126 songs found
సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం / నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం / ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము / జిహ్వా ఫలము అర్పింతుము (2) / మేమున్నాం నీ చిత్తములో / మేమున్నాం నీ సేవలో (2) ||సజీవ|| / తల్లి గర్భమునందు – మమ్మును రూపించి / శాశ్వత ప్రేమతో మేము నింపి – భువిని సమకూర్చినావు (2) / ఎగిసిపడే అలలెన్నో – అణచివేసి జయమిచ్చినావు / భీకరమైన తుఫానులోన – నెమ్మదినిచ్చి బ్రతికించావు / కృంగిపోము మేమెన్నడు / ఓటమి రాదు మాకెన్నడు (2) ||సజీవ|| / ఉన్నత పిలుపుకు మము పిలిచిన – నీ దివ్య సంకల్పం / నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా – మహిమ పూర్ణుడా (2) / జడివానలైనా సుడిగాలులైనా – కాడిని మోస్తూ సాగెదం / నిందలయినా బాధలైనా – ఆనందముతో పాడెదం / కలత చెందము మేమెన్నడు / అలసట రాదు మాకెన్నడు (2) ||సజీవ||
సజీవుడవైన యేసయ్యా / నిన్నాశ్రయించిన నీ వారికి / సహాయుడవై తృప్తి పరచితివే / సముద్రమంత సమృద్ధితో (2) / ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది / ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2) / ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము / దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2) / శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి / శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన|| / క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే / క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2) / నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే / నిత్యమైన నీ సత్య వాక్యముతో (2) ||సజీవుడవైన|| / నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే / నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే (2) / పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే / పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2) ||సజీవుడవైన||
(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురి / నిలుపుచున్నాను (2) / అక్షయ కిరీటం పొందాలని / అనుక్షణం నే స్తుతియింతును (2) / ఆరాధనా ఆరాధనా / యేసయ్యా నీకే నా ఆరాధనా (2) / చుక్కాని లేని నావనై / సంద్రాన నే చిక్కుబడగా (2) / నా దరి చేరి – ఈ ధరలోన / నీ దరి నడిపించావే (2) / అన్య జనులు ఏకమై / నిందలు నాపైన మోపినా (2) / నిందలు బాపి – నన్నాదుకొని / విడువని కృప చూపినావే (2) / నాశనకరమైన ఊభిలో / నేను పది కృంగగా (2) / హస్తము చాచి – నను ఆదుకొని / (నీ) ఆత్మతో బలపరచినావే (2)
సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం / నీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2) / శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు / ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను ||సన్నుతింతు|| / సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు / కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2) / నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు / మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును ||సన్నుతింతును|| / మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును / శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును (2) / అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును / యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము ||సన్నుతింతును||
సన్నుతింతుమో ప్రభో / సదమలమగు భక్తితో (2) / కన్న తండ్రి కావుమా (2) / కలుషము నెడబాపుమా ||సన్నుతింతుమో|| / నీతి సూర్య తేజమా / జ్యోతి రత్న రాజమా (2) / పాతక జన రక్షకా (2) / పతిత పావన నామకా ||సన్నుతింతుమో|| / మానవ సంరక్షకా / దీన నిచయ పోషకా (2) / దేవా మానవ నందనా (2) / దివ్య సుగుణ మందనా ||సన్నుతింతుమో|| / ప్రేమ తత్వ బోధకా / క్షేమ దాత వీవెగా (2) / కామిత ఫలదాయక (2) / స్వామి యేసు నాయక ||సన్నుతింతుమో|| / పాప చింతలన్నిటిన్ / పారదోలుమో ప్రభో (2) / నీ పవిత్ర నామమున్ (2) / నిరతము స్మరియించెదన్ ||సన్నుతింతుమో||
సమయమిదే సమయమిదే / సంఘమా సమయమిదే / సీయోనులో చేరుటకు / సంఘమా సమయమిదే ||సమయమిదే|| / చూడుము భూమి మీద / పాప చీకటి క్రమ్మియున్నది / జ్యోతివలె జీవించుము / జీవ వాక్యం పట్టుకొని ||సమయమిదే|| / సీయోనులో వశించు / సర్వశక్తుడు నీ ద్వారా / శోధింప ఈ దినము / మార్పునొందుము స్ఫటికముగా ||సమయమిదే|| / పిలుపుకు తగినట్లుగా / నీవు నడువుము ప్రభు యేసుతో / ప్రేమలోనే నిలువుము / నిత్యజీవము చేపట్టుము ||సమయమిదే|| / సీయోను రారాజు / నిన్ను చూచి ఏతెంచెదరు / మహిమగల కిరీటము / నీకు ఆయన ఇచ్చెదరు ||సమయమిదే||
సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2) / సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2) / రారాజు రానైయున్నాడు / వేగమే తీసుకెళ్తాడు (2) ||సమయము|| / కాలం బహు కొంచమేగా / నీకై ప్రభు వేచెనుగా / జాగు చేసెనేమో నీ కోసమే (2) / సిద్ధమేనా ఇకనైనా / సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము|| / యేసు వచ్చు వేళకై / వేచి నీవు ప్రార్ధించి / పరిశుద్ధముగా నిలిచెదవా (2) / సిద్ధమేనా ఇకనైనా / సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము||
సమర్ధవంతుడవైన నా యేసయ్యా / సమస్తము నీకు సాధ్యమేనయ్యా (2) / నా స్తుతి యాగము నీకే / నా ప్రాణార్పణ నీకే / నా సర్వస్వము నీకే / నా జీవన గానము నీకే ||సమర్ధ|| / పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా / ఉంచువాడవు నీవే యేసయ్యా / ఆత్మ జలములను నవ్యముగా / ఇచ్చువాడవు నీవే యేసయ్యా (2) / నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా (2) / దూతల చేతులలో / నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా (2) నీ ||సమర్ధ|| / శత్రువు చరలోనుండి నను భద్రముగా / నిల్పువాడవు నీవే యేసయ్యా / రక్షణ వస్త్రమును నిత్యము నాపై / కప్పువాడవు నీవే యేసయ్యా (2) / జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా (2) / రక్తపు బిందువుతో / నన్ను కడుగువాడవు నీవే యేసయ్యా (2) నీ ||సమర్ధ||
సమర్పణ చేయుము ప్రభువునకు / నీ దేహము ధనము సమయమును (2) / అబ్రామును అడిగెను ప్రభువప్పుడు / ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2) / నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2) / నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| / ప్రభుని ప్రేమించిన పేదరాలు / కాసులు రెండిచ్చెను కానుకగా (2) / జీవనమంతయు దేవునికిచ్చెను (2) / నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ|| / నీ దేహము దేవుని ఆలయము / నీ దేవుడు మలిచిన మందిరము (2) / సజీవ యాగముగా నిచ్చెదవా (2) / నీవిచ్చెదవా నీవిచ్చెదవా ||సమర్పణ||
సమస్త జనులారా మీరు / యెహోవాకు స్తుతిగానము పాడి / సంతోషముతో సన్నిధిలో / ఉత్సాహించుడి జయమనుచు (2) ||సమస్త|| / తానెయొనర్చె మహకార్యములన్ / పాపిని రక్షింప బలియాయెన్ (2) / శత్రుని రాజ్యము కూలద్రోసెను / స్మరియించుడి మీరందరును (2) / ఆయనను స్తుతియించుడి ||సమస్త|| / జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు / విడిపించె నైగుప్తునుండి (2) / నలువది వత్సరములు నడిపించె / కానానుకు మిమ్ము చేర్చుటకు (2) / ఆయనను స్తుతియించుడి ||సమస్త|| / మోషేకు తన సేవను నొసగె / యెహోషువా జయమును పొందె (2) / శత్రుని గెల్చి రాజ్యము పొందె / ఘనకార్యములను స్మరియించి (2) / ఆయనను స్తుతియించుడి ||సమస్త|| / మీరే ప్రభుని స్వంత ప్రజలుగా / కొనె మిమ్ము తన రక్తముతో (2) / ఆత్మల చేర్చి సంఘము కట్టె / ఆ రీతిని కని స్మరియించు (2) / ఆయనను స్తుతియించుడి ||సమస్త|| / పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము / నేడే వినుమాయన స్వరము (2) / అర్పించుడి మీ జీవితములను / సాగిలపడి ఆయన యెదుట (2) / ఆయనను స్తుతియించుడి ||సమస్త||
సమాధాన గృ-హంబులోను / సమాధాన-కర్త స్తోత్రములు (2) / క్రీస్తు యేసు మనకిలలో / నిత్య సమాధానము (2) / మద్యపు గోడను కూల ద్రోసెను (2) / నిత్య శాంతిని మనకొసగెన్ (2) ||సమాధాన|| / పర్వతములు తొలగినను / తత్థరిల్లిన కొండలు (2) / నాదు కృప నిను విడువదనెను (2) / నా సమాధానము ప్రభువే (2) ||సమాధాన|| / లోకమిచ్చునట్లుగా / కాదు ప్రభు సమాధానము (2) / సత్యమైనది నిత్యము నిల్చును (2) / నిత్యుడేసుచే కల్గెన్ (2) ||సమాధాన||
సమానులెవరు ప్రభో / నీ సమానులెవరు ప్రభో (2) / సమానులెవరు ప్రభో / సమస్త మానవ శ్రమాను భవమును (2) / సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో|| / సమాన తత్వము – సహోదరత్వము (2) / సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) ||సమానులెవరో|| / పరార్ధమై భవ – శరీర మొసగిన (2) / పరోపకారా నరావ తారా (నీ) (2) ||సమానులెవరో|| / దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2) / నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2) ||సమానులెవరో|| / ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2) / పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత (నీ) (2) ||సమానులెవరో||