49 songs found
విడువదు మరువదు – విడువదు మరువదు / విడువదు మరువదు – ఎన్నడూ ఎడబాయదు / ఎనలేని ప్రేమ – విలువైన ప్రేమ / మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువదు|| / నా స్థితి ఏదైనా – చింత ఏదైనా / బాధ ఏదైనా – నను విడువదు / లోకమే నను చుట్టినా – ఆశలే నను ముట్టినా / యేసయ్య సాన్నిధ్యం – నను విడువదు / మా నాన్న నా చేయి విడువడు / ప్రాణంలా ప్రేమించే నా దేవుడు (2) / విడువడు మరువడు – విడువడు మరువడు / విడువడు మరువడు – ఎన్నడూ ఎడబాయడు / నన్ను ఎత్తుకున్న – నన్ను హత్తుకున్న / నా తండ్రి కౌగిలి – నే విడువను / శోకమే కృంగించినా – దుఃఖమే బాధించినా / నా ప్రియుని చిరునవ్వు – నే మరువను / నన్నెంతో ప్రేమించిన రాజును / ఎడబాసి మనలేనే రోజును (2) / విడువను మరువను – విడువను మరువను / విడువను మరువను – ఎన్నడూ ఎడబాయను / ఎనలేని ప్రేమ విలువైన ప్రేమ / మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువను||
విడువను నిను ఎడబాయనని నా / కభయ మొసంగిన దేవా / నా కభయ మొసంగిన దేవా / నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2) / నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా ||విడువను|| / పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా (2) / నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా ||విడువను|| / మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా (2) / గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి ||విడువను|| / సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా (2) / నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను ||విడువను||
విడువవు నన్నిక ఎన్నడైననూ / పడిపోకుండా కాయు రక్షకా (2) / పడిపోవు వారెల్లరిని / లేపెడి వాడవు నీవే ప్రభు (2) ||విడువవు|| / ప్రభువా నీకవిధేయుడనై / పలు మారులు పడు సమయములలో (2) / ప్రేమతో జాలి దీన స్వరముతో / ప్రియుడా నను పైకెత్తితివి (2) ||విడువవు|| / ఆదాము హవ్వలు ఏదెనులో / ఆశతో ఆజ్ఞ మీరినను (2) / సిలువకు చాయగా బలినర్పించి / ప్రియముగా విమోచించితివి (2) ||విడువవు|| / మా శక్తియు మా భక్తియు కాదు / ఇలలో జీవించుట ప్రభువా (2) / కొల్లగా నీ ఆత్మను నొసగితివి / హల్లెలూయా పాడెదను (2) ||విడువవు||
విధేయత కలిగి జీవించుటకు / జీవమిచ్చాడు యేసు జీవమిచ్చాడు / ప్రతి ఉదయము యేసయ్యతో మాటలాడుటకు / ప్రార్ధన నేర్పాడు యేసు ప్రార్ధన నేర్పాడు / యేసయ్యతో ఉంటే సంతోషమే / యేసయ్యతో ఉంటే ఆనందమే / సాతానుతో ఉంటే కష్టాలు / సాతానుతో ఉంటే నష్టాలూ / అందుకని / ప్రతి రోజు మనం, దేవుణ్ణి ప్రార్ధించి / దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండి / మన సొంత ఇల్లైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యి / మన అమ్మ నాన్నలను కూడా పరలోక రాజ్యానికి తీసుకు వెళదామా / సరే ఇప్పుడు ఏం చేయాలంటే / ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి / యేసయ్యను ఆరాధించెదము / ఏం చెయ్యాలంటే / ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి / యేసయ్యను ఆరాధించెదము / బుడి బుడి బుడి అడుగులతో / చిట్టి చిట్టి చిట్టి చేతులెత్తి (2) / యేసయ్యను ఆరాధించెదము / యేసయ్యా ఈ రోజు నుండి / నీ వాక్యమనే మార్గములో నడిపించు యేసయ్యా
విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా / విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా / అవిధేయత తొలగించుమయ్యా / నీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే|| / పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి / ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి (2) / సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2) / అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత|| / పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి / ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2) / శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి (2) / రక్షణకు కారకుడవైతివి (2) ||అవిధేయత||
వినరండి నా ప్రియుని విశేషము… / వినరండి నా ప్రియుని విశేషము / నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2) / నా ప్రియుని నీడలో చేరితిని / ప్రేమకు రూపము చూసితిని (2) / ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే / తనువంతా పులకించి మహదానందమే ||వినరండి|| / మహిమతో నిండిన వీధులలో / బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2) / జతగా చేరెదను ఆ సన్నిధిలో / కురిసె చిరుజల్లై ప్రేమామృతము / నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే / జతగా చేరెదను ఆ సన్నిధిలో / నా ప్రేమను ప్రియునికి తెలిపెదను / కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి|| / జగతికి రూపము లేనప్పుడు / కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2) / స్తుతినే వస్త్రముగా ధరించుకొని / కృపన్ జయధ్వనితో కీర్తించెదను / నా ప్రభు యేసు చెంతన చేరెదను / స్తుతినే వస్త్రముగా ధరించుకొని / నా ప్రభు యేసు చెంతన చేరెదను / యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి|| / తలపుల ప్రతి మలుపు గెలుపులతో / నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2) / ఫలము ప్రతిఫలము నే పొందుకొని / ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను / ఆ శుభవేళ నాకెంతో ఆనందమే / ఫలము ప్రతిఫలము నే పొందుకొని / ఆ శుభవేళ నాకెంతో ఆనందమే / నా ప్రియుని విడువను నేనెన్నడు ||వినరండి||
