110 songs found

కన్నీరేలమ్మా|Kanneerelammaa

కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా / కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా / కరుణ చూపి కలత మాన్పె (2) / యేసే తోడమ్మా ||కన్నీరేలమ్మా|| / నీకేమీ లేదని ఏమీ తేలేదని / అన్నారా నిన్ను అవమాన పరిచారా / తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని / రేపటిని గూర్చి చింతించుచున్నావా / చింతించకన్న యేసు మాటలు మరిచావా / మారాను మధురంగా మార్చెను చూసావా (2) ||కన్నీరేలమ్మా|| / నీకెవరూ లేరని ఏం చేయలేవని / అన్నారా నిన్ను నిరాశపరచారా / పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని / నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా / నేనున్నానన్న యేసు మాటలు మరిచావా / కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2) ||కన్నీరేలమ్మా||

కన్నీళ్లతో పగిలిన గుండెతో|Kanneellatho pagilina gundetho

కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా / మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2) / విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను / కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2) / విడువడు నిన్ను / రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినా / కాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునా / ప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినా / నీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా ||విడువడు|| / అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినా / నిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా / బాధ కలుగు దేశమందునా – బంధకాలు ఊడకుండునా / శత్రువెంతో పగతో రగిలినా – గిన్నె నిండి పొర్లకుండునా ||విడువడు||

కన్నుల నిండుగ|Kannula Ninduga

కన్నుల నిండుగ – క్రిస్మస్ పండుగ / గుండెల నిండుగ – ఆనందముండుగ (2) / పరమ పురినుండే – పరిశుద్ధ దేవుడు / పుడమిలో పుట్టెగా – పాపుల బ్రోవగ / మహిమలోనుండే – మహిమాత్ముండు / మనుజుడాయెగా – మరణము నొందగా / రండి చేరి కొలిచెదం – రారండి కలసి పాడుదాం / రండి యేసుననుసరించుదాం – పదండి ప్రభుని చూపించుదాం (2) / సర్వసృష్టిని మాటతో చేసిన – సార్వభౌముడా నీకు సముడెవ్వరయ్యా / లోకపాపమంతయూ మోయవచ్చిన – దైవమానవా నీకు స్థలమే లేదయ్యా (2) / చీకటినుండి వెలుగునకు – మరణమునుండి జీవముకు (2) / నడిపింప వచ్చిన నజరేయుని – దాటింప వచ్చిన దయామయుని / ప్రేమించి వచ్చిన ప్రేమామయుని – క్షమియించ వచ్చిన క్షమాపూర్ణుని ||రండి|| / విశ్వమంతయూ వ్యాపించియున్న – సర్వవ్యాపి నీవులేని చోటే లేదయ్యా / అంతరంగమంతయూ ఎరిగియున్న – సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా (2) / దాస్యము నుండి స్వాతంత్ర్యమును – శాపము నుండి విడుదలను (2) / ప్రకటింప వచ్చిన పుణ్యాత్ముని – రక్షింప వచ్చిన రక్షకుని / శాంతిచేయ వచ్చిన శాంతమూర్తిని – విడిపింప వచ్చిన విమోచకుని ||రండి|| / ఊహకందని త్రియేకమైయున్న – అద్వితీయుడా నీవే ఆత్మరూపివయ్యా / నిన్న నేడు రేపు ఏకరీతిగున్న – నిత్యనివాసి నీకు అంతమే లేదయ్యా (2) / సంకెళ్ళనుండి సంబరానికి – ఉగ్రతనుండి ఉదాత్తతకు (2) / తప్పింప వచ్చిన త్యాగమూర్తిని – కనికరింప వచ్చిన కరుణశీలుని / కృపజూపవచ్చిన కృపాకరుని – దాపుచేరనిచ్చిన దాక్షిణ్యపూర్ణుని ||రండి||

కన్నులతో చూసే ఈ లోకం|Kannulatho Choose Ee Lokam

కన్నులతో చూసే ఈ లోకం ఎంతో – అందముగా సృష్టించబడెను భూలోకం / దేవుని ఆలయముగా ఈ దేహం – పరిశుద్ధునిగా సృష్టించే శరీరం / నా దేవుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా / నా యేసుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా… ఈ దేహం / అల్ఫా ఒమెగయైన మహిమకు పాత్రుడైన దేవుడు / మహిమ పొందాలని ఘనత నొందాలని / వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి / నువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని (2) / తన పోలికలో నిర్మించుకొని – ఆ హృదిలో ఉండాలని (2) / నా దేవుడే కోరెనుగా – నీ హృదయాన్ని తనకీయవా ||కన్నులతో|| / నీటిబుడగ వంటిదేగా ఈ జీవితం / ఆవిరైపోవును ఇది మన్నైపోవును / అల్ప కాలమేగా ఈ లోకము / పాడైపోవును ఇది లయమైపోవును (2) / ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావు / సృష్టికర్త దేవుడినే మరచి అంధుడవై బ్రతికావు / ఆ యేసయ్య నీ కోసమై నీ శాపాన్ని భరియించెను / నిత్య జీవము నీకిచ్చుటకై సిలువలో చేతులే చాచి నిను పిలచెను ||కన్నులతో||

