340 songs found
యేసు స్వామీ నీకు నేను / నా సమస్త మిత్తును / నీ సన్నిధి-లో వసించి / ఆశతో సేవింతును / నా సమస్తము – నా సమస్తము / నా సురక్షకా నీ కిత్తు – నా సమస్తము / యేసు స్వామీ నీకు నేను / ద్రోసి లొగ్గి మ్రొక్కెదన్ / తీసివేతు లోక యాశల్ / యేసు చేర్చుమిప్పుడే ||నా సమస్తము|| / నేను నీ వాడను యేసు / నీవును నా వాడవు / నీవు నేను నేకమాయే / నీ శుద్ధాత్మ సాక్ష్యము ||నా సమస్తము|| / యేసు నీదే నా సర్వాస్తి / హా సుజ్వాలన్ పొందితి / హా సురక్షణానందమా / హల్లెలూయా స్తోత్రము ||నా సమస్తము||
నా సర్వం నా కోట / నా దుర్గం నీవే నీవే / ఆశ్రయము నా బలము / నా ఊపిరి నీవే నీవే / బాధలలో నన్నాదరించి – నాకాశ్రయమైనావు / శోధనలో నన్నాదుకొని – నా తల పైకెత్తావు / నిను నేను విడువను దేవా – నా జీవిత కాలమంతా / నా భారమంతా నీపై వేసి – నే నడిచెదను దేవా / నే నడిచెదను – నే నడిచెదను – నే నడిచెదను దేవా (2) ||బాధలలో||
నా స్తుతి పాత్రుడా – నా యేసయ్యా / నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2) / నీ వాక్యమే నా పరవశము / నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2) / నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి పాత్రుడా|| / నీ కృపయే నా ఆశ్రయము / నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2) / నీ కృపయే నా జీవన ఆధారము (3) ||నా స్తుతి పాత్రుడా|| / నీ సౌందర్యము యెరూషలేము / నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2) / నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3) ||నా స్తుతి పాత్రుడా||
నా స్తుతుల పైన నివసించువాడా / నా అంతరంగికుడా యేసయ్యా (2) / నీవు నా పక్షమై యున్నావు గనుకే / జయమే జయమే ఎల్లవేళలా జయమే (2) / నన్ను నిర్మించిన రీతి తలచగా / ఎంతో ఆశ్చర్యమే / అది నా ఊహకే వింతైనది (2) / ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి / ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా స్తుతుల|| / ద్రాక్షావల్లి అయిన నీలోనే / బహుగా వేరు పారగా / నీతో మధురమైన ఫలములీయనా (2) / ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే / విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) ||నా స్తుతుల|| / నీతో యాత్ర చేయు మార్గములు / ఎంతో రమ్యమైనవి / అవి నాకెంతో ప్రియమైనవి (2) / నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి / పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2) ||నా స్తుతుల||
నీతో స్నేహం నే మరువగలనా / నిన్ను విడచి నేను ఉండగలనా / నీతో స్నేహం నే మరువగలనా / నా స్నేహితుడా… నా యేసయ్యా (2) / విడువక నను ఎడబాయని నేస్తమా ||నీతో|| / నా నీడగా నీవుండగా – భయమేమీ లేదుగా / శోధనకైనా బాధలకైనా భయపడిపోనుగా / శత్రువు నన్ను వేధించినా – నా ధైర్యం నీవేగా / లోకం నన్ను దూషించినా – నన్ను విడువవుగా / కన్నీరు తుడిచే నా నేస్తం నీవేగా / ఓదార్చి నడిపించే స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా|| / నా తోడుగా నీవుండగా – కొదువేమి లేదుగా / కష్టములైనా నష్టములైనా – తడబడిపోనుగా / అపాయమేమి రాకుండగా – కాచేవాడవు నీవేగా / ఎన్నటికైనా మారని నీదు – స్నేహమే మధురముగా / ప్రేమను పంచిన నా నేస్తం నీవేగా / ప్రాణాన్నే ఇచ్చిన స్నేహితుడవు నీవేగా ||నా స్నేహితుడా||
నా హృదయములో నీ మాటలే / నా కనులకు కాంతి రేఖలు (2) / కారు చీకటిలో కలువరి కిరణమై / కఠిన హృదయమును కరిగించిన / నీ కార్యములను వివరింప తరమా / నీ ఘన కార్యములు వర్ణింప తరమా (2) ||నా హృదయములో|| / మనస్సులో నెమ్మదిని కలిగించుటకు / మంచు వలె కృపను కురిపించితివి (2) / విచారములు కొట్టి వేసి / విజయానందముతో నింపినావు / నీరు పారేటి తోటగా చేసి / సత్తువ గల భూమిగా మార్చినావు ||నీ కార్యములను|| / విరజిమ్మే ఉదయ కాంతిలో / నిరీక్షణ ధైర్యమును కలిగించి (2) / అగ్ని శోధనలు జయించుటకు / మహిమాత్మతో నింపినావు / ఆర్పజాలని జ్వాలగా చేసి / దీప స్తంభముగా నను నిలిపినావు ||నీ కార్యములను|| / పవిత్రురాలైన కన్యకగా / పరిశుద్ధ జీవితము చేయుటకు (2) / పావన రక్తముతో కడిగి / పరమానందముతో నింపినావు / సిద్ధపడుచున్న వధువుగా చేసి / సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు ||నీ కార్యములను||
