340 songs found

నా ప్రాణమా నీకే వందనం|Naa Praanamaa Neeke Vandanam

నా ప్రాణమా యేసయ్యా… నా ధ్యానమా యేసయ్యా / నా ప్రాణమా నీకే వందనం / నా స్నేహమా నీకే స్తోత్రము (2) / నిను నే కీర్తింతును / మనసారా ధ్యానింతును (2) / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ / హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా (2) ||నా ప్రాణమా|| / నిను విడచి ఉండలేనయ్యా / నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా (2) / సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవు / నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా (2) / సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా (2) / మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ|| / మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూ / నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు (2) / వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా (2) / మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ||

నా ప్రాణానికి ప్రాణం|Naa praanaaniki praanam

నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా / స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా / నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా ||నా ప్రాణానికి|| / ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు / కన్నీటి సమయములో ఒంటరిని చేసారు (2) / ఆస్తులున్న వేళలో అక్కున చేరారు / ఆపద సమయాలలో అంతు లేకపోయారు / జంటగా నిలిచితివి నా ప్రాణమా / కన్నీరు తుడిచితివి నా స్నేహమా / కన్నీరు తుడిచితివి నా స్నేహమా / కన్నీరు తుడిచితివి … ||నా ప్రాణానికి|| / నీవే నా ప్రాణమని కడవరకు విడువనని / బాసలన్ని మరచి అనాథగా నను చేసారు (2) / నేనున్నానంటూ నా చెంతన చేరావు / ఎవరు విడచినా నను విడవనన్నావు / జంటగా నిలిచితివి నా ప్రాణమా / కన్నీరు తుడిచితివి నా స్నేహమా / కన్నీరు తుడిచితివి నా స్నేహమా / కన్నీరు తుడిచితివి … ||నా ప్రాణానికి||

నా ప్రియ దేశం|Naa Priya Desham

నా ప్రియ దేశం భారత దేశం / బైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం (2) / ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) / ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2) / నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను / భారతీయుడనైనందుకు గర్విస్తాను (2) / సంతోష సౌభాగ్యం – సమృద్ధి సంక్షేమం / దేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను (2) / ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) / క్రైస్తవ్యం మతము కాదని మారుమనస్సని / జీవమునకు నడిపించునని వివరిస్తాను (2) / మతి మార్చు వాడు యేసని మత బోధకుండు కాదని / రక్షించే దేవుడని ప్రకటిస్తాను (2) / ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) / ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2) / మనుషులంతా ఒక్కటేనని మంచి భావన / అందరిలో కలిగించుటకు శ్రమియిస్తాను (2) / కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేయుచు / యేసయ్య అడుగులలో పయనిస్తాను (2) / ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ||నా ప్రియ||

