126 songs found
సమీపించరాని తేజస్సులో నీవు / వసియించు వాడవైనా / మా సమీపమునకు దిగి వచ్చినావు / నీ ప్రేమ వర్ణింప తరమా (2) / యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది / యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని|| / ధరయందు నేనుండ చెరయందు పడియుండ / కరమందు దాచితివే / నన్నే పరమున చేర్చితివే (2) / ఖలునకు కరుణను నొసగితివి (2) ||యేసయ్యా|| / మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి / నా స్థితి మార్చినది / నన్నే శ్రుతిగా చేసినది (2) / తులువకు విలువను ఇచ్చినది (2) ||యేసయ్యా||
సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ.. / వసీయించువాడ నా దైవమా (2) / రాజులకు రారాజా / సమస్తమునకు జీవధారకుడా (2) / పరిశుద్ధుడా ఆ.. ఆ.. ఆ.. పరిశుద్ధుడా ||సమీపింపరాని|| / పాపులలో… ప్రధానుడనైన నను రక్షించుటకు / క్రీస్తేసువై లోకమునకు అరుదెంచినావు (2) / దూషకుడను హానికరుడైన నన్ను (2) / కరుణించి మార్చివేసితివి (2) ||సమీపింపరాని|| / నా దేవా… నా యవ్వనమును బట్టి / తృణీకరింప బడకుండ నన్ను కాపాడుము (2) / నా పవిత్రత ప్రేమ ప్రవర్తనములో (2) / నీ స్వరూపములోకి నను మార్చుము (2) ||సమీపింపరాని||
సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు (2) / సర్వము నెరిగిన సర్వేశ్వరునికి / సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2) ||సరి|| / నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే (2) / నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2) / నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2) ||సరి|| / ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2) / ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే (2) / నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2) ||సరి|| / పునరుత్థానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే (2) / శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే (2) / నాకై అతి త్వరలో మహిమతో రానైయున్నవాడే (2) ||సరి||
సరిచేయుమో దేవా / నన్ను బలపరచుమో ప్రభువా (2) / నీ ఆత్మతో నను అభిషేకించి / సరి చేయుమో దేవా (2) ||సరి|| / దూరమైతి నీ సన్నిధి విడచి / పారిపోతి నీ గాయము రేపి / లోకమునే స్నేహించితి నేను / పాపము మదిలో నింపుకున్న / అది తప్పని తెలిసి తిరిగి వచ్చి / నీ సన్నిధిలో నే మోకరించి / బ్రతిమాలుచున్నాను / నన్ను సరి చేయుమో దేవా (2) ||సరి|| / నింపుము నీ వాక్యము మదిలో / పెంచుము నను నీ పాలనలో / శోధనను గెలిచే ప్రతి మార్గం / ఇవ్వుము నాకు ప్రతి క్షణము / నీ సన్నిధిలో ఒక దినమైనను / వేయి దినములకంటే బహుశ్రేష్టము.. అని / తెలుసుకున్నాను / నన్ను సరి చేయుమో దేవా (2) ||సరి||
నిరతము నిను స్తుతియించినా / దేవా – సరిపోదు ఆరాధన / ప్రతి క్షణము కీర్తించినా / ప్రభువా – నీ కృపలకు సరితూగునా (2) / ఆరాధన స్తుతి ఆరాధన / ఆరాధన నికే ఆరాధన (2) ||నిరతము|| / ప్రభువా యెహోవా రాఫా నీవే / నా స్వస్థతలు అన్ని నీవే నీవే / దేవా యెహోవా నిస్సి నీవే / నా విజయాల అధిపతి నీవే నీవే (2) ||ఆరాధన|| / ప్రేమించే శ్రీమంతుడవు నీవే దేవా / కోపానికి కాలయాపన నీదే ప్రభువా / నాకున్న ఈ విశ్వాసం నీదే కాదా / నీ తోడు ఉంటే నా దరి రాదు ఏ భాధ (2) ||ఆరాధన|| / నా గతము రద్దు చేసిన నాదు దేవా / నా రేపును నడిపించేది నీవే ప్రభువా / నీ స్తుతికి ఆలస్యం చేయను నా ప్రభువా / నా స్థితిని ఎన్నటికి మరువను నా దేవా (2) ||ఆరాధన||
సర్వ చిత్తంబు నీదేనయ్యా / స్వరూపమిచ్చు కుమ్మరివే (2) / సారెపైనున్న మంటినయ్యా / సరియైన పాత్రన్ చేయుమయ్యా / సర్వేశ్వరా నే రిక్తుండను / సర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు|| / ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే / ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2) / పరికింపు నన్నీ దివసంబున / పరిశుభ్రమైన హిమము కన్నా / పరిశుద్ధున్ జేసి పాలింపుమా / పాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు|| / నీ చిత్తమే సిద్ధించు ప్రభూ / నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2) / నీఛమౌ గాయముల చేతను / నిత్యంబు కృంగి అలసియుండ / నిజమైన సర్వ శక్తుండవే / నీ చేత పట్టి నన్ రక్షింపుమా ||సర్వ చిత్తంబు|| / ఆత్మ స్వరూప నీ చిత్తమే / అనిశంబు చెల్లు ఇహ పరమున (2) / అధికంబుగా నన్ నీ ఆత్మతో / ఆవరింపుమో నా రక్షకా / అందరు నాలో క్రీస్తుని జూడ / ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ చిత్తంబు||
