340 songs found
నా మనో నేత్రము తెరచి / నా కఠిన హృదయమును మార్చి (2) / అంధకారములో నేనుండ (2) / వెదకి నన్ రక్షించితివి (2) ||నా మనో|| / నే పాప భారము తోడ / చింతించి వగయుచునుంటి (2) / కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) / పొంది నన్ విడిపించితివి (2) ||నా మనో|| / ఎన్నాళ్ళు బ్రతికిననేమి / నీకై జీవించెద ప్రభువా (2) / బాధలు శోధనలు శ్రమలలో (2) / ఓదార్చి ఆదుకొంటివయా (2) ||నా మనో|| / నీ సన్నిధిని నే కోరి / నీ సన్నిధిలో నే మారి (2) / స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2) / యుగయుగములు సర్వ యుగములు (2) ||నా మనో||
నా మార్గమందు నా కంటె ముందు / నడిచావయ్యా నా యేసయ్యా / పరలోకమందు నేనుండాలని / ఒక స్థలమును సిద్ధపరిచావయ్యా (2) / నిందలు అవమానములెన్నో సహియించి – సహియించి / సిలువలో నా శాపములన్ని భరియించి – భరియించి / అడ్డుగా ఉన్న పాపములన్ని క్షమియించి – క్షమియించి / మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి… / (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు / నన్ను… నీ సాక్షిగా నిలిపినావు (2) / నీ ప్రేమను – ప్రకటించుటకు / నీ చిత్తము – నెరవేర్చుటకు / నీ సేవలో – కొనసాగుటకు / నీ మహిమలో – నేనుండుటకు / (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు / నన్ను… నీ సాక్షిగా నిలిపినావు (2) / నా యేసయ్యా – నీ సాక్షిగా నిలిపినావు – (2)
నా యెడల నీకున్న తలంపులన్ని (2) / ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య (2) / అవి రమ్యమైనవి అమూల్యమైనవి(2) / నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య / నాకై నీవు తలంచుచున్నావా (2) ||నా యెడల|| / రాజువైన నీవు దాసుడవయ్యావా / దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే (2) / అభిషేకించావు అధికారం ఇచ్చావు (2) / పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు / నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల|| / ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా / దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే (2) / ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు (2) / సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు (2) / నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల|| / బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా / బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే (2) / నా స్తానము నిలిచావు నా శిక్ష భరించావు (2) / నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు / నీకే స్తోత్రము యేసయ్య (2) ||నా యెడల||
నా యేసయ్య ప్రేమ / నా తండ్రి గొప్ప ప్రేమ (2) / వర్ణించగలనా నా మాటతో / నే పాడగలనా క్రొత్త పాటతో (2) ||నా యేసయ్య|| / నా పాపనిమిత్తమై / సిలువనూ తానే మోసే / ఈ ఘోర పాపి కొరకై / తన ప్రాణము అర్పించెనే (2) / ఏముంది నాలో దేవా / ఏ మంచి లేనే లేదే (2) ||నా యేసయ్య|| / తప్పి పోయిన నన్ను / వెదకి రక్షించితివే / ఏ దారి లేక ఉన్నా / నీ దరికి చేర్చితివే (2) / ఏముంది నాలో దేవా / ఏ మంచి లేనే లేదే (2) ||నా యేసయ్య||
నా యేసయ్యా నా రక్షకా / నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) / ప్రేమింతును నీ సన్నిధానమును / కీర్తింతును యేసయ్యా (2) / నా విమోచకుడా నా పోషకుడా / నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును|| / నా స్నేహితుడా నా సహాయకుడా / నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును||
నా యేసయ్యా నా స్తుతియాగము / నైవేద్యమునై ధూపము వోలె / నీ సన్నిధానము చేరును నిత్యము / చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2) / ఆత్మతోను మనసుతోను / నేను చేయు విన్నపములు (2) / ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై / విజ్ఞాపన చేయుచున్నావా (2) / విజ్ఞాపన చేయుచున్నావా ||నా యేసయ్యా|| / ప్రార్థన చేసి యాచించగానే / నీ బాహు బలము చూపించినావు (2) / మరణపు ముల్లును విరిచితివా నాకై / మరణ భయము తొలగించితివా (2) / మరణ భయము తొలగించితివా ||నా యేసయ్యా|| / మెలకువ కలిగి ప్రార్థన చేసిన / శోధనలన్నియు తప్పించెదవు (2) / నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై / రారాజుగా దిగి వచ్చెదవు (2) / రారాజుగా దిగి వచ్చెదవు ||నా యేసయ్యా||