కన్నులనెత్తి పైరుల చూడు|Kannulaneththi Pairula Choodu

కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2) / ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2) / కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2) / ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా|| / మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2) / వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా|| / విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2) / జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా|| / మందిరము పడియుండ మందుడవై నీవుండి (2) / సరంబీ గృహములలో సంతోష సమయమిదా? (2) ||ఓ యువకుడా|| / మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ (2) / నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా (2) ||ఓ యువకుడా||

కన్నులుండి చూడలేవ|Kannulundi Choodaleva

కన్నులుండి చూడలేవ యేసు మహిమను / చెవులుండి వినలేవ యేసు మాటను (2) / నాలుకుండి పాడలేవ యేసు పాటను / కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి|| / చెడును చూడకుండ నీ కనులను / చెడును వినకుండ నీ చెవులను (2) / చెడును పలుకకుండ నీ నాలుకన్ / చెడులో నడువకుండ నీ కాళ్ళను / దూరముగా నుంచు ఓ సోదరా / దూరముగా నుంచు ఓ సోదరీ (2) ||కన్నులుండి|| / దుష్టుల ఆలోచన చొప్పునా / నడువక సాగుమా నీ యాత్రలో (2) / పాపుల మార్గమందు నీవు నిలువక / అపహాసకులు కూర్చుండు చోటను / కూర్చుండకుమా ఓ సోదరా / కూర్చుండకుమా ఓ సోదరీ (2) ||కన్నులుండి|| / యెహోవా దొరుకు కాలమందునా / ఆయనను మీరు వెదక రండి (2) / ఆయన మీ సమీపమందు నుండగా / ఆయననూ మీరు వేడుకొనండి / ఆయన తట్టు తిరుగు ఓ సోదరా / ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ (2) ||కన్నులుండి||

కరిగే కొడుకు|Karige Koduku

అన్ని తెలిసిన తల్లి మరియమ్మా / నీ వెన్న మనసులో వేదన ఏందమ్మా / కరిగే కొడుకును కన్నది నువ్వమ్మా / నీ గుండెలో బరువును తీసేదెవరమ్మా / మది సిలువలో తనయుని పలుమార్లు తలచి / నిలువెల్ల వణికి నిదురంత పోయేనా.. / పుట్టినరోజులు పండుగలేవమ్మా / ఈ కారణజన్ముడు కరుణామయుడమ్మా / గట్టిగ పట్టిన ఆపగ లేవమ్మా / గొల్గొతా గమనం తప్పదు ఓయమ్మ / అది మనకోసమేనమ్మా… ||అన్ని తెలిసిన|| / గొల్లలంతా కలిసి మెల మెల్లగ చేరిరి / తమ పిల్లన గ్రోవితో లాలిపాటను పాడిరి / తూరుపు దేశపు జ్ఞానుల మంటిరి / నింగి చుక్కను కనుగొని బహు చక్కగా చేరిరి / బంగారం సాంబ్రాణి అర్పించి రారాజు యాజకుడు అని యెంచి / మొకరించి బహుమతులిచ్చి ఆ మహిమంతా మనసుకు తెలిపి / బోళము నెందుకు తెచ్చిరి ఓ యమ్మ / ఆ మరణపు సూచిక కంటివా మరియమ్మా / బోరున వచ్చిన కన్నీరేదమ్మా నీ గుండెను గుచ్చిన తరుణం కదా అమ్మా / అది మనకోసమేనమ్మా… ||అన్ని తెలిసిన|| / ఎనిమిదో దినమున యెరూషలేము వచ్చి / పేరు యేసు అని పెట్టి ఎంతగానో మురిసిరి / సిమోయోను వచ్చెను ఆ శిశువును చూసేను / మహా సంబరపడుచు బహు నెమ్మది నొందెను / తన ఆత్మ నింపబడి ఎత్తుకుని – మన లోక రక్షణ కై ముద్దాడి / తన తనువు చాలింప తృప్తిపడి – ఆ మహిమంతా జనులకు తెలిపి / నీ హృదయములో ఖడ్గము దూరునని / ఆ సిలువలో త్యాగం నీకు నేర్పేనమ్మా / దీవెన నొందిన ధన్యత నీదమ్మా / ఆ మరణము గెలిచిన తనయుని తల్లివమ్మా / అది మనకోసమేనమ్మా… ||అన్ని తెలిసిన||

కరుణ చూపించుమా|Karuna Choopinchumaa

కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా / మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2) / నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము / ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2) / కరుణగల దేవుడు నీవు / కరుణించి కాపాడుమా (2) ||కరుణ|| / ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి / గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2) / నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము / నీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము (2) ||కరుణగల|| / ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించాము / నీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము (2) / చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళ / మాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి (2) ||కరుణగల|| / మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావు / నిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు (2) / నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్న / వాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య (2) ||కరుణగల||

Telugu Songs Starting with "క" — Page 2 | UEC Telugu Church