340 songs found
నీదు ప్రేమకు హద్దు లేదయా / నీదు ప్రేమకు కొలత లేదయా / నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు / పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు|| / తల్లి తండ్రులు చూపలేని ప్రేమ / తనయులివ్వని తేటనైన ప్రేమ (2) / పేదలకు నిరు పేదలకు / విధవలకు అనాథలకు (2) / బంధు మిత్రులు చూపలేని ప్రేమా (2) / కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు|| / నరులకై నర రూపమైన ప్రేమ / పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ (2) / దొంగలకు వ్యభిచారులకును / కౄరులకు నర హంతకులకు / మనుజులివ్వని మధురమైన ప్రేమా (2) / కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా ||నీదు||
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు / అంతరిక్షము నధిగమించెను (2) / నిను ప్రేమించి నీ ఆజ్ఞలను / అనుసరించు మానుజావళికి (2) / నిబంధనను స్థిరముగ జేసి (2) / నిరతము నలరారెడు మా ప్రభువా (2) ||నీదు|| / వేయి తరముల వరకు సరిగా / విలసిల్లేటి వెలలేని మా (2) / వింతల కృపాంబుధి యగు దేవా (2) / యెంతయో నిను స్తుతియింతుము కోరి (2) ||నీదు|| / నీ సత్య సంధత్వ మహిమ / నిరతము నిలయం సంస్తుతులకు (2) / మెరసెను నా మదిలోన దేవా (2) / మరువగ లేమి మధుర ప్రేమ (2) ||నీదు|| / ఎంతైనను నమ్మదగిన / వింతైన నీ విశ్వాస్యత (2) / వాత్సల్యత వెలసెను మాపై (2) / క్రొత్తగా ప్రతి దినము యేసు ప్రభు (2) ||నీదు|| / మన ఆత్మను జీవము దేహమును / మన ప్రభు యేసు రాకడ వరకు (2) / వొనరుగ కాపాడును పదిలముగా (2) / దిన దినమును నిందారహితముగా (2) ||నీదు|| / తండ్రి కుమార శుద్ధాత్మకును / తర తరములకు మహిమ ఘనత (2) / పరిపూర్ణముగా ప్రబలును గాక (2) / పరి పరి విధముల ప్రభు సంఘములో (2) ||నీదు||
నీదెంతో కరుణా కరుణామయా / నీదెంతో జాలి నజరేయా (2) / మా పాపమంతా గాయాలుగా / దాల్చావు నీ మీన పూమాలగా (2) / మా కర్మమంతా ఆ సిలువగా / మోసేవు తండ్రి నీ మోపున ||నీదెంతో|| / ప్రభువా మా పాప ప్రక్షాళనముకై / వెలపోసినావు నీ రుధిరమే (2) / దేవా మా ఆత్మ పరిశుద్ధికై / బలి పెట్టినావు నీ ప్రాణమే ||నీదెంతో||
నీలాంటి ప్రేమ ఈ లోకాన / ఎవరైనా చూపారా? – (2) / నా పాపభారం ఆ సిలువపైన / ఎవరైనా మోశారా? – (2) / యేసయ్యా.. యేసయ్యా.. / యేసయ్యా.. ఓ యేసయ్యా (2) ||నీలాంటి|| / చెలికాడే నిన్ను సిలువకు పంపగా / పరిసయ్యులే నిన్ను పరిహసించగా (2) / నోరు తెరువని ప్రేమ / బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా|| / దొంగలే నిన్ను దూషించగను / నా అనువారే అపహసించగా (2) / నోరు తెరువని ప్రేమ / బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా|| / తండ్రి వీరు చేయునదేమో / ఎరుగరు కనుక క్షమియించుమని (2) / ప్రార్ధన చేసితివయ్యా / మము క్షమియించితివయ్యా (2) ||యేసయ్యా|| / నీ దివ్య ప్రేమను ప్రకటింతునయ్యా / ఆ ప్రేమ మార్గములో నడిచెదనయ్యా (2) / నీదు ప్రేమే నా గానం / నీ ప్రేమే నా భాగ్యం (2) ||యేసయ్యా||
నీలి ఆకాశంలో (2) / నీ నీతి రాజ్యంలో / నేనుండ గోరితి ప్రభువా ఆ… / నేనుండ గొరెద ప్రభువా (2) ||నీలి ఆకాశంలో|| / నా ప్రియుడు నా చెంతనున్నాడు / గోప రసమంత సువాసన కలవాడు / నా ప్రియుడు ఏదేను వనమాలి / కర్పూరాల పుష్పాల సమానుడు / అతని ఎడమచేయి నా తల క్రింద నుండగా / అతని కుడిచేయి నన్ను ఆదరించుచుండగా / ప్రేమతిశయముతో నేను మూర్చిల్లెద – (2) ||నీలి ఆకాశంలో|| / నా ప్రియునికి తలుపు తీయ నే లేవగా / నా ప్రాణప్రియుడు నాకే ఎదురాయెను / నా ప్రియుడు ధవళవర్ణుడేతెంచగా / ఆ రత్నాల వర్ణుడు నను తాకగా / నేను నిదురించిన మనసు మేలుకొన్నది / నా మనసంతా యేసుతో నిండగా / రక్షించి నను చేర్చె ఆ ప్రేమ పురమున – (2) ||నీలి ఆకాశంలో||
నీలో జీవించాలని / నీలోనే బ్రతకాలని (2) / యుగయుగాల నీతోనే ఉండాలని (2) / తుది శ్వాస వరకు నీలోనే నా గమ్యం (2) / యేసూ నువ్వే కావాలి / నా యేసూ నీతో ఉండాలి (2) ||నీలో|| / మిగిలింది నాకు నిత్య శోకము / ఈ నా జీవిత యాత్రలో / కన్నీళ్లే నాకు అన్న పానములై / భుజియించుచుంటిని నిత్యము ప్రభువా (2) / నీవు నాకు ప్రత్యక్షము అయిన వెంటనే (2) / నా దుఃఖ దినములన్ని సమాప్తమాయెను (2) ||యేసూ|| / కటిక చీకటే నాకు స్నేహమాయెను / అంధకారమే నాలో నాట్యమాడెను / ఎటు వైపు చూసినా వెలుగు కాన రాలేదు / మార్గమే తెలియక మతి చెలించెను (2) / నీ వైపు చూడగానే వెలుగు కలిగె దేవా (2) / నీ నామమే నాకు మార్గమాయెను (2) ||యేసూ||
