340 songs found
నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా / నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా / నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా / నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా / నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా / గుండె నిండ నిండున్నావు ఓ నా యేసయ్యా ||నీవు తప్ప|| / కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను / నీ ప్రేమ వరమే కురిపించినావు / ఈ లోకమంతా వెలివేస్తున్న / నీ ప్రేమ నాపై చూపించినావు / నీ అరచేతిలో నను దాచినావయ్యా / నా చేయి విడువక నను నడిపినావయ్యా / నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా ||నువ్వంటూ|| / కన్నీటి అలలో మునిగిన నన్ను / నీ దివ్య కరమే అందించినావు / ఆ సిలువలోనే నీ ప్రాణమును / నను రక్షింప అర్పించినావు / నీ కృప నీడలో నను కాచినావయ్యా / ఒక క్షణము వీడక కాపాడినావయ్యా / నా శ్వాసై నా ధ్యాసై నువ్వుంటే చాలయ్యా ||నువ్వంటూ||
నీవు తోడుండగా నాకు దిగులుండునా / నా మంచి యేసయ్యా / మనసారా స్తోత్రమయా (2) ||నీవు తోడుండగా|| / నీవంటి వారెవ్వరు / నీ తోటి సాటెవ్వరు (2) / నా జీవితాన – నీవే ప్రభువా (2) / నాకెవ్వరు లేరు ఇలలో (2) / హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3) / హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా / నీవు తోడుండగా…. / మనుషులలో మహనీయుడా / వేల్పులలో ఘణ పూజ్యుడా (2) / సర్వాధికారి సర్వాంతర్యామి (2) / చేసెద నీ పాద సేవ (2) / హాలెలూయా హాలెలూయా హల్లెలూయా (3) / హల్లెలూయా హల్లెలూయా హాలెలూయా ||నీవు తోడుండగా||
నీవు తోడైయుండగా యేసు – భయము లేదు ఇలలో / మేలు చేయు దేవుడా నీకు – సాటి లేరు సృష్టిలో / ఎక్కలేని కొండలెన్నో ఎదురొచ్చిననూ / లెక్కలేని నిందలే నన్ను బాధించిననూ ||నీవు తోడైయుండగా|| / గతం గాయాన్ని చేయగా – గాయం హృదయాన్ని చీల్చగా / శోకం సంద్రంలా ముంచగా – లోకం బంధాలే తెంచగా / పేరు పెట్టి తల్లిలా పిలచి లాలించితివి / నీవే తోడు నీడగా నిలచి కృప చూపితివి ||నీవు తోడైయుండగా|| / ఆశ నిరాశగా మారినా – నిరాశ నిస్పృహ పెంచినా / యుక్తి తెలియక తిరిగినా – శక్తి క్షీణించిపోయినా / వెన్ను తట్టి తండ్రిలా నిలిపి నడిపించితివి / నీవే కొండ కోటగా నిలిచి బలపరచితివి ||నీవు తోడైయుండగా|| / నీవు నాకు అండగా నిలచి – దారి చూపినావయ్యా / నేను నీకు మెండుగా స్తుతులు – అర్పించెదను
నీవు నా తోడు ఉన్నావయ్యా / నాకు భయమేల నా యేసయ్యా / నీవు నాలోనే ఉన్నావయ్యా / నాకు దిగులేల నా మెస్సయ్యా / నాకు భయమేల నాకు దిగులేల / నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| / కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు / వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) / అడిగిన వారికి ఇచ్చేవాడవు / వెదకిన వారికి దొరికేవాడవు (2) / తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) / దేవా దేవా నీకే స్తోత్రం (4) / వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు / రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) / నేనే సత్యం అన్న దేవా / నేనే మార్గం అన్న దేవా (2) / నేనే జీవము అని పలికిన దేవా (2) / దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
నీవు ప్రార్థన చేయునప్పుడు / అడుగుచున్న వాటిని / పొందియున్నాననే నమ్మకమున్నదా నీకు (2) / నమ్మిక లేకయే నీవు చేసే ప్రార్థన / తండ్రి సన్నిధి చేరదని గుర్తెరుగుమా నేడు (2) / నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి అన్నియు / సాధ్యమేనని చెప్పిన మాట మరచితివా (2) / ప్రభు మాట మరచితివా ||పొందియున్నాననే|| / బాధలు ఇబ్బందులు నిన్ను చుట్టిన వేళలో / విశ్వాస ప్రార్థనా బలము మరచితివా (2) / సింహాల బోనులోన ప్రార్థించిన దానియేలు / నమ్మి పొందిన భయము లేని జయము మరచితివా (2) / ఆ జయము మరచితివా ||పొందియున్నాననే|| / గెత్సేమనే తోటలో కన్నీటి ప్రార్థన / ఆంతర్యమును గ్రహియించుమా నేడు (2) / సొంత చిత్తము కాకయే తండ్రి చిత్తము నెరవేర్చి / ప్రభువు మనకు నొసగెను రక్షణానందం (2) / ఈ రక్షణానందం ||పొందియున్నాననే||
నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా (2) / నా ఆశ నీవే కదా / ఓ.. నా అండ నీవే కదా (2) / యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2) / నాకై జన్మించితివే – సిలువలో మరణించితివే / నీ ఋణము తీర్చేదెలా / నిను తృప్తి పరచేదెలా (2) / నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా (2) / విలువైనదేది నీకన్నా ||యేసయ్యా|| / నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావే / నిను పోలి జీవించగా / నీ ఆత్మ నాకివ్వుమా (2) / నా జీవితము నీకై – నా జన్మ తరియింప (2) / పరిశుద్ధాత్మను ప్రోక్షించు ||యేసయ్యా||