వినరే యో నరులారా – వీనుల కింపు మీర / మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే / అనుదినమును దే-వుని తనయుని పద / వనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే|| / నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని / దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు / కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి / గి రయంబున ప్రభు – కరుణను గనరే ||వినరే|| / ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష / బూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను / దీన దయా పరు-డైన మహాత్ముడు / జానుగ యాగము – సలిపిన తెరంగిది ||వినరే|| / ఇల మాయావాదుల మాని – యితడే సద్గురు డని / తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి / నిల జనులకు గలు-ములనలరెడు ధని / కుల కందని సుఖ-ములు మరి యొసఁగును ||వినరే|| / దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి / నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె / బిరబిర మన మం-దర మా కరుణా / శరనిధి చరణ మె – శరణని పోదము ||వినరే||
వినవా మనవి యేసయ్యా / ప్రభువా శరణం నీవయ్యా / మలినము నా గతం – పగిలెను జీవితం / చేసుకో నీ వశం ||వినవా|| / లోక స్నేహమే కోరి దూరమైతిని / వీడిపోయి నీ దారి ఓడిపోతిని / విరిగిన మనసుతో నిన్ను చేరాను / చితికిన బ్రతుకులో బాగు కోరాను / నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా / నా తండ్రి నీవేనయ్యా ||వినవా|| / ఆశ ఏది కానరాక బేలనైతిని / బాధలింక పడలేక సోలిపోతిని / అలసిన కనులతో నిన్ను చూసాను / చెదరిన కలలతో కృంగిపోయాను / నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా / నా దైవము నీవయ్యా ||వినవా||
వినుమా యేసుని జననము / కనుమా కన్య గర్భమందున (2) / పరమ దేవుని లేఖనము (2) / నెరవేరే గైకొనుమా (2) / ఆనందం విరసిల్లె జనమంతా / సంతోషం కలిగెను మనకంతా / సౌభాగ్యం ప్రణవిల్లె ప్రభుచెంత / చిరజీవం దిగివచ్చె భువికంతా ||వినుమా|| / గొల్లలొచ్చె దూతద్వారా సాగిలపడి మ్రొక్కిరంట / చుక్కచూచి జ్ఞానులువచ్చిరి యేసును చూచి కానుకలిచ్చిరి / మనకోసం పుట్టెనంట పశువుల పాకలోన / ఎంత మస్తు దేవుడన్న రక్షణనే తెచ్చెనన్నా ||వినుమా|| / పాపులనంతా రక్షింపగా / పరమును విడిచె యేసు (2) / దీనులకంతా శుభవార్తేగా (2) / నడువంగ ప్రభువైపునకు (2) ||ఆనందం|| / అదిగో సర్వలోక రక్షకుడు / దివినుండి దిగివచ్చినాఁడురా (2) / చూడుము యేసుని దివ్యమోమును (2) / రుచియించు ప్రభుని ప్రేమను (2) ||ఆనందం||
విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త / మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను / వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను / తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2) / ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం / యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2) ||విన్నారా|| / దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని / గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2) / పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా / లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా ||ఊరు వాడా|| / ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని / జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2) / బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా / రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా ||ఊరు వాడా||
విరిసిన హృదయాలకు కలిసెను బంధం / కనుసైగలు చేయుచు ముచ్చటించెను (2) / తీయని భాసలే కమ్మని ఊసులే / బంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే ||విరిసిన|| / ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికి / అవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో (2) / ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని (2) / మరువకుమా ప్రియ మరువకుమా ||విరిసిన|| / మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం / ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం (2) / ఏక మనస్సుతోనే – చక్కనైన జీవితం (2) / మరువకుమా ప్రియ మరువకుమా ||విరిసిన||
విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే / అది ఎంతో విలువని నాకు చూపితివే / జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు / నీ జీవితాన్నే ధారబోసితివే (2) / నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా / ఎన్ని యుగాలైనా మారదు / ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును / నా దేవునికి సమస్తము సాధ్యమే (2) / పాపములో పడిన నన్ను / శాపములో మునిగిన నన్ను / నీ ప్రేమతో లేపితివే / రోగమే నన్ను చుట్టుకొనియుండగా / రోదనతో ఒంటరినైయుండగా / నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది|| / పగలంతా మేఘ స్తంభమై / రాత్రంతా అగ్ని స్తంభమై / దినమంతయు రెక్కలతో కప్పితివే / స్నేహితులే నన్ను వదిలేసినా / బంధువులే భారమని తలచినా / నా కొరకే బలి అయితివే (2) ||నీది|| / సాధ్యమే సాధ్యమే సాధ్యమే / నా యేసుకు సమస్తము / సాధ్యమే సాధ్యమే సాధ్యమే / నా ప్రియునికి సమస్తము (2) / ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును / నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||