340 songs found
నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి / మీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతిని / దాల్చుకొని సేవించుడి ||నీతి|| / చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా / సదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును ||నీతి|| / సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియు / గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను ||నీతి|| / గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో / పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి ||నీతి|| / పరమ దూతలు నరులు పుడమిని – మొరలుబెట్టుచు దేవుని / పరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు ||నీతి|| / ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవుని / వెలయు స్తుతి వే నోళ్ళతోడను – విసుగు జెందక జేయుడి ||నీతి|| / ఆత్మ నీవిక మేలుకొని శు – ధ్ధాత్మ యేసుని దండ్రిని / త్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే ||నీతి||
నీతో గడిపే ప్రతి క్షణము / ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) / కృప తలంచగా మేళ్లు యోచించగా (2) / నా గళమాగదు స్తుతించక – నిను కీర్తించక / యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4) ||నీతో|| / మారా వంటి నా జీవితాన్ని / మధురముగా మార్చి ఘనపరచినావు (2) / నా ప్రేమ చేత కాదు / నీవే నను ప్రేమించి (2) / రక్తాన్ని చిందించి / నన్ను రక్షించావు (2) ||యేసయ్యా|| / గమ్యమే లేని ఓ బాటసారిని / నీతో ఉన్నాను భయము లేదన్నావు (2) / నా శక్తి చేత కాదు / నీ ఆత్మ ద్వారానే (2) / వాగ్ధానము నెరవేర్చి / వారసుని చేసావు (2) ||యేసయ్యా||
నీతో నడుతుము – నిన్నే కొలుతుము / నీ సహవాసము – నిత్యము క్షేమము (2) / ఓ యేసయ్యా మా రక్షకా – నీవే మాకు తోడుగా / మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా / దేవా.. మా స్వరములు ఇవిగో – దేవా.. మా స్తోత్రాలివిగో / దేవా.. మా సర్వస్వము నీకే / దేవా.. నీ సన్నిధిలోన – దేవా.. నీ దీవెనలెన్నో / దేవా.. పొందెదము దినదినము / నీలో ఉండెదం – నీకై బ్రతికెదం / ఈ ఆనందము- ఇలలో చాటెదం (2) / ఓ యేసయ్యా మా రక్షకా – నీవే మాకు తోడుగా / మా నడవడిలో మా శ్రమలలో- నీవే మాకు నీడగా / దేవా.. మా స్వరములు ఇవిగో – దేవా.. మా స్తోత్రాలివిగో / దేవా.. మా సర్వస్వము నీకే / దేవా.. నీ సన్నిధిలోన – దేవా.. నీ దీవెనలెన్నో / దేవా.. పొందెదము దినదినము
నీతో నా జీవితం సంతోషమే / నీతో నా అనుబంధం మాధుర్యమే (2) / నా యేసయ్యా కృప చూపుచున్నావు – వాత్సల్యపూర్ణుడవై / నా యేసయ్యా నడిపించుచున్నావు – స్ఫూర్తిప్రదాతవై / ఆరాధ్యుడా యేసయ్యా… / నీతో నా అనుబంధం మాధుర్యమే / భీకర ధ్వనిగలా మార్గమునందు / నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2) / కలనైన మరువను నీవు నడిపిన మార్గం / క్షణమైన విడువను నీతో సహవాసం (2) ||ఆరాధ్యుడా|| / సంతోషమందైనా శ్రమలయందైనను / నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2) / నిత్యమైన మహిమలో నను నిలుపుటకు / శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా|| / ఆకాశమందుండి ఆశీర్వదించితివి / అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2) / నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు / నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా||
నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము / ఊహించలేను నా యేసయ్యా / నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు / ఊహించలేను నా యేసయ్యా (2) / నీదు స్వరము వినకనే నేను / నిను విడచి తిరిగితి నేను / నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2) ||నిను|| / నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి / అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2) / అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ / నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా ||నీతో|| / నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ / నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ (2) / నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు / నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా ||నిను||
