115 christmas songs available. Lyrics in Roman and Telugu script.
నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు / గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2) / లోకమే సంతోషించగా / ప్రేమనే పంచే క్రీస్తుగా / బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా / పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను|| / దేవుని కోపము నుండి / తప్పించే ప్రియ పుత్రుడాయనే (2) / ముట్టుకో ముద్దు పెట్టుకో (2) ||బెత్లెహేమను|| / గుండెలో కొలువైయుండి / దీవించే ధనవంతుడాయనే (2) / ఎత్తుకో బాగా హత్తుకో (2) ||బెత్లెహేమను|| / తోడుగ వెంటే ఉండి / రక్షించే బలవంతుడాయనే (2) / చేరుకో నేడే కోరుకో (2) ||బెత్లెహేమను||
క్రిస్మస్ శుభదినం / మహోన్నతమైన దినము / ప్రకాశమైన దినము / నా యేసు జన్మ దినము (2) / క్రిస్మస్ శుభదినం / హ్యాప్పీ క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2) / విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ / వీ విష్ యు మెర్రి క్రిస్మస్ (2) / దావీదు వేరు చిగురు / వికసించె నేడు భూమిపై (2) / అద్వితీయ కుమారునిగా / లోక రక్షకుడు ఉదయించెను (2) ||హ్యాప్పీ|| / కన్నుల పండుగగా మారెను / నా యేసు జన్మదినం (2) / కన్య మరియకు జన్మించెను / కలతలు తీర్చే శ్రీ యేసుడు (2) ||హ్యాప్పీ|| / ఆనందముతో ఆహ్వానించండి / క్రీస్తుని మీ హృదయములోకి (2) / ఆ తారగా మీరుండి / నశించు వారిని రక్షించాలి (2) ||హ్యాప్పీ||
రాత్రి నేడు రక్షకుండు వెలిసె వింతగా / నేడెంతో మోదమొందగా – ఈ పాపి రక్షణార్ధమై (2) / లోక పాపమెల్ల తనదు శిరస్సు మోసెను / లోక నాథుడై మరియకవతరించెను (2) / ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి|| / బెత్లహేము గ్రామమెంత పుణ్య గ్రామము / యేసు రాజుకేసిపెట్టె పశుల కొట్టము (2) / ఈ నాడే మనకు పండగ / రారండి ఆడి పాడగ (3) ||రాత్రి|| / ఆకశాన తార ఒకటి బయలుదేరెను / తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను (2) / చిన్నారి యేసు బాబును / కళ్లారా చూసి మురిసెను (3) ||రాత్రి|| / పొలములోని గొల్లవారి కనుల ముందర / గాబ్రియేలు దూత తెలిపె వార్త ముందుగా (2) / మేరమ్మ జోల పాడగా / జగాలు పరవశించెగా (3) ||రాత్రి|| / లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను / భూదిగంతముల క్రీస్తు పేరు నిల్చెను (2) / ఇతండె దేవుడాయెను (6) ||రాత్రి||
నేడే ప్రియరాగం పలికే నవ గీతం / ప్రేమే మన కోసం వెలసే / లోకాన శాంతి మురిసింది / మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది ||నేడే|| / దివినేలు దేవుడు ఉదయించగానే / ఇలలోన ప్రకృతి పులకించెగా / పరలోక దూతలు స్తుతియించగానే / జగమంతా ఉప్పొంగి నర్తించెగా ||నేడే|| / మనిషైన సుతుడు జనియించగానే / విశ్వాన గోళాలు విభవించెగా / చిన్నారి యేసుని చిరునవ్వుతోనే / నవ కాంతి లోకాన ప్రభవించెగా ||నేడే|| / హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ / హ్యాప్పీ క్రిస్మస్ టు యు… / లోకాన శాంతి మురిసింది / మన మనస్సులో రాగాల కాంతి విరిసింది
బెత్లహేములోనంటా – సందడి / పశువుల పాకలో – సందడి / దూతలు వచ్చెనంటా – సందడి / పాటలు పాడేనంటా – సందడి (2) / రారాజు పుట్టెనని – సందడి / మా రాజు పుట్టెనని – సందడి (2) / చేసారంట సందడే సందడి / చేయబోదాము సందడే సందడి (2) / హ్యాప్పీ హ్యాప్పీ.. / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ / అర్ధ రాత్రి వేళలో – సందడి / దూతలు వచ్చెనంటా – సందడి / రక్షకుడు పుట్టెనని – సందడి / వార్తను తెలిపేనటా – సందడి (2) / చేసారంట సందడే సందడి / చెయ్యబోదాము సందడే సందడి / చేసారంట సందడే సందడి / చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే / హ్యాప్పీ హ్యాప్పీ.. / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ / గొల్లలు వచ్చిరంటా – సందడి / మనసారా మ్రొక్కిరంటా – సందడి / అందాల బాలుడంటా – సందడి / అందరి దేవుడని – సందడి (2) / రారాజు పుట్టెనని – సందడి / మా రాజు పుట్టెనని – సందడి (2) / చేసారంట సందడే సందడి / చేయబోదాము సందడే సందడి (2) / హ్యాప్పీ హ్యాప్పీ.. / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ / తారను చూచుకుంటూ – సందడి / జ్ఞానులు వచ్చారంటా – సందడి / పెట్టెలు తెచ్చారంటా – సందడి / కానుకలిచ్చారంటా – సందడి (2) / రారాజు పుట్టెనని – సందడి / మా రాజు పుట్టెనని – సందడి (2) / చేసారంట సందడే సందడి / చేయబోదాము సందడే సందడి (2) / హ్యాప్పీ హ్యాప్పీ.. / హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్ / మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్ / విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ (2)