నీలో సమస్తము సాధ్యమే (2) / మహొన్నతుడా యేసయ్యా / బలవంతుడా యేసయ్యా (2) / ఆరాధింతును – నిన్నే స్తుతియింతున్ (4) ||నీలో|| / అలసియున్న నా ప్రాణమును సేదదీర్చువాడవు / జీవజలపు ఊటనిచ్చి తృప్తిపరచువాడవు (2) / ప్రార్థనలన్ని ఆలకించువాడవు నీవు / అడిగినవన్ని ఇచ్చేవాడవు నీవు (2) ||మహొన్నతుడా|| / శోధన వేదనలలో జయమిచ్చువాడవు / బుద్దియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు (2) / నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు / మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు (2) ||మహొన్నతుడా||
నీవు చేసిన ఉపకారములకు / నేనేమి చెల్లింతును (2) / ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన|| / వేలాది నదులంత విస్తార తైలము / నీకిచ్చినా చాలునా (2) / గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని / నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది|| / మరణపాత్రుడనైయున్న నాకై / మరణించితివ సిలువలో (2) / కరుణ చూపి నీ జీవ మార్గాన / నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది|| / విరిగి నలిగిన బలి యాగముగను / నా హృదయ మర్పింతును (2) / రక్షణ పాత్రను చేబూని నిత్యము / నిను వెంబడించెదను (2) ||ఏడాది|| / ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు / నీకేమి చెల్లింతును (2) / కపట నటనాలు లేనట్టి హృదయాన్ని / అర్పించినా చాలునా (2) ||ఏడాది||
నశించిపోయే ఆత్మలు ఎన్నో / నరకపు పొలిమేరను చెర / నన్ను పంపుము నన్ను నడిపించుము / నీ ప్రేమ సువార్త చాటను / నీ వాక్కుతో నీ శక్తితో / నీ ఆత్మతో నీ ప్రేమతో / (నను) నిత్యము నడిపించుమా – (2) / నీవు చేసిన త్యాగాన్ని / చాటి చెప్పే భాగ్యాన్ని / నాకు ఇమ్ము నా దేవా / వాడుకొనుము నా ప్రభువా (2) ||నీవు|| / నా జీవితాంతం – మరణ పర్యంతం / నీతోనే నేనుందునయ్యా (2) / కరుణ చూచి నీ మహిమ గాంచితి / నిత్యం నిను సేవింతును / నీ సన్నిధిలో ఆ దూతలతో / నీ రాజ్యములో పరిశుద్ధులతో (2) / (నిను) నిత్యము కీర్తింతును – (2) ||నీవు||
నీవు చేసిన మేళ్లకు / నీవు చూపిన కృపలకు (2) / వందనం యేసయ్యా (4) / ఏపాటివాడనని నేను / నన్నెంతగానో ప్రేమించావు / అంచెలంచెలుగా హెచ్చించి / నన్నెంతగానో దీవించావు (2) ||వందనం|| / బలహీనుడనైన నన్ను / నీవెంతగానో బలపరచావు / క్రీస్తేసు మహిమైశ్వర్యములో / ప్రతి అవసరమును తీర్చావు (2) ||వందనం||
నీవు తడితే తలుపు తీయనా ప్రభు / నాలో నీవుంటే ఇంకేల నాకు భయం (2) ||నీవు|| / పాపముతో నిండియున్న నా బ్రతుకును / పరిశుద్ధ పరిచావు నా యేసయ్యా / పాపములో జీవించుచున్న నాపై / ప్రేమ చూపి నా తలుపు తట్టావయ్యా (2) / నా చీకటి బ్రతుకులో వెలుగును నింపి / నన్ను నడిపించగ వచ్చావయ్యా (2) ||నీవు|| / తెరిచాను నా తలుపులు రావా ప్రభు / ఇక నన్ను వీడి నిన్ను వెళ్లనివ్వను / నాలోన నీవుండి పోవాలి / నీతోనే నడవాలి ఇక మీదట (2) / రక్షణనే కేడెము చేత పట్టి / ప్రతి తలుపును తట్టి నిన్ను మహిమ పరచెద (2) ||నీవు|| / విలువలేని నన్ను నీవు ఎంచుకొంటివి / వాక్యమనే ధ్యానముతో నన్ను నింపుమా / స్వస్థతనే వరముల దయచేయుమా / కడ వరకు పరుగెడుదును నీ బాటలో (2) / ఎల్లవేళలా నాతో ఉండి నన్ను / చేయి పట్టి నడిపించు నా యేసయ్యా (2) ||నీవు||
నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా / నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2) / దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా / నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2) ||నీవు|| / గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా / మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2) / కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2) ||దావీదు|| / లోకమంత చూచి నను ఏడిపించినా / జాలితో నన్ను చేరదీసిన (2) / ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2) ||దావీదు|| / నా తల్లి నన్ను మరచిపోయినా / నా తండ్రి నన్ను విడచిపోయినా (2) / తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2) ||దావీదు||