110 songs found

కల్వరి సిలువలో యేసయ్య|Kalvari Siluvalo Yesayya

కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2) / క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమే / పరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే / కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమే / కలవరము బాపెను – యేసయ్య నీ రక్తమే / సీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే (2) / నీ రక్తమే – నీ రక్తమే / నీ రక్తమే – యేసు నీ రక్తమే / విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమే / విజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమే / శిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే (2) / నీ రక్తమే – నీ రక్తమే / నీ రక్తమే – యేసు నీ రక్తమే / వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమే / ఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే / శాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే (2) / నీ రక్తమే – నీ రక్తమే / నీ రక్తమే – యేసు నీ రక్తమే / అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే / ఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమే / ఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే (2) / నీ రక్తమే – నీ రక్తమే / నీ రక్తమే – యేసు నీ రక్తమే (2)

కల్వరిలోన చేసిన యాగం|Kalvarilona Chesina Yaagam

కల్వరిలోన చేసిన యాగం / మరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2) / కడిగి వేసెను నాదు పాపం / నిలిపె నాలో నీ స్వరూపం (2) ||కల్వరిలోన|| / ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు / తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు / పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు / నాలోని రోగాలకై పొందితివా గాయాలు (2) / దైవ సుతుడవే అయిన గాని / కనికరము వీడవు ఏల క్షణమైనా గాని (2) ||కల్వరిలోన|| / ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారం / రద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారం / నువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెను / చిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను (2) / నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి / నన్ను రక్షించుటకు వేదన పడితివి (2) ||కల్వరిలోన|| / సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహము / అందించేను నా కొరకై ఆ జీవ జలము / కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు / నింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం (2) / అధికారమే లేని మరణము నిలిచెను / నిన్ను తాకేందుకు అనుమతి కోరెను (2) ||కల్వరిలోన||

కవులకైనా సాధ్యమా|Kavulakainaa Saadhyamaa

కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం / ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం / శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం / రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా|| / చెదరిన మనసులకూ శాంతి / కృంగిన హృదికీ ఓదార్పు / మృత్యు దేహముకూ జీవం / బలహీనులకు ఆరోగ్యం (2) / పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు / గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు / మోసపూరిత ఈ లోకంలో / ఏ వైద్యునికి సాధ్యము (2) ||కవులకైనా|| / క్షణికమైన అనురాగాలు / ఆవిరివంటి ఆప్యాయతలు / అవసరాల అభిమానాలు / నిలచిపోయే అనుబంధాలు (2) / నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ / ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం / స్వార్ధపూరిత ఈ లోకంలో / ఏ మిత్రునికి సాధ్యము (2) ||కవులకైనా||