓ.. ఓ .. / హల్లెలూయ.. హల్లెలూయ.. / హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ.. / రాత్రివేళ గొల్లలు గొర్రెలు కాయుచుండగా / దేవదూత వచ్చి శుభవార్తను తెల్పెను (2) / సంతోషించి ఆనందించి / యేసును చూచి పరవశించి (2) / లోకమంతా శుభవార్తను ప్రకటించిరి / హల్లెలూయ.. హల్లెలూయ.. / హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ.. / ఆకాశములో ఒక తార జ్ఞానుల కొరకు వెలసెను / యేసు పుట్టిన స్థలమునకు నడిపించెను (2) / బంగారు సాంబ్రాణి బోళం / బాల యేసునికి అర్పించి (2) / మనసార పూజించి కొనియాడిరి / హల్లెలూయ.. హల్లెలూయ.. / హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ.. / సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు / తన కిష్టులకు సమాధానము కల్గును గాక (2) / పశువుల పాకలో జన్మించిన యేసయ్యా / మన హృదయంలో జన్మించుటే క్రిస్మస్ పండుగా (2) / హల్లెలూయ.. హల్లెలూయ.. / హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..

సూడ సక్కని బాలుడమ్మో|Sooda Sakkani Baaludammo

సూడ సక్కని బాలుడమ్మో / బాలుడు కాడు మన దేవుడమ్మో (2) / కన్య మరియ గర్భమున / ఆ పరిశుద్ధ స్థలమున (2) / మనకై జన్మించినాడు / మనలను రక్షించినాడు (2) ||సూడ|| / బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను / లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను (2) / ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను / ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను (2) / సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి / పరవశించ సాగెను (2) ||సూడ|| / మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను / మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను (2) / పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు / మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు (2) / దివి నుండి భువిపైకి దిగి వచ్చి / మానవులను ప్రేమించెను (2) ||సూడ||

జన్మించె జన్మించె|Janminche Janminche

జన్మించె జన్మించె – రారాజు జన్మించె / చీకటి బ్రతుకులు తొలగించి లోకమునే వెలిగించే / అరుదెంచె అరుదెంచె – నరునిగా ఇల అరుదెంచె / పరలోకము వీడి భువికేతెంచి రక్షణ కలిగించే / ఊరూ వాడా సంబరమే – జీవపు మార్గము వెలిసెనని / నమ్మిన వారికి తప్పకనే – కలిగే ఒక వరమే (2) / హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ / విష్ యు ఎ హాప్పీ హాప్పీ క్రిస్మస్ / హాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ / విష్ యు ఎ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ / దూతకు భయపడి వణికిరి గొల్లలు / శుభవార్తను విని వేగిరమే పరుగిడిరి (2) / సంతోషముతో ఆనంద గానముతో / యేసే ప్రభువని నమ్మిరి పూజించిరి (2) ||ఊరూ వాడా|| / తారను కనుగొని వచ్చిరి జ్ఞానులు / యేసే రాజని అర్పించిరి కానుకలు (2) / ఆరాధించి హృదయములను అర్పించి / భువినేలే రారాజును కీర్తించిరి (2) ||ఊరూ వాడా|| / యేసే మార్గము యేసే సత్యము / యేసే జీవము ఇదియే నిత్యము (2) / మన పాపాలన్నీ క్షమియించేదేసయ్యే / విశ్వసించి నీ హృదయమునే అర్పించుము (2) ||ఊరూ వాడా||