49 songs found

వాగ్ధానము|Vaagdhaanamu

రాజుల రాజా ప్రభువుల ప్రభువా / నాతో ఉన్నవాడా / ఇచ్చిన మాట తప్పనివాడా / స్థిరపరచువాడా / భయపడను… నిలిచెదను… / నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము / నీ కార్యములు సంపూర్ణము – పరిపూర్ణము / నీ వాక్యములు జీవమునిచ్చును – నెమ్మదినిచ్చును / భయపడను… నిలిచెదను… / నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము / భయపడను… నిలిచెదను… / నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము / నిరంతరము… / ఓ ఓ ఓ ఓ… / ఓ ఓ ఓ ఓ… / ఓ ఓ ఓ… / నీ చిత్తమే జరుగును / నీ సన్నిధే జయమిచ్చును (2) / నీ చిత్తమే జరుగును.. ఆమేన్.. ఆమేన్.. / నీ సన్నిధే జయమిచ్చును.. ఆమేన్.. ఆమేన్.. (2) / అనుదినము నీ వాగ్ధానములో.. నే నడిచెదను (2) / భయపడను… నిలిచెదను… / నీ వాగ్ధానము దృఢపరచును – నిరంతరము / నిరంతరము…

వాడబారని విశ్వాసం|Vaadabaarani vishwaasam

వాడబారని విశ్వాసం – ఎప్పుడూ.. కోపగించని వాత్సల్యం / పాపమెంచని ఆంతర్యం – నీతో.. వీడదీయని సాంగత్యం / దయచేయుమా నాకు నా యేసయ్యా / సరిచేయుమా నన్ను నా యేసయ్యా / వాడుకో నా యేసయ్యా / అని వేడుకుంటున్నానయ్యా (2) / రాజా రాజా రాజుల రాజా / రాజా రారాజా నా యేసు రాజా (2) / ఏలియా ప్రవక్త / యోర్దాను నదీ సమీపమున / ఆహారమే లేకయుండగా / ఆ మహా కరువు కాలమున (2) / కాకోలముచే ఆహారమును పంపిన దేవా (2) / కాకోలాన్నే వాడిన దేవా / కడుహీనుడనైన నన్నును కూడా ||వాడుకో|| / బెయేరు కుమారుడు బిలాము / దైవాజ్ఞను మీరగా / మోయాబుకు పయనమైన వేళ / తన నేత్రాలు మూయబడగా (2) / గాడిదకు మాట్లాడుటకు పలుకిచ్చిన దేవా (2) / గాడిదనే వాడిన దేవా / గతిలేనివాడను నన్నును కూడా ||వాడుకో||

వాడబారని విశ్వాసముతో|Vaadabaarani Vishwaasamutho

వాడబారని విశ్వాసముతో / శుభప్రదమైన నిరీక్షణతో (2) / వేచియున్నానయ్యా కనిపెట్టుచున్నానయ్యా (2) యేసయ్యా / నీ రాక కోసమై – కడబూర శబ్దముకై / నీ మహిమ కోసమై – నిన్ను చేరుటకై (2) ||వాడబారని|| / మోకాళ్లపై వేచితి – కన్నీళ్ల పర్యంతమై / బీడు బారిన నేల వానకై – ఎదురు చూచినా సంఘమై (2) / సిద్ధపడియున్న వధువునై / ఆశతో వేచానయ్యా (2) యేసయ్యా ||నీ రాక|| / లేఖనములను చూచితి – గురుతులు గమనించితి / ప్రవచన నెరవేర్పులన్ని – జరుగుట గుర్తించితి (2) / రారాజువై నీవు రావాలని / ఎదురు చూచుచున్నానయ్యా (2) యేసయ్యా ||నీ రాక|| / నీటి కొరకై వేచిన – గూడ బాతును పోలిన / ఆత్మ దాహము తోడనిండి – అల్లాడుచున్నానయ్యా (2) / లోక బంధాల నుండి / నీ చెలిమి కోరానయ్యా (2) యేసయ్యా ||నీ రాక||

వాడిపోకముందే|Vaadipoka Munde

వాడుకో… యేసయ్యా…. / పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా / నీ కాడి నే మోస్తానయ్యా – (2) / వాడిపోకముందే నన్ను వాడుకో / పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2) / వాడుకో యేసయ్యా – నీ కాడి నే మోస్తా (2) ||వాడిపోక|| / నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే / నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2) ||వాడుకో|| / నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే / నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2) ||వాడుకో|| / నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే / నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే (2) ||వాడుకో|| / నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే / నాకున్న అవకాశం చేజారి పోకముందే (2) ||వాడుకో||