ఆశయ్యా.. చిన్న ఆశయ్యా / ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా / నీతో నేను నడువాలని / నీతో కలిసి ఉండాలని (2) / ఆశయ్యా చిన్న ఆశయ్యా / ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2) ||నీతో|| / నడవలేక నేను ఈ లోక యాత్రలో / బహు బలహీనుడనైతినయ్యా (2) / నా చేయి పట్టి నీతో నన్ను / నడిపించుమయ్యా నా యేసయ్యా (2) / నీతో నడువాలని – నీతో ఉండాలని / చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా|| / సౌలును పౌలుగా / మార్చిన నా గొప్ప దేవుడా (2) / నీలో ప్రేమా నాలో నింపి / నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2) / నీలా ఉండాలని – నీతో ఉండాలని / చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య ||ఆశయ్యా||
నీతో సమమెవరు – నీలా ప్రేమించేదవరు / నీలా క్షమియించేదెవరు – యేసయ్యా / నీలా పాపికై ప్రాణం పెట్టిన – వారెవరు (2) / లోక బంగారము – ధన ధాన్యాదులు / ఒక పోగేసినా – నీతో సరితూగునా / జీవ నదులన్నియు – సర్వ సంద్రములు / ఒకటై ఎగసినా – నిన్ను తాకగలవా / లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన / నీవేగా చాలిన దేవుడవు ||నీతో|| / పలు వేదాలలో – మత గ్రంథాలలో / పాపమే సోకని – పరిశుద్దుడేడి / పాప పరిహారార్థం – సిలువ మరణమొంది / తిరిగి లేచినట్టి – దైవ నరుడెవ్వరు / నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా / నీవేగా మంచి దేవుడవు ||నీతో|| / నేను వెదకకున్నా – నాకు దొరికితివి / నేను ప్రేమించకున్నా – నన్ను ప్రేమించితివి / పలు గాయాలు చేసి – తరచు రేపితిని / నన్నెంతో సహించి – క్షమియించితివి / నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి / నీవేగా విమోచకుడవు ||నీతో||
నీతో స్నేహం చేయాలని / నీ సహవాసం కావాలని (2) / నీ లాగే నేను ఉండాలని / నిను పోలి ఇలలో నడవాలని (2) / యేసయ్యా… యేసయ్యా… / నీ స్నేహం నాకు కావాలయ్యా (2) ||నీతో|| / శాశ్వతమైన నీ కృపతో నింపి / నీ రక్షణ నాకు ఇచ్చావయ్యా (2) / ఏమివ్వగలను నీ కృపకు నేను / నన్ను నీకు అర్పింతును (2) / యేసయ్యా… యేసయ్యా… / నీ కృపయే నాకు చాలునయ్యా (2) / మధురమైన నీ ప్రేమతో నన్ను పిలచి / నీ సేవకై నన్ను ఏర్పరచుకున్నావా (2) / ఏమివ్వగలను నీ ప్రేమకు యేసు / నన్ను నీకు అర్పింతును (2) / యేసయ్యా… యేసయ్యా… / నీ ప్రేమే నాకు చాలునయ్యా (2) / బలమైన నీ ఆత్మతో నన్ను నింపి / నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2) / ఏమివ్వగలను నీ కొరకు నేను / నన్ను నీకు అర్పింతును (2) / యేసయ్యా… యేసయ్యా… / నీ తోడే నాకు చాలునయ్యా (2) ||నీతో||
నీతోనే ఉండుటయే / నా జీవిత వాంచయ్యా / నీ చిత్తం నెరవేర్చుటయే / నా హృదయ తపనయ్యా (2) / యేసయ్యా నిన్నే కదా / నా ముందు నిలిపేను (2) ||నీతోనే|| / కరుణయు కృపయు నిరంతరం శాంతి / అన్నియు చేయువాడా (2) / నా జీవితం.. నశియింపగా.. (2) / కాపాడువాడా… నా కాపరి… (2) ||యేసయ్యా|| / నా కొరకు అన్నియు చేయువాడా / చేసి ముగించువాడా (2) / నా బరువు.. నా బాధ్యత.. (2) / నీ పాద చెంత… నుంచితివి… (2) ||నీతోనే||
ప్రెయిస్ హిం ఇన్ ద మార్నింగ్ / ప్రెయిస్ హిం ఇన్ ద నూన్ / ప్రెయిస్ హిం ఇన్ ద ఈవినింగ్ / ప్రెయిస్ హిం ఆల్ ద టైం / వేకువనే నా దేవుని ఆరాధింతును / ప్రతి సమయమున పరిశుద్ధుని కీర్తించెదను (2) / నా ధ్యానం నా సర్వం నా ప్రాణం నీవేగా అని / నా సమయం అనుక్షణము నీతోనే గడిపేయాలని (2) / నను నడిపించే దైవమా / నాతో నిలిచే కేడెమా (2) / ఉదయమున నీ కృపను స్తుతి గానాలతో కీర్తింతును / నీ కార్యముల చేత నన్ను / తృప్తి పరచి సంతోషమే ||నా ప్రాణం|| / నను కరుణించు బంధమా / నను బలపరచి ధైర్యమా (2) / కన్నీటి ప్రార్ధనతో నీ చెంత నే చేరెదన్ / నిను విడచి క్షణమైనా / నే బ్రతకలేను ఇలలో ||నా ప్రాణం||
నీతోనే నే నడవాలని / నీలోనే నే నిలవాలని / నీవలె నే మారాలని / నీ సాక్షిగా నే బ్రతకాలని (2) / (నా) మదిలోని కోరిక నా యేసయ్యా / నే నీతోనే ఉండాలని (2) / నీతో నీతో నీతో నీతో / నీతో నీతో నీతో (2) ||నీతోనే|| / దవళవర్ణుడా రత్న వర్ణుడా / పదివేల మందిలో అతి సుందరుడా (2) / సువర్ణ వీధులలో నీతోనే నడవాలని / నా మనసు కోరెను నజరేయుడా (2) ||నీతో|| / కీర్తనీయుడా పూజ్యనీయుడా / స్తుతుల మధ్యలో స్తోత్రార్హుడా (2) / ఆ దివ్య నగరిలో నీతోనే నిలవాలని / నా హృది కోరెను నా యేసయ్యా (2) ||నీతో||
నీదు ప్రేమ నాలో ఉంచి జీవమునిచ్చావు / నీదు రూపమే నాలో ఉంచి నన్ను చేసావు / మంటివాడను నన్ను నీవు మహిమపరిచావు / మరణపాత్రుడనైన నన్ను పరము చేర్చావు / ఎంత ప్రేమ యేసయ్యా – నీకెంత నాపై కరుణయో / మరువగలనా నీ కృప – బ్రతుకంతయు (2) / తోడువైనావు నా నీడవైనావు / నీవు నాకు ఉండగా నాకు ఈ దిగులెందుకు / మంచి కాపరి నీవేనయ్యా నా యేసయ్యా / ఎంచలేనయ్యా నీ వాత్సల్యం ఓ మెస్సయ్యా / జీవితమంతా మరువలేనయ్యా ||నీదు ప్రేమ|| / ప్రాణమైనావు నీవే ధ్యానమైనావు / అన్నీ నీవై చేరదీసి ఆశ్రయమైనావు / నీతిసూర్యుడా పరిపూర్ణుడా నిత్య దేవుడా / కీర్తనీయుడా కృపాపూర్ణుడా సత్యజీవుడా / నేను నిన్ను విడువలేనయ్యా ||నీదు ప్రేమ||