సర్వ యుగములలో సజీవుడవు / సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును / కొనియాడదగినది నీ దివ్య తేజం / నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2) / ప్రేమతో ప్రాణమును అర్పించినావు / శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2) / శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు / జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో|| / స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు / శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2) / నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను / మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో|| / కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు / బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2) / నెమ్మది కలిగించే నీ బాహుబలముతో / శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో||
సర్వ లోకమా స్తుతి గీతం పాడెదం / ప్రభుని నామమును ప్రబల పరచెదం (2) / ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు / స్తుతి మహిమలు సదా అర్పించెదం / అతి సుందరుడు మహిమైశ్వరుడు / ఆయన నామమును కీర్తించెదం ఎల్లప్పుడు ||సర్వ|| / అన్ని కాలములలో ఉన్నాడు ఉంటాడు / అన్ని స్థితి గతులలో నడిపిస్తాడు (2) / సంతోషించుమా ఆనందించుమా / ఆయన చేసినవి మరువకుమా / సన్నుతించుమా మహిమ పరచుమా / ఆయన నామమును ఘనపరచు ఎల్లప్పుడు ||సర్వ|| / శోధన వేదన ఏది ఎదురైనా / మొరపెడితే చాలునే విడిపిస్తాడే (2) / రక్షకుడేసు రక్షిస్తాడు / ఆయన నామములో జయం మనదే / ఇమ్మానుయేలు మనలో ఉండగా / జీవితమంతా ధన్యమే ధన్యమే ||సర్వ||
సర్వ శరీరుల దేవుడా / నీకసాధ్యమే లేదయ్యా (2) / చాచిన నీ బాహువుతో / భూమి ఆకాశాలు చేసితివే / నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే / లేనే లేదయ్యా హో యేసయ్యా / నీకసాధ్యమైనదేది లేదయ్యా / లేనే లేదయ్యా మా యేసయ్యా / నీకసాధ్యమైనదేది లేదయ్యా (2) ||సర్వ శరీరుల|| / ఆదాము హవ్వలను చేసినట్టి దేవా / సృష్టికర్త నీకే స్తోత్రము / హేబెలు అర్పణను అంగీకరించిన / గొర్రెపిల్ల దేవా స్తోత్రము / హానోకును నీతో కూడా నడిపినావు / నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు / సర్వశక్తుడా – నీతిమంతుడా / మార్పు లేని మా దేవుడా ||లేనే లేదయ్యా|| / అబ్రహాముతో నిబంధనను చేసినావు / అబ్రహాము దేవా స్తోత్రము / ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు / ఇస్సాకు దేవా స్తోత్రము / యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు / యోసేపును పెద్ద రాజుగా చేసినావు / శ్రీమంతుడా – యాకోబు దేవుడా / చూచుచున్న మా దేవుడా ||లేనే లేదయ్యా|| / మోషేతో పొద నుండి మాటలాడినావుగా / ఉన్నవాడా నీకే స్తోత్రము / ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు / భీకరుండా నీకే స్తోత్రము / యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు / కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు / మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా / చీల్చబడిన బండ దైవమా ||లేనే లేదయ్యా|| / గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా / విజయశీలుడా స్తోత్రము / సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా / యూదా సింహమా స్తోత్రము / బోయజుతో రూతును విమోచించినావు / సమూయేలును మందసం నుండి పిలిచినావు / పరిశుద్ధుడా – విమోచకుడా / ఎబినేజరు స్తోత్రము ||లేనే లేదయ్యా|| / దావీదు నా హృదయానుసారుడంటివే / రాజాధి రాజా స్తోత్రము / సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు / అనంత జ్ఞాని స్తోత్రము / ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు / ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు / ఆత్మ రూపుడా – రోషవంతుడా / జీవము గల దేవుడా ||లేనే లేదయ్యా|| / నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు / యెరూషలేము దేవా స్తోత్రము / జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు / మందసపు దేవా స్తోత్రము / ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు / దానియేలును సింహాల నుండి బ్రోచినావు / షద్రక్ మేషాకూ – అబేద్నెగోల దేవుడా / నిత్య రాజ్య స్థాపకుడా ||లేనే లేదయ్యా|| / యెహోషాపాతుకై పోరు సలిపినావు / యుద్ధ శూరుడా స్తోత్రము / యబ్బేజు సరిహద్దులిస్తరించినావుగా / యజమానుడా స్తోత్రము / హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు / యెషయాకు దర్శనమును చూపినావు / మహిమ రూపుడా – నిత్య జీవుడా / సింహాసనాసీనుడా ||లేనే లేదయ్యా|| / యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా / నమ్మదగిన దేవా స్తోత్రము / యోనాను చేప కడుపు నుండి లేపినావుగా / దీర్ఘశాంతుడా స్తోత్రము / యెహేజ్కెలుపై నీ ఆత్మ హస్తముంచినావు / యోహానును త్రోవ సరళ పరచ పంపినావు / ప్రవచనాత్ముడా – మనుష్య కుమారుడా / ప్రవక్తలందరికి దేవుడా ||లేనే లేదయ్యా|| / కృపా సత్యములు మాకై తెచ్చినావుగా / యేసు దేవా నీకే స్తోత్రము / తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా / దేవ తనయుడా స్తోత్రము / రక్తధారతో మా పాపమంతా కడిగినావు / మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు / పునరుత్థానుడా – అభిషిక్తుడా / పాపుల రక్షకుడా ||లేనే లేదయ్యా|| / పేతురును బండలా స్థిరము చేసినావుగా / పరిశుద్ధాత్ముడా స్తోత్రము / సౌలును అపొస్తలునిగా మార్చినావుగా / ఆశ్చర్యకరుడా స్తోత్రము / యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు / సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు / పెండ్లి కుమారుడా – ప్రేమ రూపుడా / రానున్న మా దేవుడా ||లేనే లేదయ్యా||
సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా / నీదు మహిమనే ప్రస్తుతించగా / స్వరమెత్తి నీ మహిమ కార్యములను / ప్రతి స్థలమునందు ప్రకటించెదా / నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం / నిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవు / విడువవు ఎడబాయవు నా యేసయ్యా ||సర్వ|| / ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే / ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే / నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా / నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి ||నీవే|| / నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ / నీ రక్తమునిచ్చ్చి జాలి హృదయమా / నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా / నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి ||నీవే||
సర్వకృపానిధియగు ప్రభువా / సకల చరాచర సంతోషమా (2) / స్తోత్రము చేసి స్తుతించెదను / సంతసముగ నిను పొగడెదను (2) / హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను / నేను… ఆనందముతో సాగెదను / ప్రేమించి నన్ను వెదకితివి / ప్రీతితో నను రక్షించితివి (2) / పరిశుద్ధముగా జీవించుటకై / పాపిని నను కరుణించితివి (2) ||హల్లెలూయా|| / అల్పకాల శ్రమలనుభవింప / అనుదినము కృపనిచ్చితివి (2) / నాథుని అడుగుజాడలలో / నడుచుటకు నను పిలిచితివి (2) ||హల్లెలూయా|| / మరణ శరీరము మర్పునొంది / మహిమ శరీరము పొందుటకై (2) / మహిమాత్మతో నను నింపితివి / మరణ భయములను తీర్చితివి (2) ||హల్లెలూయా|| / భువినుండి శ్రేష్ట ఫలముగను / దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2) / భూజనములలోనుండి నన్ను / ప్రేమించి క్రయ ధనమిచ్చితివి (2) ||హల్లెలూయా|| / ఎవరూ పాడని గీతములు / యేసుతో నేను పాడుటకై (2) / హేతువు లేకయే ప్రేమించెన్ / యేసుకు నేనేమివ్వగలన్ (2) ||హల్లెలూయా||
సర్వశక్తుని స్తోత్రగానము / సల్పరే జగమెల్లను / నిర్వహించును దాస భారము / నిత్యమెద రాజిల్లను (2) ||సర్వ|| / ముదముతో నిర్మానకుండగు / మూల కర్తను బాడరే / వదన మీక్ష్మాన్వoచి దేవుని / వందనముతో వేడరే (2) ||సర్వ|| / వేదపారాయణము సేయుచు / విశ్వమంత జయింపరే / సాదరముగా దేవు నిక మీ / స్వాoతమున బూజింపరే (2) ||సర్వ|| / ఎదను విశ్రాంతిన్ పరేశుని / హెచ్చుఁగా నుతి జేయరే / సదమలంబగు భక్తితో మీ / సర్వ మాయన కీయరే (2) ||సర్వ|| / చావు పుట్టుక లేనివాడుగ / సంతతము జీవించును / ఈవులిచ్చుచు దన్ను వేడు మ- / హేష్టులను రక్షించును (2) ||సర్వ|| / దాసులై దేవునికి నెదలో / దర్పమును బోగాల్పరే / యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము / నే మరక మైదాల్పరే (2) ||సర్వ||