నా యేసు ప్రభువా నిన్ను నేను / ఆరాధించెదను స్తుతియింతును (2) / నీ ప్రేమా సన్నిధిలో నీ ముఖము నేను చూచుచు / ఆనందించెదను చిరకాలము నీలో (2) / నీ స్నేహమే నా బలము / నీ ఊపిరే నా జీవము / నీ వాక్యమే ఆధారము / నాకు ధైర్యమిచ్చును (2) ||నీ ప్రేమా|| / నా ప్రాణమైన యేసయ్యా / నీవుంటే నాకు చాలును / నీ కోసమే నే జీవింతున్ / నిజమైన ప్రేమికుడా (2) ||నీ ప్రేమా|| / యేసయ్యా నా రక్షకా / యేసయ్యా నా జీవమా / యేసయ్యా నా స్నేహమా / నాదు ప్రాణ ప్రియుడా (2) ||నీ ప్రేమా||
నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా / ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా / నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా / నా యేసు రాజా రాజా – రాజా – రాజా… / రాజా రాజా యేసు రాజా / రాజా రాజా యేసు రాజా / రాజా యేసు రాజా (2) / నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము / నన్ను బంధించెనా (2) / నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా (2) ||నా యేసు|| / వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన / కనికర స్వరూపుడా (2) / నా కన్నీటిని నాట్యముగా మార్చితివా (2) ||నా యేసు|| / అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే / నా నీటి ఊట నీవే (2) / అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద (2) ||నా యేసు||
నా యేసు రాజు / నాకై పుట్టిన రోజు (2) / క్రిస్మస్ పండుగా / హృదయం నిండుగా (2) / హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ / మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||నా యేసు|| / పరలోకమునే విడిచెను / పాపిని నను కరుణించెను / పశు పాకలో పుట్టెను / పశువుల తొట్టిలో వింతగా (2) ||హ్యాపీ|| / నమ్మిన వారికి నెమ్మది / ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా / ప్రతి వారిని పిలిచెను / రక్షణ భాగ్యమునివ్వగా (2) ||హ్యాపీ|| / సంబరకరమైన క్రిస్మస్ / ఆనందకరమైన క్రిస్మస్ / ఆహ్లాదకరమైన క్రిస్మస్ / సంతోషకరమైన క్రిస్మస్ (2) ||నా యేసు||
నా యేసు రాజ్యము అందమైన రాజ్యము / అందులో నేను నివసింతును (2) / సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం / ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం (2) ||నా యేసు|| / అవినీతియే ఉండని రాజ్యము / ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం (2) / ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం / ఇక లంచం మోసం మొహం ద్వేషం లేని రాజ్యం (2) ||నా యేసు|| / హల్లెలూయా స్తుతులున్న రాజ్యం / యేసే సర్వాధిపతి అయినా సత్య రాజ్యం (2) / ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం / నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం (2) ||నా యేసు||
నా వేదనలో నా బాధలో / నే కృంగిన వేళలో – నా తోడైయున్నావు (2) / నన్ను నడిపించు నా యేసయ్యా / నాకు తోడైయుండు నా ప్రభువా (2) / నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| / నా అన్న వారే నను మరిచారయ్యా / అయినవారే నన్ను అపహసించినారయ్య / నా కన్న వారిని నే కోల్పోయినా / నా స్వంత జనులే నన్ను నిందించినా / కన్నీటిని తుడిచి కౌగిలించినావు / కృప చూపి నన్ను రక్షించినావు (2) / నన్ను నడిపించు నా యేసయ్యా / నాకు తోడైయుండు నా ప్రభువా (2) / నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా ||నా వేదనలో|| / ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవి కావని / ప్రభునందు నా ప్రయాస వ్యర్ధమే కాదని (2) / నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని / చావైతే నాకది ఎంతో మేలని (2) / నా కన్నులెత్తి నీ వైపుకే / నిరీక్షణతో చూచుచున్నాను (2) / నీయందే నే బ్రతుకుచున్నాను ||నా వేదనలో||
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా / నశింపజేయు దూత నన్ను దాటిపోయెను (2) ||నా సంకట|| / విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా (2) / కలిగియున్న రక్షణలో దాగియుంటిని (2) ||నా సంకట|| / ఇంకా నేను ఫరోకు దాసుడను కాను (2) / ఇంకా నేను సీయోను కన్యుడను గాను (2) ||నా సంకట|| / మార్చబడు నాడు మారా మధురముగా (2) / పారు జలము బండనుండి త్రాగుచుండును (2) ||నా సంకట|| / సౌందర్యమయమగు పరమ కానాను (2) / నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు (2) ||నా సంకట|| / ఆనందమే పరమానందమే (2) / కానాను జీవితము నా కానందమే (2) ||నా సంకట|| / నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు (2) / నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును (2) ||నా సంకట|| / నా యేసు ప్రభువే నా బలము గానము (2) / నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా (2) ||నా సంకట||