49 songs found
విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము / ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం / దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో / ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో / నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా / నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా (2) ||విలువైన|| / గడచినా కాలమంతా తోడైయున్నావు / అద్భుతాలు ఎన్నో చేసి చూపావు (2) / లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు (2) / నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు (2) ||నా జీవిత|| / సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా / నూతన కార్యాలు ఎన్నో చేశావు (2) / సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు (2) / నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు / మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు ||నా జీవిత||
విలువైనది నీ ఆయుష్కాలం / తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2) / దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం / దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది|| / బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా / దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా / నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన / నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున / పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2) / క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది|| / మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు / అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు / ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము / ఆదరించువారు లేని కన్నీటి క్షణములు / దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2) / దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||
విలువైనది నీ జీవితం / యేసయ్యకే అది అంకితం (2) / ఆ దేవ దేవుని స్వరూపంలో / నిను చేసుకున్న ప్రేమ / తన రూపులో నిను చూడాలని / నిను మలచుకున్న ప్రేమ / ఈ మట్టి ముద్దలో – తన ఊపిరే ఊది / నిను నిర్మించిన ఆ గొప్ప ప్రేమ / తన కంటి రెప్పలా – నిను కాచేటి / క్షణమైన నిన్ను ఎడబాయని ప్రేమా… ||విలువైనది|| / ప్రతి అవసరాన్ని తీర్చే / నాన్న మన ముందరుండగా / అనుక్షణమున నీ చేయి విడువక / ఆయనీతో నడిచెగా / ఎటువంటి బాధైనా – ఏలాంటి శ్రమ అయినా / నిను విడిపించే దేవుడుండగా / అసాధ్యమేముంది – నా యేసయ్యకు / సాటి ఏముంది ఆ గొప్ప ప్రేమకు ||విలువైనది||
విలువైనది సమయము ఓ నేస్తమా / ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2) / సమయము పోనివ్వక సద్భక్తితో / సంపూర్ణతకై సాగెదము (2) ||విలువైనది|| / క్రీస్తుతో మనము లెపబడిన వారమై / పైనున్నవాటినే వెదకిన యెడల (2) / గొర్రెపిల్లతొ కలిసి / సీయోను శిఖరముపై నిలిచెదము (2) ||విలువైనది|| / శోధన మనము సహించిన వారమై / క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2) / సర్వాధికారియైన / ప్రభువుతో కలిసి ఏలెదము (2) ||విలువైనది|| / క్రీస్తుతో మనము సింహాసనముపై / పాలించుటకై జయమొందుటకు (2) / సమర్పణ కలిగి / పరిశుద్దతలో నిలిచెదము (2) ||విలువైనది||
వివాహమన్నది పవిత్రమైనది / ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2) / ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2) / నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2) ||వివాహమన్నది|| / ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2) / శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2) ||వివాహమన్నది|| / దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2) / వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2) ||వివాహమన్నది||
విశేషమైన కృప నా యెడల చూపుచున్నావా… ప్రభువా (2) / నా యెడల నీవు విశేషమైన (2) / కృప చూపుచున్నావా ||విశేషమైన|| / నా బ్రతుకు నన్ను క్రుంగదీయు వేళ / నీ కృపయే నన్ను లేవనెత్తగా (2) / కృప కృప కృప అని పిలువగా / నీ కృప కృప కృప అని పిలువగా / కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా / నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన|| / గడ్డి పూవు లాంటిది నా జీవితం / పరిమళింపజేయవా నీ కృపచేత (2) / కృప కృప కృప అని పిలువగా / నీ కృప కృప కృప అని పిలువగా / కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా / నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన|| / వెలుపట లోపట పోరాటములే / యెటు చూచినా దారి కానరాలేదే (2) / కృప కృప కృప అని పిలువగా / నీ కృప కృప కృప అని పిలువగా / కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా / నీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన||
వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే / నీవే నా మంచి యేసయ్యా / ప్రవహించే సెలయేరై రావా నీవు / జీవ నదిలా మము తాకు యేసయ్యా / నీవే నా ప్రాణము – నీవే నా సర్వము / నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి / నీలోనే తరియించాలి ప్రభు (2) / నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం / నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో|| / ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం / కడవరకు కాపాడే నీవే నా దైవం / పోషించే నా తండ్రి నీవే ఆధారం / కరుణగల నీ మనసే నాకు చాలును / నీ మాటలే మాకు ఉజ్జీవం / నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు|| / ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం / ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై / నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే / నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి / మా కోసమే నీవు మరణించి / పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||
వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర / వేగిరమే వినుటకు రారండి / ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు|| / రండి… విన రారండి / యేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2) / నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి / మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2) / రండి… ||వీనులకు|| / రండి… వచ్చి చూడండి / యేసయ్య చేసే కార్యములు చూడండి (2) / నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి / శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2) / రండి… ||వీనులకు|| / సృష్టి కర్తను మరచావు నీవు / సృష్టిని నీవు పూజింప దగునా (2) / భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి / నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2) / రండి… ||వీనులకు||
వెండి బంగారాల కన్న మిన్న అయినది / యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2) / లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2) / లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి|| / లోకమునకు వెలుగైన ప్రేమ / లోకమును వెలిగించిన ప్రేమ (2) / లోకులకై కరిగిపోయిన ప్రేమ / లోకాన్ని జయించిన ప్రేమ (2) / యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) / హల్లెలూయా మహదానందమే (2) ||వెండి|| / ఏ స్థితికైనా చాలిన ప్రేమ / నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2) / నీకు బదులు మరణించిన ప్రేమ / చిర జీవము నీకొసగిన ప్రేమ (2) / యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2) / హల్లెలూయా మహదానందమే (2) ||వెండి||
వేటగాని ఉరిలో నుండి / నా ప్రాణాన్ని రక్షించావు / బలమైన రెక్కల క్రింద / నాకాశ్రయమిచ్చావు (2) / లేనే లేదయ్యా వేరే ఆధారం / నా దుర్గమా నా శైలమా / లేనే లేదయ్యా వేరే ఆధారం / నా శృంగమా నా కేడెమా / ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన / ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2) / రాత్రి వేళ భయముకైననూ / పగటి వేళ బాణమైననూ / రోగము నన్నేమి చేయదు / నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| / వేయిమంది పడిపోయినా / పదివేల మంది కూలిపోయినా / అపాయము రానే రాదు / నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా|| / మానవులను కాపాడుటకు / నీ దూతలను ఏర్పరిచావు / రాయి తగలకుండా / ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||
వేయి నోళ్లతో స్తుతియించినా / నీ ఋణమును నే తీర్చగలనా / యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా / నా రోగములను భరియించి / నా వ్యసనములను వహియించి / నా దోషములను క్షమియించి / స్వస్థత నొసగిన నా దేవా ||యేసయ్యా|| / శోధనలో నాకు జయమిచ్చి / బాధలలో నను ఓదార్చి / బలహీనతలో బలమిచ్చి / నెమ్మది నొసగిన నా దేవా ||యేసయ్యా||
వేవేల దూతలతో కొనియాడబడుచున్న / నిత్యుడగు తండ్రి సమాధాన కర్త / బలవంతుడైన దేవా ||వేవేల|| / మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగం / నే మరువలేను నా దేవా (2) / ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను (2) / ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను (2) ||వేవేల|| / మా స్థితిని మా గతిని నీవు మార్చగలవు / మా బాధలు మా వేదన నీవు తీర్చగలవు (2) / ఎంత వేదనైనా – ఎంత శోధనైనా (2) / మా కొరకు సిలువలో బలి అయినావు (2) ||వేవేల||