నా ప్రియ యేసు రా|Naa Priya Yesu Raa

ఎత్తుకే ఎదిగినా – నామమే పొందినా (2) / నాకు మాత్రము నీవే చాలయ్యా / నీ జాడలో నే నడుస్తానయ్యా / నీ కౌగిలిలో నే ఉంటా / రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ.. / రా.. నా ప్రియ యేసు రా – (2) / ఆశీర్వాదములు కావయ్యా / అభిషేకము కొరకు కాదయ్యా (2) / నీవే నా ఆశీర్వదమయ్యా / నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2) / నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా / నీ జాడలో నే నడుస్తానయ్యా / నీ కౌగిలిలో నే ఉంటా… ఓ.. / రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ.. / రా.. నా ప్రియ యేసు రా – (2) / నీకై నేను – నాకై నీవు / ఉంటే చాలయ్యా – అదియే నా ఆశ దేవా .. / నాలో ఉన్నవాడా – నాతో ఉన్నవాడా / నీవుంటే చాలయ్యా – రావా నాకై / నా ప్రాణం నీవయ్యా – నా ప్రేమ నీకేయ్యా / నీవే నా ఊపిరి యేసయ్యా / నీ పాదాలపై అత్తరునై నేనుంటా / నా ప్రాణ ప్రియుడా యేసయ్యా / పరలోకము కొరకు కాదయ్యా / వరముల కొరకు కాదయ్యా / ప్రవచనముల కొరకు కాదయ్యా / నీవుంటే నాకు చాలయ్యా / నీ శ్వాసే పరలోకం దేవా / నిను పోలిన వరములు ఏవి లేవయ్యా / ఎన్నెన్ని వరములు నాకున్నా / నీవు లేని జీవితమే వ్యర్ధముగా / నీ కోసమే బ్రతికెదను యేసయ్యా / నీ కోసమే చావైనా మేలేగా / నీ..కై ఎవరు రాకున్నా హో… / నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ.. / నీ హతసాక్షిగ నే చస్తా / రా.. నా ప్రియా యేసు రా… / నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే / నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే / కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు / నీకై నే వేచి ఉన్నా రావా నాకై… / నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని / నీవే నా ఊపిరి యేసయ్యా / నీ గుండె లోతున ఆలోచన నేనేగా / నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో… / నాకు మాత్రము నీవే చాలయ్యా – (4) / వీడని ప్రియుడవు రావా నాకై / నిన్ను పోలి ఉంటా నే రావా నాకై / వేచియున్నా నీ కోసం రావా నాకై / ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై / రావా… దేవా… రావా… దేవా… / నాకు మాత్రము నీవే చాలయ్యా / నా కోసము రావా యేసయ్యా… త్వరగా…

నా ప్రియమైన యేసు ప్రభు|Naa Priyamaina Yesu Prabhu

నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు / నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు / నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన|| / ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని (2) / దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2) ||నా ప్రియమైన|| / ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2) / నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2) ||నా ప్రియమైన|| / లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని (2) / శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై (2) ||నా ప్రియమైన|| / ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు (2) / ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము (2) ||నా ప్రియమైన|| / మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును (2) / నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి (2) ||నా ప్రియమైన||

నా ప్రియుడు యేసు|Naa Priyudu Yesu

నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు / వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల (2) ||నా ప్రియుడు|| / మెల్లని చల్లని స్వరమే వినబడెను (2) / తండ్రీ వీరేమి చేయుచున్నారో (2) / ఎరుగరు గనుక క్షమించుమనెన్ / ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే ||నా ప్రియుడు|| / అతని ప్రేమ మధురం మధురం / ఎన్నటికీ నే మరువలేను (2) / ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం / శాపమంతా బాపి నను దీవించెనుగా ||నా ప్రియుడు|| / వీపంతా దున్నబడె నాగలితో / కారె రక్త వరదల్ కనుమా (2) / యేసు రక్తంలో రక్షణ – యేసు రక్తంలో స్వస్థత / నాకై మరణించి తిరిగి లేచె సజీవునిగా ||నా ప్రియుడు|| / తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి / నాకై విన్నతి చేయుచున్నాడు (2) / రానైయున్నాడు వేగ – మేఘముపై విభుడే / నన్ను పరమ గృహమునకు తోడ్కొని వెళ్ళును ||నా ప్రియుడు||

నా బ్రతుకు దినములు|Naa Brathuku Dinamulu

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము / దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము / ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము / నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు|| / ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి / నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని / ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని / ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని / నా మరణ రోదన ఆలకించుమో ప్రభు / మరల నన్ను నూతనముగ చిగురు వేయని ||నా బ్రతుకు|| / నీ పిలుపు నేను మరచితి – నా పరుగులో నేనలసితి / నా స్వార్ధము నా పాపము – పతన స్థితికి చేర్చెను / నా అంతమెటుల నుండునో – భయము పుట్టుచున్నది / దేవా నన్ను మన్నించుము – నా బ్రతుకు మార్చుము / యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును / విశేషముగా రూపించుము నా శేష జీవితం ||నా బ్రతుకు||

Telugu Songs Starting with "న" — Page 8 | UEC Telugu Church