నా హృదయాన కొలువైన యేసయ్యా / నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా / నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే / నీ సన్నిధిలో పూజార్హుడా (2) ||నా హృదయాన|| / అగ్ని ఏడంతలై – మండుచుండినను / అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను (2) / అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే (2) / నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే / నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2) ||నా హృదయాన|| / అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో / నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే (2) / నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2) / నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే / నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2) ||నా హృదయాన|| / విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు / ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా (2) / సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే (2) / నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే / నా సర్వము నీకే అర్పింతును (2) ||నా హృదయాన||
నాకు చాలిన దేవుడ నీవు / నా కోసమే మరణించావు (2) / నా శ్రమలలో నా ఆధారమా / నను ఎడబాయని నా దైవమా (2) / ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను / ఏ రీతిగా నిను స్తుతియించగలను (2) ||నాకు చాలిన|| / వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలె / మౌనివై నా పాప శిక్షణోర్చినావు (2) / అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా (2) / చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా (2) ||ఏమిచ్చి|| / ఎండిన భూమిలో లేత మొక్క వోలె / నా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా (2) / సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో (2) / నడవలేక సుడి వడి కూలినావయ్యా (2) ||ఏమిచ్చి||
నాకు జీవమై ఉన్న నా జీవమా / నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా / నాకు బలమై ఉన్న నా బలమా / నాకు సర్వమై ఉన్న నా సర్వమా / నీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతా / నీ ధ్యానమే చేసెద నా ఊపిరి ఉన్నంత వరకు ||నాకు జీవమై|| / పూజ్యుడవు… ఉన్నత దేవుడవు / యోగ్యుడవు… పరిశుద్ధ రాజువు (2) / నా ఆరాధన నా ఆలాపన / నా స్తుతి కీర్తన నీవే / నా ఆలోచన నా ఆకర్షణ / నా స్తోత్రార్పణ నీకే ||నాకు జీవమై|| / నాయకుడా… నా మంచి స్నేహితుడా / రక్షకుడా… నా ప్రాణ నాథుడా (2) / నా ఆనందము నా ఆలంబన / నా అతిశయము నీవే / నా ఆదరణ నా ఆశ్రయము / నా పోషకుడవు నీవే ||నాకు జీవమై||
నాకు నీ కృప చాలును ప్రియుడా (2) / నాకు నీ కృప చాలును / శ్రమలతో నిండిన ఈ జీవితములో (2) / నాథా నీ రాక ఆలస్యమైతే (2) / పడకుండ నిలబెట్టుము నన్ను / జారకుండ కాపాడుము (2) ||నాకు|| / పాము వలెను వివేకముగను / పావురమువలె నిష్కపటముగను (2) ||నాథా|| / జంట లేని పావురము వలెను / మూల్గుచుంటిని నిను చేరుటకై (2) ||నాథా|| / పాపిని నను కరుణించు దేవా / చేరి నిను నే స్తుతియించుచుంటిని (2) ||నాథా||
నాకు బలము ఉన్నంత వరకు / నమ్మలేదు నా యేసుని (2) / బలమంతా పోయాక (2) / నమ్మాలని ఉంది ప్రభు యేసుని (2) / వినిపించుచున్నది / కేక నాకు – ఒక కేక నాకు (2) / నాకు స్వరము ఉన్నంత వరకు / పాడలేదు ప్రభు గీతముల్ (2) / స్వరమంతా పోయాక (2) / పాడాలని ఉంది ప్రభు గీతముల్ (2) / వినిపించుచున్నది / కేక నాకు – ఒక కేక నాకు (2) / నాకు ధనము ఉన్నంత వరకు / ఇవ్వలేదు ప్రభు సేవకు (2) / ధనమంతా పోయాక (2) / ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు (2) / వినిపించుచున్నది / కేక నాకు – ఒక కేక నాకు (2) / హృదయారణ్యములో / నే కృంగిన సమయములో / వినిపించుచున్నది / కేక నాకు – ఒక కేక నాకు (2)
చిట్టి పొట్టి పాపను నేను / చిన్నారి పాపను నేను (2) / యేసయ్యా నిన్ను చూడాలని / నాకున్న చిన్ని ఆశ / యేసయ్యా నిన్ను చేరాలని / నాకున్న చిన్ని ఆశ ||చిట్టి|| / నీ సన్నిధిలోనే ఉండాలని / నాకున్న చిన్ని ఆశ / నీ సన్నిధిలో పాట పాడాలని / నాకున్న చిన్ని ఆశ ||చిట్టి|| / నీకై నేను జీవించాలని / నాకున్న చిన్ని ఆశ / నిన్నే నేను సేవించాలని / నాకున్న చిన్ని ఆశ ||చిట్టి||