ఆకాశంబున్ దూతలు / ఉత్సాహించి పాడిరి / పుట్టె రక్షకుండని / సంతసించి ఆడిరి / సర్వోన్నతమైన స్థలములలో / ప్రభుకే మహిమలు కలుగును గాక / భూమి పై సమాధానం (2) / బెత్లెహేము నందున / క్రీస్తు రాజున్ చుడుడి / దేవుని కుమారుని / మోకరించి మ్రొక్కుడి ||సర్వోన్నతమైన||
రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2) / రక్షకుని చూడను రక్షణాలు పొందను (2) ||రండి|| / యూదుల యూదట రాజుల రాజట (2) / రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) / యూదుల యూదట రాజుల రాజట (2) / రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) ||రండి|| / బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) / పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) / బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) / పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) ||రండి|| / సాతాను సంతలో సంతోషమేదిరా (2) / సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2) / సాతాను సంతలో సంతోషమేదిరా (2) / సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2) ||రండి||
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది / దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2) / రాజులకు రాజు పుట్టాడని / యూదుల రాజు ఉదయించాడని (2) ||తార|| / మందను విడచి మమ్మును మరచి / మేమంతా కలిసి వెళ్ళాములే / ఆ ఊరిలో ఆ పాకలో / స్తుతి గానాలు పాడాములే (2) / సంతోషమే ఇక సంబరమే / లోక రక్షణ ఆనందమే / స్తోత్రార్పణే మా రారాజుకే / ఇది క్రిస్మస్ ఆర్భాటమే ||తార|| / బంగారమును సాంబ్రాణియు / బోళంబును తెచ్చాములే / ఆ యింటిలో మా కంటితో / నిను కనులారా గాంచాములే (2) / మా ఇమ్మానుయేలువు నీవేనని / నిను మనసారా కొలిచాములే / మా యూదుల రాజువు నీవేనని / నిను ఘనపరచి పొగిడాములే ||తార||
యేసే జన్మించెరా / తమ్ముడా దేవుడవతారించేరా (2) / ఓరె తమ్ముడా ఒరేయ్ ఒరేయ్ తమ్ముడా (4) ||యేసే|| / పెద్ద పెద్ద రాజులంతా నిద్దురలు పోవంగ (2) / అర్దరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్యా (2) ||యేసే|| / బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు (2) / నాథుడు జన్మించెనయ్యా మేలుగ మనందరికి (2) ||యేసే||
రారే రారే ఓ జనులారా వేగమే రారండోయ్ / సక్కనైన బాల యేసుని చూతము రారండోయ్ (2) / పాపాలు బాపునంట – రోగాలు తీర్చునంట / లోకాన పండగంట (2) ||రారే|| / మనుషుల పాపము బాప మహిమనే వీడాడంట / మనిషిగా పుట్టేటందుకు ధరణికి వచ్చాడోయ్ (2) / మహిమ రాజ్యము నాడు మనకీయ పుట్టెనులే / మహిమా స్వరూపుడు మరణానికి తల ఒగ్గాడోయ్ (2) ||రారే|| / రాజుల రాజుగ యేసు రాజ్యమే మనకీయగను / పాపపు దాస్యము నుండి విడుదల నిచ్చుటకు (2) / పాప భారము మోసి మరణ కోరలు విరచి / శాశ్వత జీవమునివ్వగ మరణము గెలిచాడోయ్ (2) ||రారే||
మన యేసు బెత్లహేములో / చిన్న పశుల పాకలో పుట్టె (2) / పాకలో పుట్టె పాకలో పుట్టె (2) ||మన యేసు|| / గొల్లలంతా దూత ద్వారా / యేసుని యొద్దకు వచ్చియుండిరి (2) / వచ్చియుండిరి నమస్కరించిరి (2) ||మన యేసు|| / జ్ఞానులంతా చుక్క ద్వారా / యేసుని యొద్దకు వచ్చియుండిరి (2) / వచ్చియుండిరి కానుకలిచ్చిరి (2) ||మన యేసు||
శుద్ధ రాత్రి! సద్ధణంగా / నందరు నిద్రపోవ / శుద్ధ దంపతుల్ మేల్కొనగా / బరిశుద్దుడౌ బాలకుడా! / దివ్య నిద్ర పొమ్మా / దివ్య నిద్ర పొమ్మా / శుద్ధ రాత్రి! సద్ధణంగా / దూతల హల్లెలూయ / గొల్లవాండ్రకు దెలిపెను / ఎందు కిట్టులు పాడెదరు? / క్రీస్తు జన్మించెను / క్రీస్తు జన్మించెను / శుద్ధ రాత్రి! సద్ధణంగా / దేవుని కొమరుడ / నీ ముఖంబున బ్రేమలొల్కు / నేడు రక్షణ మాకు వచ్చె / నీవు పుట్టుటచే / నీవు పుట్టుటచే