110 songs found

కరుణామయుడా పరలోక రాజా|Karunaamayudaa Paraloka Raajaa

కరుణామయుడా పరలోక రాజా / నిత్యనివాసి నిర్మల హృదయుడా (2) / నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు / నీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములు / నీకే స్తోత్రములు ||కరుణామయుడా|| / గడిచిన దినములన్ని కాపాడినావు / కృపాక్షేమములే నా వెంట ఉంచావు (2) / విడువక నా యెడల కృప చూపినావు (2) / విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ (2) ||నీకే స్తోత్రములు|| / శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా / వేదనలెన్నో కలిగిన వేళలో (2) / సహించే శక్తి నాకిచ్చినావు (2) / నీ సేవలో నన్ను నడిపించినావు (2) ||నీకే స్తోత్రములు|| / నూతన యుగములోన నను నిలిపినావు / నూతనాత్మతో నను నింపు దేవా (2) / నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి (2) / ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త (2) ||నీకే స్తోత్రములు||

కరుణించి తిరిగి సమకూర్చు|Karuninchi Thirigi Samakoorchu

కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా (2) / క్షమాపణ నిన్ను వేడుచున్నాను (2) / దావీదు రాజు దీనుడై వేడ (2) / అవనిలో బొందిన నష్టములన్నియు (2) / దేవా నీవు సమకూర్చితివే (2) ||కరుణించి|| / శత్రు సమూహపు కుతంత్రములతో (2) / బొత్తిగా నేను నష్టపడితిని (2) / మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి (2) ||కరుణించి|| / పసరు గొంగళి – చీడ పురుగులు (2) / నాశనము చేసిన పంటను కూర్చుమా (2) / యేసు ప్రభూ నిన్ను వేడుచున్నాను (2) ||కరుణించి|| / ప్రేమ సంతోషానందములను (2) / ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని (2) / ప్రేమతో నీవు సమకూర్చుమా (2) ||కరుణించి|| / పాపపు విషముతో నా పాత్ర నిండెను (2) / ప్రభు యేసుండను పిండిని కలుపుము (2) / పాప మరణమును తొలగించుమా (2) ||కరుణించి|| / ఆత్మీయ సోమరితనములో నుండి (2) / ఆత్మ నష్టముల నెన్నియో బొందితి (2) / ఆత్మ దేవా నీవు సమకూర్చుమా (2) ||కరుణించి|| / పాపము చేసి పడియున్న చోటున్ (2) / ప్రాపుగా నీవు జూపుమో ప్రభువా (2) / కోపగించక నాపై కృప జూపుమా (2) ||కరుణించి|| / చేసిన పాపము కప్పుకొనక (2) / విశ్వాసముతో ఒప్పుకొందున్ (2) / సిలువ రక్తముతో శుద్ధి చేయుమా (2) ||కరుణించి||

కరుణించుము మము పరమ పితా|Karuninchumu Mamu Parama Pithaa

కరుణించుము మము పరమ పితా / శరణం నీవే ప్రభు యేసా (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా / యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవా / పరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా ||హల్లెలూయా|| / రాత్రిలో కలుగు భయమేమి – రాకుండ జేయుచుండెదవు / రాత్రిలో నీ హస్తముతో – రయముగ కప్పుము ప్రియ తండ్రి ||హల్లెలూయా|| / రథమును గుఱ్ఱము రౌతులను – రాత్రిలో చుట్టిరి సిరియనులు / రథమును అగ్ని గుఱ్ఱములన్ – రక్షణగా ఉంచిన దేవా ||హల్లెలూయా|| / అర్ధ రాత్రిలో యాకోబు – అడవిలో నిద్రించిన గాని / ప్రార్ధన చేయుట నేర్పితివి – పరలోక ద్వారము చూపితివి ||హల్లెలూయా||

కలవంటిది నీ జీవితము|Kalavantidi Nee Jeevithamu

కలవంటిది నీ జీవితము / కడు స్వల్ప కాలము / యువకా అది ఎంతో స్వల్పము (2) / విలువైనది నీ జీవితం / వ్యర్ధము చేయకుము / యువకా వ్యర్ధము చేయకుము / బహు విలువైనది నీ జీవితం / వ్యర్ధము చేయకుము / యువతీ వ్యర్ధము చేయకుము ||కలవంటిది|| / నిన్ను ఆకర్షించే ఈ లోకము / కాటు వేసే విష సర్పము / యువకా అది కాలు జారే స్థలము (2) / ఉన్నావు పాపపు పడగ నీడలో / నీ అంతము ఘోర నరకము / యువకా అదియే నిత్య మరణము (2) ||కలవంటిది|| / నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం / నూతన సృష్టిగా మార్చును / పాపం క్షమియించి రక్షించును (2) / ఆ మోక్షమందు నీవుందువు / యుగయుగములు జీవింతువు / నీవు నిత్యము ఆనందింతువు (2) ||కలవంటిది||

కలుగును గాక|Kalugunu Gaaka

కలుగును గాక – దేవునికి మహిమ – కలుగును గాక / కలుగు నున్నతమైన – ఘన స్థలములందున / నిలకు సమాధానం – నరుల కాయన దయ ||కలుగును|| / ప్రభువైన దేవా – పరమరాజా – సర్వపరిపాలా / పరిపూర్ణ శక్తిగల– పరమ జనక నిన్ను / మహిమ స్తుతించుచు – మరి పొగడుచున్నాము ||కలుగును|| / మహిమపర్చుచు – ఆరాధించు – చున్నాము నిన్ను / మహిమాతిశయమును – మది దలంచియు నీకు / మహిని మా స్తుతి కృత – జ్ఞత నిచ్చు చున్నాము ||కలుగును|| / ఏక కుమారా – యేసు ప్రభువా – యెహోవా తనయా / లోక పాపము మోయు – ఏక దేవుని గొఱ్రె / పిల్ల మమ్మును కనిన – రించుము చల్లగ ||కలుగును|| / పరిశుద్ధుడవు – ప్రభుడవు నీవో – ప్రభువైన క్రీస్తూ / పరిశుద్ధాత్మతో తండ్రి – యైన దేవునియందు / బరిపూర్ణ మహిమతో – బ్రబలుచున్నామామేన్ ||కలుగును||