వింతైన తారక|Vinthaina thaaraka

వింతైన తారక వెలిసింది గగనాన / యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2) / జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ / దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2) / మనమంతా జగమంతా / తారవలె క్రీస్తును చాటుదాం / హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ / వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ / ఆకాశమంతా ఆ దూతలంతా / గొంతెత్తి స్తుతి పాడగా / సర్వోన్నతమైన స్థలములలోన / దేవునికే నిత్య మహిమ (2) / భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ / ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా|| / ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు / యేసయ్యను దర్శించిరి / ఎంతో విలువైన కానుకలను అర్పించి / రారాజును పూజించిరి (2) / హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి / అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||

విజయ గీతము మనసార|Vijaya Geethamu Manasaara

విజయ గీతము మనసార నేను పాడెద / నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2) / పునరుత్తానుడ నీవే / నా ఆలాపన నీకే నా ఆరాధన (2) / ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే / పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2) / యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది / నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ|| / ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి / నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2) / యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము / నీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ|| / నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు / ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2) / యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె / నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ||

విజయ గీతముల్ పాడరే|Vijaya Geethamul Paadare

విజయ గీతముల్ పాడరే / క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2) / వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ / నిజ కుమారుని నామమున్ / హృదయములతో – భజన జేయుచు నిత్యమున్ ||విజయ|| / మంగళముగ యేసుడే / మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను / నింగిన్ విడిచి వచ్చెను / శత్రుని యుద్ధ – రంగమందున గెల్చెను / రంగు మీరగదన – రక్త బలము వలన / పొంగు నణగ జేసెను / సాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను ||విజయ|| / పాపముల్ దొలగింపను / మనలను దన స్వ – రూపంబునకు మార్పను / శాపం బంతయు నోర్చెను / దేవుని న్యాయ – కోపమున్ భరియించెను / పాపమెరుగని యేసు – పాపమై మనకొరకు / పాప యాగము దీర్చెను / దేవుని నీతిన్ – ధీరుడై నెరవేర్చెను ||విజయ|| / సిలువ మరణము నొందియు / మనలను దనకై – గెలువన్ లేచిన వానికి / చెలువుగన్ విమలాత్ముని / ప్రేమను మనలో – నిలువన్ జేసిన వానికి / కొలువు జేతుమెగాని – ఇలను మరువక వాని / సిలువ మోయుచు నీ కృపా / రక్షణ చాల విలువ గలదని చాటుచు ||విజయ||

విజయశీలుడా|Vijayaseeludaa

విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా / కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2) / నా యేసయ్యా నిను వేడుకొనగా / నా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా|| / అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – (2) / ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2) / నిత్యానందము కలిగించె నీ / శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) ||విజయశీలుడా|| / ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – (2) / అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2) / నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి / వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా (2) ||విజయశీలుడా|| / ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు – (2) / అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు (2) / నిత్యము నీతో నేనుండుటకై / నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2) ||విజయశీలుడా||

విడిపిస్తాడు నా యేసుడు|Vidipisthaadu Naa Yesudu

విడిపిస్తాడు నా యేసుడు / మరణపు లోయైనా నను విడువడూ (2) / మనసు ఓడిపోయిననూ / మనువు వాడిపోయిననూ (2) / నను ఎత్తుకొనీ… / నను ఎత్తుకొనీ కాలికి ధూలైన తగలక ||విడిపిస్తాడు|| / ఆశలన్నీ క్షణికములో ఆవిరియై పోయినా / కంటిమీద కునుకేమో కన్నీళ్ళై పారినా (2) / తన కౌగిటిలో… / తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడు|| / ఎండమావులే స్నేహితులై ఓదర్పే కరువైనా / బండరాల్లే భాగ్యములై బ్రతుకు భారమైననూ (2) / తన కౌగిటిలో… / తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడు|| / కలలు అన్ని కల్లలై కలతలతో నిండిననూ / గాలి మేడలే ఆస్తులై శూన్యములే మిగిలిననూ (2) / తన కౌగిటిలో… / తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి ||విడిపిస్తాడూ||

Telugu Songs Starting with "వ" — Page 2 | UEC Telugu Church