నీవు లేని క్షణమైనా ఊహించలేను / నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2) / నీవే నా కాపరి – నీవే నా ఊపిరి / నీవే నా సర్వము యేసయ్య / నీతోనే జీవితం – నేనే నీకంకితం / గైకొనుమో నన్ను ఓ దేవా… ||నీవు లేని|| / శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినా / నను ధైర్యపరిచె నీ వాక్యం / సంద్రాలే పొంగినా – అలలే ఎగసినా / నను మునగనీయక లేవనెత్తిన (2) / నీవే నా కండగా – నాతో నీవుండగా / భయమన్నదే నాకు లేదూ / సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా / వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని|| / శత్రువులే లేచినా – అగ్ని ఆవరించినా / అవి నన్ను కాల్చజాలవుగా / దుష్టులే వచ్చినా – సింహాలై గర్జించినా / నాకేమాత్రం హాని చేయవుగా (2) / వెన్నుతట్టి బలపరచిన – చేయిపట్టి నడిపించిన / వేదనలే తొలగించిన యేసయ్యా / సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా / వందనము నీకే ఓ దేవా… ||నీవు లేని||
నీవు లేని చోటేది యేసయ్యా / నే దాగి క్షణముండలేనయ్యా / నీవు చూడని స్థలమేది యేసయ్యా / కనుమరుగై నేనుండలేనయ్యా (2) / నీవు వినని మనవేది యేసయ్యా / నీవు తీర్చని భాద ఏది యేసయ్యా (2) / నీవుంటే నా వెంట అదియే చాలయ్యా (4) ||నీవు లేని|| / కయీను కౄర పగకు బలియైన హేబేలు / రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు / అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు / మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు (2) / చెవి యొగ్గి నా మొరను / యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా (2) ||నీవుంటే|| / సౌలు ఈటె దాటికి గురియైన దావీదు / ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు / సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును / గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు (2) / నీ తోడు నీ నీడ / యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా (2) ||నీవుంటే||
నీవు లేని రోజు అసలు రోజే కాదయా / నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2) / నీవే లేకపోతే నేనసలే లేనయా (2) ||నీవు లేని|| / బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు / నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2) / నన్ను విడువనన్నవు – నా దేవుడైనావు (2) ||నీవే|| / ఈ నాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే / నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2) / నీవు నా సొత్తన్నావు – కృపాక్షేమమిచ్చావు (2) ||నీవే||
నీవు లేనిదే నేను లేను ప్రభువా / నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా / బ్రతుకలేనయ్యా నీవు లేక క్షణమైనా (2) / నీవు లేకుంటే నా బ్రతుకే శూన్యం (2) / మరువకయ్యా నన్ను ఏ క్షణము దేవా (2) / నీ ప్రేమతో నన్ను లాలించు ప్రతి క్షణము (2) ||నీవు|| / గమ్యమును ఎరుగక నేను వెతలు పాలైన వేళ / తీరాన్ని దాటలేని నావ నేనైన వేళ (2) / నా గమ్యం నీవైతి – ఆ గమ్యం సిలువాయే (2) / ఆ సిలువే నాకు శరణం / నా పాప పరిహారం (2) ||నీవు|| / అపజయమే నాదు బ్రతుకును విషాదముగా మార్చిన వేళ / జీవించుటకాశ లేక మరణాన్ని కోరిన వేళ (2) / నా ఆశ నీవైతి – ఆ ఆశ సిలువాయే (2) / ఆ సిలువే నాకు నిరతం / నా జీవిత చిరుదీపం (2) ||నీవు||
నీవుంటే నాకు చాలు యేసయ్యా / నీవెంటే నేను ఉంటానేసయ్యా (2) / నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా / నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే|| / ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ / ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట|| / బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ / అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట|| / ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా / ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట|| / నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము / నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో / కుంటి కుంటి నడిచెదవీవు / యెహోవాయే నీ దేవుడా / లేక వేరే దేవతలున్నారా (2) / మనం తీర్మానించెదమిప్పుడే / మన నోట వంచన లేకుండా (2) / మరుగైన పాపములన్నిటిన్ / హృదయమునుండి తొలగించెదం (2) ||నీవెన్నాళ్ళు|| / మారు మనస్సు పొందెదమిప్పుడే / జీవిత మోసములనుండి (2) / పరిశుధ్ధులమై నిర్దోషులుగా / ప్రభు దినమందు కనబడెదం (2) ||నీవెన్నాళ్ళు|| / నేను నా ఇంటివారలము / యెహోవానే సేవించెదము (2) / నీవెవరిని సేవించెదవో / ఈ దినమే తీర్మానించుకో (2) ||నీవెన్నాళ్ళు||